Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

Vol 16 సంచిక 6
నవంబర్ / డిసెంబర్ 2025
అవలోకనం

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

భగవాన్‌కు సమిష్టి శతజయంతి సమర్పణలో భాగంగా ప్రాక్టీషనర్లు చేసిన హృదయపూర్వక కృషిని, సేవలను అభినందిస్తూ, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని డా. అగర్వాల్ పేర్కొన్నారు. అలాగే, స్వామి బోధించిన నాలుగు ఆదర్శాలను ఆచరణలో పెట్టాలని, ప్రాక్టీషనర్ల సంఖ్యను విస్తరించి మారుమూల ప్రాంతాల్లో కూడా వైబ్రియానిక్స్ సేవలను బలోపేతం చేయాలని, స్ఫూర్తిదాయకమైన మరియు భాగస్వామ్యాన్ని పెంపొందించే లక్ష్యాలు, మైలురాళ్లు నిర్దేశించుకోవాలని, అలాగే అవసరంలో ఉన్న ప్రతి ఇంటికీ, ప్రతి హృదయానికీ వైబ్రియానిక్స్ వెలుగును చేరవేసేలా వార్తాలేఖను మరింత చైతన్యవంతంగా, అందరినీ భాగస్వాములను చేసుకునే విధంగా తీర్చిదిద్దాలని ఆయన మనకు గుర్తుచేస్తున్నారు.

పూర్తి వ్యాసం చదవండి

దృష్టాంత చరిత్రలు

ఈ సంచికలో పన్నెండు ఆసక్తికరమైన కేసులు పంచుకోబడ్డాయి: నడుము దిగువ భాగం నొప్పి; దీర్ఘకాలిక మలబద్ధకం, కడుపు నొప్పి; దీర్ఘకాలిక విరేచనాలు, నోటి లైకెన్ ప్లానస్, కాళ్ల నొప్పి; పెప్టిక్ అల్సర్; గొంతులో కఫం; మెడ నొప్పి; పరిమిత జుట్టు పెరుగుదల; జియోగ్రాఫిక్ నాలుక; తలనొప్పులు, నడుము నొప్పి, కడుపు ఉబ్బరం; దీర్ఘకాలిక శ్వాసకోశ ఇబ్బంది; మోకాలి నొప్పి, అసిడిటీ, తలనొప్పి; మరియు అలర్జిక్ బ్రాంకైటిస్.

దృష్టాంతములు చదవండి

సాధకుని వివరములు

2023 నవంబర్‌లో AVPగా అర్హత సాధించిన మా అంకితభావం గల ప్రాక్టీషనర్ గురించి, వైబ్రియానిక్స్ పట్ల ఆమెకున్న అభిరుచి, ఆమె నిర్వహించిన ఆసక్తికరమైన కేసులు, ఆమె ప్రత్యక్షంగా చూసిన అద్భుతమైన స్వస్థతలు, అలాగే స్వల్ప కాలంలోనే అనేక మంది రోగులకు అందించిన సేవల గురించి తెలుసుకోవడానికి చదవండి.

సాధకుని వివరములు చదవండి

ప్రశ్నలు జవాబులు

ఈ సంచికలో తెలుసుకోండి: అనేక విశేష విజయగాథలు ఉన్నప్పటికీ సాయి వైబ్రియానిక్స్‌కు ఇప్పటికీ ఎందుకు తగిన స్థాయిలో విస్తృత గుర్తింపు లభించలేదు; SRHVP ద్వారా స్వస్థత కోసం మంత్రాలు లేదా పారాయణాలను ప్రసారం చేయవచ్చా; ఒకే సీసాలో గరిష్ఠంగా ఎన్ని అల్లోపతి మందులను పొటెన్టైజ్ చేయవచ్చు; వైబ్రియానిక్స్‌లో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేసే (ఆంటీ-ఏజింగ్) చికిత్స ఏదైనా ఉందా; అలాగే బ్రాడ్‌కాస్టింగ్ కోసం జుట్టు నమూనాను సరైన విధంగా ఎలా సేకరించాలి, జుట్టుకు వేసే రంగులు లేదా షాంపూలు వాటి ప్రకంపనలపై ఏమైనా ప్రభావం చూపుతాయా.

పూర్తి వ్యాసం చదవండి

దివ్య వైద్యుని దివ్యవాణి

అనారోగ్యానికి మూలకారణమైన చెడు అలవాట్లను ఎలా విడిచిపెట్టాలో, నిజమైన ఆనందాన్ని ఎలా పొందాలో, అలాగే సేవ యొక్క అసలైన లక్షణం ఏమిటో స్వామి ప్రేమతో మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు!

పూర్తి వ్యాసం చదవండి

ప్రకటనలు

పుట్టపర్తి, భారతదేశంలో జరగనున్న వర్క్ షాప్లు.

పూర్తి వ్యాసం చదవండి

అదనంగా

అదనంగా ఈ సంచికలో: • చిత్రాలతో కూడిన ఆరోగ్య వ్యాసం: “మీ కణాల ఆరోగ్యాన్ని కాపాడుకోండి – ప్రాణాంతక క్యాన్సర్‌ను నివారించండి”. ఇందులో కణాల ఆరోగ్యం ఎందుకు అత్యంత ముఖ్యమో, ఆరోగ్యకరమైన కణాల సహజ చక్రం, క్యాన్సర్ ఎలా ఏర్పడి వ్యాపిస్తుందో, దాని కారణాలు, ప్రమాద కారకాలు, లక్షణాలు, నిర్ధారణ, వ్యాధి భవిష్యత్తు (ప్రోగ్నోసిస్), అలాగే కణాల ఆరోగ్యాన్ని సంరక్షించి క్యాన్సర్‌ను నివారించే మార్గాల గురించి వివరించబడింది. • చిత్రాలతో కూడిన నివేదికలు: లండన్‌లో జరిగిన యుకే ప్రాక్టీషనర్ల వార్షిక సమావేశం, అలాగే విశాఖపట్నంలో ప్రారంభమైన వైబ్రియానిక్స్ శిబిరం గురించిన సంక్షిప్త నివేదికలు. • డా. జిత్ కె. అగర్వాల్ డైరీ నుండి ఒక అనుభవం: “ఫైబ్రాయిడ్స్‌ను మించిన విశ్వాసం: ఒక పొరపాటు అద్భుతంగా మారిన కథ”. • స్మృతాంజలి: కేరళకు చెందిన ఒకరు, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మరొకరు—ఈ ఇద్దరు అంకితభావం గల ప్రాక్టీషనర్ల పరమపదానికి మా ప్రగాఢ సంతాపం.

పూర్తి వ్యాసం చదవండి