ప్రాక్టీషనర్ల వివరాలు 02444...India
ప్రాక్టీషనర్ 02444…ఇండియా జన్మతః అమెరికాకు చెందిన ఈ ప్రాక్టీషనరు కాలిఫోర్నియా యూనివర్సిటీలో రెండు సంవత్సరాల ఆర్కిటెక్చర్ లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత 1971లో మెరైన్ కార్ప్ గా చేరారు. అనంతరం వియత్నాంలో హెలికాప్టర్ లో రేడియో ఆపరేటరుగా చేరిన సందర్భంలో వీరికి లింఫాటిక్ కార్సినోమా అనగా శోషరస నాడీ క్యాన్సర్ రావడంతో దానికి అవసరమైన శస్త్ర చికిత్స 1973లో జరిగింది. దీని తర్వాత నావికా దళానికి చెందిన హాస్పిటల్ లో అనేక రౌండ్ల ఖీమోథెరపీ కూడా జరిగిన తర్వాత అతని మనుగడ 30% మాత్రమే అని డాక్టర్లు నిర్ధారించి డిశ్చార్జి చేయడం జరిగింది. అతనికి 100% వికలాంగ పెన్షన్ మంజూరు చేస్తూ ఐదు సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళ గలిగేలా ఉచిత విమానయాన అవకాశం కల్పించబడింది. 1977 లో వీరు చికిత్స కోసం నేపాల్ వెళ్లారు. అక్కడ అతని కాలు పూర్తిగా స్తంభించిపోయింది. ఖాట్మండులో అతను నేపాలి రాజరిక కుటుంబానికి వైద్యం చేసిన తన మొదటి వైద్యుడు డాక్టర్ ఝా అనే వేద బ్రాహ్మణ యోగిని కలిశారు. నెలరోజుల్లో అతని కాలు మామూలు స్థితికి చేరుకున్నది. ఈ నివారణ నుండి ప్రేరణ పొందిన అతను వైద్య చికిత్సలో డాక్టర్ ఝా కు సహాయం చేస్తూ ప్రాకృతిక చికిత్సా విధానము లేదా స్వాభావిక స్వస్థత నిచ్చే ఈ పురాతన ఆయుర్వేద ఔషధం నేర్చుకోవడానికి ఐదు సంవత్సరాలు గడిపారు. తగినంత నైపుణ్యము నమ్మకం కలిగిన తర్వాత అతను ఎంతో మంది రోగులకు ఉచిత చికిత్స అందించారు. ఇదే సందర్భంలో అతను హోమియోపతిక్ రత్నాలతో టెంపరమెంట్ హీలింగ్ అనే పుస్తకం రాశారు ఇదే సమయంలో అతని క్యాన్సర్ కూడా పూర్తిగా అదృశ్యం అయింది.
తర్వాతి రెండు దశాబ్దాల కాలం కలకత్తా, ఉత్తర భారతదేశంలోని పర్వత ప్రాంతాలు, గోవా మరియు నేపాల్ ప్రాంతాల్లో విస్తృతంగా ప్రయాణం చేస్తూ తన సాధనలో భాగంగా కఠినమైన సాధు జీవితం సాగిస్తూ దానిలో భాగంగా ఉచితంగా చికిత్సలు కూడా అందించారు. ఈ 20 సంవత్సరాల సాధు జీవితం అతని హృదయాన్ని బాగా ప్రభావితం చేసింది. ముఖ్యంగా సంపూర్ణ నిశ్శబ్దం ఉన్నసాధువుల సహవాసంలో ఉన్నప్పుడే ఆయనకి బహుమతిగా ఏర్పడిన అంతర్దృష్టి ఆయన ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. నిశ్శబ్దం యొక్క ఆధ్యాత్మిక అభ్యాసం తన హృదయానికి దగ్గరగా మరియు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అతను భావిస్తున్నారు. తన రోగుల పురోగతిని అనుసరించి అతను కూడా జ్ఞానం పొందారు. చాలామంది రోగులు ధూమపానం, మద్యపానం, మరియు అతిగా తినడం వంటివి విడిచి పెట్టడంతో అతను కూడా తన వ్యసనాలను విడిచి తను బోధించిన వాటిని స్వయంగా ఆచరించగలిగారు. ఇతరులకు సహాయపడటం తనను తాను నయం చేసుకోవడానికి సహకరించింది.
