కడుపులో పుండ్లు (Gastritis) 02897...UK
ప్రాక్టీషనర్ ఈ విధంగా వ్రాస్తున్నారు. 79 సంవత్సరాల వయసుగల మహిళ జ్వరము, వికారం, మంటగా ఉండే నాలుక, కడుపు నొప్పి, కడుపులో మంటతో ప్రాక్టీషనర్ ను సంప్రదించారు. వికారం వలన ఆమె తినేది చాలా తక్కువ అందులోనూ మసాలా తో కూడినవి, వేడి పదార్దాలు తినే పరిస్థితే లేదు. ఏ ఆహారము ఐనా రుచి అదోరకంగా ఉంటోంది, కనీసం స్వీట్ ను చిన్న ముక్క నోట్లో పెట్టుకున్నా చేదుగా అనిపిస్తోంది. పేషంటుకు పై వ్యాధులతో పాటు మధుమేహము, అధిక రక్తపోటు, గుండెపోటు కూడా ఉండడంతో అలోపతి మందులు తీసుకుంటున్నది. అందువలన పెద్దగా ఇబ్బందేమీ పడటం లేదు.
ఐతే పేషంటుకు పైన పేర్కొన్న లక్షణాలు 5 నెలల క్రితం ప్రారంభమై ప్రస్తుతం భరింపరాని స్థితిలో ఉన్నాయి. ఆమెకు చాలా నీరసంగా ఉంటోంది కాని బ్లడ్ రిపోర్టు ప్రకారము ఆమెకు అనీమియా లేదని తెలిసింది. డాక్టర్ వారం రోజుల కోసం కోర్సు వ్రాసారు. కానీ వారం తర్వాత పరిస్థితి మరింతగా దిగజారి నేను ఆమెను చూసే సమయానికి ఆమె మంచానికే పరిమితమైన స్థితిలో ఉంది.
నేను పేషంటును 2014 ఆగస్టు 19 వ తేది నుండి చికిత్స చేయడం ప్రారంభించాను. పేషంటు ఇచ్చిన సమాచారము ప్రకారము ఆమె కడుపులో పుండ్లు మరియు బహుశా మలేరియా వ్యాధి తోనూ బాధపడుతున్నట్లు గ్రహించాను. తను కొన్ని నెలల క్రితం వరకూ అనేక సార్లు అమెరికా వెళ్ళినపుడు కూడా వీరిని డాక్టరు పరిక్షించడం కానీ వీరి కుటుంబము వారు పరిగణనలోకి తీసుకోవడం కానీ చేయలేదు. ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసుకొని క్రింది రెమిడి ఇచ్చాను:
CC4.1 Digestive tonic + CC4.2 Liver & Gallbladder tonic + CC4.3 Appendicitis + CC4.4 Constipation + CC4.8 Gastroenteritis + CC4.10 Indigestion + CC9.2 Infections acute + CC9.3 Tropical diseases + CC10.1 Emergencies + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic
పేషంటుతో అరలీటరు బాటిల్ నీటిలో కొన్ని గోళీలు వేసుకొని బాగా కదిపి క్రింద సూచించిన విధంగా తీసుకోమన్నాను:
రోజులు 1-3: ప్రతి 10 నిమిషాలకి ఒకసారి
రోజు 4: ప్రతి గంటకి ఒకసారి
రోజు 5: ప్రతి రెండు గంటలకి ఒకసారి
రోజు 6 మరియు ఆ తర్వాత: QDS ఆమెకు బాగుందనిపించే వరకూ ఆతర్వాత TDS
పూర్తిగా కోలుకొన్నాక రెండు వారాలు: OD
3 వ రోజు నాటికి పేషంటుకు 45% తగ్గిపోయింది. ఆమె లేచి తిరగడం, తను తినేది కొద్దిగానే ఐనప్పటికీ ఆహారము తయారు చేసుకోవడం చేసుకోసాగింది. జ్వరము, వికారం, కడుపు నొప్పి, మంట తగ్గిపోయాయి. 6 వ రోజు నాటికి పేషంటుకు 100% నయమయ్యింది. దీనితో ఆమె తనకు తన భర్తకు వంట చేసుకోవడమే కాక ఇంటికి సంబంధించిన అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు. ఆమె తన పూర్వపు స్థితికి చేరానని తలవడంతో దానికి తగ్గట్టు గానే ప్రాక్టీ షనర్ రెమిడి ని TDS గా 7 వ రోజునుండి (2014 ఆగస్టు 25) కొనసాగించవలసిందిగానూ వారం తర్వాత OD గా రెండు వారాలు తీసుకోమని ఆమెకు చెప్పారు. 2014 సెప్టెంబర్ 14 నుండి ఆమె రెమిడి తీసుకోవడం పూర్తిగా మానివేసారు.
ఈ విధంగా పేషంటు వ్యాధి నుండి పూర్తిగా కోలుకున్నారు. ఇంత త్వరగా కోలుకోవడం ఆమెకు నమ్మలేని నిజం గా పరిగణిస్తూ సాయి వైబ్రియోనిక్స్ పట్ల నమ్మకం పెంచుకున్నారు. దానిని అందించిన వారికి సదా కృతజ్నురాలిగా ఉండాలని నిర్ణయించుకున్నారు.