Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

మానసిక రుగ్మతలు 11592...India


2017 లో 40 సంవత్సరాల మహిళ ఒకరోజు ప్రాక్టీషనర్ ను సందర్శిం చినప్పుడు తెలియని భయాలు, నిరంతర విచారం, కారణం లేకుండానే ఏడుపు వంటి లక్షణాలతో ఎంతో బాధతో కనిపించారు. ఎవరిదైనా మరణం వార్త ఆమెను భయంతో కంపింప  చేయడం, అంబులెన్స్ శబ్దం వింటే విపరీతంగా భయపడటం వంటి లక్షణాలు కూడా ఉండేవి. ఆమె తల పైన నరాల వత్తిడి ఫలితంగా తీవ్రమైన తలనొప్పి వచ్చేది. ఆమెకు ఆత్మ విశ్వాసం ఏమాత్రం లేకపోవడం ఒక సమస్యగా ఉంది. ఈ సమస్యలన్నీ 2006లోనే ప్రారంభమయ్యాయి కానీ కారణం తెలియదు. ఈ లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు ఆమె బలహీనంగా ఉన్నట్లు భావిస్తారు కానీ తన రోజువారీ పనులను మాత్రం ఏదో ఒకవిధంగా నిర్వహించగలుగుతున్నారు.

2006 ఆగస్టులో ఒక న్యూరో సర్జన్ ఆమెను మెదడు యొక్క CT స్కాన్ చేయించుకోమని సూచించారు కానీ ఆ రిపోర్టు  ఎటువంటి అసాధారణతనూ వెల్లడించలేదు. ఆమెకు తల నొప్పి మరియు బలహీనత కోసం మందులు సూచించగా వాటిని ఆమె రెండు సంవత్సరాలు వాడినా వాటి వల్ల ఎటువంటి మెరుగుదల కనిపించలేదు. అంతేకాక అలోపతి మందుల దుష్ప్రభావం వల్ల ఆమె గ్రహించిన తాత్కాలిక ఉపశమనం కూడా మరుగున పడింది. 2008 జూలైలో ఆమెకు సాయంకాలం మరియు రాత్రుళ్ళు కడుపులో కుడివైపున నొప్పి, గ్యాస్, మరియు త్రేన్పులు రావడం ప్రారంభించింది. అలాగే ఆమె కుడి చెవిలో రింగుమని హోరుతో వారానికి మూడు నాలుగు సార్లు శబ్దం ఏర్పడుతూ టినిటస్ వ్యాధి కలిగింది. అల్లోపతి మందుల దుష్ప్రభావాల భయం కారణంగా ఆమె ENT  నిపుణుడిని సంప్రదించడానికి నిరాకరించారు. కానీ ఆమె మానసిక స్థితి మరియు చెవులు కోసం హోమియోపతీ చికిత్సను ప్రారంభించారు. కానీ ఈ చికిత్స వల్ల కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో రెండు నెలల తర్వాత దానిని ఆపివేశారు. 2008 అక్టోబర్లో ఆమె వైద్యుడు ఈ పరిస్థితిని డిప్రెషన్ గా గుర్తించి ప్లాసిడా మాత్రను సూచించగా 2014 జూలైలో భారత ప్రభుత్వం దీని వినియోగాన్ని నిషేధించే వరకు ఆమె దీనిని కొనసాగించారు. ఈ సుదీర్ఘ ఆరు సంవత్సరాల సమయంలో ఈ మాత్ర ఆమెను మగతకు గురిచేసి రోజులో ఎక్కువభాగం నిద్రపోయేలా చేసింది. అయితే చెవిలో హోరుకుమాత్రం ఎటువంటి చికిత్స లేకుండానే ఆమె నిర్వహించు గలిగారు. ప్లాసిడా ఆపివేసిన తర్వాత ఆమె మానసిక స్థితి మరింత క్షీణించడంతో 2014 ఆగస్టులో ఆమె ఒక మానసిక వైద్యుడిని సందర్శించవలసి వచ్చింది. అతను డిప్రెషన్ కోసం MDD-XR 100 mg OD గా మరియు గ్యాస్ట్రిక్ సమస్యల కోసం Happi-D ట్యాబ్లెట్ సూచించడం జరిగింది. ఆమె ఒక్క రోజు ఒక్క మోతాదు మిస్ అయినా పరిస్థితి ఘోరంగా మారుతోంది. MDD-XR, ప్రారంభించిన రెండు సంవత్సరాల తర్వాత దాని దుష్ప్రభావాల కారణంగా ఆమె కాళ్లలో అసంకల్పిత కదలిక అనగా కాలిని గాలిలో తన్నడం వంటివి ఏర్పడింది. మనోరోగ వైద్యుడు దీనికి ఎటువంటి పరిష్కార చర్యలు సూచించే లేకపోయారు. ఉపసంహరణ ప్రభావాలు తీవ్రంగాఉంటాయి కనుక ఎట్టి పరిస్థితిలో అల్లోపతీ మందులు అపవద్దని మాత్రం ఆమెను హెచ్చరించారు. కనుక ఆమె ఈ అల్లోపతి మందులు రెండింటిని తీసుకోవడం కొనసాగించారు. 2017 నవంబర్ 30న పేషంట్ భర్త ప్రాక్టీషనరును (అతని స్నేహితుడుని) సంప్రదించగా 2017 నవంబర్ 30 న క్రిందిరెమిడి సూచించారు: 

