Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్ కె. అగ్గర్వాల్ డెస్క్ నుండి

Vol 10 సంచిక 3
May/June 2019


ప్రియమైన చికిత్సా నిపుణులకు,

ప్రపంచ మానవ విలువల దినోత్సవంగా కూడా పాటిస్తున్న మన  ప్రియమైన భగవాన్ బాబా యొక్క ఆరాధన మహోత్సవం దినోత్సవం సందర్భంగా మీకు వ్రాస్తునందుకు నేను చాలా కృతజ్ఞుడను. ఆరాధన దినోత్సవానికి దారితీసే మొత్తం నెల, భక్తులు తమ హృదయాలను శుద్ధి చేయడానికి మరియు తమని తాము  సంస్కరించుకునే ఆధ్యాత్మిక సాధనలు ప్రేమ మరియు క్షమ చుట్టూ తిరుగుతుంది. ఈ సంవత్సరం ఆరాధన దినోత్సవం సందర్భంగా ప్రశాంతి నిలయంలో వినిపిచ్చిన స్వామి ప్రసంగం యొక్క ముఖ్యోదేశం స్వీయ పరివర్తన కోసం ఏకత్వాన్ని పెంపొందించుకోవడం. వైబ్రియోనిక్స్ ప్రాక్టీషనర్ యొక్క ముఖ్య లక్షణాలు ప్రేమించడం, క్షమించడం మరియు అంకితభావంతో నిస్వార్థ సేవ చేయడం అని మేము నమ్ముతున్నాము. అన్నింటికంటే మించి,  వైబ్రియోనిక్స్ సాధన చేయడం ద్వారా భేద భావాలని అధిగమించి స్వీయ పరివర్తనను వేగవంతం చేయడానికి సహాయపడుతుంది. స్వామి ఏమన్నారంటే, “తపస్సు, తీర్థయాత్రలు, గ్రంథాల అధ్యయనం, జపం ద్వారా ఈ జీవిత మహాసముద్రాన్ని దాటలేరు. సేవ చేయడం ద్వారా మాత్రమే దాన్ని సాధించవచ్చు...... భగవంతుడు అందరిలో నివసిస్తున్నాడనే నమ్మకంతో ప్రతి ఒక్కరికీ సేవ చేయండి ”….. సత్యసాయి స్పీక్స్, వాల్యూమ్ 35. మన మందరం ఈ సందేశాన్ని మన హృదయాల్లో మరియు మన మనస్సులలో దృఢమైన ముద్ర వేసుకుందాం.

స్వామి యొక్క పై సందేశం యొక్క స్ఫూర్తితో పని చేసిన అనేక మంది వైబ్రో అభ్యాసకులతో కలిసి పనిచేయడం మా అదృష్టం. డాక్టర్ నంద్ అగర్వాల్ 10608 ... ఇండియా  9 ఏప్రిల్ 2019 న మరియు జోజా మెంటస్ 01159క్రొయేషియా 16 ఏప్రిల్ 2019 న స్వామిలో లీనమైన వార్తలను భారమైన హృదయంతో మీతో పంచుకుంటున్నాను. మా వైబ్రియోనిక్స్ మిషన్‌లో వారిరువురు గొప్ప నాయకులు. 2012 నుండి సీనియర్ ప్రాక్టీషనర్‌గా వున్న డాక్టర్ నంద్ అగర్వాల్, ఆయన భార్య 02817...ఇండియా తో కలిసి బెంగళూరు మరియు ముంబైలలో అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించారు. ఆయన తన ఇంటి వద్ద మరియు ముంబైలోని స్వామి ఆశ్రమమైన ధర్మక్షేత్రంలోని రెగ్యులర్ వైబ్రో క్లినిక్ వద్ద ఎప్పటికప్పుడు పెరుగుతున్న రోగులకు ఆదర్శప్రాయమైన సంరక్షణను అందించారు. వ్యక్తిగతంగా నేను సన్నిహితుడు మరియు మంచి సహచరుడిని కోల్పోయాను. జోజా మెంటస్, 1999 నుండి ప్రాక్టీషనర్‌ గా చాలా అంకితభావంతో పని చేస్తున్నకరుణమూర్తి మరియు  క్రొయేషియా యొక్క SSIO యొక్క జాతీయ పాలక సంస్థ (కౌన్సిల్) అధ్యక్షురాలు ప్యాంక్రియాస్ క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడి స్వర్గస్తులైనారు. సాయి ఆర్గనైజేషన్‌ మరియు వైబ్రియోనిక్స్ ద్వారా ఆమె చేసిన ఆదర్శప్రాయమైన సేవలను కోల్పోతున్నాము.

