కంటి చూపు కోల్పోవుట 11958...India
రెండు సంవత్సరాల నుండి షార్ట్ సైట్ సమస్య (దూరపు వస్తువులు కనబడకపోవుట) కలిగియున్న ఒక 40 ఏళ్ల మహిళ వైబ్రో చికిత్సా నిపుణులను 2015 జులై 13 న సంప్రదించడం జరిగింది. ఆమెకు మాక్యులర్ డిస్ట్రాఫి (కంటి కండరాల బలహీనత) ఉన్నట్లుగా వైద్యులచే నిర్ధారించబడింది. ఆమె కంటి చూపు యొక్క రిపోర్ట్ : RE -6/60 (కుడి కన్ను), LE - 6/24* (ఎడమ కన్ను) మరియు నియర్ విషన్ (సమీప ద్రిష్టి) N36**. ఆమె లండన్ మరియు ఇండియా లో అనేక వైద్యులను సంప్రదించడం జరిగింది. ఆమె క్రమంగా కంటి చూపు పూర్తిగా కోల్పోయే అవకాశముందని వైద్యులచే చెప్పబడమే కాకుండా, ప్రపంచంలో ఎక్కడైనా ఆమె కంటి సమస్యకు చికిత్స లభించిన సందర్భంలో చికిత్సకు కావలసిన ఖర్చులను తాము భరిస్తామని వైద్యులు సవాల్ చేశారు! 2013 డిసెంబర్ లో కంటి చూపు కోల్పోవడం కారణంగా ఆమె తన ఏవియేషన్ ఇంజనీరు ఉద్యోగాన్ని రాజీనామా చేయడం జరిగింది. ఆమెకు ఇతర ఆరోగ్య సమస్యలు లేని కారణంగా ఏ విధమైన మందులను ఆమె తీసుకునేది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా కుటుంభంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలు మరియు కంటి చూపు కోల్పోవడం కారణంగా ఆమె డిప్రెషన్ కు (మనసు యొక్క క్రుంగుపాటు) గురైంది.
2015 ఆగస్టు 20 న ఆమెకు క్రింది కాంబోలు ఇవ్వబడినాయి:
#1. CC7.2 Partial vision + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC15.2 Psychiatric disorders + CC17.2 Cleansing…TDS
#2. CC7.2 Partial vision…QDS రోస్ వాటర్లో(పన్నీరు )కలపబడిన కంటి చుక్కలు
ఒక నెల రోజులలో రోగి యొక్క కంటి చూపు మెరుగుపడడం మొదలయింది. క్రమంగా ఆమె వ్యక్తులను గుర్తుపట్టడం, టీవీ మరియు వార్తాలేఖలో ముఖ్యవార్తలను చదవడం మరియు మొబైల్ ఫోనును ఉపయోగించడం వంటివి చేయగలిగింది. ఇప్పుడు ఆమె పెద్ద అక్షరాలను చదవగలుగుతోంది మరియు చిన్న అక్షరాలను చదివేందుకు వీలుగా మాగ్నిఫైయింగ్ గ్లాస్సెస్ (భూతద్దము) ఆమెకు ఇవ్వబడినాయి. 2016 జులై 1 న ఆమె యొక్క కంటి చూపు పరీక్ష ఫలితాలు: RE (కుడి కన్ను) 6/24, LE (ఎడమ కన్ను) 6/9; సమీప ద్రిష్టి ఇప్పుడు ఆమె పిల్లలకు పాఠాలు కూడా నేర్పగలుగుతోంది. కంటి చూపును తిరిగి ప్రసాదించినందుకు భగవంతుడుకు తన కృతజ్ఞతలను ఆమె తెలుపుకుంటోంది! ఆమె ఇప్పటికి వైబ్రో మందును తీసుకోవడం కొనసాగిస్తున్నది.
చికిత్సా నిపుణుల విమర్శ :
ఎటువంటి చికిత్స ద్వారా క్షీణించిన చూపును తిరిగి పొందే అవకాశం లేని ఈ రోగికి, వైబ్రియానిక్స్ ద్వారా కంటి చూపు పూర్తిగా తిరిగి రావడం గమనార్హం.
సంపాదకుడి వివరణము :
* షార్ట్-సైటేడ్నెస్ (హ్రస్వదృష్టి/ దూరపు పార్వలేని): 6/6 సాధారణ ద్రిష్టి యొక్క రీడింగ్స్. 6/12 ఉన్న వ్యక్తులు 6m లో ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. అయితే సాధారణ ద్రిష్టి గల వ్యక్తులు 12m వరకు వస్తువులను చూడగలుగుతారు. షార్ట్ సైట్ ఉన్న వారు సమీపంలో ఉన్న వస్తువులను మాత్రమే చూడగలుగుతారు. 6/12 లేక 6/24 కొలతలు ఉంటే, షార్ట్ సైట్ సమస్య ఉందని అర్థం.
** హ్రస్వదృష్టి యొక్క బలహీనత: హ్రస్వదృష్టి యొక్క బలహీనత : N5 అధిక హ్రస్వదృష్టి ను , N7-N8 స్వల్ప బలహీనతను, N10-N18 కొంత బలహీనతను, N20-N36 తీవ్రమైన బలహీనతను మరియు N48 అతి తక్కువ హ్రస్వదృష్టి ను సూచిస్తాయి.