‘‘అనిమే”యానిమేషన్ కార్టూన్ల వ్యసనం 03594...USA
25 ఏళ్ల యువకుడు 7 సంవత్సరాల క్రితం తన అండర్ గ్రాడ్యుయేట్ చదువు కోసం అమెరికాకు వెళ్లాడు. తన కాలేజీ మొదటి సంవత్సరంలో, అతను అనిమే* అని పిలువబడే జపనీస్ కార్టూన్‌లను చూడటం ప్రారంభించాడు. ఇది నెమ్మదిగా వ్యసనంగా మారి కొన్ని నెలల తర్వాత, అతను రాత్రులలో కూడా నిరంతరం ఈ కార్టూన్లు చూడసాగాడు. కాబట్టి పగటిపూట, అతనికి ఏకాగ్రత లోపించింది మరియు తన చదువుపై దృష్టి పెట్టలేకపోయాడు. ఫలితంగా, అతను పరీక్షలలో బాగా రాణించలేక చివరికి రెండేళ్ల అధ్యయనం తర్వాత కళాశాల నుండి తప్పుకున్నాడు. అతను శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నాడు మరియు రిసెప్షనిస్ట్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. యువకుని తండ్రి ఇతనిని ఈ వ్యసనము విడిచిపెట్టవలసిందిగా ఒప్పించారు. అంతేకాక గతంలో తనకు వైబ్రియానిక్స్ యొక్క స్వస్థత కలిగించే శక్తి పై ఉన్న నమ్మకం కారణంగా వైబ్రియోనిక్స్‌ని తీసుకోవలసిందిగా సూచించారు. కుమారుడు దీనికి అంగీకరించినందున ప్రాక్టీషనరు 2015 డిసెంబర్ 14 న క్రింది రెమిడీ ఇచ్చారు:
#1. CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC15.3 Addictions…TDS
డిసెంబర్ 29 న, రోగి నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ బట్టి అతనికి రాత్రి నిద్రపట్టక పోవడం కారణంగా అది కార్టూన్‌లను చూడటానికి దోహదపడిందని ప్రాక్టీషనరు రోగి నుండి గ్రహించారు. రోగి సాధారణ నిద్రా విధానానికి తిరిగి రావడానికి సహాయపడటము కోసం అదనపు రెమిడీ ఇవ్వబడింది:
#2. CC15.6 Sleep disorders…సాధారణ నిద్రవేళకు 30 నిమిషాల ముందు, నిద్రరాకపోతే 30 నిమిషాల వ్యవధిలో రెండు మోతాదుల వరకు,
ఇది రోగి కార్టూన్‌లను నిరంతరం చూసే అలవాటును తగ్గించడానికి మరియు పగటిపూట చక్కగా పనిలో నిమగ్నం కావడానికి సహాయపడింది.
ప్రారంభంనుండే, అనిమే చూడడానికి గడిపే సమయం వారం వారం క్రమంగా తగ్గిపోసాగింది. 2016 మార్చి3 నాటికి 50% మెరుగుపడినట్లు అతను భావించారు. అతని కుటుంబ సభ్యుల మద్దతుతో, అతను రెమిడీలు తీసుకోవడం కొనసాగించగా వారు ఇతనిలో మరింత స్థిరమైన మెరుగుదలను గమనించారు. జూన్ మొదటి వారం నాటికి, అతను తన వ్యసనాన్ని పూర్తిగా అధిగమించాడు, ఐతే కార్టూన్‌లను చూడటములో అతని అభిరుచి మాత్రం కొనసాగుతూనే ఉంది. #1 మోతాదు BD కి తగ్గించబడి క్రమంగా జులై చివరి వారం నాటికి క్రమంగా సున్నాకి తగ్గించబడింది. అటుపిమ్మట #2 యొక్క అవసరం రాలేదు. 2017లో తన చదువును కొనసాగించుకోవడానికి ప్రారంభించి 2019 లో విజయవంతంగా పట్టభద్రుడయ్యాడు. జూలై 2021 నాటికి, చక్కగా చదువుకుంటున్నాడు.
*అనిమే వ్యసనము చాలా వాస్తవమైనదిగా అనుభూతి కలిగిస్తూ ఉంటుంది, ఐతే చాలా ప్రమాదకరమైనది (వీడియోగేమ్ వ్యసనం వంటిది). ఎందుకంటే ఇది సరదాగా, యాక్షన్ తో కూడి, హాస్యభరితంగా మరియు వినోదాత్మకంగా ఉంటుంది. ఇది మరొక ఎపిసోడ్‌ను చూడకుండా ఉండలేనంతగా దృశ్యకులను ప్రోత్సహించే ప్రదర్శన వంటిది.