Vol 10 సంచిక 6
November/December 2019
ముద్రింప తగిన వార్తాలేఖ
పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి
డా.జిత్ కే అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
ప్రియమైనచికిత్సానిపుణులకు,
భగవాన్ బాబా వారి పుట్టిన రోజు నిమిత్తం ప్రశాంతి నిలయంలో ఇప్పటికే ఆ సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటువంటి శుభసందర్భంలో మీకు ఇలా రాయడం గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నాను. స్వామి మాటలలో “భగవంతుడు ఒక్కడే,రెండుకాదు. అతడు మీ హృదయ వాసి. మీరు ఆయనపై నిరంతరం చింతన చేస్తూ ఉంటే మీరు కూడా దైవంగామారిపోతారు.మీరు ఎవరిని చూసినా వారిని దైవ స్వరూపులుగా భావించండి,దైవత్వసాధనకు మూల సూత్రం ఇదే. మీరు ఎక్కడ చూసినా దైవం అక్కడే ఉంటాడు. ఎవరిని చూసినా అతనిలో దైవం ఉన్నాడు. దేవునికి వేరే రూపం లేదు. అన్ని రూపాలు అతనివే. అందుకే వేదం “సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్ర పాత్” ( సృష్టికర్తకు వేల తలలు కళ్ళు మరియు కాళ్లు ఉన్నాయి) అనివర్ణించింది…కాన్వకేషన్ డిస్కోర్స్ 2010 నవంబర్ 22. నిజం చెప్పాలంటే వారి సన్నిధిలో జీవించడం మన యొక్క గొప్ప భాగ్యం.
మనందరికీ తెలుసు దైవశక్తి సర్వకాల సర్వావస్థలకు అతీతమైనది.ఈశక్తిసర్వవ్యాప్త, సర్వజ్ఞ మరియు సర్వ శక్తివంతము. ఈ శక్తి మన నుండి వేరైనది కాదు మనం చేరుకోవడానికి అతీతమైనది అసలే కాదు.“భగవంతుని తెలుసుకొనడానికి భగవంతునితో సంబంధం నెరపుకొనడానికి,భగవంతుని చేరుకోవడానికి ఉత్తమమైన మార్గం నిస్వార్థసేవ” అని స్వామి చెప్పారు. ఎందుకంటే భగవంతుడు అంటే పరిపూర్ణ ప్రేమ, సేవ అనేది స్వచ్ఛమైన ఆ ప్రేమ యొక్క వ్యక్తీకరణ.వైబ్రియానిక్స్ నివారణలలోని కంపనాలు మరియు చేసే నిస్వార్థ సేవ, స్వచ్ఛమైన అట్టి భగవత్ ప్రేమకు క్షేత్రస్థాయిలో తుల్యమైఉన్నందున,ఈ శక్తి అభ్యాసకుడికి మరియు రోగికి భగవంతుని యొక్క స్వచ్ఛమైన ప్రేమను అద్భుతంగా అనుభవించే అవకాశాన్ని అందిస్తున్నది. భౌతిక మరియు ఆధ్యాత్మిక రంగాల మధ్య ఉన్న ఈ సంబంధం ఇప్పుడు క్వాంటం మెకానిక్స్ ద్వారా చక్కగా అర్థం చేసుకోవడానికి మరియు వివరించడానికి వీలు కల్పించింది. వాస్తవానికి ఇంటర్ డిసిప్లినరీ రంగాలకు చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు మనల్ని స్వస్థ పరిచే కంటికి కనిపించని ఏకీకృత శక్తి స్థాయితో సంబంధం కల్పించుకునిదాని యొక్క సామర్ధ్యంపై అవగాహన పెంచుకోవడమే జీవిత లక్ష్యంగా చేసుకొని పరిశోధనలు సాగిస్తున్నారు.ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇటీవలే అర్థం చేసుకొని అభినందించడం ప్రారంభించిన అట్టి శాస్త్రాన్ని మరియు స్వామిభవిష్యత్ఔషధంగాఅభివర్ణించినవైబ్రియానిక్స్ సేవను మనం ఎప్పటినుంచో సాధన చేస్తూ ఉండటం వలన మనం ఎంత అదృష్టవంతులమో నేను మీకు వేరుగా చెప్పనవసరం లేదు.
మనందరికీ తెలుసు వైబ్రియానిక్సు ఇంకా శైశవ దశలోనే ఉన్నప్పటికీ, అభ్యాసకుల నుండి మరియు మన పరిశోధనా బృందం నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఫలితంగా కొత్త సమాచారం నిరంతరం వెలుగు లోకి వస్తూ వైబ్రియానిక్స్ ని విస్తరిస్తోంది. ఈ సమాచారం సంకలనం చేయబడిన వార్త లేఖల ద్వారా మన అభ్యాసకులకు పంపబడుతుంది అదే సమయంలో సంబంధిత పుస్తకాలు అనగా AVP మరియు SVP కరదీపికలు 108 CC పుస్తకంమరియు SVP హ్యాండ్ బుక్ (వైబ్రియానిక్స్ 2018) నవీనకరించబడ్డాయి. ఈ నవీనకరించబడిన పుస్తకాలు కొన్ని సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ముద్రింపబడుతూ ఉన్నందున చాలామంది అభ్యాసకులు తాజాగా లభ్యమయ్యే ఈ పుస్తకాలను కలిగి ఉండకపోవచ్చు.కనుక రెండు నెలలకు ఒకసారి ప్రచురింపబడే మన వార్తాలేఖ, అది ప్రచురింపబడిన వెంటనే దానిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి ప్రశ్న- జవాబులు, అదనపు సమాచార విభాగం మరియు కేస్ హిస్టరీ లను చదివిఅర్థం చేసుకోవాల్సిందిగా సవినయంగా సూచిస్తున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మీరు మన వైబ్రియానిక్స్ విబాగంలో సరికొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవడమే కాక మీ ప్రశ్నలు మరియు సందేహాలకుజవాబులుఆలేఖలలో పొందుపరచబడి ఉన్నాయి అని తెలుసుకోగలుగుతారు. ఇంకా మీకు నివారణ గురించి ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే మా యొక్కకొంబోక్వైరిస్ బృందానికి వ్రాయండి.మీ అభ్యర్థనకు ప్రతిస్పందించడం నిజమైన ఆనందం గా భావించి ప్రతి ఈమెయిలుకు సమాధానం తెలియజేస్తాము. మన ప్రధాన వెబ్సైట్ www.vibrionics.org, లో వార్త లేఖలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయడమే కాకుండా వీటికి తగిన వెబ్సైట్ లింక్ మీ వ్యక్తిగత ఈ మెయిల్ కూడా పంపుతారు కాబట్టి దీనిని గమనించ వలసినదిగా సూచన.
సమావేశాలకు,శిబిరాలకుమరియు మన స్పెషల్ వర్క్ షాపులకు హాజరు కావడం కోసం అభ్యాసకులు ఎంతోదూరం ప్రయాణించడంఅనేదిఅన్నిసమయాలలో సాధ్యం కాదని అర్థం చేసుకున్నాము.కాబట్టికొందరు సమూహాలుగాఏర్పడిస్కైప్ మరియు “గో టుమీటింగ్” వంటి వెబ్ కాన్ఫరెన్సింగ్ సాధనాలను ఉపయోగించడం ప్రారంభించారు.ఈ ఆన్లైన్ సమావేశాలు ఎంతో విజయవంతమయ్యాయని మాకు నివేదికలు కూడా వచ్చాయి.మా యొక్క యుఎస్ మరియు కెనడా కోఆర్డినేటర్01339 దాదాపు ఒక దశాబ్దకాలంగా నెలవారీ టెలీ కాన్ఫరెన్స్ లను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. దీని దృష్ట్యా భవిష్యత్తు కోసం అధికారిక వీడియో కాన్ఫరెన్సింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాము. దీనిని పూర్తిగా ప్రాక్టీషనర్03560యు.యస్.లోని తన ఐటీ ఉద్యోగం నుండి ముందస్తు పదవీ విరమణ తీసుకునీసాయివైబ్రియానిక్స్వైద్య సేవలకు తమ సమయాన్నిగణనీయంగా అందించడానికి కట్టుబడి ఉన్నారు. వారు ప్రస్తుతం మన వెబ్ సైట్ ను నిర్వహిస్తూ ఉండడంతోఈప్రారంభ దశలోవీరికిప్రస్తుతంసేవలునిర్వహిస్తున్నఅభ్యాసకులు03531 & 02844తమసహకారాన్నిఅందిస్తూఉండగాచాలాసీనియర్అభ్యాసకుడైన11964 సమన్వయం చేస్తూఉన్నారు. వీరుమనవైబ్రియానిక్స్ కు సంబంధించినరోజువారిసమస్యలనుపరిష్కరిస్తూమన వెబ్సైట్ నూ అత్యంతప్రతిభావంతంగానిర్వహిస్తూమనసంస్థకుఒకపెన్నిధిగాఉన్నారు. వీరుప్రస్తుతంమనమిషన్నుమరింతముందుకుతీసకురావడానికిసంస్థలోక్రియాశీలకమైనపాత్రనుపోషించడానికిసిద్ధంగాఉన్నారు. సంస్థలోవీరొకరోల్ మోడల్ గా ఉండడంనిజంగాఅత్యంతస్ఫూర్తిదాయకంమరియుఅభినందనీయం.
ప్రేమతో సాయి సేవలోమీ
జిత్. కె. అగ్గర్వాల్
దమ్ము/ఆయాసం 11600...India
81 సంవత్సరాలు వయస్సు ఉన్న వ్యక్తి అల్లోపతీ చికిత్స తీసుకుంటున్నప్పటకి గత 10 సంవత్సరాలుగా దాదాపు రోజు మార్చి రోజు దగ్గుతో కూడిన ఆయాసంతో భాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎక్కువ కావటంతో, గత రెండు సంవత్సరాలగా ఉపశమనం కోసం ఇన్హేలర్ మీద ఆధారపడ్డారు. 2018జూలై నుండి, పసుపు రంగు కఫంతో దగ్గు తీవ్రత పెరగడమే గాక అతనకి ఈ ఇబ్బందిని భరించటం కష్టంగాఉండి అలసటను కలిగించేది. తనకు రోగనిరోదక శక్తి తక్కువగా ఉండటం మరియు డిల్లీ లో కాలుష్యం అధికంగా ఉండటం వలన వ్యాధి తీవ్ర మవుతోందని అతను భావించాడు.
2018సెప్టెంబర్ 11న, ప్రాక్టీషనర్ ఈ క్రింది రెమెడీని ఇచ్చారు:
CC12.1 Adult tonic + CC19.4 Asthma attack + CC19.6 Cough chronic…TDS
అతనికి వ్యాధి లక్షణాలు క్రమంగా తగ్గుముఖంపట్టి అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా కనుమరుగయ్యాయి. ఆ సమయంలో, మొదటి నెలలో అవసరమైనప్పుడు ఇన్హేలర్ వాడడం తప్ప, ఏ ఇతర చికిత్స తీసుకోలేదు. నవంబర్ 2న, మోతాదు OD కి తగ్గించబడింది మరియు 2018డిసెంబర్ 31నాటికి మోతాదు ఆపేముందు వరకు క్రమంగా OW కి తగ్గించబడింది. తరువాత రోగి తన స్వగ్రామంలో పరిశుబ్రమైన వాతావరణంఉండటం వల్ల ఎక్కువ సమయం అక్కడ గడపడం ప్రాంబించాడు. ఈ మద్య కాలంలో నాలుగు నెలలపాటు డిల్లీ లో ఉన్నప్పటకి వ్యాధి లక్షణాలు ఏవి పునరావృతం కాలేదు.
2019అక్టోబర్ 19న, అతనికి ఈ క్రింది రెమెడీలు ఇవ్వడమైనది:
CC12.1 Adult tonic + CC19.1 Chest tonic…TDS ఒక నెలపాటు తరువాత నెల CC17.2 Cleansing, ఇలా సవత్సరంపాటు అతని రోగనివారణ శక్తిని సరియైన స్థాయిలో ఉంచడానికి రెమిడీ ఇవ్వబడింది.
పార్శ్వపు నొప్పి 11600...India
2018సెప్టెంబర్ 12న, 33 సంవత్సరాల మహిళ గత సంవత్సర కాలంగా వారానికి ఒకసారి విసుగు తెప్పించే తలనొప్పితో బాధపడుతూ అభ్యాసకుడిని సంప్రదించింది. ఇది ప్రారంబమైన తరువాత, మొదటి రోజు వాంతులు మరియు అజీర్ణంతో పాటు తలనొప్పి తీవ్రంగా ఉంటుంది, తరువాత 3 నుండి 4 రోజుల వ్యవధిలో క్రమంగా తగ్గుతుంది. సాదారణంగా తల అంతా నొప్పి ఉంటుంది కానీ కొన్నిసార్లు ఒక వైపు మాత్రమే ఉంటుంది. ఆమె నిరంతరం తల నొప్పితో జీవిస్తున్నట్లుగా భావించేది. ఆమె అల్లోపతీ లేదా హోమియోపతి వైద్యము నుండి ఎటువంటి ఉపశమనం పొందలేకపోయింది, అందువల్ల వాటిని వాడటం మానేసింది.
