డా. జిత్. కె అగ్గర్వాల్ యొక్క డెస్క్ నుండి
Vol 11 సంచిక 3
May/June 2020
ప్రియమైన ప్రాక్టీషనర్లారా,
సంవత్సరంలో అత్యంత పవిత్రమైన నెలలలో ఒకటైన ఈ నెలలో మీ అందరికీ వ్రాస్తున్న సందర్భంలో కృతజ్ఞతా పూర్వక హృదయంతో మన ప్రియమైన స్వామి యొక్క దివ్య పాదపద్మాలకు వినయపూర్వక వందనాలు సమర్పిస్తున్నాను. ఈ సంవత్సరం ప్రాపంచిక విషయాలు కొంచెం భిన్నంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ నెలలో ఈస్టర్, రామనవమి మరియు సత్యసాయి ఆరాధనా ఉత్సవాలు స్వామి దయ వల్ల ఆనందంగా జరుపుకున్నాము. అయితే, ఒక విషయం ఖచ్చితంగా చెప్పవచ్చు - మన ప్రియమైన స్వామి మాత్రమే, స్వామి ఒక్కరే ఈ కోవిడ్-19 మహమ్మారి ఫలితంగా ఏర్పడిన ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. స్వామి ఇలా అంటారు “సేవనుండి పొందిన ఆనందం శరీరంపై ప్రతిఫలించి అది మిమ్మల్ని వ్యాధి నుండి విముక్తి చేస్తుంది”. సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లుగా మనమే స్వామి వచనానికి దృష్టాంతంగా నిలుస్తాము.
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచము పైన తన విస్తృతమైన ప్రభావాన్ని చూపుతూ ఉండడంతో, వెంటనే మన సీనియర్ వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లు పరిశోధనా మరియు చికిత్స ఈ రెండు రంగాల్లోనూ సమన్వయంతో పనిచేస్తూ ఈ చికిత్సా రంగాన్ని దారిన పెట్టారు.
ఈ కొత్త వైరస్ గురించి నిరంతరం మారుతున్న సమాచారంతో సాయి వైబ్రియానిక్స్ పరిశోధనా బృందం ఇలాంటి వ్యాధులకు నిరూపితమైన వివిధ చికిత్సలను విశ్లేషించింది. ధ్యానం ద్వారా స్వామితో అనుసంధానమై మార్గదర్శకత్వం పొందిన తర్వాత వారు ఈ పరిస్థితికి తగిన పరిష్కారాలు ఇచ్చారు. చాలా దేశాలు ఇప్పటికే “లాక్ డౌన్” ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాక్టీషనర్లు వారి స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాలకు కట్టుబడి ఈ వైరస్ నివారణ మరియు చికిత్స రెండింటికీ రోగనిరోధక శక్తిని పెంచేదిగా తెలియ పడుతున్న “ఇమ్యూనిటీ బూస్టర్” పేరుతో ఈ రెమెడీలను పంపిణీ చేయడం ప్రారంభించారు. నిష్క్రియాత్మకముగా ఉన్న చాలామంది ప్రాక్టీషనర్లు కూడా ఆసక్తితో ముందుకు వచ్చి సేవకు మొగ్గుచూపారు. ఈ ఘనత అంతా స్వామికే చెందుతుంది. చేసేవారు, చేయించేవారు స్వామియే. వీటి ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి! గత రెండు నెలలుగా వైబ్రియానిక్స్ రెమిడీలను తీసుకున్న వారి నుండి అత్యద్భుతమైన ఫీడ్బ్యాక్ నిరంతరం అందుకుంటూనే ఉన్నాము.
ఈ సమయంలో సత్యసాయి సేవా సంస్థ మా వెనక ఉండి వారి మద్దతు అందించడం మన అదృష్టంగా భావిస్తున్నాను. నేను సత్యసాయి సేవా సంస్థల అఖిలభారత అధ్యక్షులను కోరగానే మన యొక్క విన్నపము మన్నించి మన ప్రాక్టీషనర్లకు వారి పూర్తి సహకారం అందించాలని భారత రాష్ట్రాల అధ్యక్షులకు వెంటనే వర్తమానం పంపారు. స్వామి యొక్క అపారమైన దయతో దేశవ్యాప్తంగా సాయి వైబ్రియానిక్స్ ప్రాక్టీషనర్లకు తలుపులు తెరవబడ్డాయి. వారు నిజంగా ఈ కష్ట సమయాల్లో తమవంతుగా నిర్విరామంగా కృషిచేస్తూ సాధ్యమైనంత ఎక్కువమందికి ఈ రెమిడీలు అందేలా చేశారు.
సాధ్యమైనంత వరకు ముఖ్య ప్రాక్టీషనర్లు తమ స్థానిక సాయి ఆర్గనైజేషన్ నాయకులతో సన్నిహితంగా ఉంటూ భక్తులలో వైబ్రియానిక్స్ పట్ల అవగాహన పెంచుకోవడంలో నాయకుల సహకారాన్ని తీసుకోవాలని నా సవినయ విన్నపము. ఈ విధంగా వారు “ఇమ్యూనిటీ బూస్టర్” ను మరింత పెద్దస్థాయిలో పంపిణీ చేయవచ్చు మరియు అలా చేయడం ద్వారా ప్రస్తుత ప్రతిష్టంభనకు చరమగీతం పలకవచ్చు. అట్లు చేయడంలో మన వంతుగా ఒక చిన్న పాత్రను పోషించగలము.
