డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో
Vol 5 సంచిక 2
March/April 2014
ప్రియమైన అభ్యాసకులారా,
మీతో పంచుకొనదగిన విషయములు నావద్ద ఈసారి అధికముగా వున్నవి.
సమావేశమునకు కృతజ్ణతలు
మొట్టమొదటి అంతర్జాతీయ సాయి విబ్రియోనిక్స్ సమావేశంగురించి వ్రాసిన మా గతవార్తాలేఖపై వచ్చిన, మీ ప్రతిస్పందనలతో నామనస్సు ఎంతో అద్బుతమైన ఆనందంతో నిండిపోయిందని మీకు తెలియచేస్తున్నాను. చాలామంది అభ్యాసకులు, ఈ సమావేశం ఘనవిజయాన్ని సాధించినట్లు, తమ అభిప్రాయమని వ్రాసినారు. మీలో కొందరు ఈ సమావేశం, సాయి విబ్రియోనిక్స్ గురించి తమ జ్ఞానాన్ని పురోభివృద్ధి చేసి, తోటి అభ్యాసకులతో తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునే అవకాశాన్ని యిచ్చిందని వ్యాఖ్యానించేరు. కొందరు ఈ సమావేశం విబ్రియోనిక్స్ సేవకి సమర్పితభావంతో పనిచేసేందుకు స్ఫూర్తినిచ్చినట్లుగా చెప్పారు. హాజరైనవారు తాము ఆశించినదాన్నిమించి పొందినట్లు, ఆనందించినట్లు తెలియజేస్తూ, తరువాత సమావేశం గురించిన వివరాలు అప్పుడే అడుగుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
ఇదంతా శ్రీ సాయిబాబావారి కృపవల్లనే సాధ్యమైనది
మీలో చాలామంది ఈవిధంగా చేయడానికి చాలా ముఖ్యమైన మార్గాల్లో సహాయపడ్డారు, కానీ నేను ఈ వ్యక్తులకు / సమూహాలకు కృతజ్ఞతలు ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను:
- పాల్గొన్నవారందరూ;
- మా సంపుటములకు వ్యాసాలు, ప్రసంగాలు మరియు కేసు చరిత్రలను అందించినవారందరికీ; వాటినన్నిటిని జాగ్రత్తగా సమీక్షించి, అవసరమైన సవరింపులను చేసిన ముఖ్యబృందమునకు;
- ఈ సమావేశము జరిగిన సమయంలో వేళప్రకారం, అన్నివేళల్లో భోజనాలు, యితర ఫలహారములను సమకూర్చిన మహారాష్ట్రకు చెందిన బృందమునకు, మరియు యీ సమావేశమునకు చక్కని గుర్తింపు చిహ్నాలను అందించిన ఒక అభ్యాసకునికి;
- నమోదు ఫోల్డర్లను మరియు సమావేశపు పతాకాలను అందించిన కేరళ బృందమునకు;
- ప్రతినిధులకోసం వసతి యేర్పాట్ల నిర్వహణ, మరియు ఆదాయవ్యయముల పట్టిక సంపుటముల పంపిణీ మరియు ఇతర విషయముల నిర్వహించడానికి పూర్తి బాధ్యతను తీసుకున్న యునైటెడ్ కింగ్ డం బృందానికి;
- పాత దేవాలయమును, తమ అందమైన అలంకరణలతో మా సమావేశపు వేదికగా మలచిన ఇటాలియన్ బృందానికి;
- స్థలముయొక్క రిజిస్ట్రేషన్ నిర్వహించి, గుర్తుచిహ్నాలను జారీ చేసిన అమెరికా, యుకె, భారతదేశముల నుండి మిశ్రమ బృందానికి;
- సమావేశములోని అన్ని ఆడియో / దృశ్యమాన అవసరాల బాధ్యతయేగాక, విబ్రియోనిక్స్ వీడియో (క్రింద చూడండి) ను తయారుచేసిన పోలిష్ యాజమాన్యునికి;
- ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించిన, ‘చైతన్యజ్యోతి’ మ్యూజియం ముఖ్యనాయకునికి;
- పలువురు ప్రతినిధులు తమ ఇళ్ళలో ప్రేమతో తయారుచేసిన ప్రసాదమును అందరికీ అందజేసిన గ్రీకు అభ్యాసకునికి;
పైన వుదహరించినవారు మాత్రమే కాకుండా అమెరికాలోని డాక్టర్ మైఖేల్ రాకోఫ్ యొక్క నాయకత్వంలో, సమావేశానికి ముందు 3రోజులలో, అన్నిఏర్పాట్లుచేసి, ఆ ఏర్పాట్లను శ్రద్ధగా పర్యవేక్షించేందుకు చాలా కష్టపడిన మిగిలిన వ్యక్తులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం దాదాపు 45 వాలంటీర్లు సహాయపడ్డారు. మీ సహాయాలకు మేము సర్వదా కృతజ్ణులము.
