Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 10 సంచిక 3
May/June 2019
ముద్రింప తగిన వార్తాలేఖ


పూర్తి వార్తాలేఖ యొక్క కాగితం ప్రతి కావలెనన్నఈ పుటను ముద్రించండి

డా.జిత్ కె. అగ్గర్వాల్ డెస్క్ నుండి

ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ప్రపంచ మానవ విలువల దినోత్సవంగా కూడా పాటిస్తున్న మన  ప్రియమైన భగవాన్ బాబా యొక్క ఆరాధన మహోత్సవం దినోత్సవం సందర్భంగా మీకు వ్రాస్తునందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఆరాధన దినోత్సవానికి దారితీసే మొత్తం నెల, భక్తులు తమ హృదయాలను శుద్ధి చేయడానికి మరియు తమని తాము  సంస్కరించుకునే ఆధ్యాత్మిక సాధనలు ప్రేమ మరియు క్షమ చుట్టూ తిరుగుతుంది. ఈ సంవత్సరం ఆరాధన దినోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయంలో వినిపిచ్చిన స్వామి ప్రసంగం యొక్క ముఖ్యోదేశం స్వీయ పరివర్తన కోసం ఏకత్వాన్ని పెంపొందించుకోవడం. వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ యొక్క ముఖ్య లక్షణాలు ప్రేమించడం, క్షమించడం మరియు అంకితభావంతో నిస్వార్థ సేవ చేయడం అని మేము నమ్ముతున్నాము. అన్నింటికంటే మించి,  వైబ్రియోనిక్స్ సాధన చేయడం ద్వారా భేద భావాలని అధిగమించి స్వీయ పరివర్తనను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. స్వామి ఏమన్నారంటే, “తపస్సు, తీర్థయాత్రలు, గ్రంథాల అధ్యయనం, జపం ద్వారా ఈ జీవిత మహాసముద్రాన్ని దాటలేరు. సేవ చేయడం ద్వారా మాత్రమే దాన్ని సాధించవచ్చు...... భగవంతుడు అందరిలో నివసిస్తున్నాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరికీ సేవ చేయండి ”….. సత్యసాయి స్పీక్స్, వాల్యూమ్ 35. మన మందరం ఈ సందేశాన్ని మన హృదయాల్లో మరియు మన మనస్సులలో దృఢమైన ముద్ర వేసుకుందాం.

స్వామి యొక్క పై సందేశం యొక్క స్ఫూర్తితో పని చేసిన అనేక మంది వైబ్రో అభ్యాసకులతో కలిసి పనిచేయడం మా అదృష్టం. డాక్టర్ నంద్ అగర్వాల్ 10608 ... ఇండియా  9 ఏప్రిల్ 2019 న మరియు జోజా మెంటస్ 01159క్రొయేషియా 16 ఏప్రిల్ 2019 న స్వామిలో లీనమైన వార్తలను భారమైన హృదయంతో మీతో పంచుకుంటున్నాను. మా వైబ్రియోనిక్స్ మిషన్‌లో వారిరువురు గొప్ప నాయకులు. 2012 నుండి సీనియర్ ప్రాక్టీషనర్‌గా వున్న డాక్టర్ నంద్ అగర్వాల్, ఆయన భార్య 02817...ఇండియా తో కలిసి బెంగళూరు మరియు ముంబైలలో అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆయన తన ఇంటి వద్ద మరియు ముంబైలోని స్వామి ఆశ్రమమైన ధర్మక్షేత్రంలోని రెగ్యులర్ వైబ్రో క్లినిక్ వద్ద ఎప్పటికప్పుడు పెరుగుతున్న రోగులకు ఆదర్శప్రాయమైన సంరక్షణను అందించారు. వ్యక్తిగతంగా నేను సన్నిహితుడు మరియు మంచి సహచరుడిని కోల్పోయాను. జోజా మెంటస్, 1999 నుండి ప్రాక్టీషనర్‌ గా చాలా అంకితభావంతో పని చేస్తున్నకరుణమూర్తి మరియు  క్రొయేషియా యొక్క SSIO యొక్క జాతీయ పాలక సంస్థ (కౌన్సిల్) అధ్యక్షురాలు ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడి స్వర్గస్తులైనారు. సాయి ఆర్గనైజేషన్‌ మరియు వైబ్రియోనిక్స్ ద్వారా ఆమె చేసిన ఆదర్శప్రాయమైన సేవలను కోల్పోతున్నాము.

ప్రపంచవ్యాప్తంగా స్థానిక నెలవారీ వైబ్రియోనిక్స్ సమావేశాల సంఖ్య పెరుగుతున్న శుభపరమైన ధోరణిని నేను గమనించాను. ఇటువంటి సమావేశాలను  నిర్వహించడంలో, వచ్చిన వారు అర్థవంతమైన చర్చలలో పాల్గొనడం ద్వారా మన ప్రాక్టీషనర్స్ చూపుతున్న ఉత్సాహం, సామార్ద్యము మరియు నిబద్ధత నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. సమావేశాలలో ప్రత్యక్షంగా అందరు ఒక్క చోట కలిసే అవకాశం లేని చోట, ఇంటర్నెట్ టెక్నాలజీ (స్కైప్ లేదా ఇతర ఆన్‌లైన్ సమావేశ సాధనాలు) ద్వారా నిర్వహించుకోవాలని నేను సూచిస్తున్నాను. ప్రతి సమావేశానికి, ముందుగానే సమావేశంలో చర్చించే అంశాన్ని ప్రాక్టీషనర్స్ ఎంచుకోవాలని నేను సూచిస్తున్నాను మరియు ఈ సమావేశాలను మరింత అర్ధవంతంగా వుండటానికి వారి సంబంధిత కేసులు లేదా చికిత్స సంబంధిత అనుభవాలను పంచుకునేందుకు తయారుగా ఉండండి. అటు పిమ్మట చర్చల మరియు తీర్మానాల సారాంశాన్ని వైబ్రియోనిక్స్ కమ్యూనిటీ వారితో పంచుకోవాలి.

శిక్షణా శిబిరాలు నిర్వహించేట్టప్పుడు వైబ్రియోనిక్స్ సాధన మీద పెరుగుతున్న అభిరుచి మరియు స్వీయ-అభివృద్ధి కోసం (స్వీయ-పరివర్తన లక్ష్యంతో) వివిధ పద్ధతుల కోసం పెరుగుతున్న ఆసక్తి లాంటి మరికొన్ని ఉత్తేజకరమైన పోకడలు నేను గమనించాను. ఇది చాలా మంచి సంకేతం. క్షమ, ప్రేమ, కరుణ మరియు సహనం అనే లక్షణాలతో కూడిన మంచి ఆలోచనల ముఖ్యోదేశం మనందరికీ తెలిసినప్పటికీ, ఇవి సాధారణంగా మన మనస్సులలోనే ఉంటాయి. ఈ గుణాలని ఆచరణలో పెట్టి, కృతజ్ఞత కూడిన మంచి భావాలతో మనం ఆరోగ్య పరిరక్షణకై సేవ అందిస్తున్నప్పుడు, అద్భుతాలు జరుగుతాయని నేను నిజంగా నమ్ముతున్నాను. ఒక ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, థిచ్ నాట్ హన్హ్ ప్రకారం, “మనం ఇతరులకు అందించే అత్యంత విలువైన బహుమతి మన ఉనికి. మనం  ప్రేమించేవారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు వారు పువ్వుల వలె వికసిస్తారు. ”

రానున్న ఈశ్వరమ్మ దినోత్సవంతో, మన మందరం మన మార్గంలో వచ్చిన ప్రతి జీవికి మరియు ప్రార్ధనల ద్వారా నయంచేసే వారి అందరికి తల్లి ప్రేమ మరియు దయ పంచడానికి సాధన చేద్దాం. మీరందరూ ఆనందంగా ఉండండి!

సాయికి ప్రేమపూర్వక సేవలో

జిత్ కె అగర్వాల్

తెల్లబట్ట అగుట (లూకొరియ) 10596...भारत

38 ఏళ్ల మహిళ గత ఆరు సంవత్సరాలుగా బాగా వాసనతో కూడిన తెల్లబట్ట అవ్వడంతో బాధపడుతోంది. ఇది ఆమె రోజువారీ పనులను కొనసాగించడానికి చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఆమె చాలా నిరాశకు గురైంది. ఇతర చికిత్సల ఖర్చు భరించలేని ఆమె వాటి కొరకు ప్రయత్నించలేదు. 17 నవంబర్ 2017 న, ఆమెకు ఈ క్రింద చూపిన మందు ఇవ్వబడింది:

CC3.7 Circulation + CC8.1 Female tonic + CC8.5 Vagina & Cervix + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.3 Skin allergies…TDS

5 రోజుల్లో, తెల్లబట్ట మరియు బలహీనత 25% తగ్గింది మరియు ఒక నెలలోనే, తెల్లబట్ట మరియు వాసన పూర్తిగా ఆగిపోయింది. ఆమెకు ఎటువంటి బలహీనత, నిరాశ తిరిగి రాలేదు. 17 డిసెంబర్ 2017 న, మోతాదు BD కి మరియు 2 నెలల తరువాత OD కి తగ్గించబడింది. రోగి మోతాదును మరింత తగ్గించడానికి ఇష్టపడనందున OD పైనే కొనసాగిస్తున్నారు. ఏప్రిల్ 2019 నాటికి లక్షణాలు పునరావృతం కాలేదు.

అరచేతులలో మచ్చలు 10596...भारत

51 ఏళ్ల మహిళ గత ఏడాది కాలంగా తన అరచేతులపై నిరంతరం దురదతో వుండే మందపాటి మరియు నల్లటి మచ్చలు కలిగి ఉంది, రోగి అల్లోపతి చికిత్స కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా ఎటువంటి ఉపశమనం కలుగలేదు. ఆమె పరిస్థితి ఆమెను చాలా నిరాశకు గురిచేసింది. బట్టల సబ్బు వల్ల ఆమెకు అలెర్జీ వచ్చి ఉండవచ్చని భావించింది. 9 సెప్టెంబర్ 2016 న, ఆమెకు ఈ క్రింది మందు నోటిద్వారా మరియు నూనెలో కలిపి అరచేతులపై రాయడానికి ఇవ్వబడింది:

CC3.7 Circulation + CC10.1 Emergencies + CC21.2 Skin infections + CC21.3 Skin allergies…TDS 

2 వారాలలో, దురద తగ్గి పోయింది , రెండు అరచేతులపై మచ్చలు 25% తగ్గాయి. తరువాతి 2 వారాల్లో, మచ్చలు ఇంకా తగ్గాయి. 14 వారాల చికిత్స తర్వాత, 21 డిసెంబర్ 2016 న, మచ్చలు పూర్తిగా కనుమరుగైంది. ఎటువంటి ఖర్చులు లేకుండా అటువంటి సమర్థవంతమైన మరియు అంకితమైన చికిత్స సాధ్యమని ఆమె నమ్మలేకపోయింది. అంధువల్ల ఆమె కృతజ్ఞతతో నిండిపోయింది. ఇక ఆమెకు ఎటువంటి నిరాశ కూడా లేదు. మోతాదును 2 నెలలు OD కి తగ్గించి, ఆపై ఆపివేశారు. రెమెడీని ఆపివేసిన రెండు నెలల తర్వాత కూడా ఆమె వాషింగ్ సబ్బును ఉపయోగించినప్పుడు ఎటువంటి సమస్య లేదని ఆమె తెలియజేసింది.

దీర్గకాలిక ముక్కు దిబ్బడ (క్రోనిక్ బ్లాక్డ్ సైనెస్స్) 10596...भारत

ముంబైలోని ఒక వృద్ధాశ్రమంలో 82 ఏళ్ల చూపులేని ఒక పెద్దాయన గత 8 సంవత్సరాలుగా ముక్కు దిబ్బడ మరియు సైనస్‌లతో బాధపడుతున్నారు; దీనివల్ల సరైన నిద్రకూడా పోలేకపోతున్నారు. అతను అల్లోపతి వైద్యం తీసుకున్నాఎటువంటి  ఫలితం పొందలేదు. అతను జనవరి 2019 నుండి వృద్ధాప్య ఇంటిలో నివసించడం ప్రారంభించిన తరువాత అతను అల్లోపతి మందులు తీసుకోవడం మానేశారు. రోగి తన పరిస్థితికి చాలా బాధపడుతూ సహాయం కోసం తీవ్రంగా ఎదురు చూస్తున్నారు.

