Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనంగా

Vol 10 సంచిక 6
November/December 2019


1. ఆరోగ్య చిట్కాలు

ఆరోగ్యకరమైన థైరాయిడ్ దిశగా పనిచేయండి !

“మితమైన ఆహారం ఉత్తమ ఔషదం.ప్రతీ చిన్న అనారోగ్యానికి ఆసుపత్రికి పరిగెత్తవద్దు. ఎక్కువగా మందులు తీసుకోవడం కూడా మంచిదికాదు. ప్రకృతి సిద్ధంగా వ్యాధి పై పోరాడటానికి మరియు మిమ్మలని ఆరోగ్యంగా ఉంచడానికి అవకాశం ఇవ్వండి. ప్రకృతివైద్యంయొక్క సూత్రాలను మరింత ఎక్కువగా అవలంబించి డాక్టర్స్ చుట్టూ తిరగడం మానండి...”శ్రీ సత్య సాయి బాబా1

1. థైరాయిడ్ మరియు అది చేసే ముఖ్యమైన పని

థైరాయిడ్ ఇది సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఎండోక్రైన్ గ్రంధి, మెడ దిగువ మధ్య బాగంలో, ఆడమ్స్ యాపిల్ కి కొంచెం క్రింద,స్వరపేటిక దిగువ భాగాన రెండు వైపులా మరియు శ్వాసనాళం పై భాగాన ఉంటుంది.2-4

థైరాయిడ్ పాత్ర : ఎండోక్రైన్ వ్యవస్థలో దీని ప్రధానపాత్ర శరీరం యొక్క జీవక్రియను నియంత్రించడం, అనగా, కణాలకు ఉన్న సామర్ధ్యంతో ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలగ చేసి శక్తిగా మార్చడం.దాదాపు జీవక్రియకి సంబందించిన అన్నివిలువలను (పెరామీటర్స్)అనగా , ఆకలి, శక్తి స్థాయి, హృదయస్పందన రేటు, శరీరఉష్ణోగ్రత, రక్తప్రసరణ,ఎముకుల పెరుగుదల మరియు అబివృద్ధి(ముఖ్యంగా శిశువులు మరియు చిన్న పిల్లలలో), కండరాల స్థితి స్థాపకత మరియు మృదుత్వం ,రక్తంలో చక్కెర స్థాయి, ప్రేగు పనితీరు,కొలెస్ట్రాల్ స్థాయి, కొవ్వు, కొర్బోహైడ్రేట్,ప్రోటీన్ జీవక్రియ, శరీర బరువు,రక్తంలో కాల్షియం స్థాయి, కేంద్ర నాడీ వ్యవస్థ, మరియు పునరుత్పత్తి వ్యవస్థ.2,3,5-9 ఇది ప్రభావితం చేస్తుంది. 

థైరాయిడ్ యొక్క పని తీరు :సరిగ్గా పని చేసే థైరాయిడ్ ఆహారం నుండి అయోడిన్ ను గ్రహిస్తుంది,దీనిని శరీరంలో ఉన్న అమైనో ఆమ్లం టైరోసిన్ తో మిళితం చేస్తుంది. అనంతరం తన పని తాను చేయడానికి దీనినిT3 మరియుT4హార్మోన్స్ (ట్రై-అయోడోథైరోనిన్ మరియు థైరాక్సిన్)గా మారుస్తుంది.ఇతర ఎండోక్రైన్ గ్రంధుల మాదిరిగా కాకుండా, థైరాయిడ్ గ్రంధి అది ఉత్పత్తి చేసిన హార్మోనులను నిల్వ చేసుకోగలదు.8,9,10

పిట్యూటరీ మరియు హైపోథాలమస్ చేత నియంత్రించబడుతుందిథైరాయిడ్ గ్రంధి యొక్క పనితీరును, మెదడు క్రింద పుర్రె మధ్యలో ఉంటూ మాస్టర్ గ్రంధిగా  పిలవబడే  పిట్యూటరీ గ్రంధి పర్యవేక్షిస్తూ నియంత్రిస్తుంది.ఏవిదంగా థర్మోస్టాట్ ఉష్ణోగ్రతని నియంత్రిస్తుందో అదేవిదంగా పిట్యూటరీగ్రంధి,థైరాయిడ్ గ్రంధికి మద్దత్తుగా TSH హార్మోన్(థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్) ఉత్పత్తిని నియంత్రిస్తూ సర్ధుబాటు చేస్తుంది. తిరిగి,పిట్యూటరీగ్రంధి మెదడులో అంతర్లీనంగా ఉన్న న్యూరో ఎండోక్రిన్ గ్రంధి హైపోథాలమస్ చే స్రవించబడే థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్(TRH) చే ప్రేరేపించబడుతుంది.3,5,6,8,10

