Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 11 సంచిక 6
November/December 2020


Q1. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లేదా సోరియాసిస్ వంటి స్వయం ప్రతిరక్షక వ్యాధితో బాధపడుతున్న రోగికి కోవిడ్ నివారణ కోసం ఇమ్యూనిటీ బూస్టర్ ఇవ్వవచ్చా ? అటువంటి వ్యాధుల విషయంలో రోగి తన రోగనిరోధకశక్తిని తగ్గించే మందులు తీసుకుంటూ ఉండవచ్చు కదా ?

A. అవును అలాంటి రోగులకు ఇది సురక్షితంగా ఇవ్వవచ్చు. ఈ వైరస్ వల్ల కలిగే లక్షణాలను పరిష్కరించడానికి IB రూపొందించబడింది కనుక వైరస్కు ఎక్కువగా గురయ్యే అవయవాలను బలోపేతం చేయడానికి ఇది పని చేస్తుంది. అంతేకాక ఇది ఎథిరిక్ స్థాయిలో ఒకరి వ్యక్తిగత రోగ నిరోధక శక్తిని పెంచి కోవిడ్ వంటి వైరస్ మరియు బ్యాక్టీరియాతో కూడా పోరాడటానికి సహాయపడుతుంది. అందువల్ల భౌతిక స్థాయిలో ఇవ్వబడే ఇమ్యునో సప్రెసివ్ చికిత్సతో ఇది జోక్యం చేసుకోదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కు చికిత్స చేస్తున్న కొందరు ప్రాక్టీషనర్లు ఈ వ్యాధి చికిత్స పై ఎటువంటి ప్రతికూల ప్రభావం లేకుండా IB  ఇచ్చినట్లుగా వారి రిపోర్టుల ద్వారా వెల్లడయ్యింది.     

________________________________________________________________________

Q2. కోవిడ్ కోసం ఇచ్చే ఇమ్యూనిటీ బూస్టర్ IB పుల్ అవుట్ కు కారణం అవుతుందా?  

A. అవును సైద్ధాంతికంగా ఈ కాంబో ఇతర రెమిడీల మాదిరిగానే ఉంటుంది. అయినప్పటికీ కోవిడ్ వంటి  తీవ్రమైన సమస్యలలోపులౌట్ సంభవించడం చాలా అరుదు. నివారణ కోసం IB ఇచ్చినప్పుడు(చాలా అరుదుగా)    తలనొప్పి మరియు అలసట రూపంలో పులౌట్ ఏర్పడి రెండు రోజులు మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. కానీ IB ని OD వద్ద కొనసాగించవచ్చు.

________________________________________________________________________

Q3.  నేను రెండు సంవత్సరాలుగా 108 సిసి బాక్స్ ఉపయోగిస్తూ ఉన్నాను. దానిని రీఛార్జి చేయవలసి ఉంది. నాకు దగ్గరలో ప్రాక్టీషనర్లు లేరు నేను ఏంచేయాలి?

A. మరో రెండేళ్ల పాటు కంపనాలను లేదా వైబ్రేషన్స్ చురుకుగా ఉంచడం సాధ్యమే. ప్రతీ బాటిల్ ను మీ కుడి చేతిలో పట్టుకొని ప్రార్థన చేస్తూ ఎడమ అరచేతికపై తొమ్మిదిసార్లు ట్యాప్ చెయ్యండి. నిద్రాణమైన కంపనాలు తిరిగి సక్రియం కావడానికి అవకాశం పొందుతాయి. ఈ ప్రక్రియ ఛార్జింగ్ ను మరో 6 నెలలు పెంచుతుంది. ఈ ప్రక్రియ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున నాలుగు సార్లు వరకు పునరావృతం చేసుకోవచ్చు. మీ సీసాలు రేడియేషన్ నుండి దూరంగా ఉంచడం ద్వారా మరియు ఎండిపోకుండా చూసుకోవడం వంటి జాగ్రత్తలు వహించండి. ప్రతీ సీసాను కనీసం మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేసుకుంటూ తక్కువ మట్టం గల   ఏదైనా బాటిల్ నువెంటనే పూరించండి.  

________________________________________________________________________

Q4. నేను భారత దేశాన్ని సందర్శించే కొందరు భక్తుల ద్వారా 108 సిసి బాటిళ్లను నింపడం కోసం ఆల్కహాల్ తెప్పించుకునే వాడిని సీసాలు త్వరగా పొడిగా అయిపోతున్న కారణంగానూ, భక్తులు తరచుగా ఇండియాకు రాని కారణంగా నేను నష్టపోతున్నాను, నేను ఏం చేయాలి?  

