కుక్కలో ఎర్లిచియోసిస్, పనోస్టైటిస్ 03571...थाईलैंड
ప్రాక్టీషనర్ జూలై 2018 లో AVP గా అర్హత సాధించి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను తన 2 సంవత్సరాల పెంపుడు కుక్క బ్రౌనీని పొరుగున ఉన్న తన స్నేహితుడి ఇంటి నుండి తీసుకోవటానికి వెళ్ళినప్పుడు, ఆ కుక్క కదలలేని స్థితిలో చూసి షాక్ అయ్యాడు(చిత్రాన్ని చూడండి).
అది ఎముకలు మరియు మాంసం కాండ వుండి ప్రాణం లేని జీవచ్చంలాగా ఉన్నది. ప్రాక్టీషనర్ కుక్కను పైకి ఎత్తినప్పుడు, అది నేల మీద పడిపోయింది. అది అలసిపోయినది మరియు 4 కిలోల బరువు తగ్గింది.
6 ఆగస్టు 2018 న, అతను నీటి గిన్నెలో ఈ క్రింది మందుని కలిపి ఇచ్చాడు:
# 1. CC1.1 Animal tonic + CC18.4 Paralysis + CC20.4 Muscles & Supportive tissue + CC20.5 Spine + CC20.7 Fractures…6TD
3 రోజుల తరువాత, పరిస్థితిలో మెరుగుదల లేనందున, ప్రాక్టిషనర్ దాన్ని సమీపంలోని పశువైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. దానికి ఎర్లిచియోసిస్ అని పిలువబడే టిక్-బర్న్ అంటు వ్యాధి వచ్చినదని నిర్దారించారు. ఇది బ్రౌన్ టిక్ బైట్స్ వల్ల వ్యాపించింది; దానికి యాంటీబయాటిక్స్ మరియు పెయిన్ కిల్లర్స్ ఇమ్మని రాసిచ్చారు.
దానితో పాటు మరొక కాంబో 9 ఆగష్టు 2018 ఇవ్వబడింది.
# 2. CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC17.2 Cleansing + CC18.5 Neuralgia + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions + #1…6TD,
ఆ కుక్క గిన్నెలో బ్రౌనీ నీరు త్రాగటం మానేయడం తో సిరంజి ద్వారా నోటిలో ఇచ్చారు.
బ్రౌనీ పరిస్థితి క్రమంగా మెరుగుపడింది. ఒక వారంలో, అది తన కుడి కాలు మీద కుంటుతున్నప్పటికీ, నెమ్మదిగా నడవడం ప్రారంభించింది. మరో వారం తరువాత, అది మామూలుగా తయారైయి దాదాపు 3 వారాల పాటు అలాగే ఉంది. అల్లోపతితో పాటు వైబ్రియోనిక్స్ వాడకం వల్ల త్వరగా ఆరోగ్యమును తిరిగి పొందుటకు కారణమని ప్రాక్టిషనర్ పేర్కొన్నాడు.
అయితే దాని కాళ్ళు గట్టిగా మారడం ప్రారంభించి ఒక వారంలో అంటే 18 సెప్టెంబర్ 2018 న, అది కదలలేని స్థితికి వచ్చి నొప్పితో అరవడం ప్రారంభించింది. దాన్ని అలా ఆ పరిస్థితిలో చూసి ప్రాక్టిషనర్ కి హృదయాన్ని పిండేసినట్లైంది. ప్రాక్టీషనర్ మళ్ళీ దాన్ని కొన్ని రోజుల పాటు యాంటీబయాటిక్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇంజెక్షన్లతో చికిత్స చేసిన పశువైద్యుని వద్దకు తీసుకువెళ్ళాడు. కుక్క యొక్క పరిస్థితిని పనోస్టైటిస్ అని పిలుస్తారు, దీనివల్ల నొప్పి ఒక అవయవం నుండి మరొక అవయవానికి మారుతుంది. ఈ వ్యాధికి ఎర్లిచియోసిస్ అనేది ఒక సాధారణ కారణంగా భావిస్తారు. దాని స్థితిలో ఎటువంటి మెరుగుదల లేనందున, దాని సెరిబ్రల్ ద్రవాన్ని తనిఖీ చేయడానికి బ్రౌనీని బ్యాంకాక్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యుడు సూచించారు.
24 సెప్టెంబర్ 2018 న, స్వామిని ప్రార్థించిన తరువాత, ప్రాక్టీషనర్ బ్రౌనీని ఎక్కడకు తీసుకో పోకూడదని నిర్ణయించుకున్నాడు, అల్లోపతి ఔషధాన్ని ఆపివేసి, పూర్తిగా కొత్త కాంబో నీళ్లలో కలిపి సిరేంజి ద్వారా దాని నోట్లో ఇచ్చాడు
#3. CC3.7 Circulation + CC9.1 Recuperation + CC9.4 Children’s diseases + CC10.1 Emergencies + CC20.7 Fractures + CC21.11 Wounds & Abrasions… 6TD in water through a syringe into his mouth
బ్రౌనీ క్రమంగా కోలుకోవడం ప్రారంభించాడు మరియు 25 అక్టోబర్ 2018 నాటికి ఒక నెలలో 100% ఫిట్ అయ్యాడు (చిత్రాన్ని చూడండి).
అది సాధారణంగా తినడం మొదలుపెట్టింది మరియు తన బరువును కూడా తిరిగి పొందింది. కాబట్టి, మోతాదును TDS కు తగ్గించారు. పాపం, 2019 కొత్త సంవత్సరం సందర్భంగా టపాకాయల నుండి తప్పించుకోవడానికి ఇంటి బయట పరుగెత్తినప్పుడు, రహదారిపై జరిగిన ప్రమాదంలో విధి దాని ప్రాణాలను తీసుకుంది.