Vol 10 సంచిక 6
November/December 2019
అవలోకనం
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
పవిత్రమైన నవంబరు మాసంలో ప్రాక్టీషనర్లకు శుభాకాంక్షలు తెలుపుతూ, డాక్టర్ జిత్ అగర్వాల్, సర్వవ్యాపియైన దేవుని యొక్క శక్తి అంతరిక్షము మరియు కాలాన్ని మించినదైనప్పటికీ, ఆయన మనకు ఎంతో దూరంలో లేరు అనే విషయాన్ని తెలియచేసారు. స్వామికి దగ్గరవ్వడానికి నిస్వార్థ సేవ ఒకటే ఉత్తమ మార్గం మరియు స్వచ్ఛమైన ప్రేమ మరియు మనకు ప్రసాదించిన రెమెడీస్ యొక్క వైబ్రేషన్స్ స్వామితో ఏకత్వానికి దోహద పడుతున్నాయని భావించాలి. శాస్త్రవేత్తలు అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా పరిశోధన చేస్తున్న దానిని సాధన చేయడానికి మనకు ఒక సదావకాశం లభించింది. మనం ఒక ప్రశ్న వేసే ముందు న్యూస్‌లెటర్స్‌లో ఉన్న సమాచారాన్ని ముందుగా తెలుసుకోవాలి, అలాగే కొంతమంది ప్రాక్టీషనర్లు క్రమం తప్పకుండా వెబ్ కాన్ఫరెన్సింగ్ టూల్స్ ద్వారా విషయాలను తెలుసుకుంటున్న విధంగా మనము సిద్ధంగా ఉండాలి.
పూర్తి వ్యాసం చదవండిదృష్టాంత చరిత్రలు
8 కేసులు తెలియ చేయబడ్డాయి: ఉబ్బరం (వీజింగ్), పార్శ్వపు తలనొప్పి (మైగ్రేన్), ఆస్తమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, తరచుగా మూత్రవిసర్జన, మోకాళ్ల నొప్పులు, చీము, మరియు గులాబీ మొక్కపై ఆకుపచ్చ పురుగులు.
దృష్టాంతములు చదవండిసాధకుని వివరములు
మేము ఇద్దరు ప్రాక్టీషనర్లను పరిచయం చేస్తున్నాము. ఇద్దరూ వారి రెగ్యులర్ ప్రాక్టీస్‌తో పాటు, అత్యవసర పరిస్థితులలో, వారి ఆఫీసుకు వెళ్ళునప్పుడు మరియు పర్యటనలలో ఉన్నప్పుడు, ఎల్లప్పుడూ తమ "వెల్‌నెస్ కిట్" ను సేవ చేయడానికి సిద్ధంగా వుంచుకుంటారు. మొట్టమొదటి వ్యక్తి వృత్తిరీత్యా కార్పోరేట్ సెక్టార్‌లో చార్టర్డ్ అకౌంటెంట్, 2010 లో స్వామివారి మొదటి దర్శనం చేసుకున్నారు తరువాత సేవా కార్యక్రమాలలో చురుకైన వాలంటీర్‌గా పనిచేశారు, తరువాత జూలై 2018 నుండి ప్రాక్టీషనర్ అయ్యారు. స్వామి మీద అపారమైన కృతజ్ఞతతో, అహం యొక్క టాక్సిన్స్ నుంచి మనస్సును విముక్తి చేయడం ద్వారా స్వీయ పరివర్తన తెచ్చుకోవచ్చని నొక్కి చెపుతారు. రెండవ వ్యక్తి, వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు, కామర్స్ రంగంలో డాక్టరేట్, మరియు ఆమె కాలేజీ రోజుల నుండి సేవపై మక్కువ, 2010 లో స్వామివారి సన్నిధిలోకి వచ్చి 2011 లో ప్రాక్టీషనర్ అయ్యారు. వైబ్రియానిక్స్ సాధన ద్వారా ఆమెకు మానసిక స్థిరత్వం మరియు పరిపక్వత చేకూరిందని చెపుతారు.