ఆమె ప్రాక్టిషనర్ ను సంప్రదించినప్పుడు నిరాశా జనకంగా ఉన్న ఆమె పరిస్థితిని చూసి ఆమెకు ఈ క్రింది నివారణలు ఇవ్వడమైనది:
#1. CC4.10 Indigestion + CC11.3 Headaches + CC15.1 Mental & Emotional tonic…TDS
2018సెప్టెంబర్ 30 నాటికి,ఆమెకుఎటువంటి ఉపశమనం కలగలేదని తెలిపారు. ప్రాక్టిషనర్ వ్యాధి లక్షణాలు మైగ్రైన్ కు సంబంధించినవిగా గ్రహించి రెమెడీ #1ని ఈ క్రింది విధంగా మార్చారు:
#2. CC11.4 Migraines + #1…TDS
2వారాలలోనే, ఆమెకి వ్యాధి లక్షణాలు బాగా తగ్గి భరించగలిగేలా ఉన్నాయి. మరో 2వారాల తరువాత, తలనొప్పి మరియు అజీర్ణం నుండి 100% ఉపశమనం పొందినట్లు రోగి తెలిపారు. రెండు వారాల తరువాత మోతాదు #2 నిదానంగా తగ్గించి,2018డిసెంబర్ 31 నాటికి నిలిపివేయబడింది.
2019అక్టోబర్ 17న,ఆమె ప్రాక్టీషనర్ ను సందర్శించి ఆమెకు వ్యాధి లక్షణాలు ఏవి పునరావృతం కాలేదని తెలిపారు. వ్యాధి రాకుండా నివారణా చర్యగా, ఆమెకు CC17.2 Cleansing…TDS ఒక నెలపాటు, తరువాత నెల CC12.1 Adult tonic ఇలా మారుస్తూ సంవత్సరంపాటు ఈ నివారణలు ఇచ్చారు.
ఉబ్బసం 02840...India
48 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి గత 14 సంవత్సరాలుగా ఆస్తమా భాధనుండి ఉపశమనం పొందటానికి రోజుకి ఒకసారి ఇన్హేలర్ ఉపయోగించేవారు. కానీ, గత 2సంవత్సరాలుగా ఇన్హేలర్ ఉపయోగించడం రోజుకు మూడుసార్లుకు పెరిగింది. మెట్లు ఎక్కేటప్పుడు, భోజనం చేసిన తరువాత లేదా కొంతదూరం నడచినా శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండేది. 2018సెప్టెంబర్ మొదటి భాగంలో అతని ఆరోగ్యం మరింత క్షీణిచడంతో కొన్ని రోజులు ఆసుపత్రిపాలు అయ్యారు. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అతనికి ఊపిరితిత్తులలో ఒక మోస్తరు అడ్డంకి ఉన్నట్లు సూచింప బడడంతో దానికి అల్లోపతీ మందులు తీసుకున్నారు.
అల్లోపతీ మందులు పెద్దగా ఉపశమనం ఇవ్వకపోటంతో వాటి మీద ఆధారపడడం ఇష్టంలేక, అతను 2018సెప్టెంబర్ 25న ప్రాక్టీషనర్ ను సందర్శించారు. ఈ క్రింది రెమెడీ ఇవ్వడమైనది:
CC15.1 Mental &Emotional tonic + CC19.1 Chest tonic + CC19.2 Respiratory allergies + CC19.3 Chest infections chronic + CC19.4 Asthmaattack…ప్రతి10 నిమషాలకు ఒక సారి ఒక గంట పాటు తరువాత 6TDఅతను 3 రోజుల తరువాత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు వ్యవధి 30% తగ్గినట్లుగానూ ఇప్పుడు కొంచెం తేలికగా శ్వాస తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒక వారం తరువాత అతను శ్వాస తేలికగా తీసుకుంటున్నట్లు మరియు ఇన్హేలర్ వాడటం మానేసినట్లు తెలియజేశారు. అందువల్ల మోతాదుని TDS కి తగ్గించబడింది. మరో వారం తరువాత అతను శ్వాస తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా నడవగలడం, మెట్లు ఎక్కగలడం మరియు భోజన అనంతరం ఆయాసం లేకుండా నడవగలగడం వంటివి చేయగలిగారు. మోతాదుని BDకి తగ్గించి రోగి సౌకర్యార్ధం 6 నెలలపాటు కొనసాగించారు.2019ఏప్రియల్ 10న తీసుకున్న టెస్ట్ రిపోర్టులు అతని ఊపిరితిత్తులలో ఎటువంటి అవరోధం లేకుండా చక్కగా ఉన్నట్లు తెలియజేశాయి. అప్పటినుండి వ్యాధి లక్షణాలు ఏవీ పునరావృతం కాలేదు, అందువల్ల మోతాదుని OD కి, 6 నెలల తరువాత 2019అక్టోబర్ 10 నాటికి OW కి తగ్గించారు. ముందస్తు నివారణా చర్యగా, అతనికి CC12.1 Adult tonic ఒక నెలపాటు, తరువాత నెలCC17.2 Cleansing…TDS ఇలా సంవత్సరంపాటు ఇచ్చారు.
సంపాదకుని సూచన :CC19.1 Chest tonic అవసరం లేదు ఎందుకంటే ఇది CC19.2 మరియు CC19.3 రెండింటిలోను ఉంది.
ఫంగల్ ఇన్ఫెక్షన్ 02840...India
12సంవత్సరాల బాలుడు 4 సంవత్సరాల క్రితం తన రెండు పాదాలు మీద తీవ్రమైన ఫంగల్ ఇన్ఫెక్షన్(విస్తృతమైన టీనియా కొర్పోరీస్/ తామర వంటి వ్యాధి ) ఉన్నట్లు నిర్దారించారు. కొద్దిరోజులలోనే ఇది శరీరం అంతా వ్యాపించింది. ఇది నయం కావడానికి ముందు 9నెలల పాటు అల్లోపతీ వైధ్యం తీసుకున్నారు. కానీ, ప్రతి 3నెలలకి వ్యాధి లక్షణాలు పునరావృతమవుతూనే ఉన్నాయి.నిజానికి, గత 3 సంవత్సరాలుగా ఇది 2నుండి 4 వారాల వ్యవధిలో పునరావృతం అవుతూనే ఉన్నాయి, అల్లోపతీ వైధ్యం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇవ్వగలిగింది. అందువల్ల ప్రస్తుతం తీసుకుంటున్న అల్లోపతీ వైధ్యం ఆపకుండా, వైబ్రియానిక్స్ మందులు వాడాలని బాలుని తల్లితండ్రులు నిర్ణయించుకున్నారు.2017సెప్టెంబర్ 3న వాళ్ళ అబ్బాయిని ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువెళ్లారు. ఆ బాలుని రెండు పాదాలమీద దురదతో కూడిన ఎర్రటి దద్దుర్లతో పాటు కొన్నిచోట్ల చీము కారుతూ ఉంది. దీనితోపాటు అతని మోచేతి మరియు పొట్టపై కూడా దద్దుర్లు ఉన్నాయి.అతనికి ఈ క్రింది రెమెడీ ఇవ్వడమైనది:CC15.1 Mental & Emotional tonic + CC21.1 Skin tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.7 Fungus నోటి ద్వారా తీసుకోడానికి మరియు శరీరం మీద రాసుకోడానికి విభూదిలో…6TD
నాలుగు రోజుల తరువాత, పొట్ట మరియు మోచేతి మీద ఉన్న దద్దుర్లు అదృశ్యమయ్యూయి. మరో పది రోజులు పోయిన తరువాత రెండు పాదాల మీద దద్దుర్లు మరియు చీము కారడం దాదాపుగా తగ్గిపోయింది మరియు దురద కూడా లేదు. ఇక తల్లితండ్రులు బాలునికి అల్లోపతీ వైధ్యాన్ని నిలిపివేశారు. మోతాదుని TDS కి తగ్గించబడింది. రెండు వారాల తరువాత, తనది పొడిచర్మం అని బాలుడు చెప్పడంతో విభూదికి బదులుగా శరీరం మీద రాసుకోడానికి నూనెలో తయారు చేసి ఇవ్వడమైనది. మరో రెండువారాల తరువాత ఎటువంటి మచ్చలు లేకుండా అతని చర్మం మామూలుగా మారిపోయింది. అందువల్ల మోతాదుOD కి తగ్గించబడినది. దీనిని క్రమంగా తగ్గిస్తూ 2017నవంబర్ 15 నాటికి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. 2019అక్టోబర్ 18 నాటికి బాలుడు వ్యాధి లక్షణాలు పునరావృతం కాలేదని నిర్ధారించాడు.
సంపాదకుని సూచన : CC21.1 Skin tonic అవసరం లేదు ఎందుకంటే ఇది CC21.2 మరియు CC21.3 రెండింటిలోను ఉంది.
అతిమూత్ర వ్యాధి 11615...India
94 సంవత్సరాల వయస్సు గల వ్యక్తి సుమారు 9 నెలలగా అతి మూత్రవ్యాధితో భాధపడుచున్నారు, రోజుకి 10నుండి 12సార్లు మూత్రవిసర్జన చేయవలసివస్తోంది. సాదరణంగా అతని వయస్సుకి రోజుకి 5 నుండి 6 సార్లు చేయవలసివుంటుంది. కొన్ని సార్లు అదుపు చేసుకోలేక లోదుస్తులు తడిచేవి. అతను అల్లోపతీ మందు యూరిమాక్స్-100 తీసుకుంటున్నప్పటికి, పెద్దగా ఉపశమనం కలగలేదు. అల్లోపతీతో పాటు వైబ్రియనిక్స్ ని వాడి చూడాలనే ఆలోచనతో 2019ఆగష్టు 12న, ప్రాక్టీషనర్ను సందర్శించారు. అతనికి ఈ క్రింది రెమెడీ ఇవ్వబడినది:
CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC13.3 Incontinence + CC14.2 Prostate + CC15.1 Mental &Emotional tonic + CC18.5Neuralgia…6TD
18 రోజుల తరువాత 2019ఆగష్టు 30న అతిగా మూత్రవిసర్జన చేయటం తగ్గినట్లు మరియు మూత్రాన్ని ఆపుకోగలుగుతున్నట్లు ఆయన తెలిపారు. అందువల్ల మోతాదుQDS కి తగ్గించబడింది. ఒక నెల తరువాత సెప్టెంబర్ 30న మోతాదుని TDSకు,2019అక్టోబర్ 12న OD కి తగ్గించబడింది. స్పష్టంగా, వైబ్రియనిక్స్ మందులు వాడడం ప్రారంభించిన తరువాతే మెరుగుదల కనిపించినప్పటకి,పేషెంట్ సౌలభ్యం కోసం యూరిమాక్స్-100 ను కొనసాగిస్తున్నారు.2019అక్టోబర్ 30 నాటికి వ్యాధి లక్షణాలు ఏవి పునరావృతం కాకపోవడంతో మోతాదుని OD గా తీసుకుంటున్నారు.
మోకాళ్ళ నొప్పి 11602...India
70 సంవత్సరాల మహిళకి, గత 6 నెలలగా పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోతెరఫీ తీసుకుంటున్నప్పటకి, రెండు మొకాళ్లలో తీవ్రమైన నొప్పితో భాధపడుతూ నడవడం కష్టంగా మరియు కఠిన పరీక్షలాగా ఉంటోంది. రెండు నెలల క్రితం పరీక్ష చేయించుకొన్నప్పుడు ఆమెకు కొలెస్ట్రాల్ ఎక్కువస్థాయిలో 280 mg/dl ఉన్నట్లు తెలిసింది. దీనినిమిత్తం ఆమె అల్లోపతీ మందులు తీసుకుంటున్నారు. 2019మార్చి9న, ప్రాక్టీషనర్ను సందర్శించేనాటికి, ఆమెకి రోజు వారీ నడక కూడా కష్టంగా ఉంది.ఆమెకు కొలెస్ట్రాల్ మరియు మోకాళ్ళ నొప్పి కోసం ఈ క్రింది రెమెడీ ఇవ్వడమైనది:
CC3.5 Arteriosclerosis + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.3 Arthritis + CC20.6 Osteoporosis…TDS
వేయించడానికి ఉపయోగించిన నూనెను తిరిగి ఉపయోగించవద్దని, ఆహారంలో సలాడ్స్ మరియు చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోమని ప్రాక్టీషనర్ సలహా ఇచ్చారు.మూడు రోజులు తరువాత నొప్పి నుండి 90% ఉపశమనం పొందినట్లు మరియు మరో నాలుగు రోజుల తరువాత నొప్పి నుండి పూర్తిగా ఉపశమనం పొందినట్లు తెలిపారు. వైబ్రియానిక్స్ మందులు తీసుకుంటూ ఆహారంలో మార్పులు చేసుకోటం వల్ల ఆమె ఆరోగ్యం గా ఉండటంతో 2019మార్చి17న, కొలెస్ట్రాల్ కోసం తీసుకునే అల్లోపతీ మందులు నిలిపివేశారు. మరో వారం తరువాత పెయిన్ కిల్లర్స్ మరియు ఫిజియోతెరఫీ కూడా నిలిపివేశారు. ఎటువంటి నొప్పి లేకుండా రోజువారీ పనులు తేలికగా చేసుకోగలగడం మరియు కొలెస్ట్రాల్స్థాయి127mg/dl కి రావడంతో,2019మే9న మోతాదుని ODకి తగ్గించారు, తరువాత2019మే 25న OW గా తగ్గించబడినది.5 నెలల తరువాత,2019మే9న, ఆమె కొలెస్ట్రాల్స్థాయి127mg/dlవద్ద స్థిరంగా ఉన్నట్లు, నొప్పులు తగ్గినట్లు మరియు మోతాదుని OW గా తీసుకుంటున్నట్లు తెలిపారు.వీటితోపాటు,నివారణ చర్యగా ఆమెకి CC17.2 Cleansing…OD ఇవ్వడమైనది.
