విట్రస్ ఫ్లోటర్స్ ( మెరిసే కంటి మచ్చలు ) మరియు గ్లుకోమా 10608...India
2017 ఫిబ్రవరి17 న, 65 ఏళ్ల మహిళ తనకు 2016 సెప్టెంబర్ 3 నుండి కంటిలో మెరుపులు మరియు గ్లకోమా వ్యాధుల చికిత్స కోసం ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. ఆమె కుడి మరియు ఎడమ కళ్ళల్లో మాములుగా ఉండవలసిన పీడనము 12 to 22mm Hg కన్నా ఎక్కువగా 28 మరియు 34 ఉన్నాయి. వైద్యుడు దీనికి లేజర్ శస్త్రచికిత్సయే శాశ్వత నివారణ అని సలహా ఇచ్చారు. కానీ కనీసం శస్త్రచికిత్స ఆలోచన కూడా భరింపలేని స్థితిలో భయపడి పోయి అశాంతికి గురైన పేషంటుకు వైద్యుడు ప్రస్తుతం కంటి వత్తిడి తగ్గడానికి కంటి చుక్కలను వ్రాసి ఇచ్చారు.
కంటి చుక్కల మందులు ఖరీదైనప్పటికీ, కంటి ఆపరేషన్ బాధ తప్పిందనే ఆనందంతో పేషంటు మందులు వాడసాగారు. కంటి చుక్కలను ఉపయోగించిన ఐదు నెలల తర్వాత, మరలా పరీక్షలు నిర్వహించగా కంటి ఒత్తిడి అలాగే హెచ్చు స్థాయిలోనే ఉందని (18 మరియు 25) కనుక ఎంత తొందరగా వీలయితే అంత తొందరగా లేజర్ శస్త్రచికిత్స కు సిద్ధం కావాలని వైద్యుడు సూచించారు. ఐతే ఒక స్నేహితుని సూచన పైన వైబ్రో చికిత్స తీసుకొనడానికి పేషంటు నిర్ణయించుకున్నారు.
పేషంటు కంటి చుక్కలను వేసుకోవడం కూడా మానివేసి వైబ్రో అభ్యాసకుడు ఇచ్చిన క్రింది రెమిడి వేసుకోవడం ప్రారంభించారు:
#1. CC3.7 Circulation + CC7.5 Glaucoma + CC11.3 Headache + CC15.1 Mental & Emotional tonic...6TD
#2. CC7.5 Glaucoma...6TD నీటిలో కలుపుకొని కంటికి చుక్కల మందు వలె వాడాలి
నెల రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించగా డాక్టర్ ఊహకు కూడా అందని విధంగా అద్భుతమైన మెరుగుదల కనిపించింది. కంటి పీడనము వరుసగా 15 మరియు 16కు తగ్గిపోయింది. కనుక శస్త్ర చికిత్స అవసరం లేదని వైద్యుడు చెప్పారు. అంతేకాక పేషంటు తన ఆహారము మరియు జీవనవిధానము అలవాట్లు ఏమయినా మార్చుకొనడం వల్ల అంత త్వరగా మార్పు సంభవించిందా అని ఆరా చేసారు. పేషంటు తను తీసుకుంటున్న వైద్య చికిత్స గురించి వివరాలు ఏమీ తెలపకుండా అలోపతి మందులు ఆపివేసి వైబ్రో రెమిడిలు కొనసాగించారు. #1 మరియు #2 ల యొక్క మోతాదు 6TD నుండి TDSకు తగ్గించడం జరిగింది. ప్రస్తుతం పేషంటుకు వ్యాధి లక్షణాలన్నీ పూర్తిగా అదృశ్యం ఐనప్పటికీ ముందు జాగ్రత్త కోసం రెమిడిలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ప్రాక్టీషనర్ వ్యాఖ్యలు:
పేషంటు త్వరగా కోలుకొనడానికి కారణం ఆమె క్రమశిక్షణతో కూడిన ఔషద సేవనం క్రమం తప్పకుండా మందులు వాడడం.