జవాబుల విభాగం
Vol 11 సంచిక 2
March/April 2020
ప్రశ్న 1: కరోనా వైరస్ కోవిడ్-19 కోసం ముందస్తుగా ఉపయోగించే నివారణను సూచించండి. ఒకవేళ రోగి ఈ వ్యాధికి గురైనట్లు అనిపిస్తే దానికి చికిత్స ఏమిటి?
జవాబు 1: 108 cc బాక్స్ ద్వారా ముందస్తుగా ఉపయోగించే నివారిణి : CC9.2 Infections acute + CC9.4 Children's diseases + CC13.1 Kidney tonic + CC19.3 Chest infections + CC19.6 Cough chronic + CC19.7 Throat chronic (for SRHVP ఉపయోగించే వారి కోసం: SR261 Nat Mur 30C + SR270 Apis Mel 30C + SR272 Arsen Alb 30C + SR291 Gelsemium+SR275 Belladonna 30C)…OW నివసిస్తున్నఏరియాలో వ్యాధి వ్యాపించ నట్లయితే OW, ప్రబలంగా ఉంటే ODగా తీసుకోవాలి ; రోగి వయసు మళ్లినవారు లేదా సంక్రమణ ఏర్పడే అవకాశం ఉన్నట్లయితేనూ ; విదేశాలకు వెళ్లబోతుంటే, విమానం ఎక్కే రోజున మరియు దాని ముందురోజున తీసుకోవాలి. ఎవరైనా వ్యక్తికి ఈ వ్యాధి ఉన్నట్లు అనిపిస్తే, మోతాదు 6TDగా ఇస్తూ వెంటనే హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స తీసుకోవాల్సిందిగా సూచించాలి. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే అలోపతి చికిత్స తో పాటు మద్దతుగా వైబ్రో చికిత్సను కూడా కొనసాగించాలి. ఇతర వివరాల కోసం “అదనంగా విభాగంలో “ ఇచ్చిన వ్యాసాన్ని చూడండి.
______________________________________
ప్రశ్న 2: నోసోడ్ తయారు చేసేటప్పుడు చేతికి గ్లౌస్ ఉపయోగించాలా ?
జవాబు 2: ముందు జాగ్రత్త కోసం చేతికి గ్లౌస్ ఉపయోగించడం మంచిదే. ప్రారంభంలో రోగి తన శరీరము నుండి వెలువడే వ్యర్ధాలు అనగా మూత్రము, మలము, చీము వంటివి సీసాలో భద్రపరిచి తీసుకు వచ్చేటప్పుడు శాంపిల్ తీసుకున్నతర్వాత సీసా యొక్క బయట పక్కన శుభ్రంగా కడిగి తీసుకు రావాల్సిందిగా సూచించాలి. శాంపిల్ వెల్ కలుషితం కాకుండా ఉండటానికి లేదా అభ్యాసకునికి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటం కోసం, ప్లాస్టిక్ పేపర్ లో చుట్టి ఉదాహరణకు, పలుచని ప్లాస్టిక్ రేపర్ వంటి వాటిలో చుట్టి శాంపిల్ వెల్ లో ఉంచాలి. రెమిడీ తయారీ తరువాత దానిని పేషంటుకు తిరిగి ఇచ్చివేసి జాగ్రత్తగా పారవేయమని చెప్పాలి.
________________________________________
ప్రశ్న 3: లోహంతో చేయబడిన వైరుతో చుట్టబడి ఉన్న నా క్రిస్టల్ లాకెట్టునుSRHVP మిషన్ తో చార్జ్ చేయడం సాధ్యమేనా?
జవాబు 3: లోహంతో చేసినవి ఏవీ కూడా SRHVP రెండు బావులలో ఉంచకూడదని మా అభిప్రాయం. ఒకవేళ మీ లాకెట్ ఇనుముతో చేసినది అయితే అది SRHVPలో ఉన్న ఐస్కాంతం పై కొంతకాలం తరువాత ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడ ఈ కేసు విషయంలోలాకెట్టు చుట్టూ ఉన్న లోహపు తీగ ప్రకంపనలను ప్రభావితం చేయవచ్చుకానీ SRHVP మిషన్ ను ప్రతికూలంగా ప్రభావితం చేయకపోవచ్చు.
______________________________________
ప్రశ్న 4: మనం సేవ చేసేటప్పుడు అహంకారం దొంగతనంగా ప్రవేశించకుండా చూడడము మరియు దాన్ని గుర్తించడం ఎలా?
