Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

తీవ్రమైన నెలసరి నొప్పి 11658...India


20 ఏళ్ల యువతి 2019లో తొలిసారి నెలసరి ప్రారంభమైనప్పటి నుంచి, గత ఐదు సంవత్సరాలుగా ప్రతి నెలా కింది పొత్తికడుపు మరియు వెన్నులో తీవ్రమైన నెలసరి నొప్పితో బాధపడుతోంది. సాధారణంగా ఆమెకు నెలసరి 3–4 రోజులు కొనసాగేది. మొదటి రెండు రోజుల్లో నొప్పి తీవ్రంగా ఉండటంతో, వైద్యులు సూచించిన నొప్పి నివారణ మందులను తీసుకునేది. రోజంతా పొత్తికడుపుపై వేడి కాపడం పెట్టుకోవాలని కూడా సూచించారు. అయినప్పటికీ కేవలం 20% మాత్రమే ఉపశమనం లభించేది. నొప్పి తీవ్రత ఆమె రోజువారీ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసేది. రెండు రోజులపాటు కాలేజీకి కూడా వెళ్లలేకపోయేది. తన అత్త ద్వారా వైబ్రియానిక్స్ గురించి తెలుసుకున్న తరువాత, ఆమె ప్రాక్టీషనర్‌ను సంప్రదించింది.

1 మార్చి 2024న ఆమెకు క్రింది రెమెడి ఇవ్వడం జరిగింది:

CC8.7 Menses frequent…TDS

మార్చి 6న ప్రారంభమైన నెలసరి సమయంలో ఆమె అల్లోపతి మందులు మరియు వేడి కాపడం కొనసాగించింది.

చికిత్స పురోగతి:

జూలై 2025 నాటికి, ఆమెకు నెలసరి సమయంలో ఎటువంటి నొప్పి లేకుండా కొనసాగుతోంది.