19 జనవరి 2019 న, అతనికి ఈ క్రింది కాంబో ఇవ్వబడింది:

CC15.1 Mental & Emotional tonic + CC19.2 Respiratory allergies + CC19.5 Sinusitis…TDS

ప్రాక్టీషనర్ ఒక నెల తరువాత వృద్ధాశ్రమాన్ని సందర్శించినప్పుడు, రోగి అతను మందు మొదలుపెట్టిన 3 రోజుల తర్వాత మంచి నిద్ర పొగల్గుతున్నారని తెలిపారు. అతని ముక్కు దిబ్బడ మరియు సైనస్‌ కూడా నెమ్మదిగా తగ్గడం ప్రారంభమైంది మరియు ఇప్పటికి, అది కనుమరుగైంది మరియు నొప్పి కూడా పోయింది. ఫిబ్రవరి 19 న, మోతాదు OD కి తగ్గించబడింది. మందు అతనికి బాగా నిద్రపోయేలా చేయడంతో, మోతాదును తగ్గించడానికి అతను ఇష్టపడలేదు. ఏప్రిల్ 2019 నాటికి, పునరావృతం కాలేదు; రోగి సంతోషంగా ఉన్నాడు మరియు OD నివారణను కొనసాగిస్తున్నాడు.

మాట పోవడం 02836...भारत

32 ఏళ్ల వయసున్న వ్యక్తి 2010 మార్చి 30 తెల్లవారుజామున మాట పోయినట్లు గ్రహించి వెంటనే మూర్ఛపోయాడు. అల్లోపతి చికిత్స వెంటనే ఇవ్వబడింది కాని అతని పరిస్థితి మెరుగుపడలేదు. దాదాపు మూడు నెలల తరువాత, అతను పని చేసే కార్యలయంలోని అతని నియంత్రణ అధికారి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకొని, రోగికి చికిత్స చేయమని ప్రాక్టీషనర్ ని అభ్యర్థించారు.

20 జూన్ 2010 న, ఈ క్రింది మందులు ఇవ్వబడ్డాయి:

#1. CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities…TDS
#2. CC19.7 Throat chronic…TDS

రోగి తన మాటని 8 రోజుల్లో తిరిగి పొందాడు. ఈ సంతోషకరమైన వార్తను తెలియజేయడానికి అతను స్వయంగా ప్రాక్టీషనర్ కి ఫోన్ చేసి తెలియచేశాడు. పైన పేర్కొన్న నివారణలను TDS లో కొనసాగించాలని ఆయనకు సూచించారు. రెండు నెలల తరువాత, అతను పూర్తిగా నయమయ్యాడని భావించి తనంత తానుగా వాటిని ఆపివేశాడు. అతను 4 సంవత్సరాల తరువాత ప్రాక్టీషనర్ ని కలుసుకుని అతను పూర్తిగా బాగానే ఉన్నాడని మరియు సమస్య పునరావృతం కాలేదని చెప్పాడు.

మానసిక దాడులు (సైకిక్ అట్టాక్స్) 02836...भारत

35 ఏళ్ల వయసున్న, శారీరకంగా చాలా బలంగా ఉన్న యువతిని, ఆమె భర్త 15 సెప్టెంబర్ 2010 న ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చాడు. గత 10 సంవత్సరాలుగా, ఆమె మానసిక దాడులకు గురైంది. అరవడం, అసభ్యకరమైన భాష వాడటం మరియు ఆమె యవ్వనంలో వున్న కొడుకు, కుమార్తె మరియు ఆమె భర్తను కూడా దాదాపు ప్రతిరోజూ కొట్టడం ఆమెకు అలవాటుగా మారింది. ఆమె గత 3 సంవత్సరాలుగా అల్లోపతి చికిత్స తీసుకుంటున్నా ఎటువంటి మార్పు లేకుండా ఉంది.

ప్రాక్టీషనర్ ఈ క్రింది మందు తయారుచేసి ఇచ్చాడు.

#1. CC15.2 Psychiatric disorders…TDS

అతను రోగిని కొంతసేపు నిశ్శబ్దంగా కూర్చోమని కోరి, తరువాత ఆమె నోటిలో మొదటి మోతాదును ఇచ్చాడు. ఆమెను కళ్ళు మూసుకుని దీర్గ శ్వాసలు తీసుకొంటూ, 5 నిమిషాలు క్రమబద్దమైన శ్వాసపై దృష్టి పెట్టమని కోరి, ప్రాక్టీషనర్ ఆమె కోసం ప్రార్థించాడు. అదే సమయంలో అతను 4 అంగుళాల పొడవున్న ఒక ఆమె ముఖం యొక్క కుడి వైపు నుండి ఉద్భవించి ఆమె ఎడమ వైపు కదులుతున్న నల్ల నీడను చూశాడు, ఆమె పెద్దగా ఏడుపు ప్రారంభించి, కొన్ని నిమిషాల తర్వాత శాంతించింది.

3 రోజుల తరువాత, ఆమె దుర్భాషలాడుతున్నపటికి, ఆమె చాలా ప్రశాంతంగా ఉందని తెలిసింది. ఆమె బాగా నిద్రపోకపోవడంతో, # 1 తోపాటు ఈ క్రిందదానిని కూడా ఇచ్చారు:

#2. CC15.6 Sleep disorders + #1…TDS

ఒక వారం తరువాత, ఆమె, తన భర్తతో కలిసి, ప్రాక్టీషనర్ ని కలసినప్పుడు ఈ దాడులు ఎలా ప్రారంభమయ్యాయో పంచుకున్నారు. యుక్తవయసులో, ఒక నదిలో ఈత కొడుతున్నప్పుడు, ఆమె తన పాదాల అరికాళ్ళను ఏదో తాకుతున్నట్లు అనిపిచింది. ఆమె దాన్ని తీసి చూస్తే అది ఒక అందమైన విగ్రహం. ఆమె దానిని తన ఇంటికి తీసుకువచ్చింది. సుమారు 10 సంవత్సరాల తరువాత, ఆమెలో మానసిక దాడులు మొదలైయాయి. క్షుద్ర శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న ఒక విద్వాంసుడు ఆ విగ్రహాన్నినదిలో విసిరేయమని చెప్పగా, ఆమె ఆ నదిలో పారవేసింది. కానీ ఇది ఆమె మానసిక దాడులను ఆపలేదు. అయితే వైబ్రియోనిక్స్ తీసుకున్న ఒక నెలలోనే, ఆమె ప్రశాంతంగా మారింది మరియు ఆమె కోప తీవ్రత తగ్గింది. అందువల్ల, ఆమె స్వచ్ఛందంగా అల్లోపతి మందులు తీసుకోవడం మానేసింది.

ఆమె # 2 ను మొత్తం 3 నెలల పాటు కొనసాగించింది, ఈ సమయంలో ఆమె లో హింస మరియు దుర్భాషలాడడం లాంటి మానసిక దాడులు పూర్తిగా ఆగిపోయాయి. రోగితో చివరిసారిగా 2017 లో కలిసినప్పుడు ఆమె ప్రాక్టీషనర్ కి కృతజ్ఞతలు తెలియచేసి మానసిక దాడులు పునరావృతం కాలేదని ధృవీకరించింది.

లూపస్ 03571...थाईलैंड

ప్రాక్టీషనర్ యొక్క 26 ఏళ్ల మహిళా సహోద్యోగి జూన్ 2018 లో ఆమె చేతులు మరియు ముఖంపై దద్దుర్లు మరియు చెవుల లోపలి భాగంలో ఎర్రబడటం వచ్చింది. ఆమె ముఖం వాయటమే మాత్రమే కాకుండా ముఖంపై దద్దుర్లు 4 సెం.మీ పరిమాణంలో పెద్దవిగా ఉన్నాయి(రోగి ఫోటో తీయడానికి ఇష్టపడలేదు). ఆమె చర్మవ్యాధి నిపుణుడు సూచించిన విధంగా ఆమె రోజుకు రెండుసార్లు యాంటీ అలెర్జీ ఔషధం (సెటిరిజైన్) వాడుతోంది. వైబ్రియోనిక్స్ రెమెడీ తీసుకోవాలని ప్రాక్టీషనర్ ఆమెకు సూచించినప్పుడు, ఆమె ఒప్పుకోలేదు ఎందుకంటే వేరే మందులు తీసుకోకూడదని డాక్టర్ ఆదేశించారు. చర్మం యొక్క బయాప్సీ 2 రోజుల క్రితం మాత్రమే జరిగింది మరియు నివేదిక త్వరలోనే రానున్నది. వైబ్రియోనిక్స్ యొక్క ప్రయోజనాలు తెలియజేసి దీని వలన ఎటువంటి దుష్ప్రభావాలు రావని ప్రాక్టీషనర్ ఆమెకు వివరించినప్పుడు, చర్మం పైన ఉపయోగించటానికి ఆమె అంగీకరించింది.

25 ఆగస్టు 2018 న, ప్రాక్టీషనర్ ఆమెకు ఈ క్రింది మందును కొబ్బరి నూనెతో తయారు చేసి చర్మ పైబాగంలో రాయడానికి ఇచ్చాడు:

CC8.1 Female tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies + CC21.7 Fungus…TDS

3 రోజుల తరువాత, ఆమె చేతులు మరియు ముఖంపై దద్దుర్లు తగ్గడం  ప్రాక్టీషనర్ గమనించాడు; ఆమె చెవుల్లో ఎరుపు దాదాపుగా కనుమరుగైంది. పక్షం రోజుల్లో ఆమె ముఖం మీద దద్దుర్లు, ఎరుపు మరియు వాపు కనిపించలేదు. మరో 2 వారాల తరువాత, రోగి సెటిరిజైన్ తీసుకోవడం మానేశారు, కాని 20 అక్టోబర్ 2018 వరకు మరో నెలపాటు వైబ్రియోనిక్స్ రెమెడీని ఉపయోగించడం కొనసాగించింది, ఆమె పూర్తిగా నయమైందని భావించినందున ఆమె దానిని ఆపివేసింది. ఆమె ఉద్యోగ నిమిత్తం వేరొక ప్రదేశానికి వెళ్ళిన కారణంగా ప్రాక్టీషనర్ ఆమెను కలవలేదు, కానీ ఆమె బయాప్సీ నివేదికలో ఆమెకు లూపస్ ఉందని  వచ్చింది కానీ, అది ఇప్పుడు వైబ్రియోనిక్స్ చికిత్సతో అదృశ్యమైంది. 30 ఏప్రిల్ 2019 నాటికి, ఇది 6 నెలలకు పైగా ఉంది మరియు సమస్య పునరావృతం కాలేదు.

కుక్కలో ఎర్లిచియోసిస్, పనోస్టైటిస్ 03571...थाईलैंड

 ప్రాక్టీషనర్ జూలై 2018 లో AVP గా అర్హత సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన 2 సంవత్సరాల పెంపుడు కుక్క బ్రౌనీని పొరుగున ఉన్న తన స్నేహితుడి ఇంటి నుండి తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, ఆ కుక్క  కదలలేని స్థితిలో చూసి షాక్ అయ్యాడు(చిత్రాన్ని చూడండి).

అది ఎముకలు మరియు మాంసం కాండ వుండి ప్రాణం లేని జీవచ్చంలాగా ఉన్నది. ప్రాక్టీషనర్ కుక్కను పైకి ఎత్తినప్పుడు, అది నేల మీద పడిపోయింది. అది అలసిపోయినది మరియు 4 కిలోల బరువు తగ్గింది. 

6 ఆగస్టు 2018 న, అతను నీటి గిన్నెలో ఈ క్రింది మందుని కలిపి ఇచ్చాడు:

#  1. CC1.1 Animal tonic + CC18.4 Paralysis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…6TD

3 రోజుల తరువాత, పరిస్థితిలో మెరుగుదల లేనందున, ప్రాక్టిషనర్ దాన్ని  సమీపంలోని పశువైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. దానికి ఎర్లిచియోసిస్ అని పిలువబడే టిక్-బర్న్ అంటు వ్యాధి వచ్చినదని నిర్దారించారు. ఇది బ్రౌన్ టిక్ బైట్స్ వల్ల వ్యాపించింది; దానికి యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్స్ ఇమ్మని రాసిచ్చారు.

దానితో పాటు మరొక కాంబో 9 ఆగష్టు 2018 ఇవ్వబడింది.

#  2. CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC17.2 Cleansing + CC18.5 Neuralgia + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions + #1…6TD, 

ఆ కుక్క గిన్నెలో బ్రౌనీ నీరు త్రాగటం మానేయడం తో సిరంజి ద్వారా నోటిలో ఇచ్చారు.

బ్రౌనీ పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. ఒక వారంలో, అది తన కుడి కాలు మీద కుంటుతున్నప్పటికీ, నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. మరో వారం తరువాత, అది మామూలుగా తయారైయి దాదాపు 3 వారాల పాటు అలాగే ఉంది. అల్లోపతితో పాటు వైబ్రియోనిక్స్ వాడకం వల్ల త్వరగా ఆరోగ్యమును తిరిగి పొందుటకు కారణమని ప్రాక్టిషనర్ పేర్కొన్నాడు.