గడ్డలు 11601...India
61 సంవత్సరాల మహిళకు 3 సంవత్సరాలక్రితం మధుమేహవ్యాధి ఉన్నట్లు నిర్ధారించి,ఆమె రక్తంలోని చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచటానికి డాక్టర్ ఆమెకి ఆమరిల్ (Amaryl)1½ mgతీసుకోవలసిందిగా సూచించారు. రెండు సంవత్సరాల క్రితం ఆమె కి కుడికాలులో గడ్డలు ఏర్పడి ఇవి మందులుతో నయం కాకపోటంతో శస్త్రచికిత్స(సర్జరి) చేసి తీసివేశారు. ఆమె సంప్రదించిన ఫిజీషియన్ ఇవి మధుమేహవ్యాధి వల్ల వస్తున్నట్లు తెలిపారు. ఒక నెల క్రితం, ఆమె పొట్ట మీద (నాభికి దగ్గరలో)25 mmపరిమాణంలో పెద్ద గడ్డ వచ్చింది. ఆ ప్రాంతం అంతా ఎర్రగా, చుట్టూ దురద ఉండి చాలా నొప్పిని కలిగించింది.ఈసారి ఆమెకి శస్త్రచికిత్స చేయించుకొవడం ఇష్టంలేక,2019మార్చి 28న ప్రాక్టిషనర్ను సంప్రదించారు. ఆమెకు ఈక్రింది రెమెడీ ఇవ్వడమైనది:#1. CC2.3 Tumours & Growths + CC6.3 Diabetes + CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.11 Wounds & Abrasions…6TD 3 రోజుల పాటు తరువాత TDS#2. CC21.2 Skin infections + CC21.11 Wounds& Abrasionsఆలివ్ ఆయిల్ లో భాహ్యంగా వ్రాయడానికి...TDSపేషెంట్ శ్రద్దగా ప్రతీ వారం ఎలా ఉందో ప్రాక్టిషనర్ కు తెలియచేసారు(ఫోటోలు చూడండి). 8 వారాల వ్యవధిలో గడ్డ పరిమాణం, ఎరుపుదనం, దురద, మరియు నొప్పి క్రమంగా తగ్గి,2019మే23నాటికి చర్మం పొడిగా ఉంది. మరో 4 వారాల తరువాత 2019జూన్ 19 నాటికి గడ్డ పూర్తిగా తగ్గి మచ్చ మాత్రమే మిగిలింది(ఫోటోలు చూడండి). అందువల్ల నివారణలు #1మరియు #2ల మోతాదుOD కి తగ్గించి వారం రోజుల తరువాత నిలిపివేయబడింది.నివారణా చర్యగా, ఆమెకుజూన్ 27న CC12.1 Adult tonic ఒక నెలపాటు, తరువాత నెలCC17.2 Cleansing…OW సంవత్సరంపాటు ఇచ్చారు.2019అక్టోబర్ 30న, పేషెంట్ ఆరోగ్యం ఉన్నట్లూ, గడ్డలు పునరావృతం కాలేదని, అలాగే2019నవంబర్ నెల మొదట నుండి మధుమేహవ్యాధికి చికిత్స తీసుకోవాలని అనుకుంటున్నట్లు సంతోషంగా తెలిపారు.
సంపాదకుని సూచన : నిజానికి, నివారణలు ఆపివేసిన రోజు జూన్ 27న CC21.1 Skin tonic ఇవ్వవలసిఉంది, కనీసం మచ్చ పోగొట్టటానికి భాహ్యంగా వ్రాయడానికి ఇవ్వాలి.
గులాబీ మొక్కపై పచ్చపురుగు 02802...UK
ప్రాక్టీషనర్ తోటలో ఎప్పటినుండో పెంచుకుంటున్న గులాబీ మొక్కపై ప్రతీ వేసవిలో వినాశకరమైన పచ్చపురుగులు (ఆఫీడ్స్) ఉండేవి.2019మే22న, గులాబీ మొగ్గలు ఎలా పచ్చపురుగుతో కప్పబడి ఉన్నాయో ఫోటోలో చూడండి.
ఆమె వెంటనే నివారణ CC1.1 Animal tonic + CC17.2 Cleansingతయారుచేసి ఆరోజు మరియు మరుసటి రోజు మొక్కమీద చల్లారు. ఒక వారం తరువాత, పచ్చపురుగు అదృశ్యమైనట్లు ప్రాక్టీషనర్ గుర్తించారు. రెండు రోజులు మాత్రమే స్ప్రే చేసినప్పటికీ కనిపించిన ఆచ్చర్యకరమైన మరియు నాటకీయమైన ఫలితాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. మరో 10రోజులు తరువాత,2019జూన్ 9న, ఆమె గులాబీమొక్క పచ్చపురుగు బారీనుండి రక్షించబడినట్లు గుర్తించారు(చిత్రంలో చూడండి).
ఇది నిజంగా అధ్బుతం, వేసవికాలం మొత్తం మొక్కమీద కానీ, మొక్క చుట్టూ కానీ ఒక్క పచ్చపురుగు కనిపించలేదు.
ఈ సంఘటన అనంతరం ప్రాక్టీషనర్నివారణలో CC1.1 Animal tonicబదులు CC1.2 Plant tonic ఇవ్వాలని గ్రహించారు!
సంపాపదకుని సూచన: CC1.1 Animal tonic మరియు CC1.2 Plant tonic రెండింటిలోను SR315 Staphysagria ఉంటుంది ఇది క్రిముల ముట్టడిని దూరం చేయడానికి విజయవంతంగా పనిచేస్తుంది. అదనంగా CC1.1 లో ఉన్న NM35 Worms కూడా పురుగులను పోగొట్టటానికి సహాయపడుతుంది. అలాగే, పచ్చపురుగును వదిలించుకోవాలనే ప్రాక్టీషనర్ ధృడసంకల్పాన్ని తక్కువ అంచనా వేయలేము!
చికిత్సానిపుణులవివరాలు 11600...India
ప్రాక్టీష నర్ 11600…India వృత్తిపరంగా చార్టెడ్ అకౌంటెంట్ అయిన వీరు గత 18 సంవత్సరాలుగా కార్పొరేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్నారు. నవంబర్ 2004 లో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు మార్గమధ్యంలో తన పర్సును ఇంట్లోనే మర్చిపోయినట్లు గుర్తు వచ్చింది. సాయి భక్తుడిగా ఉన్నసహ ప్రయాణికుడు ఇతని ఛార్జీలను చెల్లించాడు. అలాగే తన ఇంటి వద్ద సాయి భజనకు హాజరుకావాలని ఆహ్వానించాడు. భజనలో స్వామికిసంబదించినకొన్ని పుస్తకాలు కూడా ఇచ్చాడు. మరపురాని ఈ సంఘటనతో స్వామి ఫోల్డ్ లోకి వచ్చినటువంటి వీరు క్రమంగా సంస్థకు ఆకర్షింపబడి సత్యసాయి సేవా సంస్థ కార్యకలాపాలలో నిమగ్నమయ్యారు. 2010లో ఢిల్లీలో స్వామి వారి మొదటి దర్శనం పొందిన తర్వాత వైద్య శిబిరాలతో సహా వివిధ సేవా కార్యక్రమాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం ప్రారంభించారు.
స్థానిక సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్ 11573…ఇండియా తన తండ్రివ్యాధికి విజయవంతంగా చికిత్స చేయడం చూసి వారిచేత స్ఫూర్తిని పొంది వైబ్రియానిక్స్ కోర్సులో చేరారు. జూలై 2018 లో AVP గా మరియు అదేసంవత్సరండిసెంబర్ లో VP గా అయ్యారు. గత సంవత్సర కాలంగా వీరు 350 మందికి పైగా రోగులకు వివిధ అనారోగ్యాలకు చికిత్స చేశారు. రక్తహీనత, ప్లేట్లెట్ కౌంట్ తక్కువ ఉండటం, అధిక రక్తపోటు, మలబద్ధకం,కడుపులో అల్సర్లు, హైపోథైరాయిడ్, కంటి ఇన్ఫెక్షన్లు, సక్రమంగారాని మరియు బాధాకరమైన రుతుక్రమం, మెనోపాస్, వైరల్ ఇన్ఫెక్షన్, మైగ్రేన్, పక్క తడపడం, కిడ్నీలో రాళ్లు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, నిద్రలేమి, డిప్రెషన్, ట్రావెల్సిక్నెస్, ఆస్తమా, సైనస్ సమస్యలు, ఆర్థరైటిస్, సయాటికా, మచ్చలు మరియు పుండ్లు వంటివి వీరు చికిత్స చేసిన వాటిలో ఉన్నాయి. రేడియేషన్ థెరపీ చేయించుకుంటున్న క్యాన్సర్ రోగి ప్రాక్టీషనర్ నుండి నివారణలు తీసుకున్నతర్వాత ఆ రేడియేషన్ దుష్ప్రభావాల నుండి దూరం అయ్యారు. సాధారణ అలోపతి చికిత్స ద్వారా క్యాన్సర్ ప్రోస్టేట్ విస్తరణ, మూత్రపిండాల వైఫల్యము, మరియు పార్కిన్సన్ వ్యాధి ఉన్న రోగులు అల్లోపతి మందులతోపాటు వైద్యానికి నివారణలు తీసుకున్న తర్వాత అద్భుత ఫలితాలు కనిపించాయి. దీర్ఘకాలిక ఆమ్లత్వం నివారించడానికి వీరు ఎంచుకున్న నివారణలు CC3.5 Arteriosclerosis + CC4.10 Indigestion + CC13.1 Kidney & Bladdertonic...TDS; వీరు చికిత్స చేసిన 25 మందికి సత్వర ఉపశమనాన్ని అందించాయి.
వీరు రెండు వెల్నెస్ కిట్లను తయారు చేసుకున్నారు.మొదటిదిఎల్లప్పుడు తనతో తీసుకు వెళుతూ జ్వరం, జలుబు, దగ్గు, అజీర్ణం, నొప్పులు వంటి వ్యాధుల కోసం ఆఫీసులో తనకు పరిచయస్తులు మరియు సహోద్యోగులకు అందించడమే కాక తనుచేసే అధికారిక పర్యటనలో అనారోగ్యం కలిగినప్పుడు త్వరగా మరియు పూర్తి ఉపశమనం కలిగించడానికి ఇది వారికి సహాయ పడుతూఉంటుంది. వీరు తయారు చేసినరెండవ కిట్టు కుటుంబ సభ్యుల కోసం ఇంట్లో ఉంచుతారు.వీరు ఏదైనా ఊరు వెళ్ళవలసిన సందర్భంలో వీరి కుటుంబ సభ్యులు అవసరమైనవారికి దీని ద్వారా చికిత్స చేస్తూ ఉంటారు. వీరు వారాంతపు సెలవు దినాలు మరియు ప్రత్యేక సెలవు దినములలో తన ఇంటి నుండి రోగులకు చికిత్స చేస్తారు, అలాగే నెలకు ఒకసారి తను ఉండే అపార్ట్మెంట్లో పగటిపూట క్లినిక్ నిర్వహిస్తారు. తీవ్రమైన సమస్య ఉన్న రోగులనుసెలవు దినములు కానప్పటికీ కార్యాలయ పని వేళల ముందు మరియు వెనుక చూడటానికి వెనుకాడరు. వైబ్రియో నివారణలు చేసేందుకు ముఖ్యంగా సమితి స్థాయిలో నిర్వహించే ఆరోగ్య శిబిరాల నిమిత్తం తన భార్య నుండి మద్దతు మరియు సహాయం లభిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.AVPమ్యాన్యువల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ బుక్ మరియు సాయి సాహిత్యాన్ని అధ్యయనం చేయడానికి అభ్యాసకుడు తన ప్రయాణ సమయాన్ని మరియు ఖాళీ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు.
వైద్య సేవ నిర్వహిస్తున్న సందర్భంలో అనేక సార్లు వీరు స్వామి యొక్క మార్గదర్శకత్వాన్ని అనుభవించారు. వైబ్రియానిక్స్ సేవ ద్వారా తనను స్వామి ప్రేమకు వాహకంగా చేసినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి భగవంతుడు మనకి అమూల్యమైన నీరు, సూర్యరశ్మి మరియు ఆక్సిజన్ ప్రాణవాయువు బహుమతిగా ఇచ్చాడని అందువల్ల బాధపడే వారికి సేవ చేయడం, ఆరోగ్యాన్ని అందించడమే ఉత్తమమైన మరియు మన కృతజ్ఞత తెలియజేసే మార్గమనిఆ విధంగా అద్భుతమైన మాధ్యమం ద్వారా సేవ చేసే అవకాశం పొందినందుకు అదృష్టవంతులమని వీరి అభిప్రాయం. ముఖ్యంగా వీరు చెప్పదలుచుకున్నది ఏమిటంటే స్వీయ పరివర్తన కోసం చికిత్సా నిపుణులు అంతా పనిచేయాలి. ఆందోళన, భయం, కోపము మరియు ఇతర రూపంలో అహంకారం యొక్క దుష్ప్రభావాన్ని మనసు నుండి వేరు చేసేందుకు ఈసాధన ఉపకరిస్తుంది. వీరి అనుభవం ప్రకారము వైబ్రియానిక్స్ సాధన ప్రారంభించిన తర్వాత వీరిలో ఆత్మవిశ్వాసం ఇనుమడించి మరింత వినయంగా సేవ చేయగలుగుతున్ననానితెలియజేస్తున్నారు.