సాయి విబ్రియోనిక్స్ క్రొత్త యూట్యూబ్ ఛానల్
ఇప్పుడు కొత్త పురోభివృద్ధి వైపు పయనిస్తూ, విబ్రియోనిక్స్ ఆధికారికంగా యూట్యూబ్.కామ్ (youtube.com)లో మన స్వంత ఛానల్ ‘సాయి విబ్రియోనిక్స్ హీలింగ్’ ఆరంభించబడినదని తెలుపుటకు నేను సంతోషిస్తున్నాను. మీరు దానిని యిక్కడ క్లిక్ చేసి చూడగలరు-https://www.youtube.com/channel/UCdmKv4O1lLswMEe7TfTVvJQ.
రెండు విబ్రియోనిక్స్ వీడియోలు పెట్టబడినవి, సమావేశంలో చూపబడినవి. మొదటిది ‘విబ్రియోనిక్స్, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషన్స్’ (https://www.youtube.com/watch?v=roXS0_WcU28), ప్రశ్నలు-జవాబులు, ‘విబ్రియోనిక్స్ అనగానేమి?’. రెండవది ‘బ్లెస్సింగ్ ఆఫ్ విబ్రియోనిక్స్’ ’Blessing of Vibrionics’(https://www.youtube.com/ watch?v=fB8DDtQiOoo),
2008-2010 సం. గురుపూర్ణిమ సందర్భంలో సాయి బాబా వారి ఆశీర్వాదములతో మొదలైన విబ్రియోనిక్స్ యొక్క ఒక స్లయిడ్ షో.
మీరు ‘విబ్రియోనిక్స్, సాయిరామ్ హీలింగ్ వైబ్రేషన్స్’ వీడియో మా వెబ్ సైట్(http://www.vibrionics.org) లోని హోమ్ పేజ్ లో లింక్స్ ద్వారా “What is Sai Vibrionics” పేజ్ లో చూడగలరు.
వీడియోలు ఇంగ్లీష్ లో ఉన్నవి. అవి వివిధ భాషలలోకి అనువదించబడ్డాయి. మా (YouTube) యూట్యూబ్ఛానెల్ మరియు మా వెబ్ సైట్ లో, అందుబాటులోకి వచ్చినప్పుడు పోస్ట్ చేయబడతాయి. పోలిష్ బాషలో ఇప్పటికే లోడ్ చేయబడింది.
విబ్రియోనిక్స్ విస్తరణకు కేరళ యొక్క అసాధారణ ప్రణాళిక
నేను కేరళలో ఒక ముఖ్యమైన అభివృద్ధిని పంచుకొనుటకు ఆనందిస్తున్నాను.
కేరళరాష్ట్ర సమన్వయకర్త, మార్చి12న త్రిస్సూర్, మార్చి23న ఎర్నాకులం వద్ద అవగాహన కార్యక్రమాలను నిర్వహించిరి. (ఫోటోలు చూడండి). విబ్రియోనిక్స్ విస్తరణకై, 2 జిల్లాలలోనూ కమిటీలు నిర్వహించిరి. ప్రజలలో విబ్రోగూర్చి అవగాహన కల్పించడం, చికిత్సా శిబిరాలు నిర్వహించడం, అర్హులైనవారిని గుర్తించి, తగిన శిక్షణనిచ్చి అభ్యాసకులను తయారుచేయటంవంటి కార్యక్రమాలకు సహాయపడడమే వారిధ్యేయం. ఈకమిటీలలో సాధారణ ప్రజానీకం, మరియు విబ్రో చికిత్సవల్ల లబ్ధి పొందిన శ్రేయోభిలాషులు వుంటారు. కేరళ ఇప్పుడు ఇతర జిల్లాలకు ఈ ప్రయత్నాన్ని విస్తరింపచేయాలని యోచిస్తోంది. దీని ప్రకారం, జిల్లా సమన్వయకర్తలు మరియు తదితర అభ్యాసకులు తమ ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు దృఢంగా సంకల్పించినారు. అవగాహన కార్యక్రమం మరియు సహాయక కమిటీల కార్యక్రమాల ద్వారా, కనీసం 90 కొత్త విబ్రో అభ్యాసకులకు శిక్షణనిచ్చి, నవంబర్ 23, 2015 న భగవాన్ యొక్క 90 వ జన్మదినానికి ముందే, ప్రస్తుత సంఖ్యకు కనీసం రెట్టింపు రోగులకు చికిత్సలను అందించాలని, విబ్రియోనిక్స్ సేవకు అంకితభావంతో పనిచేస్తున్న కేరళ వారు ప్రశంసనీయులు.
శ్రీ సాయికి ప్రేమపూర్వక సేవలో,
జిత్ అగర్వాల్.