అయితే దాని కాళ్ళు గట్టిగా మారడం ప్రారంభించి ఒక వారంలో అంటే 18 సెప్టెంబర్ 2018 న, అది కదలలేని స్థితికి వచ్చి నొప్పితో అరవడం ప్రారంభించింది. దాన్ని అలా ఆ పరిస్థితిలో చూసి ప్రాక్టిషనర్ కి హృదయాన్ని పిండేసినట్లైంది.  ప్రాక్టీషనర్ మళ్ళీ దాన్ని కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్లతో చికిత్స చేసిన పశువైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. కుక్క యొక్క పరిస్థితిని పనోస్టైటిస్ అని పిలుస్తారు, దీనివల్ల నొప్పి ఒక అవయవం నుండి మరొక అవయవానికి మారుతుంది. ఈ వ్యాధికి ఎర్లిచియోసిస్ అనేది ఒక సాధారణ కారణంగా భావిస్తారు. దాని స్థితిలో ఎటువంటి మెరుగుదల లేనందున, దాని సెరిబ్రల్ ద్రవాన్ని తనిఖీ చేయడానికి బ్రౌనీని బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యుడు సూచించారు.

24 సెప్టెంబర్ 2018 న, స్వామిని ప్రార్థించిన తరువాత, ప్రాక్టీషనర్ బ్రౌనీని ఎక్కడకు తీసుకో పోకూడదని నిర్ణయించుకున్నాడు, అల్లోపతి ఔషధాన్ని ఆపివేసి, పూర్తిగా కొత్త కాంబో నీళ్లలో కలిపి సిరేంజి ద్వారా దాని నోట్లో ఇచ్చాడు

#3. CC3.7 Circulation + CC9.1 Recuperation + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions… 6TD in water through a syringe into his mouth

బ్రౌనీ క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు మరియు 25 అక్టోబర్ 2018 నాటికి ఒక నెలలో 100% ఫిట్ అయ్యాడు (చిత్రాన్ని చూడండి).

అది సాధారణంగా తినడం మొదలుపెట్టింది మరియు తన బరువును కూడా తిరిగి పొందింది. కాబట్టి, మోతాదును TDS కు తగ్గించారు. పాపం, 2019 కొత్త సంవత్సరం సందర్భంగా టపాకాయల నుండి తప్పించుకోవడానికి ఇంటి బయట పరుగెత్తినప్పుడు, రహదారిపై జరిగిన ప్రమాదంలో విధి దాని ప్రాణాలను తీసుకుంది.

ధీర్గకాలిక దగ్గు 11573...भारत

16 ఏళ్ల బాలుడు 3 సంవత్సరాల వయస్సు నుండి దగ్గు మరియు జ్వరంతో కొన్నిసార్లు జలుబు మరియు గొంతునొప్పితో తరచూ (నెలకు ఒకసారి) బాధపడుతున్నాడు. వాతావరణంలో స్వల్ప మార్పు వచ్చినా ఇవి ఎక్కువవుతున్నాయి. ప్రతిసారీ అల్లోపతి ఔషధం తీసుకున్నప్పుడు అతను 5-6 రోజుల్లో ఉపశమనం పొందుతాడు, కానీ అది తాత్కాలికమే. అతని తల్లి వైబ్రియోనిక్స్ ప్రయత్నించినందున ఆమె స్వయంగా అతన్ని ప్రాక్టీషనర్ వద్దకు తీసుకువచ్చింది. బాలుడికి గత రెండు రోజులుగా తేలికపాటి జలుబు, దగ్గు వచ్చింది. అతను ఈసారి అల్లోపతి ఔషధం తీసుకోలేదు.

5 ఆగష్టు 2018 న ఈ కింది మందు ఒక వారానికి ఇచ్చారు.

#1. SR218 Base Chakra…OD for a week

దాని తరువాత పుల్లౌట్ లేదు, బదులుగా అతని పరిస్థితి మెరుగుపడింది. 3 రోజుల విరామం తరువాత అంటే 15 ఆగస్టు 2018 న, ఈ క్రింది మియాస్మ్ ఒక డోస్ ఇవ్వబడింది:

#2. SR252 Tub-Bac

మరుసటి రోజు బాలుడు తనకు చాలా బాగుందని మరియు జలుబు లేదా దగ్గు లక్షణాలు లేవని తెలిపాడు. పుల్లౌట్ లేనందున, # 2 యొక్క రెండవ మోతాదు 30 ఆగస్టు 2018 న ఇవ్వబడింది. 3 వారాల తరువాత, బాలుడు తాను బాగా వున్నట్లు తెలియచేసాడు. ఈసారి కూడా పుల్లౌట్స్ లేనందున, # 2 యొక్క మరొక మోతాదు ఇవ్వవలసిన అవసరం రాలేదు.

బాలుడు ఆరోగ్యo బాగానే వుండి మరింత ఆనందంగా కనిపించాడు మరియు వాతావరణ మార్పుల వల్ల ఎటువంటి ఫిర్యాదులు లేవు. 2018-19 మొత్తం శీతాకాలంలో కూడా ఎటువంటి సమస్య రాలేదు. 17 ఏప్రిల్ 2019 న, సమస్య పునరావృతం కాకపోవడం వల్ల ప్రాక్టిషనర్ బాలుడిని ఒప్పించి, CC12.1 Adult tonic…TDS  ను ఒక నెల పాటు తరువాత CC17.2 Cleansing అతని రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయంగా ఒక ఏడాది పాటు ఇవ్వడానికి ఒప్పించాడు.

SRHVP  లేని ప్రాక్టీషనర్లు సీనియర్ ప్రాక్టీషనర్‌ను సంప్రదించాలి.

చెవిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ 11602...भारत

48 ఏళ్ల మహిళ చెవుల్లో 4 సంవత్సరాల క్రితం దురద రావడం తో అది ఫంగల్ ఓటిటిస్ ఎక్స్‌టర్నాతో బాధపడుతోందని పరీక్షల ద్వారా తెలిసింది. యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఫంగల్ చెవి చుక్కలతో ఉపశమనం పొందింది. ఇది 2 సంవత్సరాల క్రితం మరల వచ్చినప్పుడు అదే చికిత్స తీసుకుంది. మళ్ళీ 3 వారాల క్రితం దురద ప్రారంభమైంది; ఈసారి ఆమెకు అల్లోపతి ఔషధం మరియు చెవి చుక్కలతో పాక్షిక ఉపశమనం లభించింది.

కాబట్టి ఆమె అల్లోపతి మందులు తీసుకోవడం ఆపివేసింది మరియు 20 జనవరి 2019 న ప్రాక్టిషనర్ ని సందర్శించినప్పుడు, ఈ క్రింది మందును 10 నిమిషాల కొకసారి చొప్పున ఒక్క గంటకి ఇచ్చి తరువాత 6TD గా తీసుకోమన్నారు:

#1. CC5.1 Ear infections  + CC12.1 Adult tonic + CC21.7 Fungus…one dose every 10 minutes for one hour followed by 6TD

మొదటి గంటలో, ఆమెకు దురద రాలేదు మరియు తరువాత రోజు, అది కొంచెంగా వుంది. ఈ ఫలితాలు చూసిన తరువాత  మరుసటి రోజు, ఆమె అల్లోపతి చెవి చుక్కలను కూడా ఆపివేసింది మరియు ప్రాక్టిషనర్ అల్లోపతి చెవి చుక్కల బదులుగా ఈ క్రింది వైబ్రో చుక్కలను ఎక్స్ట్రా ఆలివ్ ఆయిల్ తో తయారుచేసి చెరోక చెవి లోను ఒక చుక్క వేయమన్నారు:

#2. CC5.1 Ear infections + CC21.7 Fungus…TDS in extra virgin olive oil, 1 drop in each ear

నూనెను చెవిలో చుక్కలుగా వేసుకోవడానికి మొదట్లో సంశయించినప్పటికీ, ఆమె దీనిని ప్రయత్నించడానికి అంగీకరించింది. మరుసటి రోజు ఆమె దురద 90% తగ్గినట్లుగా తెలియచేసింది. మూడవ రోజు 23 జనవరి 19 న, దురద పూర్తిగా పోయింది. # 1 మోతాదు TDS కి తగ్గించబడింది. ఫిబ్రవరి 15 న, # 1 మరియు # 2 రెండింటి మోతాదు OD కి తగ్గించబడింది.1 మార్చి 2019 న, ENT వైద్యుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ యొక్క జాడ లేకుండా ఆమె చెవి రంధ్రము ఆరోగ్యంగా ఉందని కనుగొన్నారు. కాబట్టి 2 వారాల తర్వాత # 2 ఆపివేయబడింది మరియు # 1 ని క్రమంగా 3 వారాల వ్యవధిలో OD నుండి OW కి తగ్గించబడింది. ఏప్రిల్ 2019 నాటికి, నొప్పి రాలేదు కాని ఆమె # 1 ని OW గా కొనసాగిస్తుoది.

తుంటి నొప్పి (స్కియాటిక్ పెయిన్) 11603...भारत

10 సంవత్సరాల నుంచి, 68 ఏళ్ల మహిళ తుంటి నొప్పి తో బాధపడుతోంది. ఆమెకు నడుము క్రింద భాగం నుండి కుడి కాలు వెంబడి కుడి చీలమండ వరకు తీవ్రమైన నొప్పి ఉండేది. మొదట్లో 2 నెలలు, ఆమె హోమియోపతి చికిత్స తీసుకుంది, ఇది ఆమెకు కొంచెం ఉపశమనం మాత్రమే ఇచ్చింది. కానీ అల్లోపతి చికిత్స కొన్ని నెలలు తీసుకున్న తరువాత ఆమెకు పూర్తిగా తగ్గింది. కానీ మళ్ళీ 2 నెలల క్రితం నొప్పి తిరిగి వచ్చిoది. ఆమె ప్రాక్టిషనర్ ని కలవడానికి వచ్చినప్పుడు ఆమె సరిగ్గా నడవలేకపోయింది. గత 2 సంవత్సరాలుగా ఆమె అరికాళ్ళ మంట వల్ల కూడా బాధపడింది. ఒక నెల క్రితం, ఆమె అకస్మాత్తుగా చెమటలు పట్టి చాలా బలహీనంగా అయ్యి సాయంత్ర సమయంలో మూర్ఛబోయినప్పుడు వైబ్రియోనిక్స్ అద్భుత ప్రభావాన్ని చూసినందున, వైబ్రియోనిక్స్ చికిత్స తీసుకోవటానికి ఆసక్తి చూపింది. ఆమె భర్త, వైబ్రో సేవలలో ప్రాక్టిషనర్ లకు సహాయం చేస్తూ వైబ్రియోనిక్స్ యొక్క శక్తి తెలిసిన కారణంగా, సమీపంలో నివసించే ప్రాక్టిషనర్ నుండి మందు తీసుకున్నారు. వారు ఆశ్చర్య పోయేవిధంగా, ఆమె నిమిషాల్లో కోలుకుంది, తద్వారా రాత్రి ఆమెను ఆసుపత్రికి తరలించాల్సిన అవసరాన్ని తప్పించింది.

28 సెప్టెంబర్ 2018 న ఈ క్రింది మందులు ఇచ్చారు. #2 ని కొబ్బరి నూనెలో కలిపి నొప్పి ఉన్నచోట రాసుకునేందుకు ఇచ్చారు.

#1. CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.6 Osteoporosis...TDS

#2. CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine...BD in coconut oil for external application

ఒక వారం తరువాత, ఆమె నొప్పి మరియు అరికాలి మంట బాగా తగ్గిందని తెలియచేసారు. మరుసటి వారం, ఆమె సమస్యలు దాదాపు పోయాయి. మరో 2 వారాల తరువాత 30 అక్టోబర్ 2018 న, ఆమె అరికాలి మంట మరియు ఆమె తుంటి నొప్పి నుండి 100% విముక్తి పొందారని తెలియచేసారు. # 1 & # 2 రెండింటి మోతాదు రాబోయే 2 నెలలకు OD కి తగ్గించబడింది, ఇది 27 ఫిబ్రవరి 2019 న ఆపడానికి ముందు మరో 2 నెలల్లో క్రమంగా OW కి తగ్గించబడింది. రోగిని చివరిగా 17 ఏప్రిల్ 2019 న సంప్రదించినప్పుడు, ఆమె ఆ సమస్యలు తిరిగి రాలేదని తెలియచేసారు.