పంచుకున్న కేసులు :
చికిత్సానిపుణులవివరాలు 02840...India
ప్రాక్టీషనర్ 02840...ఇండియా కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పొందిన వీరు గత తొమ్మిది సంవత్సరాలుగా ఒక కళాశాలలో అకౌంటెన్సీ మరియు మైక్రోసాఫ్ట్ యుటిలిటీస్ విషయాలను బోధిస్తున్నారు. ఇదే కాకుండా గత ఎనిమిది సంవత్సరాలుగా వీరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫ్యాకల్టీ గ్రూపులో సభ్యులుగా కూడా ఉన్నారు. 2016లో వీరు అకౌంటెన్సీలో డాక్టరేట్ పొందారు. వృత్తిపరమైన బాధ్యతలు నిర్వహించటంతో పాటు తనతో ఏకీభవించే మనస్తత్వం గల వ్యక్తులతో పాఠశాలలు మరియు కళాశాలలలో వృత్తి మరియు వ్యక్తిత్వ వికాసం పై ఉచితంగా ఈ లెర్నింగ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాను కళాశాలలో చదివే రోజుల నుండే సేవాభావం పట్ల మక్కువ ఉన్న వీరు భారతదేశంలో గ్రామీణ అభివృద్ధికోసం జాతీయ సామాజిక సేవా కార్యక్రమంలో చురుకైన పాత్ర నిర్వహించడం వలన పురస్కారాలను కూడా పొందారు. బాల్యము నుండి శిరిడి సాయి భక్తులయినప్పటికీ 2010లో స్వామి ఫోల్డ్ లోనికి వచ్చారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థ సేవా కార్యక్రమాలలో వీరి యొక్క అంకుల్ పాల్గొనడం చూసి ప్రేరణ పొంది 2011లో సేవాదళ్ సభ్యురాలిగా చేరారు. కొద్దిరోజుల తర్వాత పుట్టపర్తిలో ఒక వ్యాధికి నివారణ తీసుకోవడానికి తన బంధువులతో కలిసి వచ్చినప్పుడుస్వామి చెప్పిన మాటలు “మీరు జబ్బుపడిన వ్యక్తిని, నిరాశకు గురైన వ్యక్తిని, అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని చూసినప్పుడు అదే మీ సేవా క్షేత్రం” అన్నవాక్యాలనుచూసి ప్రేరణ పొంది ఆమె వైబ్రియానిక్స్ కోర్సులో ప్రవేశం పొందారు. డిసెంబర్ 2011లో AVP అయ్యారు. వీరుAVP గా అర్హత సాధించిన వెంటనే ఆమెకు ఇవ్వబడిన 108 సిసి బాక్స్ లోని కొన్ని బాటిళ్ళమూతలపై విభూతి ఉండటం చూసి వైబ్రియానిక్స్ పట్ల ఆమెకు ఉన్నవిశ్వాసం బలపడింది. గత ఎనిమిది సంవత్సరాల సాధనలో ఆమె స్వామి యొక్క ఉనికిని అనేక విధాలుగా అనుభవించారు. ఉదాహరణకు స్వామి ఫోటోలపై కనిపించే విభూతి మరియు వైబ్రియానిక్స్ శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకమైన సువాసన వంటి అనుభూతులను పొందారు.
వీరు ఇప్పటివరకు 2,600 మంది రోగులకు చికిత్స చేశారు. వీరు చికిత్స చేసిన వాటిలో ఆమ్లత్వం, రెటినోపతి, రుతు సమస్యలు వంధ్యత్వం, మైగ్రేన్, వత్తిడి, ఉబ్బసం, దీర్ఘకాలిక దగ్గు, ఫంగల్ ఇన్ఫెక్షన్, మరియు బొల్లి వంటి వ్యాధులు ఉన్నాయి. వీరి అనుభవంలోమెట్రో నగరాల్లో మానసిక ఒత్తిడి అధికంగా ఉండే పరిస్థితులు మరియు భారీ ట్రాఫిక్ లో విస్తృతంగా ప్రయాణం చేయడం వంటి సమస్యలు కారణంగా మానసిక అశాంతికి గురి అవుతున్న నేపథ్యంలో రోగులకు ఇచ్చే నివారణలకు CC15.1 Mental & Emotional tonicకలపడం ద్వారా చికిత్స వేగవంతం అవుతుందని మీరు తెలుసుకున్నారు. వీరు ఎల్లప్పుడూ తన వెల్ నెస్ కిట్టును వెంట తీసుకువెళుతూ కార్యాలయానికి వెళ్ళేటప్పుడు మరియు వచ్చేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది రోగులకు చికిత్స చేశారు. ఒకసారి రైలులో తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి మూర్ఛరావడంతో ఆమె తదుపరి స్టేషన్లో దిగి కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తీసుకువెళ్లే వరకు ప్రతీ పది నిమిషాలకు CC10.1 Emergenciesఇచ్చారు. తర్వాత వైద్యుడు సకాలంలో ప్రధమ చికిత్స చేయడాన్ని ప్రశంసించారని ఆ పేషెంటు తరువాత ఈమెకు తెలియజేశారు.
సేవ పట్ల ఈమెకు గల శ్రద్ధ మరియు సంసిద్ధత సహాయం చేసే వైఖరి ఎంతోమంది పేషెంట్లను ఈమె వైపు ఆకర్షితులయ్యే విధంగా చేసింది. అట్టివారిలో ఈమె యొక్క విద్యార్థులు మరియు కార్యాలయ సహచరులే ఎక్కువగా ఉన్నారు. ఆమె నిరంతరం సేవ చేయడానికి తగినంత మంది పేషెంట్లను పంపిస్తూ ఉండమని నిత్యమూ స్వామికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా కేసు సంక్లిష్టంగా ఉన్నప్పుడు మరియు ఏనివారణ ఇవ్వాలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు అంతర్యామి అయిన భగవంతుడు యొక్క మార్గదర్శకత్వం లో సమాధానం స్పష్టంగా లభిస్తుందని ఆమె తెలియజేస్తున్నారు. వైబ్రియానిక్స్ నివారణలు తీసుకోవడం గురించి ఎవరైనా భయపడుతూ సంశయంతో ఆమెను కలుసుకుంటే ఆమె వారి ఇంట్లో పెంచుకొనే మొక్కలకు నివారణలు అందిస్తారు. క్రమంగా వారిలో మార్పు వచ్చి తమంత తాముగా నివారణ తీసుకోవడం ప్రారంభించేలా చేస్తారు.
ఈ వైబ్రియానిక్స్ సేవ తనను ఎల్లప్పుడూ సంయమన స్థితిలో ఉండేటట్లు రోగుల పట్ల సానుభూతితో వ్యవహరించేలా ఇంకా ఆమె సహచరులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు ఏదైనా తప్పుచేసినా క్షమించేస్వభావం అలవాటు చేసిందని పేర్కొంటున్నారు. ఈ అభ్యాసకురాలు తను స్వామి చేతిలో ఒక ఉపకరణం అనీ, స్వామి చెప్పిన మానవసేవయే మాధవ సేవ మరియు అందర్నీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి అనే ఆదేశాన్ని నెరవేర్చడం తన ప్రధాన బాధ్యతగా విశ్వసిస్తున్నారు. ఒక అభ్యాసకుడికి నూరు శాతం విశ్వాసం ఉండి ప్రేమ మరియు కృతజ్ఞతాభావంతో చేసేప్రార్థనకి ఫలితాలు అద్భుతంగా ఫలిస్తాయని ఆమె అభిప్రాయం.
పంచుకున్న కేసులు:
ప్రశ్నలు జవాబులు
1.మనవార్తా లేఖ వ్యాలుమ్9,సంచిక 1 లో మీరు కంటిచుక్కల మందు ఎలా తయారుచేసుకోవచ్చో తెలిపారు. సరిగ్గా అదేవిదంగా చెవిలో మరియు ముక్కులో వేసుకునే చుక్కలను తయారుచేసుకోవచ్చా?
జవాబు : అలా కాదు,తయారుచేసుకునే విధానంలో కొంచెం తేడా ఉంటుంది.
ముక్కులో వేసుకునే చుక్కలు: ఉన్న తేడా ఏమిటంటే మీరు నేరుగా నివారణ మందుని 30ml శుబ్రపరిచిన లేదా కాచిచల్లార్చిన నీటిలో లేదా ఎక్స్ ట్రా విర్జిన్ ఆలివ్ అయిల్ లేదా మరే ఇతర ఎక్కువ నాణ్యత గల నూనెలో ఒక చుక్క వేసి, బాగా కలిపితేముక్కులో వేసుకునే చుక్కలు సిద్దంగా ఉంటాయి.
చెవిలో వేసుకునే చుక్కలు: పైన చెప్పిన విధముగానే తయారుచేసుకోవచ్చు. కానీ నీటిని ఉపయోగించకపోవడం మంచిది.
________________________________________
2. వైబ్రో ప్రాక్టీషనర్ గా ఉంటూ ఉచితంగా ఇతర వైద్యం ఏదైనా అందించవచ్చా?
జవాబు : అలా చేయకూడదు, ఎందుకంటే వైబ్రియానిక్స్ మీద ఉన్ననమ్మకము, విశ్వాసమే నివారణలు చక్కగా పనిచేయడానికీ, వైబ్రియానిక్స్ అభివృద్ధికి తోడ్పడతాయి.
ఏదైనా రెమెడీ పనిచేయనట్లుగా అనిపిస్తే (ఆశించిన ఫలితం రాకపోవడం వల్ల )ప్రాక్టీషనర్ కు,మరొకచికిత్సాపద్దతికి ప్రయత్నించే అవకాశం ఉంటే,వైబ్రియనిక్స్ యొక్క సామర్ధ్యాన్ని పూర్తిగా వినియోగించకుండా , ఇతర చికిత్సా పద్దతికి ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉంది;ఎందుకంటే మానవుని మనసు వివిధ మార్గాలద్వారా త్వరగా ఉపశమనం కోరుకుంటుంది,ఇది మేము అర్ధంచేసుకోగలము.ఒకే సమస్యకు వైబ్రియానిక్స్ లో చాలా రకాల కాంబోలు అందుబాటులో ఉన్నాయి అనే వాస్తవాన్ని ప్రాక్టీషనర్ విస్మరించే అవకాశముంది! పేషెంట్ఒకేసారి వేరే చికిత్సా పద్దతిని ఎంచుకునే కంటే వేరే కాంబో తీసుకోడానికి ఎక్కువ ఇష్టపడతాడు.
ఇంకా చెప్పాలంటే స్వామి వైబ్రియనిక్స్ ని భవిష్యత్ వైద్యంగా తెలిపారు కానీ దీని పూర్తి సామర్ధ్యం తెలుసుకోటానికి ఎటువంటి పరిశోదనలు జరగలేదు. అభ్యాసం మరియు ప్రయోగాల వల్ల నిదానంగా దీనిలోవున్న వేరు వేరు అవకాశాలను తెలుసుకోటానికి సహాయ పడతాయి. దీని అభివృద్ధి నిరంతరం కొనసాగుతున్న ప్రక్రియ, ఇది నిబద్ధత గల ప్రాక్టీషనర్స్ తో మాత్రమే సాద్యమవుతుంది. ప్రాక్టీషనర్, వైబ్రియనిక్స్ తో పాటు వేరొక వైధ్య పద్దతిని అనుసరిస్తే, ప్రాక్టీషనర్ కు వైబ్రియనిక్స్ అభివృద్ధి మీద ఆసక్తిలేనట్లు తెలుస్తుంది.
________________________________________
3. ఆరోగ్య శిబిరాలలో పనిచేసినప్పుడు బృందం(టీమ్) లో ఒక సభ్యుడిగా నెలవారీ నివేదికల కోసం పేషెంట్స్ సంఖ్యను ఎలా లెక్కించాలి. ?
జవాబు :శిబిరంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే, చాలా మంది ప్రజలుఒకే చోట కలుస్తారు కేసు వివరాలను తెలుసుకోవడం, రెమెడీ లు తయారు చేయడం మరియు తగిన సూచనలతో పేషెంట్స్ కి నివారణలు అందించడం లాంటివి ఉంటాయి.దీనికోసం కొంత మంది ప్రాక్టీషనర్స్ పెద్దమొత్తంలో నివారణలు మాత్రమే తయారు చేయడం, వేరే ప్రాక్టీషనర్ ద్వారా పంపిణీ చేయడం లాంటివి జరుగుతుంటాయి. ఎవరైనా తమ సేవా సమయాన్ని లెక్కించడం చాలా సులభం. కానీ నెలవారి నివేదికల కోసం పేషెంట్స్ సంఖ్యను లెక్కించటానికి,టీమ్ మొత్తం చికిత్స చేసిన రోగుల సంఖ్యను ప్రాక్టీషనర్స్ కు సమంగా పంచండి.ఎక్కడైనా ఒకే నివారణ, ఉదాహరణకి బ్రైన్ అండ్ మెమొరీ టానిక్ ఎక్కువ మందికి ఇస్తే,ప్రతి పేషియంట్ కి 15 నిమషాలను సేవా సమయoగా తీసుకోండి.ఇదే 15నిమషాల సూత్రాన్ని, నీటిలో నివారణ తయారుచేసి ఇంటి ప్రాంగణంలో లేదా పార్క్ లలో అనేక పక్షులు లేదా జంతువుల కోసం ఉంచినప్పుడు అనుసరించవచ్చు. మొక్కల విషయంలో, నెలలో 10 మొక్కలకు చికిత్సచేస్తే ఒక పేషంట్ గా తీసుకోండి. కానీ,దినచర్యలో భాగంగా ఎక్కువ సంఖ్యలో మొక్కలకు చికిత్స చేస్తే 15 నిమషాల సూత్రాన్ని అనుసరించండి.