సాధకుని వివరములు చదవండిప్రశ్నలు జవాబులు
మనము చెవి మరియు ముక్కులో వేసే చుక్కలను తయారుచేసే విధానం (సంపుటి 9 సంచిక 1 లో కంటి చుక్కలను గురించి తెలియచేసారు); ప్రాక్టీషనర్ వైబ్రియోనిక్స్‌తో పాటు ఏదైనా ఇతర వైద్య వ్యవస్థను, రుసుం లేకుండా చేస్తున్నప్పటికి ఎందుకు మంచిది కాదో; నెలవారీ రిపోర్టింగ్ కోసం, ఆరోగ్య శిబిరాలలో బృందంలో పనిచేస్తున్నప్పుడు రోగుల సంఖ్యను ఎలా లెక్కించాలో; రోగులు వారి లక్షణాలను స్పష్టంగా వివరించలేనప్పుడు, వారి సమస్యకు మూల కారణాన్ని తెలుసుకోవడానికి రోగులతో ఎలా వ్యవహరించాలో; మరియు క్యాన్సర్ రోగుల యొక్క కుటుంబ సభ్యులకు రాకుండా లేదా రోగ విముక్తి పొందిన రోగులకు తిరిగి రాకుండా నివారణ ఎలా ఇవ్వాలో లాంటి విషయాల గురించి తెలుసుకుంటాము.
పూర్తి వ్యాసం చదవండిదివ్య వైద్యుని దివ్యవాణి
సాత్విక శాఖాహార ఆహారం నుండి విటమిన్లు మరియు ప్రోటీన్లను ఎలా పొందాలో, మరియు మరొకరి బాధను మన బాధగా ఎలా అనుభూతి చెందాలో, మరొకరి విజయం మన విజయంగా ఎలా భావించాలో, మరియు ప్రతి ఒక్కరిని మనలా ఎలా చూసుకోవాలో మరియు ప్రతి ఒక్కరిలో మనలని మనం చూసుకోవడమే సేవ యొక్క ప్రధాన సాధనం అని స్వామి ప్రేమగా మనకు మార్గనిర్దేశం చేసారు.
పూర్తి వ్యాసం చదవండిప్రకటనలు
భారతదేశంలో (పుట్టపర్తి) మరియు అమెరికా రిచ్‌మండ్ VA లలో రాబోయే వర్క్‌షాప్‌లు గురించి తెలియపరుస్తున్నాము.
పూర్తి వ్యాసం చదవండిఅదనంగా
థైరాయిడ్ మరియు దాని కీలక పనితీరు, థైరాయిడ్ రుగ్మతలు, ప్రధానంగా హైపోథైరాయిడ్ మరియు హైపర్ థైరాయిడ్, వాటి లక్షణాలు మరియు కారణాలు, థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష మరియు థైరాయిడ్ ఫంక్షన్ సూచికల గురించి "ఆరోగ్యకరమైన థైరాయిడ్ వైపు పని చేయండి" అనే మా ఆరోగ్య కథనంలో మేము పంచుకున్నాము; స్వచ్చమైన గాలిలో ప్రతిరోజూ వ్యాయామం, అయోడిన్, అమైనో ఆమ్లాలు, విటమిన్ బి -12 మరియు సెలీనియం అధికంగా ఉండే ఆహారాలు, కొన్ని ఆహారాలు మరియు పానీయాలను నివారించడం లేదా తగ్గించడం ద్వారా మరియు వైబ్రియోనిక్స్ ద్వారా థైరాయిడ్ సమస్యను ఎలా నివారించవచ్చునో వివరించబడినది. అలాగే, క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో జరిగిన AVP వర్క్‌షాప్ మరియు రిఫ్రెషర్ సెమినార్‌లో ఇచ్చిన ముఖ్యమైన సమాచారం; USA లో ఆడియో కాన్ఫరెన్స్; లండన్, UK లో జాతీయ వార్షిక రిఫ్రెషర్ సెమినార్ మరియు ఫ్రాన్స్‌లోని అలెస్‌లో SVP మరియు AVP వర్క్‌షాప్‌లు లాంటివి కూడా పంచుకున్నాము.
పూర్తి వ్యాసం చదవండి