Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రాక్టీషనర్ల వివరాలు 03508...फ्रांस


ప్రాక్టీషనర్  03508…ఫ్రాన్స్, అనుభవం గల నర్సు గానూ మరియు మత్తు మందు ఇచ్చే టెక్నీషియన్ గా ఉన్న ఈ ప్రాక్టీషనర్కి అనస్తీషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ తోపాటు నర్సింగ్ మరియు మత్తుమందు పునర్నిర్మాణములోకూడా మాస్టర్స్ డిగ్రీలు ఉన్నవి. గత నాలుగు దశాబ్దాలుగా ఆపరేటింగ్ థియేటర్, ఇంటెన్సివ్ కేర్ మరియు ఎమర్జెన్సీ లో పని చేసిన విస్తృతమైన అనుభవం ఉన్నది. ఎంతో అంకితభావంతో ఆమె దానిని కొనసాగిస్తున్నారు. ఆమె అనేక విదేశీ భాషలు కూడా నేర్చుకుంది మరియు మానవతావాద సహాయ సంస్థలతో విదేశాల్లో పని చేయడానికి ఒక ప్రైవేట్ పైలెట్ లైసెన్స్ కూడా పొందారు.

ఆమె తన చిన్నప్పటి నుంచి మొదటి గురువుగా భావించే ఆమె తల్లి ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ ఆమె మార్గనిర్దేశంలో యుద్ధ కళలు మరియు బౌద్ధ తత్త్వశాస్త్రం  అభ్యసించడంలో 15 సంవత్సరాలు గడిపారు. రోగుల విషయంలో వారి బాధను అర్థం చేసుకోవడం ప్రేమ మరియు సంరక్షణ అందిస్తూ వ్యవహరించడానికి ఆమె ఎంచుకున్న వృత్తికి ఇది ఒక ఆశీర్వాదం.

స్వామి యొక్క మరుపురాని దర్శనం ఆమెకు 1990 నవంబర్ లో పుట్టపర్తిలో లభ్యమైంది. స్వామి ఆమె వద్దకు వచ్చి ఆమెను తీక్షణంగా చూసేసరికి ఆ చూపు ఆమె హృదయాన్ని కరిగించి ఆనందంతో నింపింది. అప్పటినుండి ఆమె తను చేస్తున్న వివిధ సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సంకల్పించారు. 1993 లో 12 సంవత్సరాల పాప తలకు తగిలిన గాయం కారణంగా చనిపోవడం గానీ లేదా జీవితాంతం వికలాంగురాలిగా ఉండిపోతుందని తెలియడంతో ఈమె చేసిన తీవ్ర ప్రార్ధనలు మరియు విభూతి ఫలితంగా మూడు నెలల కోమా తర్వాత అనూహ్యంగా కోలుకోవడం జరిగింది. ఈ సంఘటన  ప్రాక్టీషనర్ని అల్లోపతికి ప్రత్యామ్నాయ వైద్యం కోసం అన్వేషణ ప్రారంభించేలా చేసింది. ఆమె తల్లికి తీవ్రమైన కీళ్లవాతం కారణంగా అనేక నెలలు మంచం పట్టడం జరిగింది. 1995లో కొంత ఉపశమన దశలో ఆమెను పుట్టపర్తి ఆశ్రమానికి తీసుకు రాగా అక్కడ ఆమెకు స్వామి నుండి ఆశీర్వాదం లభించింది. మరియు ఆయుర్వేద చికిత్స కూడా చేయించుకోవడంతో పూర్తి స్వస్థత పొందినది. ఈ సంఘటన విభిన్న చికిత్సల యొక్క శక్తివంతమైన అంశంపై సమాధానాలు పొందాలనే ఆమె కోరికను మరింతగా పెంచింది.

నవంబర్ 2013 లో పుట్టపర్తి సందర్శించినప్పుడు ఆమె అంతరంగంలో స్వామిని ఇలా అడిగారు. ‘అన్నీ మీ శక్తితోనే జరుగుతున్నట్లయితే మీ ఆశ్రమంలో ఎనర్జీ మెడిసిన్ ఎందుకు లేదు’ ఇది యాదృచ్చిక సంఘటన కాదు గానీ వెంటనే ఆమె డాక్టర్ అగర్వాల్ గారి క్లినిక్కును సందర్శిస్తున్న ఒక భక్తుడిని చూసారు. వైబ్రియానిక్స్ గురించి ఆమెకు పరిచయం అయిన ఈ సంఘటన  తాను ఇంటికి తిరిగి ప్రయాణ మవడానికి సరిగ్గా 48 గంటల ముందు జరిగింది. నవంబర్ 2014లో తన తదుపరి సందర్శనలో ఆమె పుట్టపర్తిలో AVP శిక్షణ మరియు ఐదు సంవత్సరాల తర్వాత ఫ్రాన్స్ లో SVP కోర్సు పూర్తి చేసుకున్నారు.