________________________________________
4.రోగ లక్షణాలను స్పష్టంగా వివరించని పేషంట్నుండి రోగానికి మూల కారణము తెలుసుకొనడానికి సంబంధించిన ప్రశ్నలను అడగాలంటే సంకోచిస్తున్నాను. ఇలాంటి సంధిగ్ధ పరిస్థితిని ఎలా పరిష్కరించుకోవాలి ?
జవాబు : మీరు అలాంటి పేషంట్లను చూసినప్పుడు వారు చెప్పిన రోగలక్షణాలు,రోగి ప్రవర్తన మరియు శరీరతత్వంపై స్వంత పరిశీలన చేసి దాని ఆధారంగా నివారణాలను తయారుచేసి ఇవ్వాలి. మొదటి సమావేశంలోనే పేషంట్ సమస్య గురించి ప్రతిదీ ఖచ్చితంగా తెలుసుకోవలసిన అవసరంలేదు.పేషంట్ సమాధానం ఇవ్వడానికి సుముఖంగా ఉన్న ప్రశ్నలను మాత్రమే అడగండి ; మీరు అతనితో సంబంధాన్ని పెంచుకున్న తరువాత తదుపరి సమావేశంలో అడగవలసిన ప్రశ్నలను వ్రాసుకోండి.కొన్నిసార్లు పేషంట్ మిమ్మలను విశ్వసించి అన్నివిషయాలూ చెప్పటానికి మరిన్ని సందర్శనల అవసరం పడుతుంది.కొంతమంది పేషంట్లు మాటలలో చెప్పలేరు. ఇటువంటి సందర్భాలలో,చికిత్సా నిపుణులు పేషంట్లతో ముఖాముఖికి ముందే ప్రశ్నల జాబితాను తయారుచేసి వారికి ఇచ్చినట్లయితే వాళ్ళు ఆలోచించుకునే సమయం ఉంటుంది. ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకమైన మనస్తత్వం ఉంటుంది. మీరు ప్రాక్టిషనర్స్ గా మీ సహాయం కోరి వచ్చే పేషంట్ల పట్ల ప్రేమగా, సున్నితంగా మరియు సందర్భానుసారం తెలివిగా ఉండాలి. ఇవి ఏమి పనిచేయకపోతే, మీరు గట్టిగా ప్రార్ధించి స్పష్టత కోసం అంతరాత్మనిఅనుసరించాలి ఇది మీకు తరచుగా సహాయంగా ఉంటుంది.
________________________________________
5. క్యాన్సర్ కి సంబందించిన అనారోగ్యాలు పెరుగుతున్నందున,క్యాన్సర్ పేషంట్ల కుటుంబ సభ్యులకు క్యాన్సర్ రాకుండా నివారణలు ఇవ్వడం సాధ్యమేనా ?మరియు ఉపశమనం కోసం వెళ్ళిన పేషంట్ల కి (ఏ చికిత్స తీసుకుంటున్నప్పటకి)సరైన కాంబో ఏది ?
జవాబు : క్యాన్సర్ఉపశమనం కోసం వైద్యం తీసుకుంటున్న రోగులకు లేదా తల్లితండ్రులు లేదా తాత,మామ్మలకు క్యాన్సర్ ఉన్నప్పుడూ , వారసత్వంగా వచ్చే క్యాన్సర్ నుండి రక్షణ పొందటానికి ఇది చాలా ముఖ్యమైనది. 108CC బాక్స్ ఉన్న ప్రాక్టీషనర్స్CC2.1 Cancersఇవ్వాలి.SRHVP ఉన్నవాళ్ళు BR4 Fear + SM1 Removal of Entities + SM2 Divine Protection + SR282 Carcinosin CMఇవ్వాలి. ఏవిధముగా ఇచ్చినప్పటకి మోతాదు: OW రెండు నెలలపాటు రాత్రిపూట తరువాత OM (నెలకు ఒక మోతాదు) 6 నెలలపాటు, తరువాత ప్రతి 6 నెలలకు ఒక మోతాదు 2 సంవత్సరాలపాటు తరువాత ప్రతి సంవత్సరం ఒక మోతాదు 3 సంవత్సరాలపాటు ఇవ్వవలసి ఉంటుంది.
దివ్య వైద్యుని దివ్యవాణి
“ప్రతి ఒక్కరికీ A,B,C,D మరియు Eవిటమిన్లు అవసరం. విటమిన్లు మరియు ప్రోటీన్లు సాత్విక ఆహారంలో లభిస్తాయి.ప్రోటీన్లు పాలు, మజ్జిగ, మరియు ముడి గోధుమలలో ఉంటాయి; కూరగాయలలో చాలా విటమిన్లుఉంటాయి. భారతీయులు మరియు విదేశీయులు, వారి అలవాట్లు కారణంగా మాంసాహారం తీసుకోవడం మరియు మధ్యం త్రాగడం వల్ల వారి జీవితాలను పాడుచేసుకుంటున్నారు.మానవులందరికి ఆరోగ్యం చాలా అవసరం. ఆరోగ్యంగా ఉన్నవారు ఆధ్యాత్మిక సాధన సులభంగా చేసుకోవచ్చు.ఈ కాలంలో మన చేతులతో మనమే ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము.కేవలం ఆహారం,నివాసం మరియు దుస్తులు ఉంటే చాలు ప్రజలు సంతోషంగా ఉంటారనే భావనలో మనం ఉండకూడదు,”
…సత్య సాయి బాబా. “సత్య సాయి ఆహారం మీద ఇచ్చిన ఉపన్యాసాలు -మొదటి 81 సవత్సరాల అవతారంలో ఆహారం మీద ఇచ్చిన దివ్యఉపన్యాసాలు నుండి ” దివ్య ఉపన్యాసం 27 ఆగష్టు 1994
“సేవ ద్వారా అన్నిజీవులు దివ్యత్వం అనే సముద్రమునకు తరంగాల వంటివారనే సత్యాన్ని గ్రహిస్తారు. మరే ఇతర సాధన మిమ్మల్ని అన్ని జీవుల ఏకత్వం పై నిరంతరం ఆలోచించే స్థితికి తీసుకురాలేవు.అట్టి స్థితి ఏర్పడితే మీరు ఇతరుల బాధను మీబాధగా భావిస్తారు. ఇతరుల విజయాన్ని మీ విజయంగా భావిస్తారు. అందరిలో మిమ్మల్ని, మీలో అందరినీ చూసుకుంటారు. ఇది సేవా సాధన యొక్క ప్రధాన భాగం. ఇంకా, సేవ అహం క్షీణించేలా చేస్తుంది.ఇది ఇతరుల బాధలనూ చూసి మీ హృదయం ద్రవించేలా చేస్తుంది. మీలో సహాయం చేయాలనే తపనవున్నప్పుడు అతని సామాజిక లేదా ఆర్ధిక స్థితి ఎంత ఎక్కువ ఎంత తక్కువ అని ఆలోచించరు. సేవా అవకాశాల ద్వారా కఠినమైన హృదయం నిదానంగా మెత్తబడుతూ వెన్నలాగా మృధువుగా తయారవుతుంది ఇదియే సేవాదళ్ భగవంతునకు అర్పించవలసినది.”
…సత్య సాయి బాబా, “నో బంప్స్, నో జంప్స్” ఉపన్యాసం 14 నవంబర్ 1975 http://www.sssbpt.info/ssspeaks/volume13/sss13-18.pdf
ప్రకటనలు
ప్రకటనలు
నిర్వహిoచబోయే శిబిరాలు (ఫెబ్రవరి 2020 లో జరిగే వర్క్ షాప్ తారీఖులలో చిన్న మార్పులు జరిగినవి దయచేసి గమనిచగలరు)
- ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్16-22 నవంబర్ 2019, సంప్రదించ వలసినవారులలిత, వెబ్సైటు [email protected] లేక టెలిఫోన్ నెంబర్ 08555-288 377
- ఇండియా పుట్టపర్తి : SVP వర్క్ షాప్ 24-28 నవంబర్ 2019,సంప్రదించ వలసినవారు హెమ్ వెబ్సైటు [email protected]
- ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్ 23-29 ఫెబ్రవరి 2020 సంప్రదించ వలసినవారులలిత, వెబ్సైటు [email protected] లేక టెలిఫోన్ నెంబర్ 08555-288 377
- యు.ఎస్. ఎ. రిచ్మండ్ VA: AVP వర్క్ షాప్ 3-5 ఏప్రియల్ 2020 సంప్రదించ వలసినవారుసుసాన్వెబ్సైటు [email protected]
- ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్ 08-14 జూలై 2020సంప్రదించ వలసినవారులలిత, వెబ్సైటు [email protected] లేక టెలిఫోన్ నెంబర్ 08555-288 377
- ఇండియా పుట్టపర్తి : AVP వర్క్ షాప్16-22 నవంబర్ 2020 సంప్రదించ వలసినవారులలిత, వెబ్సైటు [email protected] లేక టెలిఫోన్ నెంబర్ 08555-288 377
అదనంగా
1. ఆరోగ్య చిట్కాలు
ఆరోగ్యకరమైన థైరాయిడ్ దిశగా పనిచేయండి !
“మితమైన ఆహారం ఉత్తమ ఔషదం.ప్రతీ చిన్న అనారోగ్యానికి ఆసుపత్రికి పరిగెత్తవద్దు. ఎక్కువగా మందులు తీసుకోవడం కూడా మంచిదికాదు. ప్రకృతి సిద్ధంగా వ్యాధి పై పోరాడటానికి మరియు మిమ్మలని ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఇవ్వండి. ప్రకృతివైద్యంయొక్క సూత్రాలను మరింత ఎక్కువగా అవలంబించి డాక్టర్స్ చుట్టూ తిరగడం మానండి...”శ్రీ సత్య సాయి బాబా1
1. థైరాయిడ్ మరియు అది చేసే ముఖ్యమైన పని
థైరాయిడ్ ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధి, మెడ దిగువ మధ్య బాగంలో, ఆడమ్స్ యాపిల్ కి కొంచెం క్రింద,స్వరపేటిక దిగువ భాగాన రెండు వైపులా మరియు శ్వాసనాళం పై భాగాన ఉంటుంది.2-4
థైరాయిడ్ పాత్ర : ఎండోక్రైన్ వ్యవస్థలో దీని ప్రధానపాత్ర శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడం, అనగా, కణాలకు ఉన్న సామర్ధ్యంతో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలగ చేసి శక్తిగా మార్చడం.దాదాపు జీవక్రియకి సంబందించిన అన్నివిలువలను (పెరామీటర్స్)అనగా , ఆకలి, శక్తి స్థాయి, హృదయస్పందన రేటు, శరీరఉష్ణోగ్రత, రక్తప్రసరణ,ఎముకుల పెరుగుదల మరియు అబివృద్ధి(ముఖ్యంగా శిశువులు మరియు చిన్న పిల్లలలో), కండరాల స్థితి స్థాపకత మరియు మృదుత్వం ,రక్తంలో చక్కెర స్థాయి, ప్రేగు పనితీరు,కొలెస్ట్రాల్ స్థాయి, కొవ్వు, కొర్బోహైడ్రేట్,ప్రోటీన్ జీవక్రియ, శరీర బరువు,రక్తంలో కాల్షియం స్థాయి, కేంద్ర నాడీ వ్యవస్థ, మరియు పునరుత్పత్తి వ్యవస్థ.2,3,5-9 ఇది ప్రభావితం చేస్తుంది.
