Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

లోపల పెరిగిన గోరువల్ల కాలి బొటనవ్రేలు సంక్రమణవ్యాధి 02554...Italy


దీర్ఘకాల నిరాశకోసం అభ్యాసకురాలివద్ద చికిత్స పొందుతున్న ఒక మహిళారోగి, జూన్ 8, 2012 న, తనకొడుకు యొక్క, సంక్రమణ (ఇన్ఫెక్షన్)సోకిన కాలిబొటనవేలుకు చికిత్స కోరింది. ఆమె భర్తనుండి వేరుపడ్డాక, అతను కారుప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గత 3 నెలలుగా స్పృహలేక  కోమాలో ఉన్నాడు. భర్తనుండి విడిపోయినా, అతను సృష్టించిన సమస్యల మూలంగా, ఆమె తీవ్రమైన నిరాశతో బాధపడుతోంది. 16 సం.ల. బాలునికి దెబ్బ తగిలినందువల్ల, గత 4 ఏళ్లుగా, అతని ఎడమ బొటనవేలుకు దీర్ఘకాలసంక్రమణ (ఇన్ఫెక్షన్) కలిగింది. కొన్నిసార్లు ఇది మెరుగుపడినప్పటికీ, సంక్రమణ మళ్ళీ తిరిగి వస్తోంది. గత ఏడాదిగా, అది ఇంకాముదిరి, మానసికంగా బాలుడిని క్రుంగదీసింది. అతనికి బూట్లను తొడుక్కోవటానికి బాధ, ఈతకు వెళ్లలేడు, ఏక్రీడలలో పాల్గొనలేడు, సహచరులతో కలిసే ఆసక్తి లేదు. బొటనవేలు చాలా నొప్పిగా, ఎర్రగా, మామూలు పరిమాణానికి 3రెట్లు వాచి, చీముతో నిండింది. బాలుని తల్లి, వివిధ వైద్యనిపుణులకి, మూలికా వైద్యులకి, ఎంతో సమయం, డబ్బు ఖర్చు చేసినా, మెరుగుదలలేక, గోరు వెలికితీసిన తరువాత కూడా, వంకరగా, తిరిగి చర్మంనుండి వేరుగా పెరుగుతున్నదని ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అతను ఏ మందులు తీసుకోవడం లేదు, బాలునికి ఇతర ఆరోగ్యసమస్యలు లేవు. అభ్యాసకురాలు వెళ్లిపోతున్నందున, ఆమె బాలుని చూడలేకపోయిరి. జూన్ 8, 2012 న తల్లికి ఈ క్రింది రెమిడీ ఇచ్చారు:

#1. CC21.9 Nails + CC21.11 Wounds & Abrasions...6TD, బొటనవేలుమీద సహజసిద్ధమైన ఆలివ్ నూనెలో కలిపి ప్రొద్దున్న, సాయంత్రం విభూతితో కలిపి పూయమని చెప్పిరి.

15 రోజుల తర్వాత బొటనవేలు ఎర్రదనం తగ్గడం తప్ప మరేమీ మార్పు లేదు. చీము కొద్దిగా ఎక్కువైంది. ఇంకా ఎక్కువవుతుందనే భయంతో, బాలుడు పైని పూసే మందు మానేసి, మందు గోళీలు మాత్రమే తీసుకుంటున్నాడు. జూలై 4, 2012న చూసినప్పుడు, బాలుడు, తనతండ్రి యొక్క క్లిష్టమైన పరిస్థితి, తల్లి యొక్క నిరాశ, తన సమస్య కారణంగా ఆమెకు కలుగుతున్న ఒత్తిడి, ఇబ్బందులు, ఖర్చువంటి తన భావోద్వేగ సమస్యలను, అపరాధ భావనలను బయటికి చెప్పుకున్నాడు. చికిత్స మార్చబడింది:

#2. NM2 Blood + NM16 Drawing + NM26 Penmycin + NM36 War + NM63 Back-up + SR264 Silicea + SR292 Graphites 200C + SR316 Streptococcus...6TD

12 జూలై 2012 న తల్లి చాలా తక్కువ ఎరుపు, వాపు ఉందని, కానీ ఇప్పటికీ చాలా చీము వున్నట్లు నివేదించింది. అదే రోజు, ఆ పిల్లవాడి భావోద్వేగ సమస్యలకు కింది పరిహారం ప్రారంభించబడినది:

