పార్శ్వపు నొప్పి 12013 & 11553...India
29 ఏళ్ల మహిళ 2014 డిసెంబర్ నుండి నెలలో 15 నుండి 20 రోజులు తీవ్రమైన తల నొప్పితో బాధపడుతోంది. నొప్పి కళ్ళకు పైన మొదలై తలకు ఎడమ వైపు తీవ్రంగా ఆమె పడుకునే వరకు రోజంతా ఉంటోంది. కొన్నిసార్లు ఇది చలి మరియు జ్వరంతో కూడా ఉంటూ ఉష్ణోగ్రత 102F వరకూ పెరుగుతుంది, మరియు ఆమె ఔషధం తీసుకుంటే మాత్రం తగ్గుతుంది. CT స్కాన్ ఎటువంటి అసాధారణతను చూపించలేదు. అందుచేత ఈ పరిస్థితికి అధిక పని ఒత్తిడి పర్యవసానంగా ఏర్పడిన మానసిక ఒత్తిడి కారణమని పేర్కొన్నారు. ఆమె ఒక సంవత్సరం పాటు అల్లోపతి మందులు తీసుకుంది, కానీ దానివల్ల కడుపులో మంట పెరగడంతో వాటిని నిలిపివేసింది.
2015 డిసెంబర్ లో ఆమె అలోపతి నుండి హోమియోపతి చికిత్సకు మారి 2017 వరకూ కొనసాగించడంతో 75% మెరుగుదల పొందారు, కానీ ఇప్పుడు నొప్పి వారానికి ఒకసారి వస్తోంది. నొప్పి మరీ ఎక్కువ తీవ్రంగా కూడా ఉండకపోయినా నొప్పి వచ్చిన ప్రతీసారి మూడు నాలుగు గంటల వరకు కొనసాగుతొంది. 2017 జూన్ నాటికి కూడా ఏమాత్రం మెరుగుదల లేకపోగా ఇది చాలా ఆర్థిక భారం అయినందున ఆమె చికిత్స మానివేసింది. పదిహేను రోజుల తర్వాత తలనొప్పి అదే తీవ్రతతో ప్రారంభమైంది. అందువల్ల ఆమె చికిత్సను తిరిగి ప్రారంభించగా పూర్వపు 75% మెరుగుదల రావడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఇక అంతకంటే మెరుగుదల రాదేమో అని తోచి ఆమె పూర్తి ఉపశమనం కలిగించే ప్రత్యామ్నాయ చికిత్స కోసం వెతకటం ప్రారంభించింది. త్వరలోనే సాయి వైభ్రియానిక్స్ గురించి తెలుసుకొని హోమియోపతి చికిత్సను ఆపివేసి 2018 ఫిబ్రవరి 15న, ప్రాక్టీషనర్ని సంప్రదించింది. ఆమెకు క్రింది రెమిడీ ఇవ్వబడింది :
CC4.10 Indigestion + CC11.3 Headaches + CC11.4 Migraines + CC15.1 Mental & Emotional tonic + CC19.5 Sinusitis…6TD
2018 ఏప్రిల్ 30 న రోగి గత రెండున్నర నెలల్లో పదిహేను రోజులకు ఒకసారి మాత్రమే తలనొప్పితో బాధపడుతూ ఉన్నందున ఆమె మునుపటి కంటే చాలా మెరుగ్గా ఉందని తెలిపింది. తీవ్రత చాలా తక్కువగా ఉంది మరియు తలనొప్పి రెండు మూడు గంటలు కొనసాగింది. జూన్ 30న తలనొప్పి తక్కువ తరచుగా మరియు ఒక గంట మాత్రమే ఉంటోంది కాబట్టి మోతాదు TDS కు తగ్గించబడింది. తలనొప్పి మరింత తగ్గి 2018 సెప్టెంబర్ 30 నాటికి, ఆమెకు పూర్తి ఉపశమనాన్ని ఇస్తూ తలనొప్పి అదృశ్యం అయింది. ఆమె తలనొప్పి పునరావృతం అవుతుందనే భయంతో TDS వద్ద మరికొన్ని నెలలు కొనసాగించటానికి ఇష్టపడింది. 2019లో, మోతాదు OD కి తగ్గించబడింది, ఏప్రిల్ 2020 నాటికి ఇంకా కొనసాగుతోంది ఎందుకంటే దాన్ని ఆపడానికి లేదా తగ్గించడానికి ఆమె ఇష్టపడడం లేదు.