నివారణ చర్యగా వైబ్రియోనిక్స్ నివారణను కొనసాగించమని ప్రాక్టీషనర్ రోగికి సూచించి ఈ క్రింద మందు ఒక నెలకి ఆమెకు ఇచ్చారు:

#3. CC12.1 Adult tonic + CC20.5 Spine + CC20.6 Osteoporosis…TDS for a month

ఆమె తుంటి నొప్పి యొక్క గత చరిత్రను దృష్టిలో పెట్టుకొని ఆమె రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు ఆమె ఎముకలను బలోపేతం చేయడానికి ఒక సంవత్సరం పాటు CC17.2 cleansing ఇచ్చారు. ఆమెకు ప్రతి రోజు సూర్యురశ్మి నుండి విటమిన్ డి పొందడానికి ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య కనీసం అరగంట సేపు ఎండలో వుండాలని ఆమెకు తెలియచేసారు.

చర్మ రోగం (సోరియాసిస్) 11580...India

61 ఏళ్ల మహిళ గత 3 సంవత్సరాలుగా తన చేతులు మరియు కాళ్ళపై నల్ల మచ్చలు కలిగి అవి దురదతో మానని గాయాల వలె ఉన్నాయి. ఇది సోరియాసిస్ అని నిర్ధారించబడింది. ఆమె ఒక సంవత్సరం అల్లోపతి చికిత్స చేయించుకుంది కానీ ఎటువంటి ఫలితం లేకపోవడంతో ఆపివేసింది. ఆమె వేరే ఏ మందులు వేసుకోలేదు.

9 అక్టోబర్ 2016 న, ప్రాక్టిషనర్ ఈ క్రింది మందు ఇచ్చాడు:

#1. CC4.2 Liver & Gallbladder tonic + CC12.4 Autoimmune diseases + CC21.10 Psoriasis + CC21.11 Wounds & Abrasions…TDS 

ఆమె పూర్తి విశ్వాసంతో ఆ మందు వేసుకుంది. ఒక నెలలో, ఆమె ఆశ్చర్యపోయే విధంగా, నల్ల మచ్చలు మరియు దురద దాదాపు 50% తగ్గాయి. తరువాతి రెండు నెలల్లో, చేతులు మరియు కాళ్ళపై ఉన్న నల్ల మచ్చలన్నీ కనుమరుగయ్యాయి మరియు దురద కూడా లేదు. ఆమె స్వస్థత పొందినట్లు అనిపించినప్పటికీ, వెంటనే మందులను తగ్గించడానికి లేదా ఆపడానికి ఆమె ఇష్టపడలేదు.  మోతాదును 9 నెలలకి BD కి తగ్గించినప్పటికి, ఆమె మరో 8 నెలలు TDS గా కొనసాగించింది, తరువాత OD కి 6 నెలలు మరియు చివరిగా 2018 డిసెంబర్‌లో OW కి తగ్గించారు. మoదులను తగ్గించ్చినప్పటకి ఏ దశలోకూడా సమస్య తిరిగి రాలేదు మరియు ఆమె పూర్తిగా నయమైందని భావిస్తుంది.

OW వద్ద # 1 ను కొనసాగిస్తూనే, 25 ఏప్రిల్ 2019 న, ఆమె రోగనిరోధక శక్తిని పెంచేందుకు #2. CC17.2 Cleansing…TDS & #3. CC12.1 Adult tonic…TDS లను ఒక నెల, #2 తరువాత నెల, తరువాత నెల #3 చొప్పున ఒక సంవత్సరం పాటు వాడడానికి ఇవ్వబడింది:

#2. CC17.2 Cleansing…TDS for one month to be alternated with #3. CC12.1 Adult tonic…TDS for one month.

చికిత్సా నిపుణుల వివరాలు 10596...भारत

ప్రాక్టీషనర్ 10596 ... ఇండియా చరిత్రలో గ్రాడ్యుయేట్ మరియు టైలరింగ్‌లో డిప్లొమా తీసుకొని, 5 సంవత్సరాలు పాఠశాల ఉపాధ్యాయురాలిగా, తరువాత స్థానిక కళాశాలలో 18 సంవత్సరాలు పరీక్షా ఇన్విజిలేటర్‌గా పనిచేశారు.1999 లో తన ఇంటికి దగ్గరలో జరిగిన నారాయణ సేవలో పాల్గొన్న తరువాత ఆమె సాయి సన్నిదిలోకి వచ్చింది. అప్పటి నుండి ఆమె సాయి సంస్థ యొక్క అనేక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంన్నారు, ఉదాహరణకి సంవత్సరానికి రెండుసార్లు  ప్రశాంతి సేవ, పాటశాల విద్యార్ధులకి ప్రధమ, ద్వితీయ భాషలను బోధించడం, కుట్టు పని నేర్పడం అలాగే దగ్గరలో వున్న మురికివాడల్లోని మరియు "గ్రామ సేవ" క్రింద దత్తత తీసుకున్న గ్రామాలలోని వయోజన మహిళలకు టైలరింగ్ వంటివి. ఆమె ప్రతివారం జరిగే మొబైల్ క్లినిక్‌లో కూడా సేవలందిస్తోంది.

24 సంవత్సరాల వయస్సులో, తన బాల్యం నుంచి ఔషధ మొక్కల పట్ల వున్న అభిరుచితో ఆమె ఇంట్లో కొన్నింటిని పెంచుకోన్నారు. ఈ మొక్కలను ఉపయోగించి, ఆమె తనకు, తన కుటుంబానికి, పొరుగువారికి మరియు జంతువులకు గత 40 సంవత్సరాలుగా చికిత్స చేస్తోంది. ఉదాహరణకు, జలుబు, దగ్గు మరియు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కోసం ఆమె ఇంట్లో పెరిగిన పిప్లీ తో పల్చని సూప్ తయారుచేసిoది, అలాగే నల్లేరు కాడల పేస్ట్ తో IBS మరియు విరిగిన ఎముకలుకు వైద్యం చేయడానికి మరియు వావిలి ఆకుల ఆవిరి ద్వారా దోమలను పోగోట్టడానికి, ఉబ్బసం నుండి ఉపశమనం పొందటం లాంటివి. ఉడికించిన ఆకుల నుండి ఆవిరితో ఆమె మనవరాలికి వచ్చిన దద్దుర్లతో కూడిన వైరల్ జ్వరాన్ని ఒక రోజులో పోగ్గొటారు. తన పొరుగు వారితో మాట్లాడేటప్పుడు, అలాగే స్థానిక పాఠశాలలు మరియు సమితి సమావేశాలలో మాట్లాడటానికి ఆహ్వానించినప్పుడు ఆమె ఔషధ మొక్కల గుణాలని మరియు తన అనుభవాన్ని సంతోషంగా పంచుకుంటుంది.

ఈమె 2009లో మొబైల్ మెడికల్ వ్యాన్ సేవలో పాల్గొన్నప్పుడు సాయి వైబ్రియోనిక్స్ గురించి తెలుసుకున్నారు. వెంటనే ఆమె తరచుగా శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న తన కొడుకు కోసం సమీపంలోని ప్రాక్టీషనర్‌ దగ్గర అపాయింట్‌మెంట్ తీసుకొంది. వైబ్రియోనిక్స్ చికిత్సతో తన కొడుకు ఆరోగ్యం త్వరగా మెరుగుపడినప్పుడు ఆమె ఆశ్చర్యపోయి చాలా ఆనందపడింది. వెంటనే ఆమె కోర్సులో పేరు నమోదు చేయించుకుంది. ఏప్రిల్ 2009 లో, ముంబైలోని ధర్మక్షేత్రంలో మొదటి వైబ్రియోనిక్స్ శిక్షణాశిబిరం నిర్వహించినప్పుడు, ఆమె AVPగా అర్హత సాధించింది. తరువాత ఆమె 2013 లో VP అయ్యారు.

ఆమె వైబ్రియనిక్స్ చికిత్స తనకున్న కాలి నరాలు ఉబ్బిపోయే వ్యాది(వేరికోజ్ వీన్స్)కి సంబందించిన చికిత్శ ద్వారా ప్రారంభించింది. ప్రతీ నెల ఒకసారి ఆమె సమీపంలోని వృద్ధాశ్రమంలో వున్న పెద్దవారికి సేవ చేయడానికి వెళ్ళుతుంటారు. ప్రాక్టీషనర్ అయిన తరువాత, ఆమె CC3.1 Heart tonic + CC4.1 Digestion tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC12.1 Adult tonic + CC13.1 Kidney & Bladder tonic…TDS అక్కడ వున్న పెద్దవారికి ఇవ్వడం ప్రారంభించింది. వాటివల్ల వారిని ఉల్లాసంగా మరియు ప్రశాంతంగా చేశాయి. వృద్ధాశ్రమంలో నీరు మరియు ఆహారం కలుషితం కావడం వల్ల వచ్చే వ్యాధులను నివారించడానికి కూడా ఇది సహాయపడింది.

ఆమె, మరో ముగ్గురు AVPలతో పాటు, వారం విడిచి వారం ప్రతి గురువారం మరియు శనివారం దగ్గరలో వున్న రెండు దేవాలయాలలో రోగులకు చికిత్స చేస్తున్నారు. ఇద్దరు సహాయకులు సీసాలకు లేబుల్ అతికించడం మరియు సీసాలను చక్కెర మాత్రలతో నింపడము లాంటి సహాయం చేస్తున్నారు. ఆమె ఇప్పటివరకు 11000 మందికి పైగా రోగులకు రోగనివారణ చేయగలిగారు. ఆమె దీర్గకాల వ్యాధులైనటువంటి కాలి సిరలు ఉబ్బడం, ఉబ్బసం, మోకాలి నొప్పులు (ఆర్థరైటిస్), అలాగే దద్దుర్లు, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు విజయవంతంగా చికిత్స చేసారు. ముఖ్యంగా, ముంబైలో అధిక ఒత్తిడితో కూడిన జీవనశైలి కారణంగా ఆమె అనేక నిద్ర సంబందిత రుగ్మతలను పోగొట్టడంలో గొప్ప విజయాన్ని సాధించింది.

సమిష్టిగా ప్రాక్టీస్ చేయడం ద్వారా చాలా ఆనందం మరియు నేర్చుకోవడానికి చాలా సహాయపడుతోందని మరియు అంతర్గతంగా, బాహ్యంగా అందరు ఒకటే అనే భావాన్ని పెంచిందని ఆమె చెప్పారు. సేవ చేయడానికి ఇచ్చిన ఈ సువర్ణావకాశానికి ఆమె స్వామికి చాలా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు. రోగులు వారి రోగం నయం అయినప్పుడు వారి సంతోషకరమైన ముఖాన్ని చూడటం ఆమెకు ఎంతో సంతృప్తిని ఇస్తుంది.

క్రమం తప్పకుండా న్యూస్ లెటర్స్ లోని సమాచారం ద్వారా తనను తానుగా విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఆమె కుటుంబ భాధ్యతల కారణంగా గత 3 సంవత్సరాలుగా పుట్టపర్తికి వెళ్లలేకపోయింది. కానీ, ముంబైలో నిర్వహించే రిఫ్రెషర్ సెమినార్‌లకు హాజరయ్యే అవకాశాన్ని ఆమె వదులుకోదు. సంవత్సరంలో నెల విడిచి నెల జరిగే సమావేశాలలో ఇటీవల నిర్వహించిన ఒకరోజు రిఫ్రెషర్ సమావేశం నుండి CC12.1 Adult tonic and CC17.2 Cleansing ద్వారా వ్యాధులను నివారించవచ్చని నేర్చుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె తనతో సహా తన రోగులకు ఈ కాంబోలను సూచించడం మరియు ఇవ్వడం ప్రారంభించింది.

వైబ్రియోనిక్స్ సాధన చేయడం ద్వారా ఆమె రోజువారీ సమస్యలను ఇబ్బంది లేకుండా ఎదుర్కోనే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది. ఈ సాధన ద్వారా దైవత్వానికి దారితీసే స్వచ్ఛతను సాధించవచ్చని ఆమె నమ్మకంగా ఉంది. ముంబై వంటి అధిక జనాభా వున్న పెద్ద నగరాల్లో నివసించే వారు వైబ్రియోనిక్స్ కోర్సు చేసి ప్రాక్టీషనర్స్ గా మారి తమ మంచి కోసం, తమ కుటుంబం, పొరుగువారు, స్నేహితులు మరియు సమాజాన్ని చూసుకోవాలని ఆమె భావిస్తోంది! వైబ్రియోనిక్స్ తన స్వీయ-పరివర్తనకు సహాయపడిందని,  తన కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చిందని ఆమె చాలా కృతజ్ఞతలు తెలిపింది.

