Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కోవిడ్ -19 11613...India


83 ఏళ్ల వ్యక్తికి గత 28 సంవత్సరాలుగా  ఆస్తమాతో బాధ పడుతూ నివారణ కోసం ఇన్హేలర్ మరియు నెబ్యు లైజర్ తీసుకుంటున్నారు. అలాగే పదేళ్ల క్రితం నిర్ధారణ అయినా రక్త క్యాన్సర్ కోసం ఇమిటీ నాబ్ - ( క్యాన్సర్ కణాల పెరుగుదలను మందగింపు చేసే కీమోథెరపీ ఔషధం) కూడా తీసుకుంటున్నారు. 2020 జూలై 12న అతను 101º F జ్వరం మరియు ఊపిరి ఆడకపోవడం వంటి సాధారణ కంటే ఎక్కువ రోగలక్షణాలు ఏర్పడి  నాలుగు రోజులు ఇవి కొనసాగుతూ ఉన్నప్పుడు అతని కుటుంబం పల్స్ ఆక్సీ మీటర్ ని ఉపయోగించి రక్తములో  ఆక్సిజన్ స్థాయిని 89% గా కనుగొన్నారు (సాధారణ స్థాయి 95% - 100% కానీ ఉబ్బస వ్యాధి గ్రస్తుడు ఉపవాసం కావడంతో అతని సాధారణ స్థాయి కనీసం 92%ఉండాలి).జులై 16న వెంటనే అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు, అక్కడ అతనికి ఆక్సిజన్ సపోర్ట్ అందించ బడింది. అదే రోజున చేసిన పరీక్షలలో అతనికి కోవిడ్ పాజిటివ్ అని తెలిసింది. అందువల్ల అతనికి విటమిన్ సి, జింక్ మరియు కాల్షియం టాబ్లెట్లతో పాటు ఆసుపత్రి వర్గాలు వెల్లడించక పోయినా  రోజు వారీ నరానికి ఇచ్చే యాంటీ వైరల్ ఇంజక్షన్లను కూడా ఇవ్వబడ్డాయి.

మూడు రోజుల తర్వాత అనగా 2020 19న జూలై 19న జ్వరం 99. 5º F  కి తగ్గింది కానీ ఆక్సిజన్ స్థాయి 84  శాతానికి పడిపోయింది. వెంటనే ఒక కుటుంబ సభ్యుడు ప్రాక్టీషనరును సంప్రదించగా ప్రామాణిక రోగ నిరోధక శక్తిని పెంచే క్రింది రెమిడీ ఇచ్చారు:  

CC4.1 Digestion tonic + CC4.8 Gastroenteritis + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC13.1 Kidney & Bladder tonic + CC15.1 Mental & Emotional tonic + CC19.3 Chest infections chronic + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic…ప్రతీ 10 నిమిషాలకు ఒక మోతాదు చొప్పున 2 గంటల వరకూ అనంతరం 6TD

మరుసటి రోజు జ్వరం 99º F కి తగ్గింది. అతని శక్తి స్థాయి ఆకలి గణనీయంగా పెరిగాయి. మూడు రోజుల తరువాత జూలై 22న స్వాబ్ టెస్ట్ లో అతను ఇంకా సానుకూలంగా ఉన్నాడని మరియు ఆక్సిజన్ స్థాయి 84 శాతం వద్ద నిలకడగానే ఉందని తేలింది కనుక ఆక్సిజన్ మద్దతును కొనసాగించారు. ఏది ఏమైనా నాలుగు రోజుల తర్వాత జూలై 26న అతను చాలా ఉపశమనం పొందాడు. పరీక్షలలో అతనికి కోవిడ్ నెగిటివ్ రావడంతో పాటు ఆక్సిజన్ స్థాయి 98 శాతానికి మెరుగుపడింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. రక్త క్యాన్సర్ మరియు ఆస్త్మా ఉన్నప్పటికీ 83 సంవత్సరాల వయసుగల ఈ వ్యక్తి కేవలం పది రోజుల్లోనే కోలుకోవడం వైద్యులను ఎంతో ఆశ్చర్యపరిచింది. ఆగస్టు 5న మోతాదు క్రమంగా TDS, BD, OD గా తగ్గించబడింది. రెమిడీ అవసరం లేదని భావించి రోగి 2020 సెప్టెంబర్ 10న నిలిపివేయడం జరిగింది.