థైరాయిడ్ యొక్క పని తీరు :సరిగ్గా పని చేసే థైరాయిడ్ ఆహారం నుండి అయోడిన్ ను గ్రహిస్తుంది,దీనిని శరీరంలో ఉన్న అమైనో ఆమ్లం టైరోసిన్ తో మిళితం చేస్తుంది. అనంతరం తన పని తాను చేయడానికి దీనినిT3 మరియుT4హార్మోన్స్ (ట్రై-అయోడోథైరోనిన్ మరియు థైరాక్సిన్)గా మారుస్తుంది.ఇతర ఎండోక్రైన్ గ్రంధుల మాదిరిగా కాకుండా, థైరాయిడ్ గ్రంధి అది ఉత్పత్తి చేసిన హార్మోనులను నిల్వ చేసుకోగలదు.8,9,10
పిట్యూటరీ మరియు హైపోథాలమస్ చేత నియంత్రించబడుతుంది: థైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరును, మెదడు క్రింద పుర్రె మధ్యలో ఉంటూ మాస్టర్ గ్రంధిగా పిలవబడే పిట్యూటరీ గ్రంధి పర్యవేక్షిస్తూ నియంత్రిస్తుంది.ఏవిదంగా థర్మోస్టాట్ ఉష్ణోగ్రతని నియంత్రిస్తుందో అదేవిదంగా పిట్యూటరీగ్రంధి,థైరాయిడ్ గ్రంధికి మద్దత్తుగా TSH హార్మోన్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) ఉత్పత్తిని నియంత్రిస్తూ సర్ధుబాటు చేస్తుంది. తిరిగి,పిట్యూటరీగ్రంధి మెదడులో అంతర్లీనంగా ఉన్న న్యూరో ఎండోక్రిన్ గ్రంధి హైపోథాలమస్ చే స్రవించబడే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్(TRH) చే ప్రేరేపించబడుతుంది.3,5,6,8,10
పారాథైరాయిడ్ గ్రంధులకు దగ్గరగా : ప్రక్క చిత్రంలో చూపిన విదంగా భౌతికంగా థైరాయిడ్ కి నాలుగు చిన్నపారాథైరాయిడ్ గ్రంధులు ఉన్నాయి. కానీ, థైరాయిడ్ తో వాటికి ఎటువంటి క్రియాత్మక సంబందంలేదు.11,12
2. థైరాయిడ్ లోపం వల్ల వచ్చే రుగ్మతలు
నిశితంగా చూస్తే రెండు రకాల సమస్యలు తలెత్తవచ్చు.థైరాయిడ్ హార్మోన్ల స్రావం (T3 మరియు T4) సరిపడనంతగా ఉండకపోవచ్చు దీనికి కారణం థైరాయిడ్ గ్రంధి సామర్ధ్యం తక్కువగా ఉండటం(హైపో థైరాయిడ్)లేదా హార్మోన్ల స్రావం ఎక్కువగా ఉండటం(హైపర్ థైరాయిడ్).ఒక తేలికైన రక్తపరీక్ష థైరాయిడ్ సామర్ధ్యాన్ని తెలియచేస్తుంది.ఐతే లక్షణాలు మరియు కారణాలు వ్యక్తికి వ్యక్తికీ మారుతూ ఉండవచ్చు.2
థైరాయిడ్ పనితీరుకు సూచికలు: పిట్యూటరీగ్రంధి ద్వారా విడుదల చేయబడిన TSH స్థాయి సాధారణంగా థైరాయిడ్ పనితీరుకు సూచిక. థైరాయిడ్ మందకొడిగా తయారైతే, థైరాయిడ్ ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేసేలా ప్రేరేపించడానికి పిట్యూటరీగ్రంధి ఎక్కువ TSH ఉత్పత్తి చేయవలసిఉంటుంది. అందువల్ల, రక్తపరీక్షలో TSH ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తే, ఇది హైపోథైరాయిడ్ ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, థైరాయిడ్ హైపర్యాక్టివ్ అయితే,పిట్యూటరీగ్రంధి TSH ఉత్పత్తిని ఆపివేయాలి, తద్వారా థైరాయిడ్ తక్కువ హార్మోన్లను స్రవిస్తుంది; రక్తపరీక్షలో తక్కువ TSH చూపిస్తుంది, ఇది హైపర్ థైరాయిడిజాన్నిసూచిస్తుంది. హైపర్ మరియు హైపో థైరాయిడ్ అనారోగ్యం మరియు మందులు ద్వారా ప్రభావితం అవుతాయి. థైరాయిడ్ లోపాలను నిర్ధారించడానికి TSH పరీక్ష మాత్రమే కాకుండా థైరాయిడ్ కి చికిత్స అవసరం ఉందో లేదో తెలుసుకోడానికి T3 మరియు T4 వంటి ఇతర పరీక్షలు తరచుగా ఉపయోగిస్తారు.13,14
సాధారణంగా థైరాయిడ్ పరిది: సాధారణంగా థైరాయిడ్ పరీక్షలోTSH ఉండవలసిన పరిది: 0.4 to 4-5 mU/L (మిల్లీ యూనిట్స్ ఒక లీటర్ సెరంకి). ఇది మార్గదర్శక సూచీ మాత్రమే ఎందుకంటే ఇది పరీక్షింప బడినవారి వయస్సు , ఆడ మగ తేడా, గర్భవతి, పరీక్ష చేసిన ల్యాబ్ ను బట్టి TSH పరిదిలో మార్పులు ఉండవచ్చు.13,14
హైపో థైరాయిడిజం లక్షణాలు:హార్మోన్ల లోపం యొక్క తీవ్రతను భట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా, శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది, శరీరానికి శక్తి ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకోలేదు.
- శిశువులలో థైరాయిడ్ ఉంటే, ఉత్సాహంగా లేకపోవడం మరియు నిశ్శబ్దంగా ఉండటం, ఆకలి తక్కువగా ఉండటం, అవసరంలేకపోయిన ఎక్కువసేపు నిద్రించడం లాంటి లక్షణాలు ఉంటాయి.
- పిల్లలలో పెరుగుదల తక్కువగా ఉండటం,శాశ్వత దంతాల అభివృది ఆలస్యమవడం, యుక్తవయస్సుఆలస్యంగా రావడం, మానసిక అభివృద్ధి సరిగ్గాలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
- పెద్దవాళ్లలో లక్షణాలు ఈ విదముగా ఉండొచ్చు : అతిగా తినకపోయిన ఆకస్మికంగా బరువు పెరగడం,ఉబ్బిన ముఖం, అలసట, తరచుగా జలుబు రావడం, చర్మం పొడిబారడం, మలబద్ధకం, మతిమరుపు,మానసికముగా తేలికపాటి కుంగుబాటు, జుట్టు పలచబడటం, ముఖం మీద జుట్టు పెరగడం,మొద్ధుబారడం, కొలస్ట్రాల్ స్థాయి పెరగడం, కండరాల బలహీనత, కండరాలు సున్నితముగానో గట్టిగానో మారిపోవడం మరియు మహిళలలో తరచుగానూ ఎక్కువగానూ ఋతుస్రావం రావడం.2,3,5-8,15,16,18
హైపో థైరాయిడిజం కి కారణాలు :
- అయోడిన్ లోపం, అయోడైజుడు ఉప్పు వాడుతున్న దేశాలకు ఇది వర్తించదు.
- థైరాయిడ్ గ్రంది వాపు (థైరాయిడిటిస్) ఇది శరీర రక్షణ వ్యవస్థ లోపంవల్ల (హషిమోటోస్ థైరాయి డిటిస్)కూడాకావచ్చు. శరీర రక్షణ వ్యవస్థ థైరాయిడ్ కణజాలంపై దాడి చేసి, చివరకు హార్మోన్ల ఉత్పత్తిని ఆపి చంపేస్తుంది. ఇది నొప్పిలేకుండా ఉండే వ్యాధి,ప్రధానంగా మధ్య వయస్కులైన మహిళలలు ఎక్కువగా దీనికి గురిఅవుతారు.
- అప్పుడే పుట్టిన శిశువులలో థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయకపోవడంవల్ల, శస్త్రచికిత్స ద్వారా థైరాయిడ్ గ్రంధిని తొలగించడం, లేదా పిట్యూటరీగ్రంధిలో లోపాలవల్ల.
- మానసిక అనారోగ్యం పోగొట్టుకోవడానికి మందులు వాడటంవల్ల, తీసుకునే ఆహారంలో లోపాలవల్ల లేదా రక్తంలో లోపాలవల్ల అధిక అయోడిన్ కి గురికావడం.3,6,7,15,16
హైపర్ థైరాయిడిజం లక్షణాలు :ఇతర ఆరోగ్య సమస్యలను అనుకరించే అవకాశం ఉంది, ఇది గుర్తించడం కష్టం. సాధారణంగా శరీరం అవసరమైనదానికంటే వేగంగా శక్తిని ఉపయోగిస్తుంది.
- ప్రధాన లక్షణాలు : మెడ మొదటి భాగంలో వాపు ఉండటంవల్ల థైరాయిడ్ గ్రంధి ఉండవలసిన దానికంటే పెద్దగా కనిపిస్తుంది, హృదయ స్పందన వేగముగా ఉండుట(టాచీకార్డియా)-సాధారణంగా హృదయ స్పందన నిమషానికి 100 కంటే ఎక్కువ ఉండటం, హృదయ స్పందన సక్రమంగా లేకపోవడం,ఎక్కువ శబ్దంతో గుండె కొట్టుకోవడం, నాడి వేగంగా కొట్టుకోవడం,లేదా చేతి వేళ్ళను చాపి పట్టుకుంటే వేళ్ళలో వణుకు కనిపించడం.
- ఇతర లక్షణాలు: ఇవి అసాధారణంగా ఉండొచ్చు ఆకలి బాగా ఎక్కువగా ,సాధారణ స్థాయి లేదా ఎక్కువ ఆహారం తీసుకున్నప్పటకి ఆకస్మికంగా బరువు తగ్గడం, ఆందోళన, భయము మరియు చిరాకు, అసాధారమైన చెమట, వేడి తట్టుకోలేకపోవడం,చర్మం పలచబడడం, జుట్టు పెళుసుగా అవ్వడం, తరచుగా ప్రేగులో కదలికలు, కండరాలు బలహీనంగా ఉంటే అలసిపోయినట్లు అనిపించుట, ఏకాగ్రత సక్రమంగా లేకపోవడం, బోలు ఎముకల వ్యాధి, నిద్రలేమి, కళ్ళు ఎరుపు లేదా ఉబ్బినట్లు,మరియు మహిళల విషయంలో తరచుగా లేదా తక్కువగా ఋతుస్రావం.
- వృద్దులలో హృదయ స్పందన రేటు పెరగడం, వేడిని తట్టుకోలేకపోవడం, సాధారణ కార్యకలాపాలలో అలసిపోయినట్లు అనిపించుట వంటి సంకేతాలు లేదా లక్షణాలు కనిపించకపోవచ్చు,2,3,5-8,15,17,18
హైపర్ థైరాయిడిజమ్ కి కారణాలు :
- గ్రేవ్స్ వ్యాధి, ఈ వ్యాధి ఉన్నవారిలో రోగనిరోధక శక్తి థైరాయిడ్ గ్రంధి మీద దాడి చేసి అవసరమైనదానికంటే ఎక్కువ హార్మోన్స్ తయారు అయ్యేలా చేస్తుంది(40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మహిళలలో ఇది సర్వసాధారణం) ; ఇది కొన్నిసార్లు కళ్ళలో వేరువేరు లక్షణాలతో థైరాయిడ్ కంటి వ్యాధికి దారితీయవచ్చు ;
- శరీరంలో ఎక్కువ అయోడిన్ ఉండుటవల్ల, దీనికి కారణం థైరాయిడ్ మందు మోతాదు లేదా అయోడిన్ ఉన్న పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం ;
- థైరాయిడ్ గ్రంధి మీద ఏర్పడిన విషతుల్యమైన అడేనోమాస్, వాపు మరియు బుడిపి శరీరంలోని రసాయినిక సమతుల్యతని దెబ్బతీసే హార్మోన్స్ స్రవించేలా చేస్తాయి; సబక్యూట్ థైరాయిడిటీస్అనగా హార్మోన్స్ లీక్ కారణంగా మంటకు కారణమవుతుంది
- పిట్యూటరీగ్రంధి సరిగా పనిచేయకపోవడం లేదా థైరాయిడ్ గ్రంధిలో కాన్సర్ పెరుగుదల.3,6,7,15,17
3. థైరాయిడ్ సమస్యను నివారించండి
ఎటువంటి లక్షణాలు కనిపించినా ఆలస్యంచేయకుండా థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం మరియు అవసరమైన వైధ్య చికిత్స తీసుకోవడం మంచిది.థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఇతర ఆరోగ్య సమస్యలు లాలాజల గ్రంధి ఉబ్బడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, నోటి మంట, సన్నబడటం(క్షయం) మరియు దంతాల బోలుతనపు వ్యాధికి దారి తీస్తుంది అని అధ్యయనాలు తెలియచేసాయి.19,20కనుక ప్రతి ఒక్కరూ క్రింది సూచనలను పాటిస్తూ ఆరోగ్యకరమైన థైరాయిడ్ కలిగి ఉండేదిశగా పనిచేయాలి:18,21-30
- స్వచ్చమైన గాలి ఉన్నచోట క్రమం తప్పకుండా వ్యాయామం శాస్త్రీయ అధ్యయనాలలో నొక్కి చెప్పినవిదంగా 22, మరియు నిపుణల మార్గదర్శకత్వంలో యోగాసనాలు. 18,21
- అయోడిన్ మరియు అమినో ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం.కాలానుగుణంగా వచ్చే తాజా పండ్లు, ముఖ్యంగా రేగిపండ్లు మరియు ద్రాక్ష వంటి రంగు రంగు పండ్లు ; కాలే, బ్రోకలి మరియు బచ్చలకూరతో సహా ఆకుపచ్చ కూరగాయలు ; అన్ని రకాల ధాన్యాలు, వీలైతే రాత్రిఅంతా నానబెట్టినవి లేదా మొలకెత్తినవి;గింజలు మరియు విత్తనాలు జీడిపప్పు, బాదం,గుమ్మడి మరియు మెంతి వంటి గింజలు, మరియు విత్తనాలు ; మరియు పెరుగు.ఒకే రకమైన ఆహారం ఎక్కువగా తీసుకోకూడదు అది ఆరోగ్యకరమైనది అని సిఫార్సు చేయబడినది అయినసరే.23-30
- విటమిన్బి-12 (విటమిన్-బి ఉండే ఆహారం కోసం, న్యూస్ లెటర్ వాల్యూమ్ 9 సంచిక 4, జూలై-ఆగష్టు 2018 చూడండి).27-29
- సెలీనియమ్ఇది బ్రెజిల్ గింజ, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు, ఆవాలు, ఆవిసె గింజలు, వేరుశనగ, బార్లీ మరియు ముడి బియ్యంలో ఉంటుంది.26-29
- మానివేయవలసిన లేదా తగ్గించుకోవలసిన కొన్ని ఆహారపదార్ధాలు అవి ఏమిటంటే: బంక ఉన్న పదార్ధాలు, ఉప్పు ఉన్న పదార్ధాలు, నిల్వ లేదా ప్రాసెస్ చేసిన ఆహారం, కొవ్వు ఎక్కువగా ఉండేవి , మరియు చక్కెర ఎక్కువగా ఉండే కేక్, బిస్కెట్, చాక్లెట్ మరియు కాఫి లాంటి పానీయాలు.27-30
- వీటికి వైబ్రియానిక్స్ రెమెడీలు: CC6.1 Hyperthyroid, CC6.2 Hypothyroid, CC12.1 Adult tonic, CC12.4 Autoimmune diseases, CC15.4 Eating disorders, CC17.2 Cleansing108CC బాక్స్ వాడుతున్నవారు;
NM72 Cleansing, NM86 Immunity,SR290 Endocrine integrity, SR308 Pituitary Gland, SR319 Thyroid Gland, SR498 Hypothalamus, SR517 Parathyroid, SR567 Hyperthyroidism,SR568 Hypothyroidism, SR572 Obesity పోటెన్టైసర్ వాడుతున్నవారు.
