వంధత్వము - అంగస్తంభన లోపం, అండాశయ తిత్తి 10980...India
ఒక యువ జంట 2011 లో వివాహం అయిన నాటి నుండి గత మూడు సంవత్సరాలుగా పిల్లల కోసం ప్రయత్నం చేస్తున్నారు. 2014 మార్చి 26 వ తేదీన 26 ఏళ్ల భర్త తన వైద్య నివేదికతో ప్రాక్టీషనర్ వద్దకు వచ్చారు. తను అంగస్తంభన లోపంతో బాధపడుతున్నట్లు నివేదిక చూపించింది. అతను మొదట ఆయుర్వేద మందులు తదుపరి చాలా ఖరీదైన హోమియోపతి చికిత్స రెండు సంవత్సరమూల పాటు తీసుకున్నా ఏమి ప్రయోజనం కనిపించలేదు. అతనికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
CC14.3 Male infertility…TDS
రెండు వారాల తర్వాత రోగి తన అంగస్తంభన మునుపటి కంటే 50 శాతం మెరుగ్గా ఉందని తెలిపారు. 2014 ఏప్రిల్ 5 న అతను తన భార్యతో వచ్చాడు. అతని అంగం పూర్తిగా మెరుగై ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అతను మరో 2½ నెలలు TDS గా మరో రెండు నెలలు కొనసాగించి 2014 జూన్ 20న ఇక దానితో అవసరం ఉండదని తన స్వంత ఒప్పందం మీద దానిని ఆపి వేసాడు.
భర్త యొక్క శీఘ్ర మెరుగుదల నుండి ప్రేరణ పొందిన 23 ఏళ్ల భార్య తన సమస్యలకు కూడా వైబ్రియానిక్స్ ప్రయత్నించాలని కోరుకున్నారు. ఆమె గత సంవత్సర కాలంగా క్రమరహిత మరియు ఆలస్యమైన బహిష్టు కాలాలను అనుభవిస్తున్నది. ఋతు చక్రాల మధ్య రెండు మూడు నెలల అంతరం ఉంటోంది. 2013 డిసెంబర్ లో నిర్వహించిన అల్ట్రాసౌండ్ స్కానింగ్ లోఅండాశయ తిత్తి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆమెకు 2014 ఏప్రిల్ 5న క్రింది రెమిడీ ఇవ్వబడింది:
CC8.1 Female tonic + CC8.4 Ovaries & Uterus + CC8.8 Menses irregular…TDS
2014 మే నుండి జూలై వరకూ ఆమె తదుపరి మూడు ఋతు చక్రాలు క్రమం తప్పకుండా వచ్చాయి. మరియు దంపతులకు ఎంతో ఆనందాన్ని అందిస్తూ 2014 ఆగస్టులో భార్య గర్భం దాల్చినది. గర్భధారణ సమయంలో తీసుకున్న సాధారణ స్కానింగ్ రిపోర్టు ప్రకారం ఆమె అండాశయంలో తిత్తి లేదని కూడా తెలిపింది. గర్భధారణ సమయంలో రెమిడీ కొనసాగించమని ఆమెకు సలహా ఇచ్చినప్పటికీ ఆ దంపతులు 2015 మే 29 న తమకు ఆరోగ్యకరమైన ఆడపిల్ల పుట్టిందని శుభ వార్త తెలపడానికి మాత్రమే ప్రాక్టీషనర్ని కలిశారు. 2018 మే లో ఆమె అబ్బాయికి జన్మనిచ్చింది. తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు మొత్తం కుటుంబం ఏదైనా ఆరోగ్య సమస్యకు వైబ్రియానిక్స్ రెమెడీలు మాత్రమే తీసుకుంటున్నారు. 2020 ఏప్రిల్ నాటికి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు.
2019 మార్చి 15న రోగియొక్క వాంగ్మూలము: అంగస్తంభన విషయంపై నేను మరియు నా భార్య అండాశయ తిత్తి మరియు క్రమరహిత ఋతు కాలాల కోసం నా భార్య 2014 మార్చి లో వైబ్రియానిక్స్ ఔషధాలను తీసుకున్నాము. పై సమస్యల కారణంగా వివాహం అయిన మూడు సంవత్సరాల వరకు మాకు సంతానం లేదు. మూడు నెలల వైబ్రో ఔషధ సేవనం తర్వాత నా భార్య గర్భం దాల్చింది. 2015 మే లో మాకు ఒక ఆడపిల్ల అనుగ్రహింపబడింది. ఇటీవల 2018 లో మాకు ఒక అబ్బాయి కూడా పుట్టాడు. 2014 నుండి ఈరోజు వరకు మేము పైన పేర్కొన్న సమస్యలకు వేరే ఇతర మందులు ఏవీ తీసుకోలేదు. వ్యాధి లక్షణాలు కూడా పునరావృతం కాలేదు. ఈ సమస్యల నుండి బయట పడటానికి సహాయపడినందుకు వైబ్రియానిక్స్ చికిత్సకు మరియు సాయిబాబా వారికి కృతజ్ఞులము.