పారాథైరాయిడ్ గ్రంధులకు దగ్గరగా : ప్రక్క చిత్రంలో చూపిన విదంగా భౌతికంగా థైరాయిడ్ కి నాలుగు చిన్నపారాథైరాయిడ్ గ్రంధులు ఉన్నాయి. కానీ, థైరాయిడ్ తో వాటికి ఎటువంటి క్రియాత్మక సంబందంలేదు.11,12

2. థైరాయిడ్ లోపం వల్ల వచ్చే రుగ్మతలు

నిశితంగా చూస్తే రెండు రకాల సమస్యలు తలెత్తవచ్చు.థైరాయిడ్ హార్మోన్ల స్రావం (T3 మరియు T4) సరిపడనంతగా ఉండకపోవచ్చు దీనికి కారణం థైరాయిడ్ గ్రంధి సామర్ధ్యం తక్కువగా ఉండటం(హైపో థైరాయిడ్)లేదా హార్మోన్ల స్రావం ఎక్కువగా ఉండటం(హైపర్ థైరాయిడ్).ఒక తేలికైన రక్తపరీక్ష థైరాయిడ్ సామర్ధ్యాన్ని తెలియచేస్తుంది.ఐతే లక్షణాలు మరియు కారణాలు వ్యక్తికి వ్యక్తికీ  మారుతూ ఉండవచ్చు.2

థైరాయిడ్ పనితీరుకు సూచికలు: పిట్యూటరీగ్రంధి ద్వారా విడుదల చేయబడిన TSH స్థాయి సాధారణంగా థైరాయిడ్ పనితీరుకు సూచిక. థైరాయిడ్ మందకొడిగా తయారైతే, థైరాయిడ్ ఎక్కువ హార్మోన్లు ఉత్పత్తి చేసేలా ప్రేరేపించడానికి పిట్యూటరీగ్రంధి ఎక్కువ TSH ఉత్పత్తి చేయవలసిఉంటుంది. అందువల్ల, రక్తపరీక్షలో TSH ఎక్కువగా ఉన్నట్లు చూపిస్తే, ఇది హైపోథైరాయిడ్ ని సూచిస్తుంది. దీనికి విరుద్ధంగా, థైరాయిడ్ హైపర్యాక్టివ్ అయితే,పిట్యూటరీగ్రంధి TSH ఉత్పత్తిని ఆపివేయాలి, తద్వారా థైరాయిడ్ తక్కువ హార్మోన్లను స్రవిస్తుంది; రక్తపరీక్షలో తక్కువ TSH చూపిస్తుంది, ఇది హైపర్ థైరాయిడిజాన్నిసూచిస్తుంది. హైపర్ మరియు హైపో థైరాయిడ్ అనారోగ్యం మరియు మందులు ద్వారా ప్రభావితం అవుతాయి. థైరాయిడ్ లోపాలను నిర్ధారించడానికి TSH పరీక్ష మాత్రమే కాకుండా థైరాయిడ్ కి చికిత్స అవసరం ఉందో లేదో తెలుసుకోడానికి T3 మరియు T4 వంటి ఇతర పరీక్షలు తరచుగా ఉపయోగిస్తారు.13,14

సాధారణంగా థైరాయిడ్ పరిది: సాధారణంగా థైరాయిడ్ పరీక్షలోTSH ఉండవలసిన పరిది: 0.4 to 4-5 mU/L (మిల్లీ యూనిట్స్ ఒక లీటర్ సెరంకి). ఇది మార్గదర్శక  సూచీ మాత్రమే ఎందుకంటే ఇది పరీక్షింప బడినవారి వయస్సు , ఆడ మగ తేడా, గర్భవతి, పరీక్ష చేసిన ల్యాబ్ ను బట్టి TSH పరిదిలో మార్పులు ఉండవచ్చు.13,14

హైపో థైరాయిడిజం లక్షణాలు:హార్మోన్ల లోపం యొక్క తీవ్రతను భట్టి లక్షణాలు మారుతూ ఉంటాయి. సాధారణంగా, శరీర జీవక్రియ నెమ్మదిస్తుంది, శరీరానికి శక్తి ఎక్కడ అవసరమో అక్కడ ఉపయోగించుకోలేదు.

హైపో థైరాయిడిజం కి  కారణాలు :

 

హైపర్ థైరాయిడిజం లక్షణాలు :ఇతర ఆరోగ్య సమస్యలను అనుకరించే అవకాశం ఉంది, ఇది గుర్తించడం కష్టం. సాధారణంగా శరీరం అవసరమైనదానికంటే వేగంగా శక్తిని ఉపయోగిస్తుంది.

