గంజాయి వ్యసనం 02758...Russia
ఒక యువ జంట, 25ఏళ్ల యువకుడు మరియు 24 ఏళ్ల యువతి గంజాయి తాగడానికి చాలా బలంగా బానిసలయ్యారు. ఇది చెడు లక్షణమని వారు అర్థం చేసుకోవడమే కాదు దాని నుండి బయట పడాలని కూడా కోరుకుంటున్నారు. కానీ అలా చేయడానికి సంకల్ప శక్తి సామర్థ్యము లేదు. వారి చిన్న వయసు కారణంగా వ్యసనం మినహా మరే ఇతర తీవ్రమైన లేదా దీర్ఘకాలిక వ్యాధులు లేవు. జూలై 2013 ప్రారంభంలో వారికి చికిత్స ప్రారంభించినప్పుడు, యువకుడు నాలుగు సంవత్సరాలు మరియు యువతి రెండు సంవత్సరాల నుంచి గంజాయి ఉపయోగిస్తున్నారు. వారు వైభ్రియానిక్స్ తప్ప వేరే చికిత్స ఏదీ తీసుకోలేదు. వారికి క్రింది నివారణ ఇవ్వబడింది:
#1. CC15.3 Addictions + CC17.2 Cleansing…TDS
చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, చికిత్స యొక్క మొదటి రోజు నివారణలు తీసుకున్న తర్వాత యువకుడు చాలా రోజులు గంజాయి తీసుకోకుండా ఉండగలిగాడు. మొదటి నెల తర్వాత, యువకుడు తనలో 50% మెరుగుదల కనిపించిందని చెప్పాడు; యువతి 25% మెరుగుదల కనిపించిందని చెప్పారు. వారిరువురు తమ బాటిళ్ల లోని గోళీలు పూర్తి చేసే సమయానికి ఎక్కువలో ఎక్కువ దీని నుండి బయట పడతామని భావించారు. కాబట్టి వారు అభ్యాసకురాలిని సంప్రదించకుండా చికిత్సను ఆపివేశారు. కానీ అలవాటు ఇంకా నియంత్రణలోకి రాలేదు కనుక చికిత్సను తిరిగి ప్రారంభించవలసి వచ్చింది. 2013 సెప్టెంబర్లో వారికి రెండవ కోర్సుగా క్రింది నివారణ ఇవ్వబడింది :
#2. CC15.2 Psychiatric disorders…TDS
ఇది యువకునకు పూర్తి నివారణ ఇచ్చింది అప్పటినుండి గంజాయి ముట్టుకోలేదు మరియు దాని పొగ వాసన కూడా భరించలేక పోయేవాడు. యువతికి 90% ఉపశమనం కలిగింది అయితే ఒత్తిడికి గురైనప్పుడు అప్పుడప్పుడు ఆమె గంజాయి పొగ త్రాగడం కొనసాగిస్తోంది.
అభ్యాసకుని వ్యాఖ్య:
ఈ వ్యక్తుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మాదకద్రవ్యాలు లేకుండా జీవించడమే కాదు కొంతకాలం తర్వాత వారు ఇస్కాన్(ISKCON) కు హాజరు కావడం ప్రారంభించారు . భగవంతుని అనుగ్రహంతో మాదకద్రవ్యాల వ్యసనం పై విజయం సాధించడమే కాక భగవంతుని చెంతకు రావడం తమంతట తామే సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించారు. మనందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చే ఇలాంటి అద్భుతాలు చేసిన భగవంతునికి ధన్యవాదాలు !”