పంచుకున్న కేసుల వివరాలు:

 

చికిత్సా నిపుణుల వివరాలు 02836...भारत

ప్రాక్టీషనర్ 02836… ఇండియా అగ్రికల్చరల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్, 2007 లో మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో పార్క్స్ అండ్ గార్డెన్స్ విభాగానికి సీనియర్ అధికారిగా పదవీ విరమణ చేశారు. అతను ప్రకృతి పట్ల ఆసక్తి వల్ల మరియు  తన తాత నుండి ప్రకృతి వైద్యం నేర్చుకున్నారు. ఆయన ప్రభుత్వ సర్వీస్ లో వుండగా తన స్నేహితుడి నుండి హోమియోపతి యొక్క ప్రాథమిక అంశాలను నేర్చుకున్నాడు తరువాత దానిమీద ఇష్టంతో తన కుటుంబం, స్నేహితులు మరియు ఆఫీసులోని సహచరులకు మందులు ఇస్తుండేవారు. 1980  ప్రారంభంలో స్వామి సన్నిధిలోకి వచ్చిన తరువాత, అయన సాయి సంస్థ యొక్క వివిధ ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభించారు. 2009 లో తన నివాసంలో గురువారం జరిగిన భజన సమయంలో, ముంబైలో వైబ్రియోనిక్స్ వర్కషాప్ జరుగుతున్నట్లు ఆయనకు తెలిసింది. వెంటనే, ఆయన , ఆయన భార్య ఇద్దరూ వర్క్ షాప్‌లో చేరారు, మే 2009 లో AVP మరియు 2011 జనవరిలో VP అయ్యారు. తరువాత, అక్టోబర్ 2011 లో ఆయన ప్రశాంతి నిలయంలో SVP కోర్సును పూర్తి చేశాడు.

పూర్తి విశ్వాసంతో, ఆయన గత 10 సంవత్సరాలగా తన నివాసంలో 4000 మందికి పైగా రోగులకు చికిత్స చేశారు. ఆయన విజయవంతంగా చేసిన చికిత్సలలో రక్త కాన్సర్ (లుకేమియా), గుండె మరియు జీర్ణ రుగ్మతలు, చెవ్వులలో గుయ్‌మనడం (టిన్నిటస్), థైరాయిడ్ గ్రంథి తక్కువగా పని చేయుట వలన కలుగు స్థూలకాయత (హైపోథైరాయిడిజం), జుట్టు రాలడం, తలనొప్పి, నోటి పూతలు, మూత్రపిండాల్లో రాళ్ళు, మానసిక రుగ్మతలు, కీళ్ల నొప్పులు మరియు చర్మ వ్యాధులు ఉన్నాయి. మాట పోయిన 5 కేసులతో ఆయన విజయం సాధించారు; ఒక కేసు ‘కేస్ హిస్టరీస్’ క్రింద ఇవ్వబడింది.

దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నరోగులకు శీఘ్ర ఉపశమనం కలిగించడానికి, అతను విశ్లేషణల కోసం లేదా కారణాల కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా, రోగ లక్షణాల ఆధారంగా మాత్రమే నివారణలను మందులు ఇచ్చేవారు. ఈ విధానంతో, 1 లేదా 2 వారాల తరువాత జరిగే తన మొదటి సమీక్షలో చాలా మంది రోగులు మెరుగవుతున్నారని, తద్వారా ఆయనపై మరియు వైబ్రియోనిక్స్ పై విశ్వాసం పెంపొందించడానికి సహాయపడుతోంది. పురోగతి నెమ్మదిగా ఉందని అతను కనుగొన్న సందర్భాలలో, రోగ కారణాన్ని గుర్తించి ఆయన రోగ నివారణకై 108 సిసి బాక్స్ లేదా SRHVP ని ఉపయోగిస్తూ తగిన మందు తయారుచేయడం సముచితంగా భావిస్తారు.

ఆయన ఉద్దేశ్యప్రకారం, ఆధునిక జీవనశైలిని అధిక ఒత్తిడులతో పాటు వాతావరణంలో కాలుష్యం మరియు రేడియేషన్ లను పరిగణనలోకి తీసుకోని ప్రతి రోగికి ముందుగా మనస్సును శాంతింపచేయడానికి మరియు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కాంబో ఇవ్వాలి. ఆయన అనుభవంలో, CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC18.1 Brain disabilities కలపి ఇవ్వడం ద్వారా చాలామందికి త్వరిత నివారణ మరియు మరింత ఆరోగ్యవంతులు కావడానికి సహాయపడ్డాయి.

అనేక వ్యాధులకు సంబందించి తయారుచేసిన 108CC (సాధారణ కాంబో)తో చాలా సంతోషపడ్డారు. వైబ్రియోనిక్స్ యొక్క అద్భుత ప్రభావాన్ని మరియు మొక్కలు, జంతువులు మరియు మానవులు అవసరమైన ప్రకంపనలను తీసుకొని నయం పొందుతున్న అద్భుతాలని చూశారు. రోగులకు చికిత్స చేయడానికి ముఖ్యంగా ఖరీదైన వైద్య చికిత్సను చేయించుకోలేని నిరుపేదలకి వైద్యం చేసేందుకు తనకు ప్రత్యేకమైన అవకాశం ఇచ్చిన ఆ దేవునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేసుకున్నారు.

పంచుకున్న కేసుల వివరాలు :

ప్రశ్నలు జవాబులు

ప్రశ్న 1: గర్భధారణ సమయంలో ఇచ్చిన ఏదైనా మందు పురిటి సమయంలో సహాయపడిందా? మరియు / లేదా అనూహ్యమైన  తెలివితేటలు లేదా ఆధ్యాత్మిక కల్గి వున్న పిల్లల పుట్టుక జరిగిందా?

సమాధానం: గర్భధారణ సమయంలో వైబ్రో నివారణలు తీసుకున్న తల్లులకు సులభంగా పురుడు జరిగిందని, ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చిచారని ప్రాక్టీషనర్లు తెలియచేసారు. గర్భస్రావం, చనిపోయి పుట్టిన పిల్లలు, కష్టమైన పురుడు లేదా చేతబడి లాంటి చరిత్ర ఉన్న మహిళల కేసులలో ఒక సమస్య వచ్చినప్పుడు నిరోధించిన సందర్బాలున్నాయి. ఒక సందర్భంలో, 3 వారాల అల్ట్రా సౌండ్ స్కాన్ల సమయంలో గర్భాశయంలో ఒక మూత్రపిండము కనిపిచ్చలేదు. 3 నెలలు వైబ్రో తీసుకున్న తరువాత, స్కాన్లో  ఆరోగ్యకరమైన మూత్రపిండాన్ని చూపించింది. తరువాత సరైన సమయానికి ప్రసవం జరిగి బలమైన మరియు ఆరోగ్యకరమైన శిశువు జన్మించారు. (న్యూస్ లెటర్  vol 8 issue 1, జనవరి /ఫిబ్రవరి 2017, కేస్  #1).

ఇక తెలివైన / ఆధ్యాత్మిక శిశువు పుట్టుకకు సంబంధించి తెలియజేసే ఎటువంటి అధ్యయనం జరగలేదు. ప్రెగ్నెన్సీ టానిక్ తల్లి యొక్క రోగనిరోధక శక్తిని పెంచదానికి, ప్రశాంతతను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతంగా వున్న తల్లి గర్భంలో ఉన్న పిల్లలపై అనుకూలంగా ప్రభావం చూపిస్తుంది. గర్భధారణ సమయంలో వైబ్రియోనిక్స్ తీసుకునే తల్లులకు పుట్టిన పిల్లలు ముఖ్యంగా మంచి స్వభావం కలవారు, అలాగే మామూలు పిల్లల కన్నా ఎక్కువ తెలివైనవారని చాలా మంది ప్రాక్టీషనర్స్ తెలియచేసారు. వైబ్రియోనిక్స్ చికిత్స చేయించుకునేవారి సంఖ్య పెరిగేకొద్దీ మరిన్ని కేసులు తెరపైకి వస్తాయని, అలాగే కొంతమంది ప్రాక్టీషనర్స్ వైబ్రియోనిక్స్ యొక్క సామర్థ్యాన్ని తెలియజేసే పరిశోధనలు చేస్తారని ఆశిస్తున్నాము.

________________________________________

ప్రశ్న 2: వైద్య శిబిరాలు నిర్వహించే సమయంలో చాలా మంది రోగులకు చికిత్స చేయడం ఇది సంతోషకరమైన అనుభూతిని ఇస్తుంది, కాని అనుగమనం (ఫాలో అప్) చేయడం కష్టం. అటువంటివారిని చూడడానికి ఉత్తమ మార్గం ఏమిటి?

సమాధానం: ఎక్కువ మంది వచ్చే, స్వామి పుట్టినరోజు, సమాధి రోజు మరియు గురు పూర్ణిమ వంటి సందర్భాలలో ఒక్కసారి మాత్రమే వుండే  వైద్య శిభిరాలు అనువైనవి కావచ్చు. ప్రాక్టిషనర్ యొక్క వివరాలతో కూడిన కాగితపు స్లిప్స్ అందుబాటులో పెట్టుకొని వారికి ఇవ్వవలెను. అంటువ్యాధులు, కాలానుగుణ వ్యాధి వ్యాప్తి, ప్రకృతి వైపరీత్యాలు లేదా యుద్ధం వంటి అత్యవసర పరిస్థితులలో కూడా ఇటువంటి శిబిరాలు అనుకూలంగా ఉంటాయి. తరచు పెట్టుకొనే వైద్య శిబిరాల కోసం, ప్రాక్టిషనర్స్ బృందంగా ఉండి, క్రమం తప్పకుండా ప్రతి వారం లేదా పక్షం రోజులు లేదా కనీసం నెలకు ఒకసారి వైద్యం చేయడానికి మరియు కేసుల పురోగతి కొరకు ఒక అనువైన స్థలాన్ని ఎంచుకోవాలి.

________________________________________

ప్రశ్న 3: నిద్రలేమికి చేసే చికిత్స, నిద్రలో నడిచేదానికి కూడా చేయవచ్చా?

సమాధానం: అవును, మీరు అదే మందు ఇవ్వవచ్చు, కాని రాత్రి పడుకునే ముందు ప్రతి 10 నిమిషాలకు ఒక మోతాదు చప్పున కేసు యొక్క తీవ్రతను బట్టి గరిష్టంగా 6 మోతాదు వరకు ఇవ్వండి. ఇది ఫలితాన్ని చూపకపోతే, CC15.1 Mental & Emotional tonic లేదా SM6 Stress + SM39 Tension కూడా ఉదయం లేచినప్పుడు ఇవ్వండి; ఎందుకంటీ దానికి కారణమైన అంతర్గతంగా వుండి పోయిన పని ఒత్తిడి (ఉదా, పాఠశాల లేదా కార్యాలయంలో) తగ్గించడానికి సహాయపడుతుంది. ఏదైనా నిర్దిష్టమైన  కారణం (ఉదా, భయం లేదా షాక్) తెలిస్తే, దానికి చికిత్స చేయండి.

________________________________________

ప్రశ్న 4: పెద్దలు మరియు పిల్లలకు ఆల్ మియామ్స్ రెమెడీ ఇచ్చే విధానాన్ని తెలియచేయగలరా?

సమాధానం  : పెద్దలకు (యుక్తవయస్సు కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు): SR560 ALL Miasms  ఎల్లప్పుడూ 30C & 1M… OW యొక్క రెండు పోటెంసీస్ వద్ద ఇవ్వబడతాయి. ఏ మోతాదు తర్వాతైనా పుల్లౌట్ ఉంటే, పుల్లౌట్ తగ్గడానికి ఒక వారం వేచి ఉండి తరువాత వారం మోతాదుని ఇవ్వండి. వరుసగా రెండు మోతాదుల తర్వాత కూడా శరీరంలో పుల్లౌట్ తగ్గేంత వరకు దీనిని  కొనసాగించండి. SRHVP ని ఉపయోగించి నేరుగా నీటిలో రెమెడీ తయారుచేయడం మంచిది. SR560 All Miasms తో సహా ఏదైనా Miasm ఇచ్చే ముందు, అన్ని నిద్రాణమైన miasm లను చైతన్యం చేయడానికి SR218 Base Chakra…OD ని 3 నుండి 7 రోజులవరకు రోజు రాత్రి ఇవ్వడం మంచిది; పుల్లౌట్ వుండకపోవచ్చు. 3 రోజులు వేచి ఉండి, తరువాత Miasm ఇవ్వండి.