హైపర్ థైరాయిడిజమ్ కి కారణాలు :

3. థైరాయిడ్ సమస్యను నివారించండి

ఎటువంటి లక్షణాలు కనిపించినా ఆలస్యంచేయకుండా థైరాయిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోవడం మరియు అవసరమైన వైధ్య చికిత్స  తీసుకోవడం మంచిది.థైరాయిడ్ గ్రంధి సక్రమంగా పనిచేయకపోవడంవల్ల ఇతర ఆరోగ్య సమస్యలు లాలాజల గ్రంధి ఉబ్బడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం, నోటి మంట, సన్నబడటం(క్షయం) మరియు దంతాల బోలుతనపు వ్యాధికి దారి తీస్తుంది అని అధ్యయనాలు తెలియచేసాయి.19,20కనుక  ప్రతి ఒక్కరూ క్రింది సూచనలను పాటిస్తూ ఆరోగ్యకరమైన థైరాయిడ్ కలిగి ఉండేదిశగా పనిచేయాలి:18,21-30

 NM72 Cleansing, NM86 Immunity,SR290 Endocrine integrity, SR308 Pituitary Gland, SR319 Thyroid Gland, SR498 Hypothalamus, SR517 Parathyroid, SR567 Hyperthyroidism,SR568 Hypothyroidism, SR572 Obesity పోటెన్టైసర్ వాడుతున్నవారు.

అధ్యయనం కోసం వెబ్సైట్లు :

References and Links:

1.      Food and Health:http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf

2.      What is Thyroid: https://www.webmd.com/a-to-z-guides/do-i-have-thyroid-problem

3.     https://my.clevelandclinic.org/health/diseases/8541-thyroid-disease

4.      Taber’s Cyclopaedic medical dictionary, edition 20, 2001, page 2187

5.     https://www.endocrineweb.com/endocrinology/overview-thyroid

6.      Metabolism: https://healthywa.wa.gov.au/Articles/S_T/The-thyroid-gland

7.     http://www.vivo.colostate.edu/hbooks/pathphys/endocrine/thyroid/physio.html

8.     https://www.crozerkeystone.org/conditions/endocrinology/Thyroid-Disorders/

9.      Manual for Junior Vibrionics Practitioners, English 2007, chapter 7: Anatomy and Body Systems, page 37

10.  Functioning of thyroid: https://www.endocrineweb.com/conditions/thyroid/how-your-thyroid-works

11. http://endocrinediseases.org/parathyroid/parathyroid_background.shtml

12. https://www.endocrineweb.com/endocrinology/overview-parathyroid

13.  Thyroid function indicators: http://www.btf-thyroid.org/information/leaflets/34-thyroid-function-tests-guide

14.  https://www.webmd.com/women/what-is-tsh-test#1

15.  Thyroid disorders: https://www.webmd.com/women/guide/understanding-thyroid-problems-basics#1

16.  https://www.mayoclinic.org/diseases-conditions/hypothyroidism/symptoms-causes/syc-20350284

17.  https://www.mayoclinic.org/diseases-conditions/hyperthyroidism/symptoms-causes/syc-20373659

18.  https://www.artofliving.org/in-en/yoga/health-and-wellness/cure-thyroid-with-yoga

19.  Thyroid & BPhttps://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3230087/

20.  Thyroid and mouth: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3169868/

21.  Work for a healthy thyroid: https://www.youtube.com/watch?v=3VZF-F6LRwU

22.  Physical exercise important: http://www.amhsjournal.org/article.asp?issn=2321-4848;year=2015;volume=3;issue=2;spage=244;epage=246;aulast=Bansal

23.  Balanced food: https://www.webmd.com/women/features/low-thyroid-alternative-therapy#1

24.  Iodine rich food: https://ods.od.nih.gov/factsheets/Iodine-Consumer/

25.  Amino acids rich foodhttps://www.medicalnewstoday.com/articles/324229.php

26.  Selenium rich food: http://www.whfoods.com/genpage.php?tname=nutrient&dbid=95

27.  Foods for thyroid: https://www.livestrong.com/article/497146-vegetarian-diet-for-hypothyroidism/

28.  https://www.onegreenplanet.org/natural-health/how-to-take-care-of-your-thyroid-on-a-plant-based-diet/

29.  Plant based diet best: https://www.ncbi.nlm.nih.gov/pmc/articles/PMC3847753/

30.  Foods to avoid: https://www.everydayhealth.com/hs/thyroid-pictures/foods-to-avoid/

 

2. ఏ‌వి‌పి వర్క్ షాప్ మరియు రీఫ్రెషర్ సెమినార్ జాగ్రెట్, క్రోయేషియా, 5-8 సెప్టెంబర్ 2019

డాక్టర్  అగర్వాల్ మరియువారిశ్రీమతిజాగ్రెబ్ లో నిర్వహించిన సెమినార్ కి ఖచ్చితంగా 20 సంవత్సరాల తరువాత ఆహ్వానిచబడినందుకు ఎంతో గౌరవంగా భావించారు, ఎందుకంటే  మొట్టమొదటిసారి క్రొయేషియాలోనిజాగ్రెబ్ మరియు స్ప్లిట్ లో వర్క్ షాప్ నిర్వహించినప్పుడు 68 మంది ప్రాక్టిషనర్స్ కి SRHVP గురించి శిక్షణ ఇవ్వడం కోసం సందర్శించడం జరిగింది,

 ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి చాలా నెలలపాటు చాలా కష్టపడి పనిచేసిన కోఆర్డినేటర్ 03577 కి ఈ గౌరవం దక్కుతుంది. ఈ సదస్సు నిర్వహించడం కోసం వారిని ప్రేరేపించి, వైబ్రియనిక్స్ లో జ్ఞానాన్నిపెంచాలనే ఉద్దేశ్యంతో 100 మందికి పైగా ప్రాక్టిషనర్స్నుస్వయంగా సంప్రదించారు (క్రోయేషియాలో మొత్తం 160 మంది ఉన్నారు). దీనితోపాటు ఆమెకి దరఖాస్తులను ఆహ్వానించడం, పరిశీలించడం, అభ్యర్ధులను ఇంటర్వ్యూ చేయడం మరియు కరస్పాండెన్స్ కోర్సు నిర్వహించడం లాంటి పనులు చాలా ఉన్నాయి.ఈ సదస్సు సజావుగా నడవడంలోఆమె గ్రూప్ కొన్ని పెద్ద సవాళ్లను ఎదుర్కొన్నప్పటికి చిన్నచిన్న విషయాల పట్లకూడాఎవరికీఇబ్బందికలగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.సదస్సులోపాల్గొన్న15 మంది లో6 గురు కొత్తవారు, 9 మంది రెండు దశాబ్దాలుగా ప్రాక్టీస్ చేస్తున్నవారు ఉన్న ఈ గ్రూప్ వారుచాలా అంకితబావం కలిగినవారు ; పాల్గొన్నవారు అందరూ బాగా అధ్యయనం చేసి వైబ్రియనిక్స్ సిద్ధాంతాలపై మరియు ప్రాక్టీస్ పై ఉన్న జ్జానాన్ని పెంచుకున్నారు. ఇంటి వాతావరణం పోలి ఉన్న ఈ సదస్సులో శ్రద్దగా బాగా అధ్యయనం చేయడాన్ని వారు చాలా బాగాఆస్వాదించారు. క్రొయేషియాలో వైబ్రియనిక్స్ అభివృద్ధి చెందడానికి,ముందుకుఅడుగు వేయడానికి ఈ సదస్సు చాలా ముఖ్యమైనది. దీని ఫలితంగా పాల్గొన్న వారందరికీ వైబ్రియానిక్స్ ద్వారా సేవ చేసుకోవాలనే కొత్త ఉత్సాహం కలిగింది.

 

 

 

 

 

3. ప్రతీమాసంలోనిర్వహింపబడే ఆడియో సదస్సు (Monthly Audio conference), యూస్ఏ, 15 సెప్టెంబర్ 2019

ఉత్తర అమెరికా కోఆర్డినటర్ మరియు ట్రైనర్ 01339, ద్వారా ప్రారంబించబడి క్రమబద్ధంగా నిర్వహింపబడినఈసమావేశంలో “ఎక్కువమంది పేషెంట్స్ మనవద్దకురాకుండాఉండడంలోగలఅవరోధాలుఏమిటి” అనే అంశంపై చర్చించారు,కొత్త పేషెంట్స్ కి  వైబ్రియానిక్స్ ని చేరువగా తీసుకువెళ్లడం కోసం పాల్గొన్నవారు వారి నూతనఆలోచనలనుఅనుభవాలను పంచుకున్నారు: 

