ఆందోళన, క్రుంగుబాటు, భయాందోళన, చెవిలో హోరు 02899...India
63 ఏళ్ళ మహిళ, గత పది సంవత్సరాలుగా ఆందోళన, నిరాశ, భయాందోళన మరియు నిద్రలేమితో బాధపడుతోంది. ఆమె పూర్తిగా అల్లోపతీ మందుల పై ఆధారపడింది ఎందుకంటే ఇవి ఉన్మాద దాడులను నియంత్రించడంలో సహాయపడ్డాయి; అంతేకాక, పనికి వెళ్లి తన సాధారణ కార్యకలాపాలను చేసుకోవడానికి సహకరిస్తున్నాయి. ఆమె వాటిని కొనసాగించడం మానివేస్తే వ్యాధి లక్షణాలు తిరిగి రావడమే కాక ఆమె పరిస్థితి మరింత దిగజారుతోంది. మందులు తీసుకోవడం ప్రారంభిస్తే ఆమెకు కాస్త నెమ్మదిస్తున్నది కానీ ఆమె తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పడుతోంది. అనారోగ్యం యొక్క ప్రస్తుత దశ 2016 ఏప్రిల్ 1 న ప్రారంభమై ఇది తీవ్ర భయాందోళనగా పరిణమించి దీనితో పాటు ఆమె తలలో హోరు (టినిటస్), ఆకలి లేకపోవడం కూడా ఏర్పడ్డాయి. ఆమె పనికి వెళ్ళి నేరుగా ఇంటికి తిరిగి రావడమే తప్ప బయటకు వెళ్ళడానికి లేదా ఇంట్లో సందర్శకులను ఆహ్వానించడానికి ఆసక్తి ఉండేది కాదు. నిరంతరం సందడి చేసే చెవిలో హోరు ఆమెకు నిద్రపట్టకుండా చేసి నిద్రమాత్రలు కూడా ఏ మాత్రం సహాయం చేయని పరిస్థితి ఏర్పడింది. 2016 జూలై నుండి ఈ పరిస్థితి అత్యంత దయనీయంగా మారడంతో ఆమె పనికి వెళ్లడం కూడా మానేసింది. డాక్టర్లు ఆమె చెవిలో హోరుకు కారణం గుర్తించాలనుకొన్నారు. 2016 జూలై 24న, మెదడుకు MRI స్కానింగ్ కోసం పంపబడింది, కానీ దానికి కారణం నిరూపితం కాలేదు. ఆమె పరిస్థితి రానురాను మరింత క్షీణించింది. 20 ఏళ్లుగా అల్లోపతి మందులతో అనుబంధం కారణంగా అల్లోపతీపై గట్టి నమ్మకం ఉన్నప్పటికీ, 2016 ఆగస్టు 23 న ఆమె ప్రాక్టీషనర్ని చూడడానికి అంగీకరించారు. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది:
#1. CC5.3 Meniere’s disease + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC15.6 Sleep disorders + CC17.3 Brain & Memory tonic…TDS
రోగి యొక్క కవల సోదరి ప్రాక్టీషనర్తో సన్నిహితంగా ఉన్న కారణంగా మొదటి మోతాదు తర్వాత తన సోదరి #1 ని ఒక్కసారి కూడా తీసుకోలేదని తెలిపారు. తర్వాత రెండు నెలల్లో ఆమె పరిస్థితి క్రమంగా అధ్వానంగా తయారై ఆమె ఆసుపత్రికి మరియు వెలుపలకు తిరుగుతోంది. ఆమె చాలా అరుదుగా ఏదైనా తినగలుగుతోంది, చాలా బలహీనపడింది మరియు నిద్ర కూడా పట్టడం లేదు. రానురాను ఆమె ఇంటి నుండి బయటకు వెళ్ళే స్థితి పోయింది. ఆమె తీసుకుంటున్న చికిత్స ఆమెకు ఏమాత్రం సహాయం చేయడం లేదని ఆమెకు అనిపించి ఆమె సోదరితో తానిక చనిపోతానేమోనని భావిస్తున్నట్లు చెప్పింది. రోగి సోదరి అట్టి నిరాశావాహ పరిస్థితిలో 2016 అక్టోబర్ 28 న ప్రాక్టీషనర్ని సంప్రదించింది. రోగికి వైబ్రియానిక్స్ తీసుకోవడంలో సుముఖత లేనందువలన రోగికి సహాయం చేయడానికి చేయగలిగినది ఏమైనా ఉందా అని ప్రాక్టీషనర్ని రోగి సోదరి అడిగింది. ప్రాక్టీషనర్ అదే సమయంలో తన SVP కోర్సు పూర్తి చేసి ఉన్నందున అక్టోబర్ 31న రోగి యొక్క పూర్తి నిడివి చిత్రాన్ని ఉపయోగించి బ్రాడ్కాస్టింగ్ చేయడం ప్రారంభించారు. దాని కోసం క్రింది రెమిడీ ఉపయోగించారు:
#2. NM5 Brain TS + NM6 Calming + NM12 Combination-12 + NM88 Meniere's disease +
SM39 Tension + SM41 Uplift...TDS
అదే రోజు రోగి ప్రశాంతంగా ఉండడంతో పాటు కొద్దిగా ఆహారం కూడా తీసుకుంది. అదేరోజు సాయంత్రం ఆమె తన కొడుకు మరియు మనవరాళ్ల ను చూడటానికి బయలుదేరింది. బ్రాడ్కాస్టింగ్ కొనసాగుతున్నప్పుడు ఆమె ప్రతీ రోజు తినే ఆహారంలో క్రమంగా స్వల్ప పెరుగుదలతో పాటు ఆమె మామూలుగానే సంభాషించడం ప్రారంభించింది. మూడు రోజుల్లో ఆమె భయాందోళనలు మరియు ఆకలి విషయంలో 50% మెరుగుదల కలిగింది, కానీ తలలో హోరు మాత్రం కొనసాగింది. కనుక 2016 నవంబర్ 3న రెమిడీ క్రింది విధంగా మెరుగుపరచ బడింది:
#3. SM19 Ears + #2...TDS
2016 నవంబర్ 8 నాటికి రోగి చాలా బాగుంది. కానీ ఆమె తలలో హోరు 50 శాతం మాత్రమే తగ్గింది. ఆమె ఇప్పుడు MRI స్కానింగ్ ఫలితాలు పొందగా అంతా సాధారణంగా ఉన్నట్లు చూపాయి. రోగి ఇప్పుడు రెమిడీ #3 నోటికి తీసుకోవడానికి ఇష్టపడడంతో ఆమె సోదరి రెమిడీ ని అందజేసింది, బ్రాడ్కాస్టింగ్ నిలిపి వేయబడింది. 2017 చివరి వారం నాటికి తలలో హోరు 60% తగ్గింది. ఈ సమయంలో ఆమెను ఒక కన్సల్టెంట్ కు చూపించగా ఆమె అల్లోపతి మందులు ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల రసాయనాల విషాల వల్ల ఏర్పడిందని నిర్ధారించారు. డాక్టర్లు ఔషధాలను తగ్గించడం ప్రారంభించారు. ఆమె వైబ్రియానిక్స్ తీసుకోవడం కొనసాగించింది. మార్చి చివరినాటికి ఆమె త్వరగా 90% ఉపశమనం కలగడంతో రెమిడీ ని BD కి తగ్గించి దాన్ని ఆపి వేయడానికి ముందు క్రమంగా తగ్గించబడింది. 2017 జూలై చివరి నాటికి ఆమెకు 100% ఉపశమనం కలిగింది. ఆమె ఇప్పుడు ఎటువంటి మందులు తీసుకోవడం లేదు ప్రస్తుతం చాలా సాధారణంగా ఉంది. 2017 సెప్టెంబర్ నుండి తన పూర్తి టైం పనికి వెళ్లి కలుగుతోంది.
2020 మార్చి నాటికి ప్రాక్టీషనర్ అప్డేట్: మోతాదును BD కి తగ్గించినప్పుడు రోగి రెమెడీ తీసుకోవడం మానివేసి దాని గురించి నిశ్శబ్దంగా ఉంది. ఆమె డిసెంబర్ 2019 వరకు ఎటువంటి మందులు లేకుండా విరామ స్థితిలో ఉన్నా బాగానే ఉంది. కానీ ఆమెకు భయాందోళన స్వల్పంగా పునరావృతమైనా తనను తాను చికిత్స చేసుకోగలననే నమ్మకంతో ఆమె వైబ్రియానిక్స్ తో సహా ఏ మందులూ తీసుకోకూడదని నిర్ణయించుకుంది. స్వల్ప భయాందోళన ఉన్నప్పటికీ ఈ కేసును సానుకూల ధృక్పథంతో చూసినప్పుడు 10 సంవత్సరాల పాటు తీవ్రమైన అనారోగ్య స్థితిలో ఉన్న రోగికి ఐదు నెలల వైబ్రియానిక్స్ చికిత్స అనంతరం పూర్తి ఉపశమనం కలగడమే కాక ఎవరి సహాయం లేకుండా తనను తాను నిర్వహించగలిగే అంత బలంగా మారడం విశేషం.
108CC ద్వారా ఇస్తున్నట్లైతే #2 బదులుగా: CC5.3 Meniere’s disease + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.2 Cleansing; for #3: CC5.1 Ear infections + CC5.3 Meniere’s disease + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC17.3 Cleansing ఇవ్వండి