Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి

Vol 12 సంచిక 1
January / February 2021


ప్రియమైన ప్రాక్టీషనర్లకు,

ఈ నూతన సంవత్సర వేడుక సందర్భంగా నేను మీకు రాస్తున్నప్పుడు స్వామి చెప్పిన మాటలు నాకు గుర్తుకు వస్తున్నాయి “ప్రతిసెకను కొత్త సంవత్సరం గానే భావిస్తూ ఆ భావనతోనే వ్యవహరించండి. ఏదైనా సంస్థనో లేదా వ్యాపారమునో ప్రారంభించుటకు మీరు 12 నెలలు గడిచేవరకూవేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రతీక్షణం మీకు మీరే రూపాంతరం అవ్వండి, కొత్త సంవత్సరపు స్ఫూర్తిని ప్రభావితము చేసే పాత ఆలోచనలు వదిలించుకోండి. మీ జీవితాలను పవిత్రం చేసుకొనడానికి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి.  ధర్మబద్ధమైన ప్రవర్తనకు కట్టుబడి ఉండండి. “ఎల్లప్పుడూ సహాయం చేయండి ఎవరినీ బాధపెట్టకండి” అనే సూక్తికి అనుగుణంగా  జీవించండి... శ్రీ సత్య సాయి బాబా దివ్య వాణి 1993 జనవరి 1 ప్రశాంతి నిలయం.

   సూర్యుడు2020 సంవత్సరములో అస్తమిస్తూ ఉండగా 2021 యొక్క వేకువ పొడజూపుతూఉంది.ఇప్పటికే కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వినాశనం కలిగించినప్పటికీ ఇది మనందరినీ అనేక విధాలుగా సుసంపన్నం చేసింది. వైబ్రియానిక్స్ విషయానికి వస్తే ఈ సంవత్సరం మనకు అనేక పాఠాలు నేర్పడమే కాక మనం ఎలా బోధించాలి, రోగులకు చికిత్స మరియు సంరక్షణ వంటి అనేక అవకాశలను అందించింది. 2020 సంవత్సరంలో మైలురాళ్ళుగా భావించే కొన్ని విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

1. కొత్త ప్రవేశ ప్రక్రియ మరియు ఆన్లైన్ పాఠ్యాంశాల కంటెంట్ మరియు డెలివరీ మెకానిజంతో సహా వైబ్రియానిక్స్ యొక్క శిక్షణ మరియు అభివృద్ధి కోసం డిజిటల్ వేదికను విజయవంతంగా స్వీకరించడం. ఈ కాలంలో ప్రాక్టీషనర్లగా మారటానికి ఆసక్తి ఉన్న వారందరికీ ఇది అందుబాటులో ఉండేలా చేయడము ద్వారా వేగవంతమైన పద్ధతికి వైబ్రియానిక్స్ విద్య రూపాంతరం చెందింది. ముందు ముందు ఈ ప్రక్రియ సుదూరప్రాంతాల్లోఉంటూ వర్క్ షాప్ కు హాజరు కావడానికి ప్రయాణం చేయలేని వారికి ప్రయోజనం చేకూరుస్తుంది.

2. భౌతిక సంప్రదింపుల నుండి ఆన్లైన్ లేదా టెలిఫోన్ సంప్రదింపులకు మారడం మరియు వ్యక్తిగతంగా సాధ్యమైన చోట రెమిడీలను ఇవ్వడం లేదా పోస్టు ద్వారా పంపడం లేదా బ్రాడ్ కాస్టింగ్ చేయడం వంటిచికిత్సా పద్ధతులకు మారడం అభిలషణీయం. గత తొమ్మిది నెలలుగా శ్రమతో ఈ సేవను అవిశ్రాంతంగా చేస్తున్న వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

3. మెరుగైన లక్షణాలు మరియు ప్రాముఖ్యత కలిగిన హంగులతో నవీనీకరింపబడిన వెబ్ సైట్ ను ప్రారంభించడం జరిగింది. ఆశ్చర్య కరంగా ప్రారంభించిన 5 నెలల్లోనే ల్యాండింగ్ పేజీలో 5700 హిట్లను నమోదు చేయబడినవి, దీని ఫలితంగా ప్రాక్టీషనరులకు సంబంధించిన సమాచారము కోసం ప్రశ్నలు పెరిగాయి మరియు AVPకోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పెరిగారు.

4. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాయి వైబ్రియానిక్స్ప్రాక్టీషనర్స్ (IASVP)లో 64 మంది కొత్త ప్రాక్టీషనర్లు చేరారు. ఈ సభ్యుల కోసం రూపొందించిన ప్రామాణిక సందర్శన కార్డుకు కూడా అసోసియేషన్ సభ్యులందరినుండిమంచి ఆదరణ లభించింది.వైబ్రియానిక్స్ రెమిడీలురోగులందరికిడబ్బుగానీ లేదా ఏ రకమైన విరాళాలు గానీ లేకుండా పూర్తిగా ఉచితంగా అందించబడతాయి.దీనిని అతిక్రమించిన వారు ఎవరైనా సరే వారి పేర్లు వెంటనే మా డేటాబేస్ నుండి తొలగించ బడతాయి,SRHVP మిషను మరియు 108 సిసి బాక్సు IASVP యొక్క సంపద. ఇవి దానిని స్వీకరించే ప్రాక్టీషనరుఉపయోగం కోసం మాత్రమే ఇవ్వబడతాయి, వీటిని మరెవరికీ ఇవ్వకూడదు, కొనకూడదు.

5. కోవిడ్-19 కొరకు రోగ నిరోధకముగానూమరియు చికిత్సగా కూడా పనిచేసిరోగనిరోధకశక్తిపెంపొందించే ఇమ్యూనిటీ బూస్టర్రెమిడీని విజయవంతంగా అభివృద్ధి చేశాము. మహమ్మారి ప్రారంభంలోనే మన పరిశోధనా బృందం ఈ సవాలుకు ధీటుగా స్పందించింది, దీని ఫలితంగా ఈ రెమిడీ వేలాది మందికి లభించడం నిజంగా ఒక వరం. సాధ్యమైనంత ఎక్కువగా దీనిని విస్తరించడానికి ఏప్రిల్ లోనే అన్ని రాష్ట్రాల అధ్యక్షులకు ఒక ప్రకటన జారీ చేసినందుకు సత్యసాయి సంస్థల అఖిలభారత అధ్యక్షుడు శ్రీ  నిమీష్పాండ్యాగారికినేను ఎప్పటికీ రుణపడిఉంటాను. తత్ఫలితంగాలాక్డౌన్ సమయంలో కూడా ఈ రెమిడీ విస్తృతముగా పంపిణీ చేయబడి తద్వారా 270,000 మందికి ప్రయోజనం చేకూరింది. రాబోయే సంవత్సరంలో భారతదేశంలో మా ప్రాంతీయ సమన్వయ కర్తల యొక్క భాగస్వామ్యాన్ని మేము ఎక్కువగాఅభిలషిస్తున్నాము.

6. బలమైన మరియు చురుకైన సంస్థ నిర్మాణాన్ని అమలు చేయడం ద్వారానూ మరియు సమర్థవంతమైన ప్రామాణిక నిర్వహణా విధానాలను రూపొందించడం ద్వారా మా నిర్వహణా వేదికను బలోపేతం చేయడం జరిగింది. ఇంతటి గొప్ప పరిణామ ప్రగతి ఉన్నప్పటికీ ఇది మనం పొందిన  పురస్కారాలనూ చూసి మురిసిపోతూ విశ్రాంతి తీసుకోవడానికి సమయం కాదు.మనము మరెన్నో కార్యక్రమాలకు ప్రణాళికలను సిద్ధంచేసి రాబోయే సంవత్సరానికి ఇప్పటికే కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాము.బెంజమిన్ ఫ్రాంక్లిన్ మాటల్లో చెప్పాలంటే “నీవు చనిపోయిన తరువాత నిద్రించడానికి చాలా సమయం ఉంటుంది”ప్రతీ సంవత్సరం వైబ్రియానిక్స్మిషన్ ను బలోపేతం చేయడానికి మరింతగా విస్తరించడానికి అంకితభావంతోను ధృఢమైన ప్రయత్నంతో మనం మరింత ముందుకు సాగాలి.

2021లోక్షేత్రస్థాయిలో అనేక కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా మరింత ఉత్సాహాన్ని పొందాలని మేము ఎదురుచూస్తున్నాము. ఈ విషయంలో మొదటి దశగా చిన్న సామాజిక సమూహాలు, పాఠశాలలు, ప్రైవేటు సంస్థలు, మరియు ఇతర సంస్థలలో అవగాహన చర్చల ద్వారాస్ప్రెడ్దవర్డ్ పేరుతో వైబ్రియానిక్స్ గురించి ప్రచారం ప్రారంభించాలని మేము ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము.దీనిలో భాగంగా అలోపతి వైద్యులు సందర్శించే పెద్ద పెద్దసంస్థలను సంప్రదించి అలోపతితో కలిపి వైబ్రియానిక్స్ కూడా ప్రయత్నించమని సూచించడం ద్వారా దీనిని  సహాయక చికిత్సగా పరిచయం చేయాలనే ఆలోచన ఉంది.అలాగే హోమియోపతి క్లినిక్ నిర్వహిస్తున్న దేవాలయాలు మరియు గురుద్వారా వంటి ప్రార్థన స్థలాలను కూడా సంప్రదిస్తాము.వైబ్రియానిక్స్ యొక్క సమర్ధతగురించి అలోపతి వైద్యులు పరిశీలనలను నమోదు చేయడంపైన కూడా మేము దృష్టి పెడతాము.