2001లో కుంభమేళాలో పాల్గొనడానికి వారణాసి వెళ్ళిన సందర్భంలో లక్షలాది మంది సాధువులతో సహా 60 మిలియన్ల మంది ఈ మేళాను సందర్శించారు. గంగ ఒడ్డున అతను ఉచిత హోమియోపతి మందులు ఇస్తున్న సందర్భంలో ఒక సాయి భక్తుడుని కలవడానికి అవకాశం కలుగగా పుట్టపర్తిలో ఇలాంటి సేవలలో నిమగ్నమై ఉన్న డాక్టర్ అగర్వాల్ గురించి అ భక్తుడు చెప్పారు. 2003లో ఇతను పుట్టపర్తి లోని బాబా ఆశ్రమం లోని అగర్వాల్ గారి వైబ్రో క్లినిక్ కు వచ్చారు. అక్కడ వైబ్రియానిక్స్ తరగతులకు హాజరవడమే కాక ఎప్పుడూరద్దీగా ఉండే అగ్గర్వాల్ గారి క్లినిక్ లో చాలా నెలలు సహాయం చేస్తూ చివరికి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనరుగా అర్హత సాధించారు. ఈ క్లినిక్కులో పొందిన అనుభవం అతనికి ఒక కొత్త కోణాన్ని తెరిచింది. టెంపర్ మెంట్ చికిత్స మరియు వైబ్రియానిక్స్ రెండు వ్యవస్థలు చాలా సామీప్యంగా ఉన్నాయని తాను పవిత్ర గ్రంథాల నుంచి అధ్యయనం చేసిన వాటినే ఇవి ప్రతిబింబిస్తున్నాయని అతను గ్రహించారు.
ఒకరోజు డాక్టర్ అగర్వాల్ గారి సూచన మేరకు ఈ ప్రాక్టీషనరు బాబా వారి దర్శనం కోసం వెళ్లారు. బాబా జీవితాంతం సూక్ష్మంగా అతనికి సహాయం చేస్తున్నారని మొదటి దర్శనం లోని వీరికి అర్థం అయింది. ఈ సందర్భంగా వీరికి కేవలం నాలుగు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ఇతని తల్లి వీరిని ఒక జంతు ప్రదర్శనశాలకు తీసుకుని వెళ్లినప్పుడు అక్కడ గోడకు వేలాడుతున్న భారీగా ఉన్న ఖాళీ ఫ్రేమ్లో మందంగా ఉన్న ఉన్ని మధ్యలో ఆకర్షణీయమైన, అద్భుతమైన ముఖం గల బాబావారి చిత్రం మీద అతని చూపులు లగ్నం అయ్యాయి. అంతలో అకస్మాత్తుగా ఫోటో సజీవంగా మారిపోయి స్వామి అతనివైపు కళ్ళు తెరిచి చూస్తూ కను రెప్పలు అల్లారుస్తున్న అనుభవం కలిగింది. స్వామి వద్దకు రావడం అనేది తన జీవితంలో గొప్ప మలుపు అని ఆధ్యాత్మికంగా తనకు పునర్జన్మ అని వీరు పేర్కొంటున్నారు. ఆధ్యాత్మిక సిద్ధాంతాలపై తనకున్న అవగాహనను ఆచరణ లోనికి తీసుకురావడానికి ప్రేరేపించినది అపరిమితమైన స్వామి ప్రేమ మాత్రమే అని ఈ ప్రాక్టీషనర్ నమ్ముతున్నారు. స్వామి ఏదో ఒక విధంగా నిరంతరం అతని గమనిస్తూ అనేకసార్లు తనను సేవతో కొనసాగడాన్ని ప్రోత్సహిస్తూ తన హృదయ పరివర్తనకు సహాయపడ్డారని ప్రాక్టీషనరు గుర్తు చేసుకుంటున్నారు. ప్రాక్టీషనరు తను 2004లో రచించిన పుస్తకం యొక్క పూర్తిగా సవరించిన మరియు నవీనీకరించబడిన ప్రతిని సిద్ధం చేశారు కానీ దానిని స్వామికి సమర్పించినప్పుడు అది తిరస్కరించబడింది. 2006 నుండి 2010 వరకు ఐదు సంవత్సరాలు హిమాలయ పర్వతాలలో మణికర్ణను
ప్రతీ వేసవిలో (రెండు నుండి మూడు నెలల వరకు) వైద్య శిబిరాలను నిర్వహించడానికి సందర్శించి నప్పుడు అక్కడ అతను రోజూ 20 నుండి 30 మంది రోగులకు చికిత్స చేసేవారు. ఈ కాలంలో అతను తన పుస్తకాన్ని మళ్ళీ సవరించగా 2009 మార్చి 13న స్వామి తన పుస్తకాన్ని ఆశీర్వదించినప్పుడు అతని ఆచరణలో ఒక మైలురాయి దాటి నట్లు అనిపించింది. అతను రోజువారీ జీవితంలో స్వామి యొక్క ఉనికిని స్పష్టంగా అనుభవిస్తూ వైబ్రియనిక్స్ భవిష్యత్తులో చాలా ప్రభావంతమైన వ్యవస్థగా మారుతుందని ఎందుకంటే స్వామి యొక్క ఆశీర్వాదం మార్గదర్శకత్వం దీనికి ఎల్లప్పుడూ ఉంటుంది కనుక దీనికి అపజయం కానీ హాని గానీ ఉండవని వీరు భావిస్తున్నారు. ప్రజలకు ముఖ్యంగా స్వామి భక్తులకు సేవ చేయడానికి అవకాశం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తారు. రోగులు అద్భుతంగా నయంకావడం చూసి స్వామి తన ద్వారా వీరికి స్వస్థత కలిగిస్తున్నారనీ తనను ఒక ప్రభావవంతమైన సాధనంగా ఉపయోగించుకుంటున్నారని భావిస్తూ వీరు ఎంతో ఆనందిస్తున్నారు. ఇదే స్వామి తన సాధన పట్ల పట్ల సంతోషంగా ఉన్నారు అనే సంతృప్తిని వీరికి అందించింది.
దీనికి అదనంగా బాబా వారు ప్రాక్టీషనర్ నివసిస్తున్నఅపార్ట్మెంట్ లో ఉన్న చిత్రాలనుండి ఎంత విభూతిని ఇస్తున్నారు. రోగులు వారి ఆరోగ్యం మెరుగుపడటం కోసం వైబ్రియానిక్స్ రెమిడీలతోపాటు విభూతిని కూడా తీసుకు వెళుతూ ఇలా రెండింటి శ్రేయస్సు అనుభవిస్తున్నారు. రెమిడీల బ్రాడ్కాస్టింగ్ ఇతని అభ్యాసంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాయి. ఏ రెమిడీ ఇవ్వాలో ఎంపిక కోసం ఎల్లప్పుడూ స్వామిని ప్రార్ధించినప్పుడు సరైన రెమిడీ ఎన్నుకోవడంతో స్వామి సహాయం చేయడాన్ని ప్రాక్టీషనరు తరచుగా అనుభవించసాగారు. ఎలా అంటే 108CC బాక్సును తెరిచినప్పుడు తగినటువంటి కాంబోలో ద్రవం పైకి వచ్చి మూతకు అంటుకొని ఉంటుంది.
టెంపర్ మెంట్ లేదా స్వభావ చికిత్స గురించి తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఇతను మానవ శరీరంలోని చక్రాలను బ్యాలెన్స్ చేయడానికి వీరు జెమ్స్ కార్డులు (SR226toSR234) మరియు మెటల్ కార్డులు (SR273, SR359, SR383, మొదలగునవి ) ఉపయోగించి చికిత్స ప్రారంభిస్తారు. అలాగే SR233 Ruby కార్డు అన్నీ రకాల కంటిసమస్యలకూ, తక్కువ రక్తపోటుకు, జీర్ణక్రియ సమస్యలతో ఉన్నవారికి ప్రభావవంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. ఏదైనా కేసు విషయంలో పూర్తిగా నిస్సహాయ స్థితి లాంటిది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఎవరైనా రోగి అతని సహాయం కోరి వచ్చినప్పుడు జాగ్రత్తగా అతను చెప్పింది వినటానికి మరియు పూర్తిస్థాయి నివారణకు తగిన చికిత్సను అందించడానికి తనవంతు కృషి చేస్తారు. ఉదాహరణకు 45 ఏళ్ల పేగు కేన్సర్ రోగిని 2008లోడాక్టర్లు ఆపరేషన్ కోసం ఉదర భాగాన్ని ఓపెన్ చేసి అది చివరి స్థాయిలో ఉన్నదని నిర్ధారించి వెంటనే మూసేసి ఆ రోగి ఆరు వారాల కంటే ఎక్కువ బ్రతకడాని చెప్పారు. దీనికితోడు రోగి కుటుంబంలో ఒక ఆమె ఇతని పేరుతో ఉన్న ఇంటిని తన పేరుతో రాయాలని కోరుతూ అతన్ని ఎర్రటి బాగా కాలిన ఇనుప రాడ్డుతో వాత పెట్టింది. ఈప్రాక్టీషనర్ మరియు అతని భార్య అనుభవజ్ఞులైన SVP 0 1 2 2 8 (ఈమె ప్రొఫైల్ వార్తాలేఖ సంచిక 7 సంపుటి 1 లో ప్రచురింపబడింది) ఇద్దరూ కలిసి అతనికి క్యాన్సర్తో పాటు కాలిన గాయాలకు చికిత్స చేశారు అతను 12 సంవత్సరాల తరువాత ఇప్పటికీ కూడా జీవించి ఉండటంతో పాటు ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నాడు.