ప్రపంచవ్యాప్తంగా స్థానిక నెలవారీ వైబ్రియోనిక్స్ సమావేశాల సంఖ్య పెరుగుతున్న శుభపరమైన ధోరణిని నేను గమనించాను. ఇటువంటి సమావేశాలను  నిర్వహించడంలో, వచ్చిన వారు అర్థవంతమైన చర్చలలో పాల్గొనడం ద్వారా మన ప్రాక్టీషనర్స్ చూపుతున్న ఉత్సాహం, సామార్ద్యము మరియు నిబద్ధత నాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తోంది. సమావేశాలలో ప్రత్యక్షంగా అందరు ఒక్క చోట కలిసే అవకాశం లేని చోట, ఇంటర్నెట్ టెక్నాలజీ (స్కైప్ లేదా ఇతర ఆన్‌లైన్ సమావేశ సాధనాలు) ద్వారా నిర్వహించుకోవాలని నేను సూచిస్తున్నాను. ప్రతి సమావేశానికి, ముందుగానే సమావేశంలో చర్చించే అంశాన్ని ప్రాక్టీషనర్స్ ఎంచుకోవాలని నేను సూచిస్తున్నాను మరియు ఈ సమావేశాలను మరింత అర్ధవంతంగా వుండటానికి వారి సంబంధిత కేసులు లేదా చికిత్స సంబంధిత అనుభవాలను పంచుకునేందుకు తయారుగా ఉండండి. అటు పిమ్మట చర్చల మరియు తీర్మానాల సారాంశాన్ని వైబ్రియోనిక్స్ కమ్యూనిటీ వారితో పంచుకోవాలి.

శిక్షణా శిబిరాలు నిర్వహించేట్టప్పుడు వైబ్రియోనిక్స్ సాధన మీద పెరుగుతున్న అభిరుచి మరియు స్వీయ-అభివృద్ధి కోసం (స్వీయ-పరివర్తన లక్ష్యంతో) వివిధ పద్ధతుల కోసం పెరుగుతున్న ఆసక్తి లాంటి మరికొన్ని ఉత్తేజకరమైన పోకడలు నేను గమనించాను. ఇది చాలా మంచి సంకేతం. క్షమ, ప్రేమ, కరుణ మరియు సహనం అనే లక్షణాలతో కూడిన మంచి ఆలోచనల ముఖ్యోదేశం మనందరికీ తెలిసినప్పటికీ, ఇవి సాధారణంగా మన మనస్సులలోనే ఉంటాయి. ఈ గుణాలని ఆచరణలో పెట్టి, కృతజ్ఞత కూడిన మంచి భావాలతో మనం ఆరోగ్య పరిరక్షణకై సేవ అందిస్తున్నప్పుడు, అద్భుతాలు జరుగుతాయని నేను నిజంగా నమ్ముతున్నాను. ఒక ప్రసిద్ధ బౌద్ధ సన్యాసి, థిచ్ నాట్ హన్హ్ ప్రకారం, “మనం ఇతరులకు అందించే అత్యంత విలువైన బహుమతి మన ఉనికి. మనం  ప్రేమించేవారిని హృదయపూర్వకంగా ఆలింగనం చేసుకున్నప్పుడు వారు పువ్వుల వలె వికసిస్తారు. ”

రానున్న ఈశ్వరమ్మ దినోత్సవంతో, మన మందరం మన మార్గంలో వచ్చిన ప్రతి జీవికి మరియు ప్రార్ధనల ద్వారా నయంచేసే వారి అందరికి తల్లి ప్రేమ మరియు దయ పంచడానికి సాధన చేద్దాం. మీరందరూ ఆనందంగా ఉండండి!

సాయికి ప్రేమపూర్వక సేవలో

జిత్ కె అగర్వాల్