నోటి పూత 02806...Malaysia
2014 మార్చి 23న, 38 ఏళ్ల వ్యక్తి 15 సంవత్సరాలుగా నోటి పూతతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చారు. వీరు కొన్ని సంవత్సరాలుగా అనగా : 2002-2004; మరియు 2005, అనేక మంది అల్లోపతి వైద్యులు చేత చికిత్స పొందారు. వైద్యులు హెర్పెస్ సింప్లెక్స్ గా నిర్ధారించి యాంటీ వైరల్ ల జోవిరాక్స్(ఎసిక్లో వీర్) మరియు కార్టికోస్టెరాయిడ్, ప్రెడ్ని సోలెన్, సమయోచితంగా ఉపయోగించిన బాహ్య అనువర్తన క్రీములతో మూడు నెలలు ఉపయోగించినప్పటికీ; ఇవన్నీ తాత్కాలిక ఉపశమనం ఇచ్చి పునరావృతం అయ్యేవి, కానీ శాశ్వతంగా ఎటువంటి మార్పు లేదు;
2006 లో, చెవి ముక్కు మరియు గొంతు నిపుణుడు టాన్సీలెక్టమీ మరియు విటమిన్లు ఇచ్చారు కానీ ఎటువంటి పురోగతి లేదు): 2007- 2010 మధ్య సాంప్రదాయ చైనీస్ ఔషధం తీసుకున్నారు (కానీ ఉపశమనం లేదు); మరియు 2011- 2014 మధ్య అదనపు వైద్యుల వద్ద చికిత్స తీసుకున్నారు (కానీ ఉపశమనం లేదు). ఒక పరీక్షలో నాలుక అంతటా మరియు నోటి శ్లేష్మ ఉపరితలంపై పూత లాగా కనిపించింది. నాలుక పూత మరియు గొంతు అసౌకర్యం కారణంగా రోగి ద్రవ లేదా పాక్షిక ద్రవ ఆహారము మరియు అతి కష్టంగ ఘన ఆహారం తీసుకునేవారు. ఎందుకంటే దానిని మింగెటప్పుడు చాలా నొప్పిగా ఉండేది. ఈ సమస్య కారణంగా రోగి ఎంతో ఆందోళన మరియు విచారంతో ఉన్నారు. రోగి ప్రతిరోజూ ఉదయం నిద్ర లేచిన తర్వాత 200-250 మిల్లీ లీటర్ల నీరు త్రాగాలని రెండు వారాలపాటు క్రింది నివారణ తీసుకోవాలని సూచించబడింది:
#1. CC11.5 Mouth infections + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic…5 గోళీలు 90 ml నీటిలో కరిగింప జేసి; 5 ml చొప్పున 6 గంటలకు ఒకసారి
ఏప్రిల్ 5న, రోగిని తిరిగి పరీక్షించినప్పుడు, ఐదు శాతం స్వల్ప ఉపశమనం కనిపించింది. అతనికి ఇంకా ఎన్నో నోటి పుండ్లు ఉన్నాయి, కానీ అంత బాధాకరంగా లేవని తెలిపారు. నోటి పూత తగ్గడానికి స్టెరాయిడ్లు తీసుకున్నట్టుగా రోగి తెలిపారు. రోగిని నివారణ కొనసాగించవలసిందిగానూ అయితే 5ml నివారణ నీటిని ప్రతి మూడు గంటలకు ఒక మోతాదు చొప్పున రెండు వారాల వరకు తీసుకొని, మరలా రావలసిందిగా సూచించారు.
ఏప్రిల్ 20న, తిరిగి పరీక్షించినప్పుడు నోటి పుండ్లు సంఖ్యలోనూ మరియు వాటి తీవ్రతను లోనూ 40 % ఉపశమనం కనిపించింది. ఈసారి నయం కావడానికి పట్టిన సమయం గణనీయంగా తక్కువగా ఉందని రోగి తెలిపారు. 5 నుంచి 7 రోజుల్లో నయం అయ్యే అల్సర్లు ఇప్పుడు రెండు రోజుల్లోనే నయం అయ్యాయని తెలిపారు. ఇది వైబ్రియనిక్స్ యొక్క అద్భుతం ఎందుకంటే ఈ రెండు వారాలు స్టెరాయిడ్లు తీసుకోవడం ఆపి వేసినట్లుగా రోగి తెలిపారు.
మే 10వ తేదీన రోగికి ఇచ్చే నివారణ క్రింది విధంగా మార్చబడింది:
#2. Combo #1 + CC21.8 Herpes... 90 ml మినరల్ వాటర్లో 5 గోలీలు కరిగింప జెసి ; 5 ml ప్రతి 3 గంటలకు (6TD)
మే 22న, తిరిగి పరీక్షించినప్పుడు, 50-60% మెరుగుదల కనిపించింది. నాలుక మీద కొద్ది సంఖ్యలో మాత్రమే పుండ్లు కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు రోగి అన్నం వంటి ఘన ఆహార పదార్థాలను ఎటువంటి నొప్పి లేకుండా తింటున్నట్లు తెలిపారు. రోగిని నివారణ అలాగే కొనసాగించమని కోరుతూ మోతాదును TDS కు తగ్గించారు.
జూన్ 8 నాటికి, రోగి నాలుక ఎక్కువలో ఎక్కువ పూర్తిగా కోలుకుంది. మొత్తం నోటిపూత మరియు నోటి పుండ్లు ఇప్పుడు 80 నుంచి 90 శాతం మెరుగు పడ్డాయి. రోగి 15 సంవత్సరాల తర్వాత తన సాధారణ ఆహారాన్ని తిరిగి ప్రారంభించ గలిగారు.
చికిత్స కొనసాగించాలని మరియు ఏదైనా పునరావృతం ఎదుర్కొంటే వెంటనే అభ్యాసకుని కలవాలని సలహా ఇవ్వబడింది. 2014 జూలై నాటికి, రోగి వైబ్రియనిక్స్ చికిత్సా నివారణ కొనసాగిస్తున్నారు. ఎటువంటి పునరావృతం కలుగలేదు.