డిస్ఫాజియా (మ్రింగుడు పడక పోవడం) 11573...India
44-ఏళ్ల-మహిళ తన గొంతు ద్వారా ఏదైనా మింగడంలో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఐదేళ్ల క్రితం ఇది డిస్ఫాజియాగా నిర్ధారణ చేయబడింది. ఆమె తినడం ప్రారంభించిన ప్రతీసారీ, ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది(ఆహారం సరియైన మార్గంలో వెళ్లకుండా తప్పు దారిన పడుతుంది) ఫలితంగా దగ్గు మరియు ఉక్కిరిబిక్కిరి అవుతున్న భావన కలుగుతుంది. ఈ తీవ్రమైన దగ్గు పగలు మరియు రాత్రి కూడా కొనసాగుతున్నందువలన దీని ప్రభావం కారణంగా చాలాసార్లు ఆమెకు శరీరమంతా నొప్పులు (రాత్రి సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది) మరియు జ్వరం కూడా వస్తూ ఉండేది. బహుశా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. వైద్యుడు శస్త్ర చికిత్సకు సిఫారసు చేస్తారని ఆమె భయపడినందున ఆమె అతనిని సంప్రదించలేదు. ఆమె OTC మందులను మాత్రమే తీసుకుంది కానీ పెద్దగా ప్రయోజనం సాధించలేదు. 2018 జనవరి 17 న, ప్రాక్టీషనరు క్రింది రెమిడీ ఇచ్చారు:
NM18 General Fever + NM20 Injury + NM30 Throat + NM31 Tonsils (& Glands) + NM32 Vein-Piles + NM36 War + SM41 Uplift…ప్రతీ పది నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకు అనంతరం 6TD
ఒక వారంలోనే శరీరంలో నొప్పి మరియు జ్వరం తగ్గిపోయాయి, ఇప్పుడు ఇబ్బంది లేకుండా బాగా మింగగలుగుతున్నారు, పగటిపూట దగ్గు అప్పుడప్పుడు వస్తోంది కానీ రాత్రి సమయంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో వారం తరువాత పగటిపూట దగ్గు లేదు ఐతే రాత్రిపూట దగ్గులో 50% మెరుగుదల ఉంది, కాబట్టి మోతాదు TDS కి తగ్గించబడింది. ఆమె పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూ మరో రెండు వారాలలో ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఆమె ఇప్పుడు తన భోజనాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. 2018 ఫిబ్రవరి 28 నాటికి మోతాదు నెమ్మదిగా సున్నాకి తగ్గించబడింది. 2021 జులై నాటికి, వ్యాధి పరిస్థితి మళ్లీ కనిపించలేదు.
108CC బాక్సు ఉపయోగిస్తున్నట్లైతే : CC19.7 Throat chronic + CC3.7 Circulation ఇవ్వండి