గజ్జల్లో హెర్నియా (ఇంగ్వైనల్ హెర్నియా) 02899...UK
63 సం.ల. పురుషునికి 29 జూన్ 2015న గజ్జల్లో పుట్టిన వరిబీజం వున్నదని డాక్టర్స్ నిర్ధారించినారు. ఆ ముందురోజు అతను కుర్చీలో కూర్చొని, పూజచేస్తుండగా, గజ్జలవద్ద నొప్పి వచ్చినది. ఈనొప్పికి ఎటువంటి ముందు సూచనలు లేవు. మళ్ళీసారి, అతను వైద్య పరీక్షకి వెళ్ళగా, పరిస్థితి చాలా బాధాకరమైనదిగా మారింది. వైద్యుడు ఉబ్బిన ప్రేగును రెండుసార్లు దానిస్థానంలోకి త్రోసినాడు. లాభంలేక వైద్యుడు శస్త్రచికిత్స చేయాలన్నాడు. కాని రోగి వైద్యునికి చెప్పకుండా, వైబ్రియనిక్స్ తో పాటు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే వైబ్రియోనిక్స్ చికిత్సవల్ల బహుశా తనబాధ తగ్గవచ్చని అనుకున్నాడు. అభ్యాసకుడు పరిస్థితి 6-8 వారాలపాటు పర్యవేక్షించటానికి అంగీకరించి పరిస్థితి దిగజారితే మాత్రం, ఆసుపత్రికి నేరుగా వెళ్లమని రోగిని కోరిరి. అభ్యాసకుడు రోగికి ఈ క్రింది వైబ్రో మిశ్రమాలని ఇచ్చారు.
CC4.9 Hernia + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…TDS in water
ఒకరోజు చికిత్స తర్వాత, నొప్పి 50% తగ్గింది కానీ ప్రేగులు పొత్తికడుపు గోడను పొడుస్తున్న బాధ తగ్గలేదు. 3రోజుల చికిత్స తర్వాత, నొప్పి 80% తగ్గినది. ప్రేగులనొప్పి కూడా ఉదయం విరోచనం సమయంలో, రోజులో ఒకసారి మాత్రమే కలుగుతున్నది. మరో 4 రోజుల్లో నొప్పి పూర్తిగా పోయింది. రోగికి ప్రేగుల బాధ తెలియలేదు. 2వారాల తర్వాత అతను 100% మెరుగయ్యారు. సెప్టెంబరు 2వవారంలో డాక్టర్ పరీక్షించి, పూర్తిగా నయమైనట్లు నిర్ధారించేరు. ఆయనకు ఇటీవల చేసిన ఆరోగ్యపరీక్షలో, వరిబీజం పూర్తిగా నయమైనట్లు నిర్ధారించిరి. కొందరు రోగులు వరిబీజంవున్న ప్రాంతంలో కండరాలను బలోపేతం చేయటానికి ప్రయత్నిస్తారని, ప్రస్తుత రోగి విషయంలో అదే జరిగిందని డాక్టర్ చెప్పారు. కాని భారీబరువులు ఎత్తి, గజ్జలో కండరాలను బలపరిచే వ్యాయామాలను చేయకూడదని రోగికి సలహా ఇచ్చారు. OW యొక్క నివారణ మోతాదుతో కొనసాగించాలని అభ్యాసకుడు సలహా ఇచ్చారు కానీ రోగి OD గా కొనసాగించారు.