నెర్వస్ నెస్/భయము 11271...India
43-సంవత్సరాల పాఠశాల ఉపాధ్యాయుడు గత 10 సంవత్సరాలుగా ఆత్మవిశ్వాసం కోల్పోయి ప్రతీ విషయంలోనూ భయానికి గురవుతూ ఉండేవారు. దీనివలన వీరు నల్లబల్ల పైన కూడా కుదురుగా వ్రాయలేకపోయేవారు. ఇది వారి కెరీర్ ను ప్రభావితం చేయసాగింది. ఎవరయినా చూస్తూ ఉంటే రిజిస్టర్ లో సంతకం పెట్టడానికి కూడా భయపడేవారు చేతులు వణుకు తూ చేతి వ్రాత ఆస్పష్టంగా మారిపోయేది. డాక్టర్లు దీనిని నాడీ సంబంధ మైన వ్యాధిగా గుర్తించారు. వీరు అనేక రకాల మందులు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం అంతంతమాత్రమే. కనుక వైబ్రో మందులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు.
11 అక్టోబర్ 2014 న వీరికి క్రింది రెమిడి ఇవ్వబడింది:
#1. CC18.1 Brain & Memory tonic + CC18.4 Paralysis + CC20.5 Spine…TDS
4 వారాల తరువాత వీరి చేతి వ్రాత లో మార్పు వచ్చింది కానీ భయం మాత్రం అలాగే కొనసాగుతూ ఉండడంతో ప్రాక్టీ షనర్ 8 నవంబర్ 2014 న క్రింది రెమిడి ఇచ్చారు:
#2. CC15.2 Psychiatric disorders + CC18.4 Paralysis + CC20.5 Spine…TDS
చికిత్స ప్రారంభించిన రెండు నెలల తరువాత పేషంటుకు ఆత్మవిశ్వాసం, ఆందోళన విషయంలో 50% మెరుగుదల కనిపించింది. ఇప్పుడు వీరు ధైర్యంగా బోర్డు మీద వ్రాయగలుగు తున్నారు. మరో రెండు నెలల తరువాత వీరి పరిస్థితి లో 75% మెరుగుదల కనిపించింది. 9 మే 2015 నాటికి వీరికి 90% మెరుగుదల కనిపించింది. 2015 జూలై నాటికి వీరికి పూర్తిగా ఉపశమనం కలగడంతో డోసేజ్ ను OD గా తీసుకోవలసిందిగా ప్రాక్టీషనర్ సూచించారు. కానీ పేషంటు దీనికి నిరాకరించి TDS గానే కొనసాగించాలని భావించారు. కనుక వీరికి 100% ఉపశమనం కలిగినా 2018 ఆగస్టు నాటికి ఏ ఇబ్బంది లేకుండా TDS గానే మోతాదు కొనసాగిస్తూ ఉన్నారు.
ప్రాక్టీషనర్ CC20.5 వేసే అవసరం లేదని తెలుసుకున్నప్పటికీ ఈ కొంబో ఉపశమనం కలిగిస్తోంది కావున దీనిని అలాగే కొనసాగించారు.