ఆమె తనతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులతో పాటు వారి జంతువులు, మొక్కలు, తోటలు మరియు ఇళ్ళతో తన అభ్యాసాన్ని ప్రారంభించారు. ప్రాక్టీషనర్కి చెందిన చాలా మంది రోగులు దూరంగా నివసిస్తూ  ఉండడంతో వారు ఫోన్లోనే సంప్రదిస్తుంటారు. ఆమె పనిచేస్తున్నచోట సహోద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులు వివిధ వ్యాధుల కోసం రెమిడీలు తీసుకొని చక్కని ఫలితాలు పొందారు.  చికిత్సా విధానాన్ని నమ్మకంగా అనుసరించిన వారు పూర్తిగా నయమయ్యి రెమిడీల కోసం ఇప్పటికీ ఆమె వద్దకు వస్తూనే ఉన్నారు. మరికొందరు తమకు రెమిడీల వల్ల నయమైనప్పటికీ బలమైన వ్యసనాల కారణంగా సూచించిన జీవనశైలిని అనుసరించలేక ఆమెను సంప్రదించడం మానేసారు. ఉదాహరణకి సొరియాసిస్తో బాధపడుతున్న సహోద్యోగికి 90% చర్మపు సోరియాసిస్ ఏర్పడగా చికిత్స తర్వాత ఆమె మోచేతుల పై మాత్రమే చారికల మాదిరిగా వ్యాధి మిగిలి ఉంది. ఈ రోగి తన జీవన శైలిలో మార్పులు చేయలేకపోవడంతో చికిత్స నిలిపివేసారు. మూడు సంవత్సరాల తర్వాత కూడా పెద్ద మచ్చలు ఏవి పునరావృతం కాలేదని ప్రాక్టీషనర్ గమనించారు.

ప్రాక్టీషనర్ 2015లో స్వామిని తను పనిచేస్తున్న ఆసుపత్రిలో తన పనిలో వైబ్రియానిక్స్ఎలా మిళితం చేయాలో తెలపమని ప్రార్ధించారు. ఆమె తన పనిచేస్తున్నచోట పరిసరాలను వైబ్రో రెమిడిలతో పరిశుభ్రం చేయాలని మార్గనిర్దేశం పొందారు. ఆ తర్వాత ప్రజలు అధికంగా గుమిగూడే ప్రదేశాలు ఉదాహరణకి రిసెప్షన్, రికవరీ రూములు, స్టాఫ్ రూములు, రోగులను మార్పిడి చేసే రూములు, మరియు ఆపరేటింగ్ థియేటర్లలో ఆమె హీలింగ్ వైబ్రేషన్స్ పిచికారీ చేయడము ప్రారంభించారు. సాంకేతిక నిపుణులు ఇట్టి రూములను పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత వారి  డ్యూటీ అనంతరం రాత్రిపూట ఆమె వైబ్రో రెమిడీలను పిచికారి చేసేవారు. దీనికోసం ఆమె క్రింది రెమిడీలు ఉపయోగించారు.CC10.1 Emergencies + CC17.2 Cleansing, ఇది చాలా ప్రభావవంతంగా ఉన్నట్లు ఆమె కనుగొన్నారు. కానీ సిబ్బంది లో అలసట, ఒత్తిడి మరియు శక్తి హీనత  సంకేతాలను ఆమె గమనించారు. కాబట్టి ఈ క్రింది కొంబోలను ఉపయోగించారు CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders. ఆ తర్వాత ఆమె ఈ రెండూ రెమిడీ లను ఒకటి తర్వాత ఒకటి మారుస్తూ ప్రాంతాలు, స్థలము, స్థితి, మరియు వ్యక్తులను బట్టి నిర్దిష్ట,పద్దతిలో  స్ప్రే చేసేవారు. ఉదాహరణకు దుర్బలంగా ఉన్న రోగులు సూక్ష్మ క్రిముల నుండి రక్షించ బడటానికి CC9.2 Infections acuteని స్ప్రే చేసేవారు.

రోగుల ప్రవర్తన మరియు లక్షణాలలో సానుకూలంగా కనిపించే మార్పులు ప్రాక్టీషనర్ని కోంబోలతో ఈ మరువరాని అభ్యాసాన్ని కొనసాగించేలా ప్రోత్సహించాయి. రోగులు మరియు సిబ్బంది ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉండడం కోసం ఆపరేషన్ థియేటర్లో అనస్తీషియా ప్రారంభించే ముందు ఆమె ప్రతిరోజు ఈ రెమిడీ స్ప్రే చేసేవారు. 2015-2019 మధ్య సుమారు 1,000 మంది రోగులు ఈ స్ప్రే ద్వారా లబ్ధి పొందడం విశేషం. ఆమె తనను, తన ఇంటిని, తోటను రక్షించడానికి మరియు శుద్ధి చేయడానికి మరియు ముఖ్యమైన నియామకాలపై ఆమె ప్రయాణించేటప్పుడు ఈ స్ప్రేని ఉపయోగిస్తారు.