గత 17 సంవత్సరాలలో పుట్టపర్తిలో నివసిస్తూ ఉన్నప్పుడు ప్రపంచం నలుమూలల నుండి వచ్చే యాత్రికుల మధ్య చాలా మంది రోగులకు చికిత్స చేసే అవకాశం ప్రాక్టీషనరుకు లభించింది. ప్రస్తుతం జనరల్ హాస్పిటల్ నుండి ఒక వైద్యుడు క్రమం తప్పకుండా ఇతనికి రోగులను పంపిస్తూ ఉంటారు. ముఖ్యంగా అలోపతితో మెరుగుదల లేనివారు మరియు ఇతర చికిత్స విధానాలను ఉపయోగించి కూడా ఫలితంలేని వారు వస్తూ ఉంటారు. ఇటువంటి రోగులకు వైబ్రియానిక్స్ తో రోగనివారణ కావడం అతనికి ఎంతో సంతృప్తిని ఇస్తుంది. వీరు తన భార్యతో కలిసి స్థానికంగా ఉన్న పాఠశాలలో ( చిత్రాన్ని చూడండి) వృద్ధరోగుల ఇళ్లవద్దను, దగ్గరగా ఉన్న గ్రామాల్లోనూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు.అంతేగాక వీరిద్దరూ పుట్టపర్తి రైల్వే స్టేషనులో వార్షిక వైద్య శిబిరాన్ని స్వామి జన్మ దినోత్సవం నాడు ప్రారంభించారు (చిత్రాన్ని చూడండి).
గత పది సంవత్సరాలుగా నిరాటంకంగా ఇది నిర్వహింప బడుతూనే ఉంది. వీరు ఎంతో మంది పాఠశాల పిల్లలకు పెద్ద నులిపురుగులకు సంబంధించిన రోగాలకు చికిత్స చేశారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 30 వేల మందికి పైగా రోగులకు పైగా చికిత్స చేశారు నిజంగా అద్భుతమైన సేవ! కాలక్రమేణా ప్రపంచంలోని అందరికీ కూడా రోగ నివారణ అవసరం ఏర్పడు తుందని అది శారీరకంగాగానీ లేదా మానసికంగా గానీ అయి ఉంటుందని వీరు కనుగొన్నారు.
ఈ భార్యాభర్తలు ఇద్దరూ తాము చికిత్స చేసిన పేషంట్లు అందరూ బాగవుతున్నారని తెలుపుతున్నారు. ఇప్పుడు కోవిడ్-19 వైరస్ పుట్టపర్తికి కూడా వచ్చింది. నివారణ కోసం ఎక్కువ మంది ప్రజలు ఇమ్యూనిటీ బూస్టర్ తీసుకుంటూ ఈ ప్రాక్టీషనర్లను మామూలు కంటే మరింత బిజీగా చేస్తున్నారు. వైబ్రియానిక్స్ సేవ అనేది జ్ఞాన సముపార్జనకు పరివర్తనకు అత్యుత్తమమైన సాధన అని ఈ ప్రాక్టీషనర్ భావిస్తున్నారు. వీరు చివరిగా స్వామి యొక్క సూక్తి
‘”అందర్నీ ప్రేమించండి అందర్నీ సేవించండి” అని చెబుతూ ముగిస్తున్నారు.
పంచుకున్న కేసులు