#1. CC3.7 Circulation + CC4.10 Indigestion + CC5.3 Meniere’s disease + CC12.1 Adult tonic + CC15.2 Psychiatric disorders...TDS 

నెల రోజుల తర్వాత ఆమె భయము, విచారము, కారణం లేకుండా ఏడుపు, తలనొప్పి, విరామం లేకుండా కాళ్లు తన్నడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, వంటి అన్నిటినుండి 50% ఉపశమనం పొందారు. మరొక నెల రోజుల తర్వాత గ్యాస్ట్రిక్ సమస్య చెవిలో హోరు సమస్య పూర్తిగా కనుమరుగయ్యాయి, మిగిలిన సమస్యలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. మరో పది నెలల తర్వాత 2018 నవంబర్ నాటికి అన్నీ లక్షణాల నుండి 100% స్వస్థత చేకూరింది. ఆమెకు ఏమాత్రం బలహీనత అనిపించకపోవడంతో పాటు ఆత్మవిశ్వాసం పూర్తిస్థాయిలో తిరిగి చేరింది. కాబట్టి ఆమె మనోరోగ వైద్యుడు  Happi-D మాత్రను ఆపి  MDD-XR ను 50 mg కు మరో రెండు వారాల తర్వాత 25mgకి తగ్గించి చివరకు 2019 జనవరి 10న ఆపివేశారు. 2019 జనవరి 16వ తేదీన ఆమెకు తన పాత లక్షణాలైన భయము, తలపోటు, కాళ్లు తన్నడం వంటివి పాక్షికంగా (30%) పునరావృతం అయ్యాయి. ఆ సమయంలో సీనియర్ ప్రాక్టీషనరు 11585…ఇండియా  సలహా ద్వారా #1క్రింది విధంగా మార్చబడింది:

ప్రశాంతతకు:

#2. NM6 Calming + NM25 Shock + NM95 Rescue Plus...TDS

తలనొప్పికి:

#3. NM44 Trigeminal Neuralgia + NM85 Headache-BP...TDS

కేవలం రెండు వారాల్లోనే భయము అదృశ్యమైంది.   

కాలు తన్నడం, తలపోటు విషయంలో 50% ఉపశమనం లభించింది.మరో నెల రోజులు రెమిడి కొనసాగించిన తర్వాత ఫిబ్రవరి చివరి  నాటికి ఆమె తిరిగి అన్ని వ్యాధి లక్షణాలు నుండి 100% ఉపశమనం పొందారు. #3 మోతాదు OD కి  తగ్గించబడింది. ఆమె ఎటువంటి అలోపతి మందులు తీసుకోవడం లేదు కనుక  #2 మాత్రం మూడు నెలల తర్వాత అనగా మే చివరినాటికి OD కి తగ్గించబడింది. #3 ను జూన్ చివరి నాటికి OW కి తగ్గించి 2019 ఆగస్టు నెలాఖరులో    ఆపివేసే వరకు కొనసాగించ బడింది. అయితే పేషెంటు #2 ను మాత్రం ODగా కొనసాగిస్తూనే ఉన్నారు. 2020 జూన్ నాటికి వ్యాధి లక్షణాలలో ఎటువంటి పునరావృతం లేకుండాఆరోగ్యంగా ఉన్నారు.

108CC బాక్సు, ఉపయోగిస్తున్నట్లైతే #2:CC15.1 Mental & Emotional tonic; #3: CC11.3 Headaches + CC11.4 Migraines ఇవ్వవలెను.