మొదటిసారి ఈ రెమిడీలు ఉపయోగించి అద్భుతాలను చవిచూసిన మన ప్రాక్టీషనర్ల విజయవంతమైన ఫలితాల వార్తలను మేము వినియున్నామని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ సంచికలోని “అదనంగా” విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ఉత్తేజకరమైన కథలు మరియు డేటాను మీతో పంచుకోవడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది.
ఈ మహమ్మారి మానవాళికి వినాశకరమైన నష్టాన్ని - ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, కలిగిస్తన్నప్పటికీ ఎందరో తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అదే సమయంలో వైభ్రియానిక్స్ ప్రాక్టీషనర్లగా సేవలో మునిగిపోవడానికి మరియు ఎంతోమందికి సహాయపడటానికి ఇది ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించింది! మీరు ఈ ఇమ్యూనిటీ బూస్టర్ ఇచ్చిన కొత్త రోగులను ఫాలోఅప్ చేస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ఒత్తిడి, నిరాశ, లేదా వైబ్రియానిక్స్ సహాయపడే ఇతర ఆరోగ్య పరిస్థితుల కోసం తనిఖీ చేయండి. ఈ మహమ్మారిని ముందస్తుగా ఎదుర్కొనడం కోసం మనకున్న అనుభవం మేరకు ప్రాక్టీషనర్లు అందరికీ నేను చేయబోయే మరో ముఖ్యమైన సిఫారసు ఏమిటంటే, భవిష్యత్తులో మన రెమిడీలను సాధ్యమైనంత ఎక్కువ మంది రోగులకు అందించి గరిష్ట ప్రభావమును అందుకొనే దిశలో ప్రాక్టీషనర్లందరూ తగినన్ని చక్కెర గోళీలు, అవి నింపే సీసాలు, ప్రాథమిక టింక్చర్ (ఇథైల్ ఆల్కహాల్) ఎక్కువగా నిల్వ ఉంచుకోవాలి.
కొత్త కేసులు తక్కువ కావడం ప్రారంభించినప్పుడు, సామాన్య ప్రజలలో మరియు మన ప్రాక్టీషనర్లలో కూడా కొంత అలసత్వం ఏర్పడే అవకాశం ఉంది. సామాజిక దూరాన్ని పాటించడంతో సహా, ఇతర ముందు జాగ్రత్త మార్గదర్శకాలకు కట్టుబడి ఉండడంలో అప్రమత్తంగా ఉండాలని సూచన. మన వైపు నుండి తప్పు జరగకుండా జాగ్రత్త వహించండి ఎందుకంటే మన నిర్లక్ష్యం వల్ల అందరూ తమ జీవితాలను ఫణంగా పెట్టే పరిస్థితి రావచ్చు. ముఖ్యంగా, వృద్ధులు దీనికి త్వరగా లోనయ్యే అవకాశం ఉన్నందున మరియు వారి రోగనిరోధకశక్తి ఈ మహమ్మారికి ఏదో విధంగా రాజీపడే అవకాశం ఉంటుంది. కనుక ప్రాక్టీషనర్లు అందరూ విస్తృత స్థాయిలో పరిశుభ్రత నియమాలను పాటించాలనీ మరియు కోవిడ్-19 పూర్తిగా నిర్మూలన అయ్యేవరకు అన్ని రక్షణ చర్యలు తీసుకుంటూనే ఉండాలని నేను ధృఢంగా కోరుతున్నాను.
స్వామి ఒక సందర్భంలో ఏమన్నారంటే “మీ దైనందిన జీవితంలో ప్రతి చర్యలోనూ ప్రేమను కురిపించండి. దాని నుండే దైవత్వం వ్యక్తమవుతుంది” దివ్యవాణి-1996, జులై 5. స్వామి మన ద్వారా పనిచేస్తూ ఈ మహమ్మారిని అదుపులో ఉంచాలని మరియు మనందరినీ క్షేమంగా ఆరోగ్యంగా ఉంచాలని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యము, వ్యక్తిగత సంబంధాలు, ఆర్థిక వ్యవస్థ మరియు భవిష్యత్తు గురించి అనిశ్చితి మరియు జీవితానికి సంబంధించిన అనేక అంశాలకు సంబంధించి ప్రజలలో అనేక రకాల భయాలు నెలకొని ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే స్వామి మనకు అందించిన అభయం “నేను ఉండగా భయమేల”, అన్న స్వామి మాటలు మనం ఎప్పుడు గుర్తుంచుకోవడమే కాకుండా ఈ సందేశాన్ని మనకు తారసపడే వారందరికీ (రోగులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, పొరుగువారు, దీన జనులు) వ్యాపింపజేసి వారి జీవితాలను అర్థవంతం చేసుకునేలా మన వంతు కృషి చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.
ప్రేమ పూర్వక సాయి సేవలో మీ
జిత్ కె అగ్గర్వాల్