నిద్రలేమి 00814...Croatia
ప్రాక్టీషనరుకు ఎంతో కాలంగా పరిచయం ఉన్న 65 ఏళ్ల మహిళ నిద్రలేమికి సహాయం కోరారు. సంవత్సరానికి పైగా ఆమె రాత్రి సమయంలో రెండు గంటల కన్నా తక్కువ నిద్రపోగలుగుతున్నారు. ఆమె చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తున్నప్పటికీ ఆమెకు అవిశ్రాంతంగా, విచారంగా, అసాధారణ నిస్పృహ అనిపిస్తూ ఉంటుంది. ఆమె బ్రతకాలన్న ఆశ కూడా కోల్పోయారు. 2019 సెప్టెంబర్ 10వ తేదీన ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC15.1 Mental & Emotional tonic…TDS
#2. CC15.6 Sleep disorders…నిద్రించడానికి అరగంట ముందు
ఆరోజు నిద్రించడానికి ముందు ఆమె #2 ను ప్రతీ పది నిమిషాలకి ఒకటి చొప్పున మూడు డోసులు తీసుకున్నారు. అనంతరం ఆమె 8 గంటలు నిద్రపోగలిగారు. రెండవ రోజు రాత్రి ఆమెకు నిద్ర రాలేదు. మూడవరోజు రాత్రి ఆమె రెమిడీ తీసుకోకుండా టీవీ చూస్తూనే మంచం మీద ఒరిగి నిద్రపోయారు. రెమిడీ తీసుకున్న రెండు రోజుల తర్వాత ఆమె నిద్ర షెడ్యూల్ సాధారణ స్థితికి చేరింది!
రెండు వారాల తర్వాత ఆమె మరుసటి సందర్శనలో ఆమెకు కొంచము అవిశ్రాంతంగా ఉన్నట్లు కనిపించినా ఆరోగ్యంగానే ఉన్నట్లు అనిపించింది. ఆమె ఒత్తిడి విషయంలో కొంత సమాచారం అందించారు కానీ దానికి కారణం ఏమిటో తెలియలేదు. ఆమె మానసిక స్థితి లో 60% మెరుగుదల ఉన్నట్లు ప్రాక్టీషనర్ ఊహించారు. ఆ రెండు రోజుల తర్వాత ఆమె #2 వ మోతాదును తీసుకోలేదు కానీ ప్రతి రాత్రి చక్కగా నిద్ర పోతున్నారు. #1 వ మోతాదు కొనసాగించి #2 వ మోతాదు తిరిగి ప్రారంభించవలసిందిగా సూచింపబడింది. మరో నెల రోజుల తర్వాత అక్టోబర్ 20న ఆమె మానసికంగా 80% ఉపశమనం పొందినట్లు తెలిపారు. కాబట్టి #1వ మోతాదు BDకి తగ్గించబడింది. 2019 డిసెంబర్ 19 న ఆమె పూర్తిగా సాధారణ స్థాయిలో కనిపించారు. తన ఒత్తిడికి కారణం (కుటుంబ సమస్య) గురించి కూడా వివరించగలిగారు. కాబట్టి #1 వ మోతాదు OD కి తగ్గించబడింది. ఆమెకు “బ్రతకాలని సంకల్పం” తిరిగి చిగురించింది. అందుచేత ఆమె 65 సంవత్సరాల వయసులో కొత్త ఫార్మసీ ఏర్పాటు చేసారు. #1 మరియు #2 ఆపివేయ బడ్డాయి. 2020 మార్చి1 నాటికి ఆమె చాలా చక్కగా ఉన్నారు.