   ఈ విషయంలో కంపెనీలు, పాఠశాలలు మొదలైన వాటిని సంప్రదించడానికి మీలో ఎవరైనా జంటగా లేదా సమూహంగా కలసి పని చేయడానికిఆసక్తి ఉంటేమీ ప్రతిపాదనలను[email protected]కు పంపమని నేను ఆహ్వానిస్తున్నాను.మా అడ్మిన్ టీం ద్వారా పఠనసామాగ్రి మరియు ప్రజెంటేషన్ రూపంలో మా మార్గదర్శకత్వము,సహాయము మరియు మద్దతు మా నిర్వాహకుల ద్వారా అందరికీ అందించబడుతుంది. ఈ చొరవ ప్రాక్టీషనర్లకు అపారమైన సేవా అవకాశాన్ని అందిస్తుందని నేను భావిస్తున్నాను.

కమ్యూనిటీ సేవా ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా వైబ్రియానిక్స్  విస్తరణకు మంచి అవకాశం ఉంది. అటువంటి సేవా ప్రాజెక్టులలో ఒకదాని గురించి సంపుటి 11 సంచిక 5 లొ వివరంగా ఇవ్వబడింది. క్రొయేషియా కు చెందిన ఒక ప్రాక్టీషనరు స్థానిక ప్రభుత్వ అధికారులను సంప్రదించి కమ్యూనిటీ వాలంటీర్ల సహాయంతో లావెండర్ పొదలను వైబ్రియానిక్స్రెమిడిలతో చికిత్స చేయడం ద్వారా పునరుద్ధరించడం జరిగింది. ఈ సంవత్సరం మనచుట్టుప్రక్కల ఉన్న పశు శాలలు (ముఖ్యంగా గోశాలలు), స్థానిక ఉద్యాన వనాలు మొదలైన ప్రాజెక్టులపై పైన మన దృష్టి ఉంటుంది.

ఇటీవలే క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న సందర్భంలో యేసు పై స్వామి చెప్పిన మాటలనుపునరుద్ఘాటించడం సముచితమని నేను భావిస్తున్నాను. స్వామి ఏమిచెప్పారంటేఏసు పేదవారిలోకెల్లా నిరుపేదలైన వారికి సేవ చేస్తూ తన అనుయాయులకు ఇలా బోధించారు.పేదల అవసరాలు తీర్చడం, సహాయం అవసరమైన వారికి,ఆకలితో ఉన్నవారికి, రోగ గ్రస్తులకు, సేవ చేయడం ద్వారా మనం దేవునికే సేవ చేస్తున్నామని బోధించారు. ఇలా చెపుతూ స్వామి “మనలో ఉన్న యేసునుమేలుకొల్పాలని” పిలుపు నిచ్చారు. నిజమే ఇది ఇప్పుడు చాలా అవసరం. నేను మన ప్రాక్టీషనర్లందరినీయేసు జీవితం నుండి జీవిత పాఠాలను ఆకళింపు చేసుకుంటూ మానవాళి నుండి దైవత్వం వరకు కొనసాగే ఈ ప్రయాణంలో కలిగే అన్ని అడ్డంకులు మరియు కష్టాలను అధిగమించాలని మీ అందర్నీ వినయంగా కోరుతున్నాను.

ఈ 2021మన వైబ్రియానిక్స్ కు మరిన్ని సేవా అవకాశాలను తెస్తుందని నేను నిజంగా ఆశిస్తున్నాను. దైవిక తేజస్సును మరియు దైవ ప్రేమను సమిష్టిగా వ్యాప్తి చేయడానికి మనమందరం ప్రతీరోజు ప్రేమతో మన జీవితాన్ని ప్రారంభించడం, ప్రేమతో గడపడం, ప్రేమతో నింపడం, మరియు ప్రేమతో రోజు ముగించడం అనే సంకల్పం చేయాలని ప్రార్థిస్తున్నాను.ఆ విధంగా మనమందరం సమిష్టిగా ఈ భూమాతను ఒక చక్కని ప్రదేశంగా మార్చే అవకాశం ఏర్పడుతుంది.

ప్రేమతో సాయి సేవలో,

జె కె అగర్వాల్