A. మనము 96% కంటే ఎక్కువ స్వచ్ఛత గల ఇథైల్ ఆల్కహాల్ ఉపయోగిస్తాము. కొన్ని దేశాల్లో అధిక స్వచ్ఛత కలిగిన ధాన్యం ఆల్కహాలు గ్రెయిన్ ఆల్కహాల్ లభిస్తుంది.  దీనిని స్థానికంగా సేకరించడం సాధ్యం కాకపోతే తాత్కాలిక చర్యగా జిన్ లేదా వోడ్కా (సుమారు 45% ఆల్కహాల్ ఉండేవి) వంటి స్పష్టమైన లిక్కర్ వాడవచ్చు. తక్కువ స్వచ్ఛత ఆల్కహాల్ తోసమస్య ఏమిటంటే గోళీలకు దాన్ని జోడించినప్పుడు అది త్వరగా  ఆవిరై పోదు కనుక మనము ఒకే సీసాలో వేర్వేరు సీసీల యొక్క బహుళ చుక్కలను జోడించినప్పుడు గోళీలు మెత్తగా మారిపోతాయి.  ఈ సమస్యను నివారించడానికి ఒక్కొక్క సిసి బాటిల్ నుండి సేకరించిన చుక్కలను ఒక ఖాళీ సీసాలో వేసి అట్టి మిశ్రమం యొక్క ఒక చుక్కను రెమిడీ తయారుచేసే గోళీలు ఉన్న బాటిల్ కి జోడించండి ఇటువంటి ప్రశ్ననే 2014 సెప్టెంబర్ అక్టోబర్ సంచిక 5 సంపుటి #5.1లో చూడండి.  

హెచ్చరిక!  రెమిడీలు తయారీకి మనం డినేచర్డ్ ఈథైల్ ఆల్కహాల్  లేదా రాబ్బింగ్ ఆల్కహాల్ గా పిలవబడే  మిథైల్ ఆల్కహాల్ వాడకూడదు. ఎందుకంటే ఈ రెంటినీ అంతర్గతంగా తీసుకుంటే విషపూరితం అవుతాయి. కనుక ఇథనాల్ అని కూడా పిలువబడే ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే వాడండి.  

________________________________________________________________________

Q5. చితక కొట్టిన మందులను గానీ లేదా అలెర్జీ కారకాలకు పోటెంటైజ్ చేసేముందు ఇథైల్ ఆల్కహాల్ బదులుగా నీటిని ఉపయోగించవచ్చా?  

A. అవును మీరు నీటిని ఉపయోగించవచ్చు. కానీ అది స్వచ్ఛంగా ఉండాలి. ఉదాహరణకు బాటిళ్లలో ఉండేది లేదా మరిగించి చల్లార్చిన నీటినే ఉపయోగించాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పోటెంటయిజ్ చేసే పదార్ధము కంటైనర్ యొక్క దిగువన తాకేటట్లు లేదా అది కనీసం పాక్షికంగా నీరు లేదా ఆల్కహాల్ కరిగిపోయే లా చూసుకోవాలి. పదార్ధము కరిగిపోకుండా తేలుతూ ఉంటే అట్టి పదార్థాన్ని దానికదే అలాగే వాడండి.  

________________________________________________________________________

Q6. నా రోగికి విక్స్ వేపొరబ్ పీల్చే అలవాటు ఉంది. వైబ్రియానిక్స్ రెమిడీలు తీసుకునేటప్పుడు కూడా అతను దానిని ఉపయోగించవచ్చా ?

A.  దగ్గు మరియు జలుబు నుండి ఉపశమనం కోసం పిల్లల చాతీకి రాయడానికి తల్లులు కూడా ఉపయోగించే ఈ గి విక్స్ వేపొరబ్ లో కర్పూరం, మెంథాల్ మరియు యూకలిప్టస్ ఆయిల్ కూడా ఉంటాయి. ఇటువంటి బలమైన వాసన గల పదార్థాలు అనేక ప్రకంపనలను తటస్థం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి విక్స్ వేపొరబ్ ఇంకా ఇతర బామ్ (భారతదేశంలో అమృతాంజన్ గానూ అనేక దేశాల్లో వేర్వేరు బ్రాండ్ పేర్లతో విక్రయించే ఉత్పత్తులు) వంటివి నివారించడమే మంచిది.  ఒక వేళ తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే రెమిడీ  తీసుకోవడానికి కనీసం గంట ముందు వెనుక వ్యవధి తప్పనిసరిగా ఉండాలి.  

________________________________________________________________________

Q7. కొబ్బరి నూనె, పెట్రోలియం జెల్లీ, ఆలివ్ ఆయిల్, విభూతి, మొక్కజొన్న పిండి వంటి మాధ్యమాల్లో కంపనాలు ఎంతకాలం ప్రభావవంతంగా ఉంటాయి?

A. చక్కెర గోళీల మాదిరిగానే ఈ మాధ్యమాల్లో కంపనాలు ఆరు నెలల వరకు ప్రభావవంతంగా ఉంటాయి. ఐతే ఈ రెమిడీలు బాగా సంరక్షించబడినప్పుడు మాత్రమే ఉదాహరణకు రేడియేషన్ మూలాల నుండి  దూరంగా ఉంచబడినప్పుడు మాత్రమే కంపనాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.