వైబ్రియోనిక్స్ సహాయంతో పెరుగుతున్న టొమాటోలు 00002...UK
ప్రాక్టీషనర్ ఈ విధంగా వ్రాస్తున్నారు: నేను గత కొద్ది సంవత్సరాలుగా పుట్టపర్తి లోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చెంత నివసిస్తున్నాను. నాకు ఒక చిన్న తోట ఉండటంతో దానిలో రకరకాల కూరగాయలు పెంచుతూ ఉంటాను. తోటలోని టమాటాలు నాటిన ఎనిమిది వారాల తర్వాత (నవంబర్ 2015 లో) ఆరడుగుల పొడుగు పెరిగి పిందెలతో బలంగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా గత సంవత్సరం నేను వైబ్రియానిక్స్ చేసిన ప్రయోగం వల్లనే సాధ్యమయ్యింది. గతంలో నేను వేసిన మొక్కలు 4 అడుగుల ఎత్తు మాత్రమే పెరిగి చిన్న టమాటాలు కాయడంతో వీటి ఫలితాలపై అసంతృప్తిగా ఉన్నాను. అందుచేత కొత్త విత్తనాలు నాటినప్పుడు నేను వాటికి క్రింది రెమిడీ ఇచ్చాను:
CC1.1 animal tonic + CC1.2 plants tonic + SR264 Silicea 3X…OD నీటిలో కలిపి, 2లీటర్స్ బాటిల్ తో విత్తనాలపై చల్లాను.
విత్తనాల నుండి మొక్కలు మొలిచిన తర్వాత వాటిని కుండీల నుండి వేరు చేసి నేలపై నాటాను. ఈ నాటడంలో అవి ఒత్తిడికి గురవుతాయి కనుక వాటికి తగినంత బలం ఇచ్చే ఉద్దేశంతో మూడు రోజుల వరకు OD గా రెమిడీ కొనసాగించాను. వెంటనే మొక్కలు బలాన్ని పుంజుకొని యేపుగా పెరగసాగేయి. తర్వాత కొన్నినెలలవరకూ ప్రతీరోజూ 5రోజుల కొకసారి చల్లుతూ ఉండేవారము. మొక్కలు 5 ½ అడుగుల ఎత్తుపెరిగి, మంచి మేలురకం పెద్దసైజ్ టొమాటోలు కాయసాగినవి. వానిలో కొన్ని చాలా పెద్ద సైజు వరకు పెరిగి రెండు మూడు టమాటాలు సుమారు ½ కిలో వరకు బరువు తూగినట్లు కనుగొన్నాము. (ఫోటోలో చూడవచ్చు).
మేము వేసిన ఇతర కూరగాయలు కొర్జెట్స్, బచ్చలికూర, స్విస్ చార్డ్, వంకాయలు మరియు పాలకూర వంటివి ఆరోగ్యమైనవిగా మరియు బలంగా ఉన్నట్లు గమనించాము. మొక్కలు అన్నిటికీ మా గార్డెన్ లో తయారుచేసిన కంపోస్టు ఎరువు వేయడంతోపాటు గొంగళి పురుగులు, ఆఫిడ్స్(ఆకుపేను/పచ్చదోమ), ఈగలు , చీమలు, మిలీబగ్స్(పిండి పురుగులు) మరియు ఇతర కీటకాలు మరియు తెగుళ్ల నుండి రక్షించడానికి ఇంట్లో తయారు చేసిన మిరపకాయ మిశ్రమంతో పిచికారి చేసాము. మేము పైన పేర్కొన్న వైబ్రియానిక్స్ మిశ్రమం క్రమం తప్పకుండా ఇవ్వడం ఇదే మొదటిసారి, మరియు ఇంత పెద్ద టమాటాలు కలిగి ఉండడం కూడా ఇదే మొదటిసారి. వాటి రుచి కూడా ఎంతో బాగుంది.
ప్రాక్టీషనర్ వ్యాఖ్య: మా మిరపమిశ్రమం ఎలా తయారు చేయాలో ఇక్కడ పొందుపరుస్తున్నాము అయితే పైనపేర్కొన్న వైబ్రోటానిక్ మొక్కలతెగుళ్ళను నిరోధించటానికి కూడా సహాయపడుతుంది: 1/2కిలో సన్నని ఎర్రమిరపముక్కలు 3లీటర్ల నీటిలో 15-20 నిమిషాలు మరిగించి, 30 గ్రాముల సబ్బుకలిపి బాగా తిప్పవలసి ఉంటుంది. సబ్బు కలుపుటచే మొక్కలకు ఈ మిరపమిశ్రమం బాగా పట్టివుంటుంది. చివరగా మరో 3లీటర్ల నీటిని కలిపి చల్లార్చి వడబోయవలసి ఉంటుంది అనంతరం స్ప్రే బాటిల్ తో కానీ లేదా భారతీయులు ఉపయోగించే చీపురుతో గాని మొక్కలపై చిలకరించవచ్చు.