ఒక మైనాకు పునరుజ్జీవనం 10940...India
2015 జూలై 15వ తేదిన నేను ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నపుడు ఒక మైనాపక్షిని , పక్కన ఉన్న కాలువలో పడి ఉండ్డడం చూసాను. అది చలికి వణుకుతు బైటకి రాలేని పరిస్ధితిలో ఉంది. నేను ఒక లోట తీసుకొని, ఆ పక్షిని బైటకు తీసి దాన్నిపక్కనె ఉన్నగడ్డి మీద సురక్షితంగా పెట్టడానికి ప్రయత్నించాను కానీ అది కుదురుగా నిలబడే పరిస్ధితిలో లేదు,చలికి వణుకుతూ స్ఫ్రుహ తప్పి నేలకు ఒరిగినది. పక్షిని అక్కడే వదిలేసినా ,వెంటనే వైద్యం చేయకపోయినా అది బ్రతకడం కష్టమని ఆర్ధమైయ్యింది.
వెంటనే ఆ పక్షిని మా ఇంటికి తీసుకుని వెళ్లి కామన్ కాంబో కిట్ నుండి CC1.1 Animal టొనిక్ పక్షి ముక్కు మీద రెండు చుక్కలు వేసాను. ఒక క్షణంలో పక్షికి స్పృహ వచ్చింది.
పావు గంటలో మైనా కొంచం కధల సాగింది. పక్షికి బలం పెంచడానికి CC12.1 Adult tonicతో పాటు స్వామీ విబూతి పక్షి ముక్కుమీద పులివాను,వెంటనే ఈ పక్షి తన ముక్కుని వెడల్పుగా తెరచి తన రెక్కల్ని విరిచింది. ఈ పక్షికి పూర్తిగా బలం వచ్చినట్లుగా నాకు అనిపించింది. 45 నిమిషలు తర్వాత ఈ పక్షి మా ఇంటి ప్రాంగణంలో నడవడం మొదలుపెట్టింది. రాత్రి 9 గంటలుకి ఇది తన ఆహారాన్ని వెంబడించడం చూసాను. మరోక గంట తర్వాత ఈ మైనా నా స్కూటర్ కింద పడుకిని నిధ్రపోయ్యింది. ప్రొద్దున్నఈ పక్షి నాకింక కనబడలేదు. తన దారిని తాను వెళ్లిపోయింది.