కండరబంధనం మూలంగా భుజాలమీద, మోచేతి మడుపులో ఏర్పడిన పిక్కలు, మధుమేహం 01096...USA
10 సెప్టెంబరు 2014న వృత్తిరీత్యా డాక్టర్ ఐన ఈ వైబ్రో అభ్యాసకురాలికి 62 ఏళ్ల రోగి ఫోన్ చేసి, తన 2భుజాలు, మోచేయికీళ్ళపై గల 2 కీళ్లస్నాయువులలో గోళీలవంటి (10-25 మిమీ సైజులో) కణుతులతో చాలాబాధగా వున్నట్లు చెప్పారు. గత 2 వారాలుగా నొప్పి తీవ్రతవల్ల తన మోచేతులను కదల్చలేకపోతున్నారు. అతనివ్యాపార స్థలంలో జరిగిన అగ్నిప్రమాదం, దానివల్ల వచ్చినపొగ, తర్వాత నిర్మాణపనుల నుండి వచ్చే దుమ్ము ప్రభావాలకు లోనవడం జరిగింది. అతను తన నొప్పికి వైద్య సలహా కాని చికిత్సను కాని కోరలేదు, అట్లే అతను చాలాదూరం లో వుండుటవల్ల అభ్యాసరాలివద్దకు రాలేదు. అతను గత 3ఏళ్లుగా తన మధుమేహమునకు అలోపతిమందు (మెట్ఫోర్మిన్(Metformin) 1gm BD) ను తీసుకుంటున్నాడు. అతను మధుమేహంకోసం పూర్వం వైబ్రియోనిక్స్ తీసుకుని, ఆ అనుభవంతో మళ్లీ ప్రయత్నించాలనుకున్నాడు. అతనికి క్రింది రెమిడీ ఇవ్వబడింది:
కండరబంధనమునకు మరియు భుజముపై కాయలకు:
#1. CC2.3 Tumours & Growths + CC20.4 Muscles & Supportive tissue...TDS
పొగ త్రాగుట, దుమ్ము:
#2. CC17.2 Cleansing...OD
మధుమేహమునకు:
#3. CC6.3 Diabetes...అతని చక్కెరస్థాయి ఖాళీ కడుపుతో కూడా 140 కన్నా ఎక్కువైతే రాత్రి ఒక మోతాదు తీసుకోవాలి.
(ప్రాక్టీషనర్ గమనిక:
ఏడాదిక్రితం అతని అనుభవం ఆధారంగా ఈమోతాదు సూచించబడింది. అతనికి రక్తములో చక్కెర, ఉదయం మోతాదు తీసుకున్న గంటలో 200 నుండి 50కి చేరుతున్న కారణంగా అతను నీరసపడుతున్నారు. రాత్రి మోతాదు అలా కాకుండా130-140 నుండి 120 వరకు మాత్రమే ఉపవాసపు చక్కెరకు తగ్గిస్తుంది. ఉదయం ప్రతిస్పందనపై అతని భార్య భయపడుటచే, అతను నివారణను నిలిపివేశాడు.)
రోగికి 1 లేక 2 రోజులలో నొప్పితగ్గటం మొదలుపెట్టింది. 4 రోజులతర్వాత నొప్పి 80% మెరుగుపడింది. కానీ భుజాలమీద, మోచేతులమీద కాయలు తగ్గుటకు సమయం పట్టింది. రోగికి 2 వారాలలో తన కండరబంధనం 50% మెరుగుపడి, భుజాలపై కాయలు తగ్గుతున్నట్లు నివేదించారు. #2 ను 3TW కు తగ్గించారు. జనవరి 2015 నాటికి, అతని నొప్పి, కాయలు పూర్తిగా నయమైనట్లు రోగి పేర్కొన్నారు. #1, # 2 OW కు తగ్గించబడి, మధుమేహం మినహా మిగతా రోగలక్షణాలన్నీ పూర్తిగా మెరుగైనందున మార్చి 2015 లో మందు ఆపివేసిరి. అక్టోబర్ 2015 నాటికి, అతను అలోపతి మధుమేహం మందులతో పాటు #3 ... OD ను కొనసాగిస్తున్నారు.