  • ఆరోగ్యాన్ని పొందిన పేషెంట్స్ వైబ్రియానిక్స్ కి మంచి ప్రచారకులు,కాబట్టి, వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, మరియు వారి జంతువులు మరియు మొక్కలకు వైబ్రియనిక్స్ ని సూచించమని అడగటానికి వెనుకాడవద్దు.
  • ఒక అభ్యాసకురాలుమూడు మడతలుగల150సాయి వైబ్రియానిక్స్ బ్రోచర్లను తీసుకొని నిర్దిష్టప్రదేశాలలోఎక్కువమందిహాజరయ్యే సాయి సమావేశంలో  ఉంచారు.కొద్దిమందితప్ప  మిగతా వారంతాఈబ్రోచర్లుతీసుకున్నప్పటికీ ఇప్పటివరకు ఆమెకి 5 మంది కొత్త పేషెంట్స్ మాత్రమేవచ్చారు.
  • వరసగా రెండు సంవత్సరాలు,యిద్దరు SVP లు కమ్యూనిటీ ప్రత్యామ్నాయ ఆరోగ్య ఉత్సవంలో వైబ్రియానిక్స్అవగాహనా ప్రదర్శన చేశారు. చాలామంది ప్రత్యామ్నాయవైద్యం తెలిసినవారు హాజరైనారు. వైబ్రియనిక్స్ ప్రదర్శన నిర్వహింపబడే టేబుల్ బాగా ప్రాచుర్యం పొందింది. రంగు రంగుల వస్త్రంతో కప్పబడిన టేబుల్ మీద ల్యాప్ టాప్ ఉంచి 2 వైబ్రియనిక్స్ వీడియాలను నిరంతరం ప్రదర్శించారు. వైబ్రియనిక్స్ చికిత్స లో ఉన్న వివిధ ప్రయోజనాలు తెలియచేయడానికి గుర్తుగా మూడుమడతలుగలిగినబ్రోచెర్ల తోపాటు సంప్రదించవలసిన సమాచారాన్ని ప్రదర్శనలో ఉంచారు. అంతేకాక దీనికి ఎటువంటి రుసుము చెల్లించనవసరంలేదుఅనిచెపుతూసుమారు 80 బ్రోచెర్స్ పంపిణీ చేశారు.చాలా మంది ప్రజలు ఆసక్తి చూపించి తగిన ప్రశ్నలద్వారా సందేహ నివారణచేసుకున్నారు.
  • ఒక SVP, వైబ్రియనిక్స్ సమాచారంపై సదస్సులు ఆమె ఇంటివద్దే నిర్వహిస్తున్నారు. అక్కడ “ వైబ్రియానిక్స్ అంటే ఏమిటి” ? అనే వీడియో చూపించి, 108CC బాక్స్ చూపిస్తూ మాట్లాడుతారు తరువాత ప్రశ్నలు మరియు జవాబులు ఉంటాయి.ఒక్కొక్కసెషన్లోసాధారణంగా 15-20 మందివీరిలోఎక్కువభాగం సాయి భక్తులే హాజరవు తూఉంటారు.ఒక సదస్సులో,ఇంద్రియాతీత శక్తి కలిగినఒక అతిధి సాయి బాబా అందరి చుట్టూ తిరిగి 108CC బాటిల్స్ తాకడం చూశారు. సంతోషంగా ఉండండి ప్రజలు మరింత ఎక్కువగా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుంటారు అని స్వామి చెప్పినట్లు అర్ధం చేసుకున్నారు.చాలా మంది వారికోసం తయారు చేసిన నివారణాలను అక్కడికక్కడే తీసుకున్నారు. ఆచరణాత్మకంగా అందరూ తరువాత జరిగే సదస్సు తేదీని తెలుసుకోవాలని అనుకున్నారు,ఎందుకంటే వారుతమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు తెలియ చేయడానికిఅవకాశంఉంటుంది.
  • చాలామంది ప్రాక్టిషనర్స్ బిజినెస్ కార్డ్స్లేదావిజిటింగ్ కార్డులు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలుసుకున్నారు. పేషెంట్స్ కి ఇవ్వడంకోసం ఒక SVPప్రతి నివారణతో పాటు కొన్ని కార్డ్స్ ఇవ్వడం లేదా పంపడం చేసేది.ఆమె కొత్త పేషెంట్స్ ని సంపాదించడంలో గొప్ప విజయాన్ని సాదించింది. ఆ గ్రూప్ ఇప్పుడు కార్డ్స్ ప్రామాణికంగా చేయడానికి చూస్తున్నారు.
  • ఒక SVP 170 మైళ్ళు ప్రయాణంచేసి కొత్త నగరానికి వెళ్ళి అక్కడ సారూప్య ఆలోచనలు గల అధ్యాత్మిక వ్యక్తులను కలిసే మార్గం కోసం చూసింది. ఇటీవలే ఆమెకి తెలిసిన పుస్తకం “అధ్బుతాలకు సంబందించిన కోర్సు“ గురించి చర్చించడానికి వారానికి రెండుసార్లు సమావేశమయ్యే అటువంటి బృందాన్నికనుగొన్నది. తత్ఫలితంగా, ఆమెవైబ్రియనిక్స్ యొక్క అధ్బుతమైన ప్రభావాలను అనుభవించిన పేషెంట్ నోటి మాట ద్వారా,నలుగురు కొత్త పేషెంట్స్ ని సంపాదించింది.
  • కొత్త పేషెంట్స్ నివారణలకోసం డబ్బులు చెల్లించడానికి లేదా విరాళం ఇవ్వడానికి ముందుకు వచ్చినప్పుడు,ఒక SVP, ఇతరులకు ఈ వైధ్య విధానం గురించి తెలియచేయడమే ఆమె అంగీకరించే ఏకైక గొప్ప “చెల్లింపు” అని పేషెంట్స్ కి చెబుతారు. పేషెంట్స్ అర్ధంచేసుకొని,సంతోషంగా ఇతరులకు చెబుతారు, ఈ విధంగా ఆమె కొత్త పేషెంట్స్ ని సంపాదిస్తుంది.

ఒక ప్రాక్టీషనర్ ఎక్కువమంది ప్రజలు ఉన్నప్పుడు అందరూ చూచేలా తనకోసంతయారు చేసినసొంతనివారణ తీసుకుంటారు. అపరిచితులు లేదా స్నేహితులు ఏమి తీసుకున్నారు అని అడుగుతారు ; ఇది ఆమెకి వైబ్రియనిక్స్ గురించి మాట్లాడే అవకాశంకల్పిస్తుంది.

