Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

కాలిచీలమండలో ఎముక విరుపు (ఫ్రాక్చర్) 11520...India


2015 సెప్టెంబర్ 28న ఒక 53 ఏళ్ళ వ్యక్తికి కింద పడిపోవడం కారణంగా ఎడమ కాలి చీలమండ లో స్నాయువులు (లిగమెంట్) భాదితతో పాటు ఎముక విరుపు కలిగింది. కాలు వాచడంతో పాటు తీవ్ర నొప్పి కలిగింది(పటం చూడండి).

అప్పటికే, రోగికి, శరీరంలో తగినంత రక్తప్రసరణము జరగనందువల్ల తొంటికీలులో బంతిగిన్నెకీలు కలిసిపోయి, చలనశక్తి క్షీణించింది. వైబ్రో చికిత్స ద్వారా రోగి సొంతంగా నడవ గలిగేవారు మరియు రోజువారి చర్యలు చేసుకో గలిగేవారు. అయితే, చీలమండ ఎముక విరుపు ద్వారా కలిగిన నొప్పి కారణంగా అతనికి దినచర్యలు కొనసాగించడంలో ఇబ్బంది కలిగింది. సాయంత్రం మరియు రాత్రి సమయాల్లో నొప్పి మరింత తీవ్రంగా ఉండేది. కాలుని ఎనిమిది వారాల వరకు ప్లాస్టిక్ మూసలో (కాస్ట్) ఉంచమని వైధ్యులచే సలహా ఇవ్వబడింది కాని రోగి దానికి నిరాకరించారు. తనకి ఉన్న తొంటికీలు సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశముందని రోగి భయపడ్డారు. అందువల్ల వైద్యులు రోగిని  పెయిన్ కిల్లెర్లతో పాటు కాల్శియుం మరియు పైపూత మందును తీసుకోమని మరియు చల్లని కాపడం పెట్టుకోమని సలహా ఇచ్చారు. అయితే రోగి ఈ సలహాలని కూడా నిరాకరించారు. చల్లని కాపడం పెట్టుకున్నారు కాని వాతావరణం చల్లగా ఉన్న కారణంగా మానేశారు. రోగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా క్రింది వైబ్రో మందులు రోగికి ఇవ్వడం జరిగింది:

NM7 CB7 + NM67 Calcium + SM28 Injury + SR280 Calc Carb + SR295 Hypericum + SR311 Rhus Tax + SR353 Ledum + SR398 Nat Carb + SR550 Gnaphalium + SR574 Tendonitis + SR503 Ligament + CC10.1 Emergencies…6TD

ఎనిమిది దినాలలో, నొప్పి మరియు వాపులో 45% మెరుగుదల కనపడింది. రోగి, రోజువారి దినచర్యలు కొంత సహాయంతో చేసుకోవడం ప్రారంభించారు. మందుల మోతాదు QDS కి తగ్గించడం జరిగింది.

పదిహేను రోజుల తర్వాత వాపు పూర్తిగా తగ్గి, నొప్పి 65% వరకు తగ్గింది. రోగి దినచర్యలను సొంతంగా చేసుకోవడం తిరిగి ప్రారంభించారు. ఈ  కారణంగా మోతాదు TDS కి తగ్గించ బడింది.

24 రోజుల తర్వాత, అక్తోబెర్ 22న, రోగికి 100% ఉపశమనం కలిగింది. వాపు మరియు నొప్పి తగ్గి, కాలు సాధారణ స్థితికి వచ్చింది (పటం చూడండి). ఒక వారం రోజులకు మోతాదును BD కి, ఆపై OD కి తర్వాత OW కి తగ్గించడం జరిగింది. 2015 నవంబెర్ 14న వైబ్రో చికిత్స పూర్తయింది. అయితే, రోగి తన తొంతికీలు సమస్యకు వైబ్రో మందును వాడడం కొనసాగిస్తున్నారు.

సంపాదకుడి వివరణ: SR280 Calc Carb వాచిన మరియు మృదువైన ఎముకకు, SR295 Hypericum నరాల గాయాలకు; SR311 Rhus Tax అస్థిబంధకాల నొప్పులకు; SR353 Ledum చీలమండ వాపుకు; SR398 Nat carb బలహీనమైన చీలమండకు; SR550 Gnaphalium చీలమండ కీలుకు మరియు SR574 Tendonitis నొప్పితో కూడిన వాపుకు

                             After treatment

 

 


Before treatment