అధ్యయనం కోసం వెబ్సైట్లు :
References and Links:
1. Food and Health:http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf
2. What is Thyroid: https://www.webmd.com/a-to-z-guides/do-i-have-thyroid-problem
3. https://my.clevelandclinic.org/health/diseases/8541-thyroid-disease
4. Taber’s Cyclopaedic medical dictionary, edition 20, 2001, page 2187
5. https://www.endocrineweb.com/endocrinology/overview-thyroid
6. Metabolism: https://healthywa.wa.gov.au/Articles/S_T/The-thyroid-gland
7. http://www.vivo.colostate.edu/hbooks/pathphys/endocrine/thyroid/physio.html
8. https://www.crozerkeystone.org/conditions/endocrinology/Thyroid-Disorders/
9. Manual for Junior Vibrionics Practitioners, English 2007, chapter 7: Anatomy and Body Systems, page 37
10. Functioning of thyroid: https://www.endocrineweb.com/conditions/thyroid/how-your-thyroid-works
11. http://endocrinediseases.org/parathyroid/parathyroid_background.shtml
12. https://www.endocrineweb.com/endocrinology/overview-parathyroid
13. Thyroid function indicators: http://www.btf-thyroid.org/information/leaflets/34-thyroid-function-tests-guide
14. https://www.webmd.com/women/what-is-tsh-test#1
15. Thyroid disorders: https://www.webmd.com/women/guide/understanding-thyroid-problems-basics#1
16. https://www.mayoclinic.org/diseases-conditions/hypothyroidism/symptoms-causes/syc-20350284
17. https://www.mayoclinic.org/diseases-conditions/hyperthyroidism/symptoms-causes/syc-20373659
18. https://www.artofliving.org/in-en/yoga/health-and-wellness/cure-thyroid-with-yoga
19. Thyroid & BP: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3230087/
20. Thyroid and mouth: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3169868/
21. Work for a healthy thyroid: https://www.youtube.com/watch?v=3VZF-F6LRwU
22. Physical exercise important: http://www.amhsjournal.org/article.asp?issn=2321-4848;year=2015;volume=3;issue=2;spage=244;epage=246;aulast=Bansal
23. Balanced food: https://www.webmd.com/women/features/low-thyroid-alternative-therapy#1
24. Iodine rich food: https://ods.od.nih.gov/factsheets/Iodine-Consumer/
25. Amino acids rich food: https://www.medicalnewstoday.com/articles/324229.php
26. Selenium rich food: http://www.whfoods.com/genpage.php?tname=nutrient&dbid=95
27. Foods for thyroid: https://www.livestrong.com/article/497146-vegetarian-diet-for-hypothyroidism/
29. Plant based diet best: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3847753/
30. Foods to avoid: https://www.everydayhealth.com/hs/thyroid-pictures/foods-to-avoid/
2. ఏవిపి వర్క్ షాప్ మరియు రీఫ్రెషర్ సెమినార్ జాగ్రెట్, క్రోయేషియా, 5-8 సెప్టెంబర్ 2019
డాక్టర్ అగర్వాల్ మరియువారిశ్రీమతిజాగ్రెబ్ లో నిర్వహించిన సెమినార్ కి ఖచ్చితంగా 20 సంవత్సరాల తరువాత ఆహ్వానిచబడినందుకు ఎంతో గౌరవంగా భావించారు, ఎందుకంటే మొట్టమొదటిసారి క్రొయేషియాలోనిజాగ్రెబ్ మరియు స్ప్లిట్ లో వర్క్ షాప్ నిర్వహించినప్పుడు 68 మంది ప్రాక్టిషనర్స్ కి SRHVP గురించి శిక్షణ ఇవ్వడం కోసం సందర్శించడం జరిగింది,
ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి చాలా నెలలపాటు చాలా కష్టపడి పనిచేసిన కోఆర్డినేటర్ 03577 కి ఈ గౌరవం దక్కుతుంది. ఈ సదస్సు నిర్వహించడం కోసం వారిని ప్రేరేపించి, వైబ్రియనిక్స్ లో జ్ఞానాన్నిపెంచాలనే ఉద్దేశ్యంతో 100 మందికి పైగా ప్రాక్టిషనర్స్నుస్వయంగా సంప్రదించారు (క్రోయేషియాలో మొత్తం 160 మంది ఉన్నారు). దీనితోపాటు ఆమెకి దరఖాస్తులను ఆహ్వానించడం, పరిశీలించడం, అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేయడం మరియు కరస్పాండెన్స్ కోర్సు నిర్వహించడం లాంటి పనులు చాలా ఉన్నాయి.ఈ సదస్సు సజావుగా నడవడంలోఆమె గ్రూప్ కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నప్పటికి చిన్నచిన్న విషయాల పట్లకూడాఎవరికీఇబ్బందికలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.సదస్సులోపాల్గొన్న15 మంది లో6 గురు కొత్తవారు, 9 మంది రెండు దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్న ఈ గ్రూప్ వారుచాలా అంకితబావం కలిగినవారు ; పాల్గొన్నవారు అందరూ బాగా అధ్యయనం చేసి వైబ్రియనిక్స్ సిద్ధాంతాలపై మరియు ప్రాక్టీస్ పై ఉన్న జ్జానాన్ని పెంచుకున్నారు. ఇంటి వాతావరణం పోలి ఉన్న ఈ సదస్సులో శ్రద్దగా బాగా అధ్యయనం చేయడాన్ని వారు చాలా బాగాఆస్వాదించారు. క్రొయేషియాలో వైబ్రియనిక్స్ అభివృద్ధి చెందడానికి,ముందుకుఅడుగు వేయడానికి ఈ సదస్సు చాలా ముఖ్యమైనది. దీని ఫలితంగా పాల్గొన్న వారందరికీ వైబ్రియానిక్స్ ద్వారా సేవ చేసుకోవాలనే కొత్త ఉత్సాహం కలిగింది.
3. ప్రతీమాసంలోనిర్వహింపబడే ఆడియో సదస్సు (Monthly Audio conference), యూస్ఏ, 15 సెప్టెంబర్ 2019
ఉత్తర అమెరికా కోఆర్డినటర్ మరియు ట్రైనర్ 01339, ద్వారా ప్రారంబించబడి క్రమబద్ధంగా నిర్వహింపబడినఈసమావేశంలో “ఎక్కువమంది పేషెంట్స్ మనవద్దకురాకుండాఉండడంలోగలఅవరోధాలుఏమిటి” అనే అంశంపై చర్చించారు,కొత్త పేషెంట్స్ కి వైబ్రియానిక్స్ ని చేరువగా తీసుకువెళ్లడం కోసం పాల్గొన్నవారు వారి నూతనఆలోచనలనుఅనుభవాలను పంచుకున్నారు:
- ఆరోగ్యాన్ని పొందిన పేషెంట్స్ వైబ్రియానిక్స్ కి మంచి ప్రచారకులు,కాబట్టి, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, మరియు వారి జంతువులు మరియు మొక్కలకు వైబ్రియనిక్స్ ని సూచించమని అడగటానికి వెనుకాడవద్దు.
- ఒక అభ్యాసకురాలుమూడు మడతలుగల150సాయి వైబ్రియానిక్స్ బ్రోచర్లను తీసుకొని నిర్దిష్టప్రదేశాలలోఎక్కువమందిహాజరయ్యే సాయి సమావేశంలో ఉంచారు.కొద్దిమందితప్ప మిగతా వారంతాఈబ్రోచర్లుతీసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆమెకి 5 మంది కొత్త పేషెంట్స్ మాత్రమేవచ్చారు.
- వరసగా రెండు సంవత్సరాలు,యిద్దరు SVP లు కమ్యూనిటీ ప్రత్యామ్నాయ ఆరోగ్య ఉత్సవంలో వైబ్రియానిక్స్అవగాహనా ప్రదర్శన చేశారు. చాలామంది ప్రత్యామ్నాయవైద్యం తెలిసినవారు హాజరైనారు. వైబ్రియనిక్స్ ప్రదర్శన నిర్వహింపబడే టేబుల్ బాగా ప్రాచుర్యం పొందింది. రంగు రంగుల వస్త్రంతో కప్పబడిన టేబుల్ మీద ల్యాప్ టాప్ ఉంచి 2 వైబ్రియనిక్స్ వీడియాలను నిరంతరం ప్రదర్శించారు. వైబ్రియనిక్స్ చికిత్స లో ఉన్న వివిధ ప్రయోజనాలు తెలియచేయడానికి గుర్తుగా మూడుమడతలుగలిగినబ్రోచెర్ల తోపాటు సంప్రదించవలసిన సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు. అంతేకాక దీనికి ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదుఅనిచెపుతూసుమారు 80 బ్రోచెర్స్ పంపిణీ చేశారు.చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించి తగిన ప్రశ్నలద్వారా సందేహ నివారణచేసుకున్నారు.
- ఒక SVP, వైబ్రియనిక్స్ సమాచారంపై సదస్సులు ఆమె ఇంటివద్దే నిర్వహిస్తున్నారు. అక్కడ “ వైబ్రియానిక్స్ అంటే ఏమిటి” ? అనే వీడియో చూపించి, 108CC బాక్స్ చూపిస్తూ మాట్లాడుతారు తరువాత ప్రశ్నలు మరియు జవాబులు ఉంటాయి.ఒక్కొక్కసెషన్లోసాధారణంగా 15-20 మందివీరిలోఎక్కువభాగం సాయి భక్తులే హాజరవు తూఉంటారు.ఒక సదస్సులో,ఇంద్రియాతీత శక్తి కలిగినఒక అతిధి సాయి బాబా అందరి చుట్టూ తిరిగి 108CC బాటిల్స్ తాకడం చూశారు. సంతోషంగా ఉండండి ప్రజలు మరింత ఎక్కువగా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుంటారు అని స్వామి చెప్పినట్లు అర్ధం చేసుకున్నారు.చాలా మంది వారికోసం తయారు చేసిన నివారణాలను అక్కడికక్కడే తీసుకున్నారు. ఆచరణాత్మకంగా అందరూ తరువాత జరిగే సదస్సు తేదీని తెలుసుకోవాలని అనుకున్నారు,ఎందుకంటే వారుతమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలియ చేయడానికిఅవకాశంఉంటుంది.
- చాలామంది ప్రాక్టిషనర్స్ బిజినెస్ కార్డ్స్లేదావిజిటింగ్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలుసుకున్నారు. పేషెంట్స్ కి ఇవ్వడంకోసం ఒక SVPప్రతి నివారణతో పాటు కొన్ని కార్డ్స్ ఇవ్వడం లేదా పంపడం చేసేది.ఆమె కొత్త పేషెంట్స్ ని సంపాదించడంలో గొప్ప విజయాన్ని సాదించింది. ఆ గ్రూప్ ఇప్పుడు కార్డ్స్ ప్రామాణికంగా చేయడానికి చూస్తున్నారు.
- ఒక SVP 170 మైళ్ళు ప్రయాణంచేసి కొత్త నగరానికి వెళ్ళి అక్కడ సారూప్య ఆలోచనలు గల అధ్యాత్మిక వ్యక్తులను కలిసే మార్గం కోసం చూసింది. ఇటీవలే ఆమెకి తెలిసిన పుస్తకం “అధ్బుతాలకు సంబందించిన కోర్సు“ గురించి చర్చించడానికి వారానికి రెండుసార్లు సమావేశమయ్యే అటువంటి బృందాన్నికనుగొన్నది. తత్ఫలితంగా, ఆమెవైబ్రియనిక్స్ యొక్క అధ్బుతమైన ప్రభావాలను అనుభవించిన పేషెంట్ నోటి మాట ద్వారా,నలుగురు కొత్త పేషెంట్స్ ని సంపాదించింది.
- కొత్త పేషెంట్స్ నివారణలకోసం డబ్బులు చెల్లించడానికి లేదా విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు,ఒక SVP, ఇతరులకు ఈ వైధ్య విధానం గురించి తెలియచేయడమే ఆమె అంగీకరించే ఏకైక గొప్ప “చెల్లింపు” అని పేషెంట్స్ కి చెబుతారు. పేషెంట్స్ అర్ధంచేసుకొని,సంతోషంగా ఇతరులకు చెబుతారు, ఈ విధంగా ఆమె కొత్త పేషెంట్స్ ని సంపాదిస్తుంది.
ఒక ప్రాక్టీషనర్ ఎక్కువమంది ప్రజలు ఉన్నప్పుడు అందరూ చూచేలా తనకోసంతయారు చేసినసొంతనివారణ తీసుకుంటారు. అపరిచితులు లేదా స్నేహితులు ఏమి తీసుకున్నారు అని అడుగుతారు ; ఇది ఆమెకి వైబ్రియనిక్స్ గురించి మాట్లాడే అవకాశంకల్పిస్తుంది.