శిశువులకు (1 నుండి 12 నెలల వయస్సు): మొదట వారి శారీరక పెరుగుదలను మెరుగుపరచడంలో సహాయపడటానికి SR218 Base Chakra ఒక మోతాదు ఇవ్వండి. నాలుకపై స్వచ్ఛమైన (ఉదా, ఉడికించిన మరియు చల్లబడిన) నీటితో తయారు చేసిన మందుని 1-2 చుక్కలు వేస్తే సరిపోతుంది. ఈ మోతాదు ఇచ్చిన ఒక నెల తర్వాత, శిశువు ఆరోగ్యంగా ఉంటే, SR252 Tub-Bac 200C ఒక మోతాదు ఇవ్వండి. కనీసం 2 నెలలు వేచి ఉండి, శిశువుకు ఇప్పుడు 12 నెలల వయస్సు ఉంటే, SR560 All Miasms ఒక మోతాదు ఇవ్వండి. నెలలోపు వయసున్న పిల్లలకు ఏమీ ఇవ్వకూడదు.

1 సంవత్సరం నుండి యుక్తవయస్సు పిల్లలకు: SR218 Base Chakra యొక్క మోతాదుతో ప్రారంభించండి. ఒక నెల తరువాత, SR252 Tub-Bac 200C యొక్క మోతాదు ఇవ్వండి, మరో 2 నెలల తరువాత SR560 All Miasms యొక్క మోతాదు ఇవ్వండి.

________________________________________

ప్రశ్న 5: మనం మొట్ట మొదటే నోసోడ్ ఇవ్వగలమా లేదా మొదట 108 CC బాక్స్ నుండి కాంబోస్‌తో, తరువాత SRHVP తో, ఆపై నోసోడ్‌తో చికిత్స చేయాలా?

సమాధానం: సాధారణంగా, అనారోగ్యానికి తగిన కార్డు లేనప్పుడు లేదా అనేక కార్డులు ప్రయత్నించినప్పటికి ఎటువంటి ఫలితం లేకపోతే మాత్రమే నోసోడ్ సిఫార్సు చేయబడింది. కొన్ని సందర్భాల్లో, మొదటే నోసోడ్ ఇవ్వవచ్చు ఉదాహరణకి రక్త కాన్సర్ (లుకేమియా) విషయంలో బ్లడ్ నోసోడ్ మరియు అలెర్జీ కి  తెలిసిన అలెర్జీ యొక్క నోసోడ్ లాంటివి. అయినప్పటికీ, కొంతమంది ప్రాక్టిషనర్స్ చెస్ట్ ఇన్ఫెక్షన్ కొరకు కఫం యొక్క నోసోడ్, రాలే జుట్టు కొరకు జుట్టు యొక్క నోసోడ్, నోటి పూతల కొరకు లాలాజలం యొక్క నోసోడ్, IBS కోసం మలం యొక్క నోసోడ్ చికిత్స చేయడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందారు.

దివ్య వైద్యుని దివ్య వాణి

“సరైన ఆహార అలవాట్లు మరియు మానసికానందం కోసం ఎంచుకునే అవివేక మార్గాల వల్ల అనారోగ్యం కలుగుతుందని వైద్యులు అంగీకరిస్తున్నారు. కానీ, ఆహారం అనే పదం అనేక రకాలైన ‘తీసుకోవడం’ ను సూచిస్తుందని వారికి తెలియదు. ఇంద్రియాలలో దేని దాని ద్వారానైనా తీసుకునే  ‘ఆహారం’వలన వచ్చే ప్రతి అనుభవం వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. మేము “ఆలోచనకు ఆహారం” అని చెప్తాము; మనం ఏదైతే చూస్తామో , వింటామో , వాసన చూస్తామో లేదా స్పర్శిస్తామో అది శరీరంపై మంచి లేదా  చెడు ప్రభావాన్ని చూపుతుంది;. రక్తం చూడటం వల్ల కొంతమంది మూర్ఛ పోతారు; లేదా, కొన్ని చెడు వార్తల వినడం వల్ల షాక్‌కి గురి అవుతారు. వాసనలు పడకపోవడం ద్వారా లేదా మనసుకి నచ్చని దాన్ని తాకినప్పుడు లేదా రుచి చూసినప్పుడు అలెర్జీ  రావచ్చు. ఆనందంగా వున్న మనస్సు ఆరోగ్యకరమైన  శరీరాన్ని; ఆరోగ్యకరమైన శరీరం ఆనందకరమైన మనస్సును వుంచుతాయి. రెండు ఒకదానిమీద నొకటి ఆధారపడి ఉంటాయి. ఆనందం కోసం ఆరోగ్యం అవసరం; సంతోషంగా వుండడానికి ఆనందం అనేది ఒక సామర్థ్యం, ​​ఏదైమైనప్పటికి అది శారీరక ఆరోగ్యానికి అవసరం కూడా.”

...సత్య సాయి బాబా “వెహికిల్ కేర్” దివ్య ప్రవచనం,16 అక్టోబర్ 1974 
http://www.sssbpt.info/ssspeaks/volume12/sss12-48.pdf

 

“సృష్టిలోని జీవులందరూ పరస్పర సేవ చేసుకోవడం ద్వారా జీవిస్తున్నారు మరియు ఎవ్వరూ మరొకరి కంటే ఉన్నతంగా పరిగణించలేము. ప్రతి వ్యక్తి తన సామర్థ్యం మరియు అతని కార్యకలాపాల రంగానికి అనుగుణంగా సేవలను అందించాలి. మానవ శరీరంలో వివిధ అవయవాలు ఉన్నాయి. కానీ చేతులు, కాళ్ళు చేయగలిగే పని చేయలేవు, కళ్ళు, చెవుల విధులను నిర్వర్తించలేవు. చెవులు ఆనందం పొందగల్గినట్లు  కళ్ళు పొందలేవు. అదేవిధంగా, మానవులలో తేడాలు ఉన్నాయి. వారి సామర్థ్యాలు మరియు యోగ్యతలలో తేడాలుండవచ్చు. కానీ ప్రతి ఒక్కరూ వారి శక్తి మరియు సామద్ద్యానికి అనుగుణంగా సేవా కార్యకలాపాల్లో పాల్గొనాలి.”

…సత్యా సాయి బాబా, “బోర్న్ టు సర్వ్” దివ్య ప్రవచనం, 19 నవంబర్ 1987
http://www.sssbpt.info/ssspeaks/volume20/sss20-26.pdf

ప్రకటనలు

రాబోయే శిక్షణాశిబిరాలు

  • ఇండియా జలగావ్, మహారాష్ట్ర: AVP Refresher శిక్షణాశిబిరం 22-23 జూన్ 2019, నారాయణ బి కులకర్ణి గార్ని +91 9404490768 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
  • ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణాశిబిరం 17-22 జూలై 2019, లలిత గార్ని [email protected]  ద్వారా లేదా ఫోన్ 8500-676 092 ద్వారా సంప్రదించవచ్చు.
  • ఇండియా పుట్టపర్తి: SVP Refresher శిక్షణాశిబిరం 24-25 జూలై 2019, హెమ్ గార్ని [email protected]  ద్వారా సంప్రదించవచ్చు.
  • ఫ్రాన్స్ అలేస్ - గార్డ్: SVP శిక్షణాశిబిరం 20-24 అక్టోబర్ 2019, డేనియల్ గార్ని [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
  • ఫ్రాన్స్ అలేస్ - గార్డ్: AVP శిక్షణాశిబిరం మరియు రిఫ్రెషర్ సెమినార్ 26-28 అక్టోబర్ 2019, డేనియల్ గార్ని [email protected] ద్వారా సంప్రదించవచ్చు.
  • ఇండియా పుట్టపర్తి: AVP శిక్షణాశిబిరం 17-22 నవంబర్ 2019, లలితగార్ని [email protected]  ద్వారా లేదా ఫోన్ 8500-676 092 ద్వారా సంప్రదించవచ్చు,
  • ఇండియా పుట్టపర్తి: SVP Refresher శిక్షణాశిబిరం 24-28 నవంబర్ 2019, హెమ్ గార్ని [email protected]  ద్వారా సంప్రదించవచ్చు.

అదనంగా

1. పూర్తి ఆరోగ్యం మరియు ఆనందం కోసం తాజా పండ్లతో జీవితాన్ని ఆస్వాదించండి  

“శరీర సంరక్షణ కోసం మీకు అన్నిరకముల ప్రోటీన్లు మరియు విటమిన్లు అవసరంపండ్లు  మరియు కూరగాయలు తీసుకోండి, ఇవి మీకు ఎంత బలాన్ని ఇస్తాయి”శ్రీ సత్య సాయి బాబా .1

1. ఫలం అంటే ఏమిటి ?

తల్లి భూమి నుండి వచ్చిన విలువైన బహుమతులలో ఒకటి, ఒక చెట్టు లేదా మొక్క యొక్క కండగల్గి విత్తనములను కలిగి ఉన్న తినదగిన పదార్ధం. ఒక పండు యొక్క ప్రాధమిక ఉద్దేశ్యం విత్తనాన్ని రక్షించి నలువైపుల వ్యాప్తి చేయడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటం. దయతో, మానవుల ఆకలి మరియు దాహాన్ని తీర్చి ప్రకృతికి అనుగుణంగా జీవించడానికి వీలు కల్పిస్తుంది .2-4

పండ్లు సాధారణంగా తీపి లేదా పుల్లగా ఉంటాయి మరియు పచ్చిగా తినవచ్చు. మనకి తెలిసున్నవి: అరటి, మామిడి, సపోటా, బొప్పాయి, ఆపిల్, పియర్, జామ, దానిమ్మ, పుచ్చకాయ, ద్రాక్ష, పైనాపిల్, నారింజ, ద్రాక్షపండు, పీచ్, ప్లం, చెర్రీ, కివి, అత్తి, నేరేడు పండు మరియు బెర్రీలు. దోసకాయ, టమోటా, మిరియాలు, గుమ్మడికాయ, వంకాయ వంటి ప్రసిద్ధ కూరగాయలు కూడా పండ్లు అని సైన్స్ చెబుతుంది; చిక్కుళ్ళు , కొన్ని సుగంధ ద్రవ్యాలు మరియు తృణధాన్యాలు కూడా సన్నని పండ్ల గోడతో విత్తనాలు. గింజలు కూడా కఠినమైన పెంకులతో కూడిన పండ్లు. 1893లో, యుఎస్ సుప్రీంకోర్టు పండ్లు మరియు కూరగాయల మధ్య చర్చను ప్రజలు  భావించిన విధoగా టమోటాను కూరగాయగా ప్రకటించడం ద్వారా దానిని పండు లేదా డిజర్ట్ (బోజనమ్ తరువాత తినేది) గా కాకుండా  కూరగాయగా కలిగి ఉన్నారు. 5-7

2. పండ్లవల్ల ఉపయోగాలు
సాధ్యమైనంత వరకు మన ఆహారంలో నీటి పరిమాణం మన శరీరంలోని నీటి పరిమాణం కంటే ఎక్కువ కల్గి ఉండాలి. పండ్లు 90% నీరు కల్గి శరీరాన్ని పొడిబారకుండా శక్తివంతంగా ఉంచుతాయి. పురాతన భారతీయ గ్రంథాల ఆధారంగా జరిగిన అధ్యయనం ప్రకారం పండ్ల తినడం ద్వారా నీటిని తీసుకోవడం ఉత్తమం అని సూచిస్తోంది. మరియు మన ఆహారంలో 30% స్థానికంగా పండించిన కాలానుగుణ్ణంగా ఉండే తాజా పండ్లు తీసుకుంటే అనారోగ్యానికి గురికారు. 8-9

ప్రతి పండు స్వయంగా దానికదే సంపూర్ణమైన ఆహారం మరియు చాలా పోషకమైనది, సులభంగా జీర్ణమయ్యేది కావడం ద్వారా మన శరీర వ్యవస్థపై ఒత్తిడి చేయదు. దీనిలో కేలరీలు తక్కువగాను మరియు ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ అధికంగాను ఉంటాయి. మన రోజువారీ ప్రోటీన్ అవసరాలలో 10% కూడా తీర్చగలదు.5,8,9,10