వారాంతంలోవచ్చే ఆదివారం సాయంత్రం కాన్ఫరెన్స్ కాల్ ఏ విధంగాఏర్పాటుచేస్తున్నారోఆ ప్రక్రియనుగురించిఒకగ్రూప్తెలియజేస్తూపేషెంట్స్ ఆరోగ్యం మరియు వైద్యం కోసం, ప్రస్తుతం మరియు గతంలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి గురించి,వారి కుటుంబాలు మరియు భూమాత గురించి 108 సార్లు సాయి గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు, ముఖ్యంగా పాత పేషెంట్లులబ్ది పొందేందుకు ఇది ఒక అధ్బుతమైన మార్గం. ఆ కాల్ లో పాత పేషెంట్స్ ని జాయిన్ అవ్వమని ఆహ్వానిచడం ద్వారా వాళ్ళగురించి మీరు ఆలోచిస్తునట్ట్లు వాళ్ళకి తెలుస్తుంది.దీనివలన వారు మరియు వారి కుటుంబసభ్యులు ప్రేమ పూరితమైన వైబ్రేషన్స్ యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.మరొక ప్రయోజనం ఏమిటంటే కొంతమంది నివారణాలను రీఫిల్ చేసుకోవాలని గుర్తుచేసుకుంటారు.

4. వైబ్రోచికిత్సానిపుణులవార్షిక  సదస్సు, లండన్, యుకె సెప్టెంబర్ 22, 2019

యుకె కోఆర్డినేటర్ 02822చేచే నిర్వహించబడిన, ఈ సదస్సుకు యుకె లోని అన్ని ప్రాంతాల నుండి ప్రాక్టీషనర్స్ హాజరయ్యారు-మొత్తంగాఇరవై ఇదు (ముగ్గురు వైధ్యులు మరియు నలుగురు నర్సులతో సహా) మంది వ్యక్తిగతంగా మరియుఆరుగురువీడియో కాన్ఫెరెన్స్  ద్వారా హాజరయ్యారు. ఆతిధ్యమిచ్చిన కుటుంబసభ్యులనుండి ముగ్గురు మరియు ఒక గెస్ట్స్పీకర్వైబ్రియానిక్స్ నుండి వ్యక్తిగతంగా ప్రయోజనంపొందితన పేషెంట్లలో చాలా మందినివైబ్రో ప్రాక్టీషనర్స్ దగ్గరకు పంపి స్తున్న అనుభవజ్జుడైన వైద్యుడుకూడాపాల్గొన్నవారిలోఉన్నారు. ఇద్దరు యువ వాలంటీర్స్ వీడియో కాన్ఫరెన్సింగ్ భాధ్యతలు చేపట్టారు. ఈ సదస్సులో విజయవంతమైన కేసులు పంచుకోవడం కోసం,కష్టమైనకేసులగురించి చర్చించడం కోసం మరియుప్రశ్నలుసందేహాలను ముందుగానే తనకుపంపమని హాజరైన వారిని ప్రేరేపించడంలో కోఆర్డినేటర్ చాలా శ్రమించారు.సభ్యులయొక్కఅసంఖ్యాకమైన ప్రశ్నలకు(రాబోయే సంచికలో ఇవి ఉంటాయి) సమాధానలకోసం ఆత్రుతతో ఉన్నందున, హాజరైన వారి అందరిలో సందేహనివారణపొందినసంతృప్తిమరియు విజయవంతమైన కేసులను విన్నఆనందముపొందారు.ఐతే యుకెలో వైబ్రియానిక్స్ చికిత్స తీసుకునే వారి సంఖ్య రానురానూతగ్గుతోందిఅనేఅభిప్రాయంవ్యక్తమైంది. దీనిని అధికమించడానికి యు.యస్చికిత్సానిపుణులుసూచనలను(#3 లో చూడండి) తెలియచేయగా, ప్రాక్టీషనర్స్ అందరూ ఇవి చాలా వినూత్న ఆలోచనలని మెచ్చుకుని ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నారు.కొందరుసభ్యులు వివిధ సమస్యలకు విజయవంతంగాపనిచేసిన రెమెడీలను గురించితెలియజేశారు. SVP లు 02899&02900 వైబ్రియనిక్స్ తో తమ కుమార్తె యొక్క ఆసక్తికరమైన అనుభవాన్ని పంచుకున్నారు.

