బహిష్టు నొప్పి, రక్తహీనత, ఆమ్లత్వము 11585...India
మారుమూల గ్రామీణ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళ బహిష్టు చక్రంలో రక్తస్రావం మామూలుగా ఉన్నప్పటికీ గత 25 సంవత్సరాలుగా విపరీతమైన బాధను అనుభవిస్తోంది. వైద్యుని సూచన మేరకు నొప్పి భరింపరానిదిగా ఉన్నప్పుడు నొప్పి నివారణ లను తీసుకుంటున్నది. 2 సంవత్సరాల క్రితం ఆమె కడుపులో మండుతున్న భావన ఎదురుకాగా దాన్నిఅధిగమించడానికి యాంటాసిడ్ ట్యాబ్లెట్లను తీసుకోవడం ప్రారంభించింది. 2017 మార్చిలో ఆమె Hb కౌంటు అనగా రక్త శాతము మామూలుగా ఉండవలసిన 12 -16 g/dL కన్నా చాలా తక్కువగా 7 g/dL మాత్రమే ఉన్నందున ఆమెకు రక్తహీనత ఉన్నట్లు కనుగొనబడింది. 2017 ఏప్రిల్ 25 న ఆమె ప్రాక్టీషనర్ని సందర్శించి బలహీనత మరియు అలసట గురించి ఫిర్యాదు చేసింది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
ఋతు బాధ మరియు రక్తహీనతకు:
#1. CC3.1 Heart tonic + CC8.8 Menses irregular + CC12.1 Adult tonic...TDS
ఆమె #1 ని ప్రారంభించడానికి ముందు నొప్పి నివారణ మందులను నిలిపి వేసింది కానీ యాంటాసిడ్ కొనసాగించింది.
2017 మే 19న, తన తదుపరి సందర్శనలో గత 25 సంవత్సరాలలో ఋతుస్రావ సమయంలో మొదటి సారి నొప్పి కలుగలేదని సంతోషంగా తెలియ జేసింది. ఆమెను #1 ని కొనసాగించాలని కోరుతూ ఆమ్లత్వం కోసం క్రింది రెమిడీ ఇవ్వబడింది:
ఆమ్లత్వము కోసము:
#2. CC4.10 Indigestion...TDS
ఈ సమయంలో ఆమె యాంటాసిడ్ ట్యాబ్లెట్లను కూడా నిలిపివేసింది. 8 వారాల తర్వాత జులై 16 న, జూన్ మరియు జూలై ఋతు చక్రాల సమయంలో ఆమెకు నొప్పి లేకుండా ఉందని మరియు ఆమ్లత్వం నుండి పూర్తిగా విముక్తి పొందానని ఆమె ప్రాక్టీషనర్కి తెలియజేసింది. ఆమెకు ఇక ఎంత మాత్రము బలహీనత మరియు అలసట లేని మీదట ఆమె మరొక రక్త పరీక్ష కోసం వెళ్లవలసిన అవసరం లేదని భావించింది. #1 మరియు #2 యొక్క మోతాదు రెండు వారాల పాటు BD కి, ఆ తర్వాత మరో రెండు వారాలు ODకి తగ్గించబడి, క్రమంగా తగ్గిస్తూ 2017 సెప్టెంబర్ 30న ఆపి వేసేముందు వరకూ OW గా కొనసాగించింది.
వైబ్రియానిక్స్ రెమెడీల ప్రభావంతో ప్రేరణ పొందిన ఆమె కుటుంబసభ్యులంతా ప్రాక్టీషనర్ నుండి రెమిడీలు తీసుకోవడం ప్రారంభించారు. 2020 ఏప్రిల్ నాటికి వ్యాధి లక్షణాల పునరావృతం కాకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు రోగి తెలిపింది.