డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 7 సంచిక 1
January/February 2016
ప్రియమైన చికిత్సా నిపుణులకు,
మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ పండుగ రోజులు మనమందరం ఆనందంగా ఉంటూ మన ప్రేమను అందరితో పంచుకునే సమయము. అంతేకాదు ఇది మన ప్రేమమూర్తి బాబా మనందరి పైన తమ అమూల్యమైన దీవెనలు కురిపించినందుకు గాను కృతజ్ఞతలు తెలుపుకునే సమయం కూడా. ఈ సంవత్సరం వైబ్రియోనిక్స్ దృష్ట్యా స్వామి చేత ప్రత్యేకంగా దీవెనలు పొందినట్టిది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం లో ఎన్నోసార్లు వర్కు షాప్ లు ప్రపంచ వ్యాప్తంగా అనేకచోట్ల నిర్వహించుటకు అవకాశం కలిగింది. (కొన్నిటిని గూర్చి ఈ సంచికలో ‘’అదనపు సమాచారం ‘’ అనే విభాగములో ఇవ్వబడినవి). ఇంకా పరిపాలనా విభాగము నెలకొల్పడం, వార్తాలేఖలను మరో 11 భాషలకు విస్తరించడం ఈ సంవత్సరంలోని మార్పులే. 2015 సంవత్సరంలో ఇచ్చిన పిలుపు ననుసరించి ఎంతోమంది ఉదారంగా వైబ్రియోనిక్స్ విస్తరించడానికి కావలసిన సంపాదకీయం, అనువాదం, కేసుల పరిశీలన, డేటా నిర్వహణ, వెబ్ సైట్ నిర్వహణ ఇలా ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు.
ఈ సంవత్సరం లోనే స్వామి “ప్రేమే ప్రాణం, ప్రేమే మార్గం, ప్రేమే లక్ష్యం” అనేది అర్ధం చేసుకొనేలా చేసారు. ఎన్నోసార్లు కర్తవ్యము గోచరించక నిస్పృహతో దిక్కు తోచని స్థితి లో ఉన్నప్పుడు స్వామి ఎవరో ఒకరిని పంపి ఆ పరిస్థితి నుండి గట్టెంకించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి సందర్భానికి ఒక ఉదాహరణ గత వార్తాలేఖ లో ఇవ్వబడినట్టి స్వామి ఆరోగ్యం ప్రసాదించిన 90 మంది రోగులయొక్క కేస్ హిస్టరీ లను ఒక పుస్తకంగా ముద్రించి స్వామి వారి 90 వ పుట్టినరోజుకు కానుక గా సమర్పించ నైనది.
గత సంవత్సరం కూడా ఒక సీనియర్ వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ మరియు ఇంగ్లాండ్ లోని పరిశోధనల విభాగపు అధికారిణి 00002…UK మరియు వారి టీం సహకారంతో 2004 సంవత్సరపు సీనియర్ వైబ్రో ప్రాక్టీషనర్లకు SRHVP వినియోగము పైన ఉన్న మాన్యువల్ ను సవరించిన సరికొత్త ఎడిషన్ గా ముద్రించడమైనది. స్వామి ఆశీర్వాదముతో ఈ 2016 ఎడిషన్ కూడా స్వామి సమాధి చెంత జనవరి 1 వ తేదీన సమర్పించడమైనది. ఈ సరికొత్త ఎడిషన్ లో స్వామి 12 సంవత్సరాల క్రితం తమ దివ్య చేవ్రాతతో అనుగ్రహించిన నాటినుండి ఈ నాటి వరకు వచ్చిన మార్పులు నూతన విధానాల నన్నింటినీ పరిగణన లోనికి తీసుకోవడం జరిగింది. దీనిలో ఇటీవలే కేన్సర్ మరియు ట్యూమర్ విభాగము, విస్తృత పరిచిన మైయజం విభాగము, కొత్తగా సమాచారం చేర్చిన రోగనిరోధకశక్తిని పెంపొందించే విభాగము సరికొత్త ఆకర్షణలుగా ఉంటాయి. కొత్తగా పుట్టిన శిశువులకు, పిల్లలకు సరికొత్త కోమ్బో లను మిస్సిలినియస్ విభాగములో ఇవ్వడం జరిగింది. సీనియర్ ప్రాక్టీషనర్ లు ఈ ఎడిషన్ ను పుట్టపర్తి లోని మా రూము S4-B1 నుండి కానీ లేదా మీ స్టేట్ కో ఆర్డినేటర్ నుండి గానీ తీసుకొనవచ్చు.
ఈ రోజు అనగా జనవరి 15 భారత దేశంలో సరికొత్త పనులను ప్రారంభిస్తారు. ఈరోజు సూర్యుడు రాశి చక్రము లోని మకర రాశి లో ప్రవేశించి ఉత్తరాభిముఖంగా ప్రయాణం ప్రారంభించేరోజు.
ఈ రోజును ప్రశాంతి నిలయంలో మకర సంక్రాంతి గా జరుపుకుంటారు. బాబా వారు ఆధ్యాత్మిక పరంగా దీని ప్రాముఖ్యత వివరిస్తూ ఇది ఎంతో పవిత్రమైన రోజని ఈ రోజు సాధనా పరంగా నూతన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగిపోవలసిందిగా సూచిస్తుండేవారు. సంక్రాంతి మన అంతరాభిముఖ ప్రయాణానికి అనువైన రోజు. ఆధ్యాత్మిక ప్రవర్తనలో మార్పును సూచిస్తూ ప్రయాణం ప్రారంభించే రోజు. స్వామి సూచన ప్రకారం మనం చేరాల్సిన లక్ష్యం, అనందనిలయము బాహ్యంగా లేదు, మనలోనే ఉంది.
15 జనవరి1996లో స్వామి తమ ప్రసంగములో “కళ్ళజోడును నుదుటున ఉంచుకుని దానికోసం ఇల్లంతా వెతుకుతున్నట్లు ఆనందం తమ హృదయంలోనే ఉంచుకొని దానికోసం బయట వెతుకుతున్నారు మానవులు. ఆ దివ్యత్వం నీలోనే ఉంది. బాహ్యంగా చేసే సాధనల ద్వారా కలిగే ప్రయోజనం శూన్యం. కనుక ఈ మకర సంక్రాంతి పుణ్య తిధిని పురస్కరించుకొని అంతరాభిముఖ ప్రయాణం ప్రారంభించండి. తనను తాను తెలుసుకొన్నవాడే ముక్తిని పొందుతాడు. మానసికంగా చేసే పూజలు మొదలగునవి కూడా హృదయానికి పరిపక్వత నివ్వలేవు. నవవిధ భక్తిమార్గములో స్మరణం తో మొదలుకొని శరణాగతి అనగా ఆత్మనివేదనంతో ముగుస్తుంది. అట్టి ఆత్మనివేదనమునకు మార్గం సుగమం చేసేదే ఈ సంక్రాంతి” అని సెలవిచ్చారు.
కనుక ఈ పవిత్రమైన రోజు మనందరికీ ఆనందాన్ని పంచుతూ మనం చేసే సేవ మన ఆధ్యాత్మిక పురోగతిని పెంపొందించేదిగా ఉండాలని కోరుకుంటూ
ప్రేమపూర్వకంగా సాయి సేవలో,
జిత్ కే అగ్గర్వాల్.