#3. NM83 Grief + BR4 Fear + SM2 Divine Protection + SM9 Lack of Confidence...TDS

5 రోజుల తరువాత, సంక్రమణ 50% తగ్గిందని వారు నివేదించిరి. 10రోజుల తరువాత 80% మెరుగయింది. బాలుడు ఆశ్చర్యపడుతూ, చాలా సంతోషంగా ఉన్నాడు. బొటనవేలు దాదాపు మామూలుగా కనిపిస్తోంది. 3 వ వారంలో, అభ్యాసకురాలిని సంప్రదించకుండా బాలుడు #2 TDS కు తగ్గించారు. అభివృద్ధి కొనసాగింది, కానీ చాలా నెమ్మదైంది. 1 ½ నెలల తర్వాత బొటనవేలి కుడివైపున 90% -100% మెరుగైంది, కానీ ఎడమవైపు, పూర్తిగా నయమవలేదు, కానీ రోగి ప్రతిరోజు మెరుగుపడున్నట్లు చెప్పాడు. తల్లి, బాలుడు క్రమపద్ధతిలో పరిహారాలు తీసుకోవటంలేదని, అభ్యాసకురాలికి, చెప్పినది. 27 జూలైన సంబంధ మిశ్రమాలు క్రిందివిధంగా సవరించబడినవి:

#4. SR267 Alumina 200C + #2…TDS 

# 5. CC12.1 Adult tonic + #3...TDS

23 సెప్టెంబర్ న రోగి 100% మెరుగైనట్లు నివేదించాడు. బొటనవేలు ఇప్పుడు పూర్తిగా సాధారణమైంది. రోగి కొంతకాలం క్రితం, పరిహారాలు తీసుకొనుట ఆపేసాదు .

రోగి యొక్క వ్యాఖ్యలు:
ఒకనాడు నేను నాబొటనవేలును దేనికో గట్టిగా గుద్దుకున్నప్పుడు, నాసమస్య మొదలైంది. ఇది కొన్నిరోజులయినా, తగ్గక, బాధాకరమైన గాయాన్ని కలిగించింది. కొన్నిరోజుల తర్వాత , బొటనవేలుగోరు లోపల పెరిగినట్లు తెలుసుకున్నాను. నేను మట్టి పాకెట్లు, రికోటా జున్ను, యాంటీబయాటిక్స్ మొదలైన వివిధ చికిత్సలు ప్రారంభించాను. నేను కూడా గుర్తుంచుకోలేనన్ని పద్ధతులు ప్రయత్నించాను. ఒక సం.రం. తర్వాత నేను ఆసుపత్రికి వెళ్తే, వాళ్ళు శస్త్రచికిత్సతో బొటనవేలి గోరు తీసేరు. గోరు లేకపోయినా వాపు మాత్రం తగ్గలేదు, చాలా నొప్పిగా వుంది. సుమారు 5 నెలల్లో గోరు తిరిగి పెరిగింది, కానీ సంక్రమణం నయమవలేదు. పాఠశాలలో ఏశారీరకవ్యాయామంలో పాల్గొనలేను. నా సాధారణ కాలి పరిమాణంకంటే రెండురెట్లు పెద్దబూట్లు కొనాల్సివచ్చింది. ఒకరోజు నాతల్లి అభ్యాసకురాలిని కలవగా, వైబ్రియోనిక్స్ గూర్చి ఆమె చెప్పింది. మేము మరల ప్రయత్నించాలనుకున్నాము. 3రోజుల్లో బొటనవేలు ఎరుపు తగ్గి, నొప్పి పోయింది. 20 రోజుల్లో వాపుకూడా పోయింది. నెల్లాళ్ళలో నాకు పూర్తిగా నయమైంది. ఈ చిన్నగోళీలు ఆధునిక శస్త్రచికిత్సను కూడా అధిగమించి మేలు చేసినవి.

ప్రాక్టీషనర్ వ్యాఖ్యలు:
ఈకేసు పూర్తిగా పరిష్కరించబడింది. ఈ సమస్యను నివారించడానికి చేసిన మునుపటి ప్రయత్నాలద్వారా కుర్రాడు నిరాశకు గురైనందున ఇది కష్టమైనది. ఆచికిత్సలు ఖరీదైనవైనా, పరిస్థితి మెరుగుపడలేదు. కొన్ని సందర్భాల్లో ఇది పరిస్థితిని మరింత దిగజార్చింది. నిరాశతో బాధపడుతున్న తన తల్లి, తనకోసం సమయం, డబ్బు ఖర్చు చేయవలసి వస్తున్నందుకు, అతను న్యూనతాభావంతో బాధ పడుతున్నాడు. నా అభిప్రాయంలో, ఇది పరిస్థితి యొక్క భావోద్వేగ కారకాలతో పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది.