Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ముక్కుకు సంబంధించిన అలర్జీ సమస్య (అలెర్జిక్ రైనైటిస్) 11658...India


వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ఒక 36 ఏళ్ల వ్యక్తి,  జనవరి 2022 నుంచి శ్వాసకోశ అలర్జీతో బాధపడుతున్నారు. డిసెంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు కోవిడ్‌-19 తో బాధపడిన తన యజమానితో ఎక్కువసేపు కలసి ఉండటంతో ఆయనకు ఈ అలర్జీ మొదలైంది. ఆ తర్వాత, దుమ్ము, సీలింగ్ ఫ్యాన్లు, ఎయిర్ కూలర్లు మరియు డ్రైవింగ్ కారణంగా ఎక్కువై ప్రతిరోజూ తుమ్ములు మరియు ముక్కు కారడం జరుగుతుండేది.

2022 ఏప్రిల్‌లో ఆయుర్వేద చికిత్స మొదలుపెట్టి, ఎటువంటి  మెరుగుదల లేకపోవడంతో నాలుగు నెలల తరువాత దానిని నిలిపివేశాడు. 28 మార్చి 2023న అల్లోపతి చికిత్సను ప్రారంభించాడు. ఇందులో నోటి ద్వారా తీసుకునే మందులు మరియు నాసల్ స్ప్రే ఉన్నాయి. డిసెంబర్‌లో ఉపశమనం లేకపోవడంతో నోటి మందులను నిలిపి వేసి,  చాలా స్వల్పమైన ఉపశమనం కలిగినా నాసల్ స్ప్రేను మాత్రమే కొనసాగించాడు. ఆర్థిక పరిమితుల కారణంగా ప్రత్యామ్నాయ చికిత్స కోసం చూస్తున్న సమయంలో వైబ్రియానిక్స్ గురించి తెలుసుకుని, 21 మే 2024 న ప్రాక్టీషనర్‌ను కలవగా అతనికి ఈ క్రింది రెమెడీలు ఇవ్వబడ్డాయి:

#1. IB (vol 13 #5)…OD

#2. Covid recuperation (vol 12 #4)…OD, రెండింటినీ రెండు వారాల పాటు ఇచ్చారు. అతను నాసల్ స్ప్రేను కొనసాగించాడు.

చికిత్స పురోగతి:

2025 నాటికి రోగి ఆరోగ్యంగా ఉన్నాడు. SOS అవసరానికి #5 ను తన వద్ద ఉంచుకున్నప్పటికీ, గత ఒక సంవత్సరంలో సమస్య మళ్లీ పునరావృతం కాలేదు.