SVP గా ఆమె అనుభవంలో శక్తివంతమైన కార్డు వ్యవస్థను ఉపయోగించడం అరుదైన బహుమతిగా భావించారు. ఎందుకంటే ఇది చికిత్సలో ఖచ్చితత్వాన్ని అందిస్తుంది. వివిధ స్థాయిల నొప్పికి భిన్నమైన అల్లోపతి మందులు ఎలా పని చేస్తున్నాయనే దానిపై తనకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆమె 1-10 స్థాయిలో నొప్పికి చికిత్స చేయడానికి వాటిని సేకరించి పోటెన్టైజ్ చేసి ఒక కిట్ లా తయారుచేసి ఆమె వాటిని ప్రభావవంతంగా మరియు ఆచరణాత్మకంగా ఉపయోగించడం ప్రారంభించారు. అలోపతి మందుల ఉపసంహరణ కారణంగా ఏర్పడే మనో మాంద్యమునకు సంబంధించి CC15.5 ADD & Autism విజయవంతంగా ఉపయోగించారు. సంక్లిష్ట కేసులకు సంబంధించిన సమాచారాన్ని ఆమె సీనియర్ ప్రాక్టీషనరు 02499 తో పంచుకొని వారితో కలిసి పనిచేస్తూ వారిచ్చే సలహాలను అనుసరిస్తారు. రోగులతో పాటు ప్రాక్టీషనర్లకు కూడా ప్రయోజనం చేకూరే నిమిత్తం ఈ రకమైన జత ఉండాలని ఆమె సిఫార్సు చేస్తున్నారు.

వైబ్రియానిక్స్ అనేది ఒక మూసివేయబడిన ఆరోగ్య వ్యవస్థ వంటిది కాదు, నిరంతరం అభివృద్ధి చెందుతున్నటువంటి వ్యవస్థ అని వీరి అభిప్రాయం. వివిధ రకాల వ్యక్తులకు కలిగే వ్యాధులు మరియు వాటికి గల కారణాలను అన్వేషిస్తూ వివిధ మార్గాలకు అనుమతిస్తూ ఇది స్వేచ్ఛగా విస్తరిస్తోంది. ఇది ఒక్కొక్కసారి రోగి మీద ప్రత్యక్షంగా పని చేసినట్లు అనిపించకపోయినా అది మనకు కనిపించని అవసరమైన స్థాయిలో పని చేస్తూనే ఉంటుంది. కనుక ఇది ఎప్పటికీ వైఫల్యం కాదు, ఎందుకంటే చికిత్స తాలూకు బీజం అప్పటికే శరీరంలో ప్రవేశపెట్టబడి ఉంది. కొన్ని సందర్భాల్లో సాధారణ కోంబోల కలయికలు కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ సేవా సాధనలో గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హృదయాన్ని ఎల్లప్పుడూ దాని మూలంతో కలపబడి ఉంచడం ఈ సాధనకు గుండె వంటిది. స్వామీయే మనద్వారా పనిచేసేటట్లు జాగ్రత్త వహిస్తే వారి జ్ఞాన దృక్పథం, మార్గదర్శకత్వం ద్వారా మనకు భరోసా ఇస్తారు. ఎందుకంటే స్వామి మాత్రమే వ్యాధిని స్వస్థపరిచేవారు కనుక.

మానవాళిని స్వస్థ పరిచే మరియు వారి బాధలను పోగొట్టే ఒక దైవిక సంస్థలో పని చేయడానికి తనను స్వీకరించినందుకు ప్రాక్టీషనర్ ఎంతో గౌరవంగా భావిస్తున్నారు. శ్రీ సత్య సాయి బాబావారు ఆశీర్వదించిన దైవ ప్రకంపనలను రోగులకు ప్రసారం చేయడం గొప్ప బాధ్యతగా ఆమె భావిస్తున్నారు. ఈ సేవ తన జీవితంలో అవసరమైన వాటిని తిరిగి పొందేలా చేసిందనీ, స్వార్ధం, స్వప్రయోజనం అనే జాడ్యాలకు లోనూ కాకుండా తనను రక్షిస్తోందని ఈమె భావిస్తున్నారు. రోగిని నయం చేయడం అంటే తనను తాను నయం చేసుకోవడమే అని చెపుతూ వీరు ముగిస్తున్నారు.  

పంచుకున్న కేసులు: