ఆహార ఎలర్జీలు 03523...UK
67 ఏళ్ల మహిళ ఆమె విదేశాలనుంచి తిరిగి వచ్చినప్పటినుంచి, గత సం7 సం.లు.గా బాధపడుతున్న చర్మ అలెర్జీ కోసం చికిత్సను కోరి వచ్చారు. ఆమె గోధుమ, గింజలు వంటి కొన్ని ఆహార పదార్ధాలను తిన్నప్పుడు, ఆమె మెడమీద, తలపైగల చర్మంపై పొక్కులు వస్తున్నవి. 2 సం.లకు ముందు, ఆమెకు అధిక రక్తపోటు కూడా వున్నట్లు నిర్ధారణ జరిగి, దగ్గరి కుటుంబ సభ్యుడి మరణం తరువాత యెక్కువయింది. ఆమె చర్మం కోసం యాంటిహిస్టామైన్ (Cetirizine మాత్రలు) మరియు Amlodipine 5mg అధిక రక్తపోటు కోసం తీసుకుంటోంది. 25 జూన్ 2015 న రోగికి ఇవ్వబడింది:
#1. CC3.3 High Blood Pressure (BP) + CC3.7 Circulation + CC4.10 Indigestion + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC21.2 Skin infections + CC21.3 Skin allergies...TDS #2. CC21.2 Skin infections + CC21.3 Skin allergies - నీటిలో పత్తిముంచి, అవసరమున్నచోట నీటిబొట్లు వేయవలెను.
మొదటి వారంలో తన చర్మంమీద గల దద్దుర్లు ఇంకా దిగజారినట్లు ఆమె గుర్తించింది. అవి పొడిగా ఎండిపోయి, నల్లగా మారిపోయాయి. ఆమెకు యిది సంభవమేనని తెలుసు కనుక రెమిడీ తీసుకొంటూనే వున్నారు. మరొక వారం తర్వాత, ఆమె చర్మం స్థిరంగా మెరుగు చెందటంతో ఆమె అలోపతి అలెర్జీ మందులని తీసుకోవడం నిలిపివేసింది. నెల తరువాత ఆమె చర్మం 95% మెరుగైనదని చెప్పింది.
ఆమె ఆహారంలో గోధుమ, కొద్దిగా గింజలు తిరిగి తినడం ప్రారంభించింది. అభ్యాసకుడు ఆమెను #1 ను BD కు తగ్గించమని, ఆమెకు చర్మం దురదగా వున్నప్పుడు మాత్రమే #2 ను ఉపయోగించమని చెప్పిరి. అక్టోబర్ 15, 2015 నాటికి ఆమె చర్మంపై దద్దుర్లు తిరిగి రాకుండా, గోధుమలు, గింజలను తినగల్గుతోంది. ఆమె #1... OD ని నివారణ మోతాదుగా కొనసాగించింది. డాక్టర్ చేసిన పరీక్షలో, ఆమె రక్తపోటు నియంత్రణలో వున్నది. కాని ఆమె BP కోసం అల్లోపతి మందులను వాడమని చెప్పారు.
రోగి యొక్క ప్రశంశా పూరిత వ్యాఖ్య:
ఇతర చికిత్సలు పనిచేయలేని నా చర్మ పరిస్థితికి ఈ మాత్రలు నిజంగా సహాయపడ్డాయి. నేను నా చర్మం, ముఖ్యంగా నా ముఖం చాలా అసహ్యంగా వుండి, బయటకు వెళ్ళడం మానివేసితిని. ఇప్పుడు అది మెరుగవుటచే, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు దురద కలగగానే, నేను పరిహారం తీసుకుంటాను, దురద ఆగిపోతుంది. నేను ఇప్పుడు రొట్టె, చపాతీలు, గింజలు అన్నీ, నా ఆహారంలో, దద్దుర్లు వస్తాయనే భయం లేకుండా తినగలను.