ముందస్తు జాగ్రతగా పర్వతారోహణలో వచ్చే అనారోగ్య (ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్)  నివారణ కోసం

ఈయువఉపాధ్యాయురాలు 18 మంది పిల్లలు మరియు ఇద్దరు సహచరులతో కూడిన గ్రూప్ తో 4 వారాలపాటు భౌగోళిక పర్యటనకు భారతదేశం వెళ్తున్నారుఈ యాత్రలో పర్వతం ఎక్కవలసి ఉన్నందున,పర్వతం ఎక్కువ ఎత్తుగా ఉండటం, అక్కడ తక్కువ ఆక్సిజన్ స్థాయి ఉండటం మరియు ఆకస్మిక వాతావరణ మార్పులు కారణంగా తీవ్రమైన పర్వతారోహణ అనారోగ్యం(ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్) వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రాక్టీషనర్స్(ఆమె తల్లితండ్రులు)నివారణను నేరుగా ఆల్కహాల్లో ( కారణం ఏమిటంటే 90 చుక్కలు మాత్రలను కరిగించివేస్తాయి.) ఒకడ్రాపర్బాటిల్లో108CC లో ఉన్నవి అన్నీ ( 1, 2, 8, 14 & CC17.2 Cleansingకాకుండా)కాంబోలను అన్నీకలిపి నివారణను తయారుచేశారు.వారుఆమెకు మామూలుగాఇచ్చేయాత్రానివారణనుఆమెకు సహయంగా ఇవ్వడమైనది : CC4.4 Constipation + CC4.6 Diarrhoea + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies.

గమ్యంచేరినతరువాతబృందంలోనిప్రతీ సభ్యుడు త్రాగునీటిని చేసుకోవడం ద్వారా శుద్ది చేసుకోవలసి ఉండేది.కానీ, ప్రాక్టీషనర్ కుమార్తెఒకఅభినందించదగ్గ పని చేసింది, ఆమె ఒక లీటర్ వాటర్ బాటిల్లో ఒక చుక్కపైనసూచించిన రెమెడీ వేసిరోజంతా తీసుకునేది. ఆమె ఇద్దరు సహచరులు ఇలా చేసినందుకు ఆమెను ఆటపట్టించారు. వారు ఆమెను “హిప్పీ డిప్పీ” అని పిలవడం ప్రారంబించారు, కానీ ఆమె దానికి సరదాగా నవ్వేది. పిల్లలకుకూడాఈ నివారణా చుక్కలను ఇవ్వడానికి ఇష్టపడేదికానీవారితల్లిదండ్రులఅనుమతిలేకమిన్నకుండేది.

పిల్లలు మరియు ఆమె సహచరులు వికారం, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం, దగ్గు, జ్వరం, నిద్రలేమి వంటి AMS(ఎక్యూట్ మౌంటెన్ సిక్ నెస్స్) వంటి లక్షణాలతో బాధపడుతున్నప్పటకి, 4 వారాల వ్యవధిలో ఆమె ఒక్కర్తే ఆరోగ్యంగా ఉంది.ఇది చూచి, తన సహచరులలో ఒకరు ఇండియాలో ఒక నెల పాటు ఉండవలసి ఉండటంతో అతనికి వైబ్రేషన్స్ ఇవ్వమని అభ్యర్ధించాడు. ఒక నెల తరువాత, అతను ” వైబ్రేషన్స్ ప్రతి రోజూ తీసుకుంటున్నాను మరియు ఆరోగ్యంగా ఉన్నాను. ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన వాస్తవం, ఇది పనిచేస్తుంది” అని ఆమెకి సందేశం పంపాడు.

 

 

 