వారాంతంలోవచ్చే ఆదివారం సాయంత్రం కాన్ఫరెన్స్ కాల్ ఏ విధంగాఏర్పాటుచేస్తున్నారోఆ ప్రక్రియనుగురించిఒకగ్రూప్తెలియజేస్తూపేషెంట్స్ ఆరోగ్యం మరియు వైద్యం కోసం, ప్రస్తుతం మరియు గతంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి,వారి కుటుంబాలు మరియు భూమాత గురించి 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు, ముఖ్యంగా పాత పేషెంట్లులబ్ది పొందేందుకు ఇది ఒక అధ్బుతమైన మార్గం. ఆ కాల్ లో పాత పేషెంట్స్ ని జాయిన్ అవ్వమని ఆహ్వానిచడం ద్వారా వాళ్ళగురించి మీరు ఆలోచిస్తునట్ట్లు వాళ్ళకి తెలుస్తుంది.దీనివలన వారు మరియు వారి కుటుంబసభ్యులు ప్రేమ పూరితమైన వైబ్రేషన్స్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.మరొక ప్రయోజనం ఏమిటంటే కొంతమంది నివారణాలను రీఫిల్ చేసుకోవాలని గుర్తుచేసుకుంటారు.
4. వైబ్రోచికిత్సానిపుణులవార్షిక సదస్సు, లండన్, యుకె సెప్టెంబర్ 22, 2019
యుకె కోఆర్డినేటర్ 02822చేచే నిర్వహించబడిన, ఈ సదస్సుకు యుకె లోని అన్ని ప్రాంతాల నుండి ప్రాక్టీషనర్స్ హాజరయ్యారు-మొత్తంగాఇరవై ఇదు (ముగ్గురు వైధ్యులు మరియు నలుగురు నర్సులతో సహా) మంది వ్యక్తిగతంగా మరియుఆరుగురువీడియో కాన్ఫెరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఆతిధ్యమిచ్చిన కుటుంబసభ్యులనుండి ముగ్గురు మరియు ఒక గెస్ట్స్పీకర్వైబ్రియానిక్స్ నుండి వ్యక్తిగతంగా ప్రయోజనంపొందితన పేషెంట్లలో చాలా మందినివైబ్రో ప్రాక్టీషనర్స్ దగ్గరకు పంపి స్తున్న అనుభవజ్జుడైన వైద్యుడుకూడాపాల్గొన్నవారిలోఉన్నారు. ఇద్దరు యువ వాలంటీర్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ భాధ్యతలు చేపట్టారు. ఈ సదస్సులో విజయవంతమైన కేసులు పంచుకోవడం కోసం,కష్టమైనకేసులగురించి చర్చించడం కోసం మరియుప్రశ్నలుసందేహాలను ముందుగానే తనకుపంపమని హాజరైన వారిని ప్రేరేపించడంలో కోఆర్డినేటర్ చాలా శ్రమించారు.సభ్యులయొక్కఅసంఖ్యాకమైన ప్రశ్నలకు(రాబోయే సంచికలో ఇవి ఉంటాయి) సమాధానలకోసం ఆత్రుతతో ఉన్నందున, హాజరైన వారి అందరిలో సందేహనివారణపొందినసంతృప్తిమరియు విజయవంతమైన కేసులను విన్నఆనందముపొందారు.ఐతే యుకెలో వైబ్రియానిక్స్ చికిత్స తీసుకునే వారి సంఖ్య రానురానూతగ్గుతోందిఅనేఅభిప్రాయంవ్యక్తమైంది. దీనిని అధికమించడానికి యు.యస్చికిత్సానిపుణులుసూచనలను(#3 లో చూడండి) తెలియచేయగా, ప్రాక్టీషనర్స్ అందరూ ఇవి చాలా వినూత్న ఆలోచనలని మెచ్చుకుని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు.కొందరుసభ్యులు వివిధ సమస్యలకు విజయవంతంగాపనిచేసిన రెమెడీలను గురించితెలియజేశారు. SVP లు 02899&02900 వైబ్రియనిక్స్ తో తమ కుమార్తె యొక్క ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు.
ముందస్తు జాగ్రతగా పర్వతారోహణలో వచ్చే అనారోగ్య (ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్) నివారణ కోసం
ఈయువఉపాధ్యాయురాలు 18 మంది పిల్లలు మరియు ఇద్దరు సహచరులతో కూడిన గ్రూప్ తో 4 వారాలపాటు భౌగోళిక పర్యటనకు భారతదేశం వెళ్తున్నారుఈ యాత్రలో పర్వతం ఎక్కవలసి ఉన్నందున,పర్వతం ఎక్కువ ఎత్తుగా ఉండటం, అక్కడ తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉండటం మరియు ఆకస్మిక వాతావరణ మార్పులు కారణంగా తీవ్రమైన పర్వతారోహణ అనారోగ్యం(ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్) వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రాక్టీషనర్స్(ఆమె తల్లితండ్రులు)నివారణను నేరుగా ఆల్కహాల్లో ( కారణం ఏమిటంటే 90 చుక్కలు మాత్రలను కరిగించివేస్తాయి.) ఒకడ్రాపర్బాటిల్లో108CC లో ఉన్నవి అన్నీ ( 1, 2, 8, 14 & CC17.2 Cleansingకాకుండా)కాంబోలను అన్నీకలిపి నివారణను తయారుచేశారు.వారుఆమెకు మామూలుగాఇచ్చేయాత్రానివారణనుఆమెకు సహయంగా ఇవ్వడమైనది : CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies.
గమ్యంచేరినతరువాతబృందంలోనిప్రతీ సభ్యుడు త్రాగునీటిని చేసుకోవడం ద్వారా శుద్ది చేసుకోవలసి ఉండేది.కానీ, ప్రాక్టీషనర్ కుమార్తెఒకఅభినందించదగ్గ పని చేసింది, ఆమె ఒక లీటర్ వాటర్ బాటిల్లో ఒక చుక్కపైనసూచించిన రెమెడీ వేసిరోజంతా తీసుకునేది. ఆమె ఇద్దరు సహచరులు ఇలా చేసినందుకు ఆమెను ఆటపట్టించారు. వారు ఆమెను “హిప్పీ డిప్పీ” అని పిలవడం ప్రారంబించారు, కానీ ఆమె దానికి సరదాగా నవ్వేది. పిల్లలకుకూడాఈ నివారణా చుక్కలను ఇవ్వడానికి ఇష్టపడేదికానీవారితల్లిదండ్రులఅనుమతిలేకమిన్నకుండేది.
పిల్లలు మరియు ఆమె సహచరులు వికారం, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, దగ్గు, జ్వరం, నిద్రలేమి వంటి AMS(ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్) వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పటకి, 4 వారాల వ్యవధిలో ఆమె ఒక్కర్తే ఆరోగ్యంగా ఉంది.ఇది చూచి, తన సహచరులలో ఒకరు ఇండియాలో ఒక నెల పాటు ఉండవలసి ఉండటంతో అతనికి వైబ్రేషన్స్ ఇవ్వమని అభ్యర్ధించాడు. ఒక నెల తరువాత, అతను ” వైబ్రేషన్స్ ప్రతి రోజూ తీసుకుంటున్నాను మరియు ఆరోగ్యంగా ఉన్నాను. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన వాస్తవం, ఇది పనిచేస్తుంది” అని ఆమెకి సందేశం పంపాడు.
5. SVP వర్క్ షాప్, అలెస్, ఫ్రాన్స్, 20-24 అక్టోబర్ 2019
ఇటీవలేప్రాక్టీషనర్గామారినఒకనిపుణుడు తనఇంట్లోనేఆతిథ్యమిచ్చినఈవర్క్ షాప్ లో పాల్గొన్న నలుగురు SVPలు మరియు ఇద్దరు SVP దరఖాస్తు దారులను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అత్యంత పరస్పరఆధారితపద్దతిలోజరిగినఈవర్క్షాప్లోవైబ్రియనిక్స్ లో ఉన్న అత్యంత కీలకమైన చికిత్సా పద్దతులైన మయాజంమరియు నోసోడ్లపైచర్చించడం ద్వారా మరింత ప్రత్యేకమైన చికిత్సను గురించిఅనుభవజ్ఞానముపొందారు. కొత్త SVPలు సాయి వైబ్రియనిక్స్ లో ఉన్న మరియొక కోణం తలుపులు తెరిచినట్లుగా భావించారు.108CC బాక్స్ తో పనిచేయడం చాలా సరళమైనది మరియు కొంత యాంత్రికమైనది అని పాల్గొన్నవారు వ్యాఖ్యానించారు,కానీ పోటెంటైజర్ కోసం కార్డ్స్ ఎంచుకోవడం ఎంతో విశ్లేషణాత్మకమైనది మరియు మెదడకు కొంతపనికల్పించేటటువంటిది ! హాజరైన వారికి కలిసి భోజనం తయారు చేసుకునే అవకాశం కల్పించబడడంతో, ఇది వారికి ఆరోగ్యకరమైన ఆహారం యొక్క సూత్రాలను లోతుగా అధ్యయనంచేయడానికి వీలు కల్పించింది. కొత్త దరఖాస్తుదారులు ఇద్దరూ తమ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు మరియు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చాలా పవిత్రమైన వాతావరణంలో SRHVPని విలువైన భాహుమతిగా స్వీకరించారు. వైబ్రియానిక్స్ కుటుంబంలో మరియు వైబ్రియానిక్స్ పరిణామంలో ఈ కొత్త దశ వారికి మరింత బాధ్యతని ఇస్తుందని అర్ధం చేసుకుంటూ వారు తమ సేవలను కొనసాగించడానికి ఉత్సాహంచూపించారు.90వదశకంలోనికి చేరిన(అక్టోజెనెరియన్) ఒకవృద్ధమహిళాప్రాక్టీషనర్ 02499 కొన్ని సంవత్సరాలగా పొటెన్టైజర్వాడకంలో తన కున్న అనుభవాన్ని పంచుకోవడం ద్వారా పాల్గొన్నవారందరికి ఉత్సాహాన్నినింపింది. డాక్టర్ అగర్వాల్ ప్రాక్టీషనర్స్ అడిగిన ప్రశ్నలకు స్కైప్ కాల్ ద్వారా సభ్యులసందేహాలనుచక్కగా అర్ధం చేసుకునేలా సమాధానాలు చెపుతూ,మయజం కు ముందు బేస్ చక్ర ఇవ్వడానికి కారణం మరియు ప్రేగు /ఆంత్రము నోసోడ్ ఉపయోగం వంటివిషయాలుకూడాసవివరంగాఅర్థం చేసుకు నేందుకుసహాయపడ్డారు..
6. AVP వర్క్ షాప్ మరియు రీఫ్రెషర్, అలెస్, ఫ్రాన్స్, 26-28అక్టోబర్ 2019
ఆరుగురుసభ్యులతోనిర్వహించుకోబడినఈAVP వర్క్ షాప్ మరియు పునశ్చరణసదస్సులోముగ్గురు SVP లు కూడాపాల్గొన్నారు.మొట్ట మొదటిసారిఈఫ్రెంచ్ వర్క్ షాప్ లో మోడల్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాల్గొన్నవారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందారు.రకరకాల పరిస్థితులను ఎదుర్కోనెలా AVPలను తయారుచేయడం కోసం మోడల్ క్లినిక్ లో కేసులనుSVPలు తయారు చేశారు.ఇందులో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి,పేషెంట్ రెండు ధీర్ఘకాలిక వ్యాధులు లేదా ఒకతీవ్రమైన మరియు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మొదట చికిత్స చేయాల్సిన వ్యాధి గురించి, మూడు రకాల పుల్లౌట్లను ఎలా ఎదుర్కోవాలి,కాంబోలను ఎంచుకోవడం మరియు మోతాదుని నిర్ణయించడం,మరియు ఆరోగ్యం మెరుగైన తరువాత మోతాదుని ఎలా తగ్గించాలివంటివి ఉన్నాయి .AVPలు ఈవర్క్షాప్పట్లచాలా ఆనందగా ఉన్నారు. ఎందుకంటే సమర్పించిన కేసులు మరియువివిధపరిస్థితులకుఎలాప్రతిస్పందించాలిఅనేవిషయాలపైమరింతజ్ఞానమును, ఆత్మవిశ్వాసం
పొందడానికి సహాయపడ డమేకాక ఇది వారి భవిష్యత్ ప్రాక్టీస్ కి ఉపయోగపడుతుంది.
ఫ్రఆత్మవిశ్22వాసంోసం వైబ్రియనిక్స్ అడ్మినిస్ట్రేటివ్ సేవలో చాలా సంవత్సరాలు చురుకుగా పాల్గని, వైబ్రియనిక్స్ AVP అర్హత పరీక్షలో అద్భుతంగా ఉత్తీర్ణత సాధించిన తరువాత, కొత్తగా అర్హత సాధించిన AVPలుభారీచప్పట్లమధ్య108CC బాక్స్ ను. అందుకున్నారు. డాక్టర్అగ్గార్వల్ .స్కైప్ ద్వారా అనేక సందేహాలకు వివరణ ఇచ్చారు, ఇందులో తీవ్ర అనారోగ్యం, ధీర్ఘకాలిక ఆనారోగ్యం మరియు అత్యంత తీవ్రమైన అనారోగ్య లక్షణాల మధ్య ఉన్నవ్యత్యాసంవంటివి.వివరించ బడ్డాయి.