ముఖ్యమైన అవయవాలను ఆరోగ్యవంతంగా ఉంచడం మరియు డయాబెటిస్, గుండె జబ్బులు, జీర్ణ రుగ్మతలు, ప్రోస్టేట్ పెరుగుదల, మూత్రపిండాల్లో రాళ్ళు మరియు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించడం వల్ల అన్ని పండ్లు ప్రయోజనకరంగా ఉంటాయి. అవి హార్మోన్లను సమతుల్యం చేస్తాయి, వయస్సుతోపాటు జరిగే ఎముకల నష్టాన్ని తగ్గిస్తాయి, రక్తపోటును నియంత్రిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ప్రతి పండుకు ప్రత్యేక గుణాలు ఉన్నాయి. అందువల్ల, స్థానిక మార్కెట్లో లభించే ఘనీభవించిన, నిలువ ఉంచిన లేదా ప్రాసెస్ చేసినవి కాకుండా దొరికే వివిధ రకాల తాజా పండ్ల కొనుకోవడం మంచిది. ప్రతి కాలం (సీజన్‌)తో వచ్చే రోగాలను నివారించడానికి ఆ కాలంలో దొరికే పండ్లు సహాయపడతాయి. మనం ఉండే ప్రాంతంలో మనకి ఆయా కాలాలలో కావలసిన పండ్లు మనకు దొరుకుతాయని తెలుసు, అంటే, ఆ సమయంలో తినడానికి ఉత్తమమైనవి అని. ఉదా. వేడి వాతావరణంలో పుచ్చకాయలు మరియు మామిడిపండ్లు లాంటివి. పండ్ల రసానికి బదులుగా, సాధ్యమైనంతవరకు, గింజలను మరియు తొక్కలను తీయకుండా పండ్లను వాటి సహజ రూపంలో తీసుకుంటే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయి. 5,9,11

చక్కర వ్యాదితో బాధపడే రోగులు చక్కెర స్థాయిని సమస్థాయిలో వుంచడానికి, ఆయాకాలాలలో లభించే పండ్లను పండ్ల రసంగా కాకుండా పండుగానే తీసుకోవడం ద్వారా ప్రయోజనం పొందవచ్చును. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఉన్న పండ్లు సురక్షితమైనవి. జామకాయ, లేదా నల్ల నేరేడు పండ్లు మరియు స్ట్రాబెర్రీలలో డయాబెటిస్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార మార్గదర్శకాలను పాటించడం మంచిది. 12-15

ప్లానెట్ ఫ్రెండ్లీ: పచ్చిగా వండకుండా తినడం ద్వారా మనము కార్బన్ మోతాదును తగ్గించి పర్యావరణానికి సహాయం చేస్తున్నాము. పండ్లు చెట్ల నుండి వస్తాయి గాని దున్నుతున్న భూమి మరియు పంట నుండి కాదు, పర్యావరణపరంగా ఇది ప్రపంచానికి చాలా  తేడాను కలిగిస్తుంది. అందువలన, పండ్లు తినడం ద్వారా, మనము భూమికి కూడా సేవ చేస్తున్నాము! 10,16

3. ఎప్పుడు మరియు ఎలా పండ్లను తీసుకోవడం?

పండ్లను శుబ్రపరచడం: పండ్లను బాగా కడిగి, వాటిని గిన్నెలో సగం నింపిన నీటిలో ఒక చెంచా ఉప్పు మరియు రెండు చెంచాల వెనిగర్ కలిపి ఆ నీటిలో ఈ పండ్లను వుంచండి. వాటిని 20 నిమిషాలు నానబెట్టి తరువాత కుళ్ళాయి నీటిలో మళ్ళీ బాగా కడగాలి. లేదా దీనికి ప్రత్యామ్నాయంగా, ఒక చుక్క CC17.2 Cleansing లేదా NM72 Cleansing ని మంచినీటిలో కలిపి కూడా పండ్లను నానబెట్టవచ్చు. 17

పండ్ల పై తొక్కలు సహజంగా పండ్ల లోపల ఉండే యాంటీఆక్సిడెంట్ విటమిన్లను కాపాడుతాయి. పండ్లు కోసిన తర్వాత, వాటిని వెంటనే లేదా 30 నిమిషాల లోపు తినాలి. ఒకవేళ వెంటనే తినలేకపోతే, వెంటనే వాటిని రిఫ్రెజిరెట్ లో వుంచండి; లేకపోతే వాటిలో విటమిన్లు ఆక్సీకరణం చెంది ఎందుకు ఉపయోగం లేకుండా పోతాయి. 18

పండ్లకి సరైన సమయం: పర కడుపుతో పండ్లను తినండి, తద్వారా శరీరం వాటిలోని పోషక పదార్ధాలని సులభంగా గ్రహిస్తుంది మరియు వ్యవస్థలోని విషఫలితాలను (టాక్సీడ్స్) సులభంగా తొలగిస్తుంది. రోజును ప్రారంభించడానికి పండుని మించింది ఏమీ లేదు! 19-22

పండ్లు వాటిని జీర్ణం చేయడానికి కడుపు యొక్క ఆమ్ల మాధ్యమం అవసరం లేదు; అవి నేరుగా కడుపు గుండా పేగుకు వెళతాయి. అందువల్ల రుచికొరకు ఎటువంటివి కలపకుండా సహజమైన పండ్లను ఒక్కొక్కటిగా తినాలి. మామూలుగా భోజనానికి కనీసం 30 నిమిషాల నుండి ఒక గంట ముందు పండ్లు తినండి; కానీ ఖచ్చితంగా భోజనం తిన్న వెంటనే కాదు .19,20

మనము మొదటి ముద్ధను నోటిలోకి పెట్టినప్పుడే జీర్ణ ప్రక్రియ మొదలవుతుంది; అధి భోజనం ముగించే వరకు వేచి ఉండదు. పండ్లు మరియు కూరగాయలు మినహా, సాధారణంగా, శాఖాహార ఆహారం చిన్న ప్రేగులోకి వెళ్ళే ముందు, కడుపులో జీర్ణం కావడానికి రెండు నుండి రెండున్నర గంటలు పడుతుంది. కాబట్టి, భోజనం తిన్న తరువాత అల్పాహారం గా పండ్లు తిన్నడానికి కనీసం 2 గంటలు వ్యవద్ది ఉండాలి; లేకపోతే, పండ్లు శరీరంలో పీల్చుకోబడటానికి బదులుగా శరీరంలో పులిసిపోవును. 19-22

ఒక అధ్యయనం ప్రకారం, పుల్లటి పండ్లను పగటిపూట ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో తీసుకోవడం మంచిది, ఖాళీ కడుపుతో కాదు. అరటి, మామిడి వంటి తీపి పండ్లు నిద్రపోయే ముందు తినడం మంచిది కాదు  ఎందుకంటే అవి శక్తి స్థాయిని పెంచి వారిని మేల్కొని ఉండేటట్లు చేస్తాయి.19,22

సామాన్యంగా తీసుకోవలసిన పండ్ల పరిణామం: రోజువారీ ఆహారంలో కూరగాయలు మరియు తృణధాన్యాలు ఉంటే, రోజుకు 2 పండ్లు సరిపోతాయి; ప్రతిసారీ 150 గ్రాములు, అనగా ఆపిల్, పియర్, నారింజ లేదా అరటి వంటి ఒక మీడియం సైజు పండు లేదా ఒక కప్పు నిండా ముక్కలుగా చేసిన పండ్లు సరిపోతాయి. పండ్లతో ఉపవాసంలో ఉంటే, సాధారణ ఆహారానికి బదులుగా పగటిపూట మూడుసార్లు పండ్లను తీసుకోవాలి. గుర్తుపెట్టుకోవలసిన నియమం “అతిగా ఏది తీసుకోరాదు” ఉదా,2 చిన్న అరటిపండ్లు తినడం సహాయపడుతుంది కాని నాలుగు అరటిపండ్లు మనలను మందకొడిగా చేస్తుంది. 23,24

పండ్ల మిశ్రమం 25-27: నిజానికి మనం పండ్లను మూడు రకాలుగా విభజించవచ్చు: తీపి, పుల్లని (ఆమ్లం) మరియు సగం తీపి మరియు సగం పులుపు. వివిధ రకాల పండ్లలో లభించే ఫ్రక్టోజ్ (ఫల చక్కెర), ఆమ్లం, విటమిన్లు, ప్రోటీన్లు, సెల్యులోజ్ మరియు పిండి పదార్ధాల నిష్పత్తి వేర్వేరుగా వుండి, ఒక విలక్షణమైన రుచిని కలిగి వుండటం ద్వారా అవి ఏ రకానికి సంబందించినదో నిర్ణయిస్తారు.

అరటి, టెంకతో వున్న పండ్లు, జామ, ద్రాక్ష, అంజీరము, ఖర్జూరం          మరియు అన్ని రకాల పుచ్చకాయలు (అధిక నీటి శాతం కలిగి ఉంటాయి) మొదలైనవి రుచిలో తీయగా ఉండే కొన్ని పండ్లు. ఈ పండ్లలో పుల్లని పండ్ల కంటే చాలా ఎక్కువ ఫ్రక్టోజ్ (ఫలచక్కెర) ఉంటుంది.

నల్లని ఎండు ద్రాక్ష, రాస్బెర్రి మరియు కివి పండ్లు రుచిలో పుల్లగా ఉంటాయి. పుల్లటి పండ్లు అయిన పెద్ద నిమ్మ, చిన్న నిమ్మ కాయ మరియు ద్రాక్షపండు కూడా పుల్లగా ఉంటాయి కాని కొన్ని సార్లు చేదుగా కూడా ఉంటాయి. వాటిలో పెద్ద మొత్తంలో ఆమ్లం ఉంటుంది.

అన్ని పండ్లు తీపి లేదా పుల్లని రుచిని కలిగి వుండవు. నారింజ, దానిమ్మ, పైనాపిల్, ఆపిల్, మామిడి, పియర్, బొప్పాయి, స్ట్రాబెర్రీ మరియు బ్లాక్‌బెర్రీ వంటి కొన్ని పండ్లలో ఫ్రక్టోజ్ (పండ్ల చక్కెర) మరియు ఆమ్లం దాదాపు సమానంగా ఉంటాయి, ఇవి తీపి మరియు పుల్లని రుచిని ఇస్తాయి.

ఒకే వర్గానికి చెందిన పండ్లు ఒకే రకమైన వేగంతో జీర్ణమవుతాయి అందువల్ల వాటిని కలపవచ్చు. కానీ తీయటి పండ్లను పుల్లని పండ్లతో కలపి తినరాదు. అయితే తీపి / పులుపు కలిగిన పండ్లను తీపి లేదా పుల్లని పండ్లతో కలిపి తినవచ్చు. 25-27

4. ముంధు జాగ్రతకు సంబందించిన  చిట్కాలు

మంచి ఆరోగ్యం కోసం తీసుకొనే ఆహారం ప్రతి ఒక్కరిలో ఉన్న పంచ భూతాలైన ఆకాశం(అంతరిక్షము), గాలి, అగ్ని, నీరు మరియు భూమి వీటికి సరిపోవునట్లు ఉండాలని ఆయుర్వేద శాస్త్రం తెలియచేస్తోంది. అనుచితమైన ఆహారం, శరీరంలోని జీర్ణ అగ్నిని గందరగోళానికి గురిచేసి అసమతుల్యతకు కారణమవుతాయి. దీని ప్రకారం: 19

  • కడుపు నిండినప్పుడు కాకుండా ఇతర సమయాలలో, ఒకే రకమైన పండ్లు వేరే వాటితో కలపకుండా తీసుకోవాలి.
  • అజీర్ణం వల్ల కలిగే విరోచనాలు లేదా అపానవాయువు(పిత్తు) లాంటివి నిరోదించడానికి, పండు తిన్నవెంటనే కాకుండా తినడానికి అరగంట లేదా గంట ముందుగా నీటిని త్రాగాలి.
  • తాజా పండ్లను పచ్చి లేదా వండిన కూరగాయలతో కలపవద్దు.
  • 2-5 సంవత్సరాల వయస్సు తరువాత మన శరీరం పాలయొక్క పోషక పదార్ధాలని జీర్ణం చేయడానికి అవసరమైన ఎంజైమ్ (లాక్టేజ్) ను ఉత్పత్తి చేయలేనందున తీపి పండ్లను పాలతో కలిపి తీసుకోరాదు. 28 పండ్లను పాలతో కలిపి తీసుకోవడం ద్వారా మనం పండ్ల యొక్క విశిష్టతను కోల్పోవడమే కాకుండా జీర్ణవ్యవస్థపై అధిక ఒత్తిడి పెట్టడం ద్వారా అనారోగ్యానికి దారి తీస్తుంది. 29

5. చివరి మాట!

మనుష్యుల యొక్క శరీరాకృతులు ఒక్కలాగా వుండకపోవడం వల్ల, కొన్ని సార్లు కొంతమందికి సాధారణ మార్గదర్శకాలు పనిచేయకపోవచ్చు. కావున మనం తిన్న తరువాత మనకి ఎట్లా అనిపిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.  శరీరం నుండి వచ్చే సూచనలపై మనం జాగ్రతవహిస్తే, మనకు ఏది ఉత్తమమో, ఎప్పుడు, ఎంత తినాలో మనకు తెలుస్తుంది.