5. SVP వర్క్ షాప్, అలెస్, ఫ్రాన్స్, 20-24 అక్టోబర్ 2019

ఇటీవలేప్రాక్టీషనర్గామారినఒకనిపుణుడు తనఇంట్లోనేఆతిథ్యమిచ్చినఈవర్క్ షాప్ లో  పాల్గొన్న నలుగురు SVPలు మరియు ఇద్దరు SVP దరఖాస్తు దారులను హృదయపూర్వకంగా ఆహ్వానించారు. అత్యంత పరస్పరఆధారితపద్దతిలోజరిగినఈవర్క్షాప్లోవైబ్రియనిక్స్ లో ఉన్న అత్యంత కీలకమైన చికిత్సా పద్దతులైన మయాజంమరియు నోసోడ్లపైచర్చించడం ద్వారా మరింత ప్రత్యేకమైన చికిత్సను గురించిఅనుభవజ్ఞానముపొందారు. కొత్త SVPలు సాయి వైబ్రియనిక్స్ లో ఉన్న మరియొక కోణం తలుపులు తెరిచినట్లుగా భావించారు.108CC బాక్స్ తో పనిచేయడం చాలా సరళమైనది మరియు కొంత యాంత్రికమైనది అని పాల్గొన్నవారు వ్యాఖ్యానించారు,కానీ పోటెంటైజర్ కోసం కార్డ్స్ ఎంచుకోవడం ఎంతో విశ్లేషణాత్మకమైనది మరియు మెదడకు కొంతపనికల్పించేటటువంటిది ! హాజరైన వారికి కలిసి భోజనం తయారు చేసుకునే అవకాశం కల్పించబడడంతో, ఇది వారికి ఆరోగ్యకరమైన ఆహారం యొక్క సూత్రాలను లోతుగా అధ్యయనంచేయడానికి వీలు కల్పించింది. కొత్త దరఖాస్తుదారులు ఇద్దరూ తమ పరీక్షలో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారు మరియు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చాలా పవిత్రమైన వాతావరణంలో SRHVPని విలువైన భాహుమతిగా స్వీకరించారు. వైబ్రియానిక్స్ కుటుంబంలో మరియు వైబ్రియానిక్స్ పరిణామంలో ఈ కొత్త దశ వారికి మరింత బాధ్యతని ఇస్తుందని అర్ధం చేసుకుంటూ వారు తమ సేవలను కొనసాగించడానికి ఉత్సాహంచూపించారు.90వదశకంలోనికి చేరిన(అక్టోజెనెరియన్) ఒకవృద్ధమహిళాప్రాక్టీషనర్ 02499 కొన్ని సంవత్సరాలగా పొటెన్టైజర్వాడకంలో తన కున్న అనుభవాన్ని పంచుకోవడం ద్వారా పాల్గొన్నవారందరికి ఉత్సాహాన్నినింపింది. డాక్టర్ అగర్వాల్ ప్రాక్టీషనర్స్ అడిగిన ప్రశ్నలకు స్కైప్ కాల్ ద్వారా సభ్యులసందేహాలనుచక్కగా అర్ధం చేసుకునేలా సమాధానాలు చెపుతూ,మయజం కు ముందు బేస్ చక్ర ఇవ్వడానికి కారణం మరియు ప్రేగు /ఆంత్రము నోసోడ్ ఉపయోగం వంటివిషయాలుకూడాసవివరంగాఅర్థం చేసుకు నేందుకుసహాయపడ్డారు..

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

6. AVP వర్క్ షాప్ మరియు రీఫ్రెషర్, అలెస్, ఫ్రాన్స్, 26-28అక్టోబర్ 2019

ఆరుగురుసభ్యులతోనిర్వహించుకోబడినఈAVP వర్క్ షాప్ మరియు పునశ్చరణసదస్సులోముగ్గురు SVP  లు కూడాపాల్గొన్నారు.మొట్ట మొదటిసారిఈఫ్రెంచ్ వర్క్ షాప్ లో మోడల్ క్లినిక్ ఏర్పాటు చేయడంతో పాల్గొన్నవారు ప్రత్యేకంగా ప్రయోజనం పొందారు.రకరకాల పరిస్థితులను ఎదుర్కోనెలా AVPలను తయారుచేయడం కోసం మోడల్ క్లినిక్ లో కేసులనుSVPలు తయారు చేశారు.ఇందులో సంప్రదింపులు ఎలా నిర్వహించాలి,పేషెంట్ రెండు ధీర్ఘకాలిక వ్యాధులు లేదా ఒకతీవ్రమైన మరియు ధీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నప్పుడు మొదట చికిత్స చేయాల్సిన వ్యాధి గురించి, మూడు రకాల పుల్లౌట్లను ఎలా ఎదుర్కోవాలి,కాంబోలను ఎంచుకోవడం మరియు మోతాదుని నిర్ణయించడం,మరియు ఆరోగ్యం మెరుగైన తరువాత మోతాదుని ఎలా తగ్గించాలివంటివి ఉన్నాయి .AVPలు ఈవర్క్షాప్పట్లచాలా ఆనందగా ఉన్నారు. ఎందుకంటే సమర్పించిన కేసులు మరియువివిధపరిస్థితులకుఎలాప్రతిస్పందించాలిఅనేవిషయాలపైమరింతజ్ఞానమును, ఆత్మవిశ్వాసం

పొందడానికి సహాయపడ డమేకాక ఇది వారి భవిష్యత్ ప్రాక్టీస్ కి ఉపయోగపడుతుంది.

ఫ్రఆత్మవిశ్22వాసంోసం వైబ్రియనిక్స్ అడ్మినిస్ట్రేటివ్ సేవలో చాలా సంవత్సరాలు చురుకుగా పాల్గని, వైబ్రియనిక్స్ AVP అర్హత పరీక్షలో అద్భుతంగా ఉత్తీర్ణత సాధించిన తరువాత, కొత్తగా అర్హత సాధించిన AVPలుభారీచప్పట్లమధ్య108CC బాక్స్ ను. అందుకున్నారు. డాక్టర్అగ్గార్వల్ .స్కైప్ ద్వారా అనేక సందేహాలకు వివరణ ఇచ్చారు, ఇందులో తీవ్ర అనారోగ్యం, ధీర్ఘకాలిక ఆనారోగ్యం మరియు అత్యంత తీవ్రమైన అనారోగ్య లక్షణాల మధ్య ఉన్నవ్యత్యాసంవంటివి.వివరించ బడ్డాయి.

 

 

 

 

 

 

 

Om Sai Ram