వైద్యము యొక్క హీలేర్ నుండి దైవ పదాలు
Vol 1 సంచిక 1
September 2010
"మితమైన ఆహారం తీసుకుని దీర్ఘాయువును పొందండి. యుగ యుగాలుగా యోగులు ఇచ్చిన సలహా ఇదే. ఈ సలహాను అరుదుగా పాటిస్తున్నారు. మనుష్యులు పొట్టను ఆహారంతో నింపుతున్నారు. ధనవంతులు గర్వంతో ఖరీదైన విందులు ఏర్పాడు చేసి అధిక కొవ్వున్న ఆహారాలు మరియు ఆరోగ్యానికి హాని కలిగించే ఇతర ఆహారాలను భుజించి జీర్ణ శక్తికి హాని కలుగ చేస్తున్నారు. ఆరోగ్యం యొక్క విలువను గుర్తించినవారు సాత్వికమైన ఆహారాన్నే తీసుకుంటారు."
-సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XI
"ప్రసరణము, కంపనం మరియు సాకారవస్తుత్వము, ఈ మూడు శక్తుల సంయోగం కారణంగా మానవుడు జీవిస్తున్నాడు. దీన్ని ప్రకృతి అంటారు. ప్రాణ శక్తి దీని యొక్క కదలికకు కారణం. చైతన్య శక్తైన ప్రజ్ఞా శక్తి ఈ కదలికకు మార్గం నిర్దేశిస్తుంది. చైతన్య శక్తి, ప్రాణశక్తి మరియు విషయ శక్తుల కలయికే మానవుని యొక్క జీవితం. ఈ సత్యాన్ని విస్మరించి, మానవుడు తన శరీరానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నాడు. శరీరానికి మాత్రమే అన్ని శక్తులు ఉన్నాయన్న భ్రమతో జీవిస్తున్నాడు.
అమెరికా ఒక పుష్కలమైన, ఆహార కొరత లేన ఒక దేశమని అందరికి తెలుసు. అందువల్ల ఈ దేశంలో ప్రజలు అధికంగా తింటూ, జీవితాన్ని భోగములో గడుపుతూ ఉంటారు. ఈ కారణంగా, ఈ దేశ ప్రజలు గుండెకు సంభందించిన వ్యాధులతో అధికంగా భాధపడుతున్నారు.
స్వీడన్ ఐరోపాలో చాలా సంపన్నమైన దేశం. ఈ దేశ ప్రభుత్వం ప్రజలకు సాధ్యమైన సౌఖర్యాలను అందిస్తోంది. ఇలా ఉన్నప్పటికీ ఈ దేశంలో ఆత్మహత్య చేసుకునే, మరియు విడాకులు ఇచ్చే వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. దీనికి కారణం ఏమిటి? ఇది ధనం లేదా ఇతర సౌఖర్యాల కొరత వల్ల కాదు. దీనికి కారణం ప్రజలలో ఆధ్యాత్మిక ద్రుక్పధం లేకపోవడమే. శరీరం మరియు ఇతర తాత్కాలికమైన విషయాలకు అధిక ముఖ్యత్వం ఇచ్చి, శాశ్వతమైన అంతరాత్మ మీద ఎవరు దృష్టి పెట్టట్లేదు. ఈ విధంగా వారు ఒక కృత్రిమ జీవితాన్ని గడుపుతున్నారు. "
–సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XXVI
“మనిషికి సమాజానికి మధ్య సంబంధం తేనెటీగ పువ్వు మధ్యున్న సంభంధం లాగానే ఉంటుంది. శిశువు తల్లి పాలును, తేనెటీగ పుష్పంలో ఉన్న తేనెను త్రాగి ఆనందిస్తున్నట్లుగానే మానవుడు ప్రకృతి అందించే బహుమతులను ఆనందంతో అనుభవించాలి. యుగ యుగాలుగా మానవుడు ప్రతికూల ఆలోచనలతో భాదితుడై ఉంటున్నాడు. ఒక అత్యాస గల మనిషి తన భాతు ఇచ్చే భంగారు గుడ్లను ఒక్క మాటు తీసుకునే ఉద్దేశంతో ఆ భాతును చంపిన ఒక పురాణ కధ ఉంది. ఇదే విధంగా మానవుడు తన మూర్ఖపు చర్యల ద్వారా ప్రకృతిలో అసమతుల్యత సృష్టించిడం వల్ల భూకంపాలు వంటి సహజ విపత్తులు సంభవిస్తున్నాయి. వివేకం లేకుండా శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రయోగించడం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రకృతి వనరుల క్షీణత కారణంగా కలిగే దుష్ప్రభావాల గురించి మానవుడు ఆలోచించట్లేదు."
–సత్య సాయి బాబా, సత్య సాయి స్పీక్స్, సంపుటము XXVI