రేఫెరన్సెస్ మరియు లింకులు:

  1. Health, Food, and Spiritual Disciplines, Divine Discourse 8 October 1983, Sathya Sai Baba Speaks on Food, Sri Sathya Sai Sadhana Trust, Publications Division, First edition, 2014, page 56.
  2. What is a fruit: https://www.organicfacts.net/health-benefits/fruit
  3. https://www.cropsreview.com/functions-of-fruits.html
  4. http://www.uky.edu/hort/Ecological-importance-of-fruits
  5. Types of fruit: https://www.nutritionadvance.com/healthy-foods/types-of-fruit/
  6. Tomato is vegetable: https://www.livescience.com/33991-difference-fruits-vegetables.html 
  7. https://en.wikipedia.org/wiki/Nix_v._Hedden
  8. Eat water through fruits: https://www.youtube.com/watch?v=gSYsI3GCbLM
  9. https://isha.sadhguru.org/us/en/wisdom/article/fruit-diet-good-for-you-planet
  10. Fruits have protein: https://www.myfooddata.com/articles/fruits-high-in-protein.php
  11. https://www.healthline.com/nutrition/20-healthiest-fruits
  12. For diabetics: https://www.everydayhealth.com/type-2-diabetes/diet/fruit-for-diabetes-diet/
  13.  https://diabetes-glucose.com/fruit-diabetes-diet/
  14.  https://www.onlymyhealth.com/health-slideshow/best-fruits-diabetics-eat-1271667125.html
  15. https://drmohans.com/dos-and-donts-in-diabetes/
  16. Impact on planet: https://www.independent.co.uk/life-style/health-and-families/veganism-environmental-impact-planet-reduced-plant-based-diet-humans-study-a8378631.html
  17. Washing fruits: Manual for Senior Vibrionic Practitioners, 2018, chapter 9, A.6, page86; Newsletter, vol.8, # 5, Sept-Oct 2017, Health Tips, Enjoying food the healthy way,  para 6,  https://news.vibrionics.org/en/articles/228
  18. Cut fruits: https://www.verywellfit.com/fruits-vegetables-cut-nutrients-lost-2506106
  19. Healthy Fruit eating: http://www.muditainstitute.com/articles/ayurvedicnutrition/secrettohealthyfruiteating.html
  20. https://www.quora.com/Do-fruits-need-stomach-acids-to-get-digested
  21. http://www.ibdclinic.ca/what-is-ibd/digestive-system-and-its-function/how-it-works-animation/
  22. https://www.ayurvedabansko.com/fruits-and-vegetables-in-ayurveda/
  23. How much to eat: https://www.eatforhealth.gov.au/food-essentials/how-much-do-we-need-each-day/serve-sizes
  24. How much Satvic food: http://www.saibaba.ws/teachings/foodforhealthy.htm
  25. Food combinations: https://lifespa.com/fruit-ayurvedic-food-combining-guidelines/
  26.  https://www.ehow.com/info_10056003_sweet-vs-sour-fruits.html
  27. http://www.raw-food-health.net/listoffruits.html#axzz5mXlWmuVw
  28. Inadequate lactase in adult to digest milk: https://healthyeating.sfgate.com/milk-digestible-4441.html
  29. Science of nutrition-yogic view: https://www.kriyayoga-yogisatyam.org/science-of-nutrition

 

2. ఏ‌వి‌పి వర్క్ షాప్ పుట్టపర్తి, ఇండియా, 6-10 మార్చ్ 2019

ఇద్దరు అనుభవం కలిగిన కోర్సు ఉపాధ్యాయుల10375 &11422 ద్వారా నమూనా క్లినిక్ తో కూడిన 5 రోజుల వర్క్‌షాప్ నందు ఎనిమిది మంది అభ్యర్థులు, భారతదేశం నుండి ఆరుగురు (ఇప్పుడు జనరల్ హాస్పిటల్, పుట్టపర్తిలో స్వచ్ఛంద సేవ చేస్తున్నఇద్దరు వైద్య నిపుణులతో కలిపి) ఫ్రాన్స్ మరియు క్రొయేషియా నుండి ఒక్కొక్కరు పాల్గొని AVP లుగా అర్హత సాధించారు.

వర్క్‌షాప్‌లో మరో నలుగురు అర్హత సాధించిన సాధకులు కూడా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి పాల్గొన్నారు. ఇద్దరు వైద్యులు తెలియచేసిన విషయాలు వర్క్‌షాప్‌ను మరింత సుసంపన్నం చేశాయి మరియు మరింత ఉల్లాసంగా మరియు పరస్పర అభిప్రాయాలూ తెలుసుకొనేవిధంగా చేశాయి. వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారు మాక్ / ఫీల్డ్ క్లినిక్‌లకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా మరింత ఆచరణాత్మకంగా వుంటుందని సూచనలు ఇచ్చారు. ప్రత్యేక సెషన్ ద్వారా ఆచరణాత్మక ఉదాహరణలతో కేస్ హిస్టరీలను ఎలా రాయాలి మరియు రోగి రికార్డులను జాగ్రతగా నిర్వహించడం యొక్క ప్రయోజనాలు తెలియచేసారు.

డాక్టర్ అగర్వాల్ తన మాటల ద్వారా ఈ శక్తివంతమైన చికిత్స ఎలా అభివృద్ధి చెందినది, ప్రతి అడుగులోనూ స్వామి ఏలా మార్గనిర్దేశం చేసినది తెలియచేస్తూ స్వామివారి మార్గదర్శకత్వం ఇంకనూ కొనసాగిస్తూ అభ్యాసకులకు వైబ్రియోనిక్స్ సాధన చేయడంద్వారా వారి జీవితాన్ని ఎలా మారుస్తున్నారో తెలియచేసి అభ్యర్ధులను అలరించారు.

 

 

3. అవగాహన మరియు నైపుణ్యం పెంపొందించే సదస్సు, కామ్బ్రై, ఫ్రాన్స్, 9 మార్చ్ 2019

ఫ్రెంచ్ సమన్వయకర్త01620 సాధకుల వివరాల కొరకు SRHVP కల్గిన చాలామంది పాత సాధకులను కలిశారు. వారంతా తిరిగి శిక్షణ పొందటానికి ముఖ్యంగా 108CC ని వాడటానికి ఉత్యాహం చూపించారు. ఆమె ఒక సాధకురాలి ఇంట్లో ఏర్పాటు చేసిన అవగాహనా సధస్సు లో తొమ్మిది మంది పాల్గొన్నారు. వారందరికి వైబ్రియనిక్స్ గత కొన్ని సంవత్సరాలుగా ఎలా వృద్ధి చెంది వస్తోందో  తెలియచేసి సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి పాత్ర యొక్క ఆవశ్యకత గురించి తెలియచేసారు. ఆమె వారికి వైబ్రియోనిక్స్ సాహిత్యానికి సంబందించిన పుస్తకాలతో పాటు మొదటి అంతర్జాతీయ సమావేశ పుస్తకాన్ని మరియు మన ప్రధాన సైట్‌ ను చూపించారు. సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తిరిగి నేర్చుకోవడానికి మరియు ఈ మిషన్ లో చురుకుగా పాల్గొనడానికి, ఇతర స్నేహితులను వైబ్రియోనిక్స్ లోనికి తిరిగి తీసుకురావడానికి చాలా ఉత్సాహం చూపించారు. ​పాల్గొన్న వారిలో కొంతమంది వద్ద ఇప్పటికే 108CC బాక్స్ కలిగి వున్నారు మరియు వారి అనుభవాలను పంచుకోవడానికి మరియు వారి బాక్స్ లను తిరిగి ఛార్జ్ చేయడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు.​

 

4. SVP శిక్షణ మరియు  నైపుణ్యం పెంపొందించే శిబిరం, పెరిగిక్స్, ఫ్రాన్స్,16-20 మార్చ్ 2019

ఫ్రెంచ్ కోఆర్డినేటర్ & ట్రైనర్ 01620 ఒక ఐదు రోజుల SVP కోర్సును ఆమె తన నివాసంలో నిర్వహించారు. ఆ సమావేశంలో ఆమె SVP గా మారడానికి అవసరమైన వారి పాత్ర మరియు బాధ్యతలను తెలియచేసినప్పుడు శిబిరంలో పాల్గొన్నవారు ప్రశంసించారు. మారిషస్ నుంచి వచ్చిన ఒక VP అద్భుత ప్రదర్శన చూపి, SVP గా అర్హత సాధించిన తరువాత అక్కడే ఒక రెమెడీ తయారు చేసి, తోటి అభ్యర్ధికి SRHVP మీద తయారు చేసి చూపించారు. ఏడాది క్రితం అర్హత సాధించిన ఇద్దరు SVPలు తమ అనుభవాలను, కేసు చరిత్రలను మిగతా వారితో పంచుకున్నారు. శిబిరంలో పాల్గొన్నవారు ఈ 5-రోజుల శిబిరం చాలా విలువైనదిగా భావించారు. చివరిగా స్కైప్‌లో డాక్టర్ అగర్వాల్‌తో ప్రశ్నోత్తరాల సెషన్‌ ద్వారా కోర్సు ముగిసింది.

 

5. నైపుణ్యం పెంపొందించే శిబిరం, న్యూడిల్లీ, ఇండియా, 23 మార్చ్ 2019

డిల్లీ కో-ఆర్డినేటర్ మరియు ఉపాధ్యాయుని 02059 ద్వారా సాయి ఇంటర్నేషనల్ సెంటర్‌లో నిర్వహించిన ఉత్తేజపరిచే వర్క్‌షాప్‌లో 19 మంది అభ్యాసకులు హాజరయి తమ విజయవంతమైన మరియు కష్టమైన కేసులను అంధరితో పంచుకున్నారు. డాక్టర్ అగర్వాల్ అభ్యాసకులకు నిరంతరాయంగా నిస్వార్థ సేవగా వైబ్రియోనిక్స్ సాధన కొనసాగించాలని మరియు స్వామి ముందు తీసుకున్న ప్రమాణం యొక్క నిజమైన స్ఫూర్తితో ప్రభువుకు లొంగిపోవాలని కోరారు. తదుపరి స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండమని, జ్ఞానాన్ని మరియు నైపుణ్యాలను నిరంతరం నవీకరించుకుంటూ, సమిష్టి కృషి మీద నమ్మకముంచి వైబ్రియోనిక్స్ సరైన దిశలో వృద్ధి చెందేలాగా పరిపాలనా భాద్యతలను చేపట్టడానికి ముందుకు రంమ్మని కోరారు.

న్యూస్ లెటర్స్ లలో ఇటీవల తెలియచేసిన వైబ్రియనిక్స్ యొక్క ముఖ్యమైన మరియు కీలకమైన అంశాలను దీర్ఘంగా చర్చించారు.

  • అభ్యాసకుడు 2 వారాలకు పైగా దూర ప్రాంతాలకి వెళ్ళేటట్లైతే వారి రోగులకు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
  • వేడి చేసి చల్లార్చిన నీటితో కంటి చుక్కలు మరియు స్వచ్ఛమైన నూనె / నెయ్యితో చెవి చుక్కలు తయారుచేసేటప్పుడు జాగ్రత్త వహించడం; చర్మ సంబందిత సమస్యలకు నూనె, క్రీమ్ లేదా జెల్ లాంటివి కాకుండా సమర్థత కల్గిన నీటిని ఉపయోగించడం, మార్గదర్శకాలకు అనుగుణంగా కోణం, దూరం మరియు ప్రభావిత ప్రాంతం దృష్టిలో పెట్టుకొని చాయాచిత్రాలను తీయవలసిన ఆవశ్యకత; మరియు ప్రతి 2 సంవత్సరాలకు 108 CC బాక్స్ రీఛార్జింగ్ యొక్క ప్రాముఖ్యత.
  • సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం మరియు స్వచ్ఛమైన గాలిలో ధీర్గశ్వాసతో కూడిన ఆరోగ్యవంతమైన జీవనశైలి గురించి రోగులకు ప్రేరణ మరియు మార్గనిర్దేశం చేయడం.
  • రెమెడీని తయారు చేసే సమయంలో రోగులకు వైబ్రియోనిక్సుకు సంబందించిన వార్తాలేఖలు / సమావేశ పుస్తకాలను ఇవ్వడం ద్వారా వారి విశ్వాసాన్ని పెంచడం.
  • రోగ లక్షణాలు తగ్గిన తరువాత క్రమంగా రెమెడీస్స్ ని క్రమంగా తగ్గించడం, తరువాత రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ప్రత్యామ్నాయ ప్రక్షాళన మరియు రోగనిరోధక శక్తిని పెంచే రెమెడీస్స్ లను ఇవ్వడం, తరువాత వ్యాధిని మూలాల నుండి పూర్తిగా నిర్మూలించడానికి మియాస్మ్‌లతో చికిత్స చేయడం.
  • క్షమాగుణం ద్వారా మనసుని ప్రక్షాళన చేయడం