జవాబు 4: అహంకారం ఎప్పుడు ప్రవేశిస్తుందో, నిశ్శబ్దంగా మనపై ఎప్పుడు తిష్టవేసుకుని కూర్చుంటుందో మనకు తెలియకపోవచ్చు. కానీ ప్రతిరోజు భగవంతుని ప్రార్థనతో రోజు ప్రారంభించడం మరియు ఉదయం మొదటి రోగితో సంభాషించేటప్పుడు ప్రార్ధించడం, అలాగే ప్రతీ రాత్రీ క్రమం తప్పకుండా ఆత్మ పరిశీలన చేసుకోవడం ద్వారా, అహంకారమును ఏదో ఒక రోజు వదిలించుకోవడానికి సహాయపడుతుంది. మనం చేసే ప్రార్థన హృదయపూర్వకంగా మనం కేవలం భగవంతుడు పనిముట్లు అనే భావనతో చేయాలి. 108 సిసి పుస్తకం పరిచయంలో ఇచ్చిన ప్రార్థనను గుర్తుచేసుకోండి: “మేము మీ ప్రేమ, కాంతి మరియు నయం చేసే శక్తి యొక్క స్వచ్ఛమైన వాహకాలుగా ఉండాలని తద్వారా ఈరోజు మా వద్దకు వచ్చే రోగులకు సహాయ పడాలని ప్రార్థిస్తున్నాము”. వైబ్రియానిక్స్ అనేది మన ఆధ్యాత్మిక సాధన కోసం నిర్దేశించిన ఒక చక్కని మాధ్యమం అనేది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. మన మాన్యువల్ యొక్క శీర్షికలో ఇచ్చిన స్వామి సందేశం అలాగే 108 సిసి పుస్తకంలో ఇచ్చిన సందేశము, అహంకారం నుండి దూరంగా ఉండేలా చేస్తుంది. ఈ సందేశాన్ని మనం ప్రతిరోజూ చూసుకొని చదువుకునేలా ఎక్కడైనా అతికించుకోవడం ఉత్తమం.
______________________________________
ప్రశ్న 5: రోగ నిర్ధారణకు ముందే అనుమానాస్పద క్యాన్సరుకు నేను చికిత్స చేయవచ్చా?
జవాబు 5: అవును, వ్యాధి సోకుతుంది అనుకున్న అవయవానికి కావలసిన నివారణ ఎంపిక చేసి దాన్ని కూడా కలపవచ్చు. మన వైబ్రియానిక్స్ నివారణలకు ఉన్న గొప్పదనం ఏమిటంటే రోగ లక్షణాలు బాహ్యంగా కనిపించక ముందే ముందస్తు నివారణగా సూక్ష్మ శరీరముపై పని చేయడం ప్రారంభిస్తాయి. మన వార్తా సంపుటి 10 సంచిక 6 లో ప్రశ్నలు జవాబులు విభాగంలో 5 వ ప్రశ్నలో క్యాన్సరుకు ముందస్తు నివారణల గురించి ఇవ్వబడిన వ్యాఖ్యను చదవండి.
______________________________________
ప్రశ్న 6: థైరాయిడ్ సమస్యతో వచ్చిన రోగికి ఇది హైపో లేదా హైపర్అని తెలియనప్పుడు చికిత్స ఎలా చేయాలి?
జవాబు 6: రోగనిర్ధారణ నివేదిక లేనప్పుడు, లక్షణాలు మరియు కారణాలు తెలిస్తే వాటి ద్వారా సరైన కోంబో ఎంపిక చేసుకోవచ్చు. మన వార్తాలేఖ సంపుటి 10 సంచిక 6 లో ఆరోగ్య చిట్కాలలో ఇచ్చిన థైరాయిడ్ వ్యాసం చదవండి.
______________________________________
ప్రశ్న 7: రోగికి మొదటి మాత్రను వేసేటప్పుడు బాటిల్ యొక్క మోత నాలుకను తాగడం లేదా అతడి లాలాజలం అభ్యాసకుని వేలి మీద పడటం వంటివి జరిగితే ఏం చేయాలి?
జవాబు 7: రోగికి మొదటి మాత్రను అభ్యాసకుడే నోటిలో వెయ్యాలి అయితే పైన చెప్పబడిన సంఘటనలు జరగకుండా కొంచెం దూరం ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ చేయి రోగి నాలుకకు తాకినట్లయితే శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఒకవేళ ఆ మాత్రను కొంత దూరం నుండి వేయటం సాధ్యం కాకపోతే మాత్ర ఉంచిన మూతను రోగికి ఇచ్చి అతనినే/ఆమెనే వేసుకోమని చెప్పండి.
______________________________________
ప్రశ్న 8: ఉదయమే కర్పూరం పీల్చే అలవాటు ఉన్న ఒక రోగికి మనం ఇచ్చే వైబ్రియానిక్స్ నివారణలు ప్రకంపనలకు ఆటంకం కలిగించే అవకాశం ఉందా ?
జవాబు 8: కర్పూరం యొక్క బలమైన వాసన వైబ్రియానిక్స్ నివారణల యొక్క ప్రకంపనలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీని వాసన చాలా కాలం పాటు ఉంటుంది కనుకనే కీటకాలను దూరంగా ఉంచడానికి దీన్ని ఉపయోగిస్తారు. కనుక రోగి వైబ్రియానిక్స్ చికిత్స లో ఉన్నప్పుడు కర్పూరం వాసన పీల్చడం నిలిపివేయడం గానీ లేదా వైబ్రో మందులు తీసుకోవడానికి వాసన పీల్చడానికి మధ్య కనీసం ఒక గంట విరామం ఉండేలా చూడమనండి.