Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు జవాబులు

Vol 10 సంచిక 1
January/February 2019


1. ప్రశ్న: అభ్యాసకునిగా నా జీవితం ఇతరులకు ఆదర్శప్రాయం కాకపోతే నన్ను నేను తీర్చిదిద్దుకోలేకపోతే నన్ను నేను ఎలా మార్చుకోగలను?  నా వద్దకు వచ్చే రోగులకు ఒక ప్రేరణగా ఎలా ఉండగలను?

జవాబు: ప్రాపంచిక దృష్టితో చూస్తే ఎవరూ పరిపూర్ణులుగా ఉండలేరు (యాదృచ్ఛికంగా దైవిక శక్తి మాత్రమే పరిపూర్ణంగా ఉంటుంది). అందుకే స్వామి అందరినీ ‘ప్రేమ స్వరూపులారా అని సంబోధిస్తారు. కాబట్టి పరివర్తన కోసం, పరిష్కరణ దిశలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశలో మనసుకు తర్ఫీదు నివ్వండి. మీ “సంకల్పం” దానికి  మార్గాన్ని కనుగొంటుంది. అలా చేసే శక్తి ఇప్పటికే  దేవుడు ఇచ్చిఉన్నాడు. ఫలితం ఆశించని ప్రయత్నం ఎల్లప్పుడూ భగవంతుడిచే ప్రశంశింప బడుతుంది. కనుక మార్పును ఆస్వాదించండి. సంకల్పం బలంగా లేకపోతే, పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే భగవంతుడిని తీవ్రంగా ప్రార్థించండి. అవసరమైతే, మీరు విశ్వసించిన స్నేహితుడి నుండి లేదా మరొక అభ్యాసకుడి నుండి కౌన్సిలింగ్ తీసుకోండి మరియు ప్రక్షాళన కోసం తగిన కాంబో తీసుకోండి.

________________________________________

2. ప్రశ్న: నేను నా పేషంటుకు మొదటి డోస్ గోళీ రూపంలో కాక నీటి రూపంలో ఇవ్వవచ్చా ?

జవాబు: అవును, సమయం మరియు పరిస్థితులు అనుకూలిస్తే నీటిలో నివారణ యొక్క మొదటి మోతాదును ఇవ్వడం మంచిదే. ఇది రోగి నీటిలో నివారణను తయారుచేసుకొనడానికి ఒక నమూనా ప్రదర్శన వలె పనిచేస్తుంది. రోగి తన ఇంట్లో కూడా అదే విధంగా చేయటానికి ఇది ప్రేరేపిస్తుంది. సాధారణంగా చాలా మంది రోగులు సులువైన మార్గాన్ని ఎంచుకోవడానికి ఇష్టపడతారు, నాలుక క్రింద ఒక మాత్రను వేసుకొని చప్పరించడం కన్నా నీటిలో తీసుకున్న పరిహారం మరింత ప్రభావవంతంగా ఉంటుందనే వాస్తవాన్ని వారు మరచిపోతారు. రెమిడీ కలిపిన కంటైనర్ను మీరు రోగికి ఇవ్వాలనుకొంటే, మిగిలిన నివారణ నీటితో పాటు రోగికి ఇవ్వండి. లేదా ఆ నీటిని మీ పెరటిలోని మొక్కలకు పోయవచ్చు. రోగులతో ఖాళీ బాటిల్ తీసురమ్మని కూడా సూచించవచ్చు.

________________________________________

3. ప్రశ్న:రోగి సంప్రదించడానికి మన వద్దకు రాకముందే అతని వ్యాధుల వివరాలను పొందడానికి ఒక ఫారం పంపడం సముచితమేనా ?

జవాబు: ఔను ఐతే మొదట మీరు రోగితో మాట్లాడి అలా పంపించడం వారికి ఇష్టమేనా అని అడగాలి. అలా నింపడం రోగ లక్షణాలు మరియు అవి ఎంతకాలం నుండి ఉంటున్నాయి అనేది జాగ్రత్తగా గుర్తుకు తెచ్చుకొని రాయడానికనీ అది వారి సౌకర్యము కోసమేనని తెలియజెప్పాలి. మీరు పంపబోయే ఫారం మరీ ఎక్కువ సమాచారం అడిగే విధంగానూ మరియు సున్నితనైన విషయాలను రాబట్టే విధంగానూ ఉండకుండా చూసేలా డిజైన్ చెయ్యండి. అదే సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వ్రాసి ఉంచడం మంచిది. అలాగే మీ క్లినిక్ లో కూడా ఈ సూచనలు ప్రదర్శించడం రోగులకు మేలు చేస్తుంది.

________________________________________

4. ప్రశ్న: మనము రెమిడీలను ప్లాస్టిక్ బాటిళ్లలో ఇస్తాము. కానీ పర్యావరణాన్ని పరిరక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా నో ప్లాస్టిక్ ప్రచారం జరుగుతోంది. నివారణకు హాని కలగకుండా ఈ సీసాలు ఎంతకాలం ఉంటాయి మరియు మనం ఎంతకాలం వీటిని తిరిగి ఉపయోగించవచ్చు?

జవాబునో ప్లాస్టిక్ విషయంలో మీరు చెప్పింది సబబే. ఈ ప్రచారం తక్కువ గ్రేడ్ ప్లాస్టిక్‌లకు వ్యతిరేకంగా ఉంటుంది, అవి తిరిగి ఉపయోగించబడవు మరియు పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. మనము ఈ విషయంలో గాజు సీసాలను ఉపయోగించవచ్చు, కానీ అవి ఖరీదైనవి. సులభంగా పగిలి పోతాయి మరియు గాజు పెంకులు గోళీలలోనికో, లిక్విడ్ లోనికో ప్రవేశిస్తే చాలా ప్రమాదంఅలాగే వైబ్రేషన్ న్యూట్రల్ అయ్యే అవకాశం ఉన్నందున మనము లోహ కంటైనర్లను ఉపయోగించలేము. ఈ విధమైన ఆచరణాత్మక కారణాల వల్ల మనము ప్రసిద్ధ హోమియోపతి దుకాణాల నుండి సేకరించిన హై గ్రేడ్ ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నాము. ఇంట్లో రెమెడీని గ్లాస్ కంటైనర్లలో తయారు చేసుకొన వచ్చును. కానీ ప్రయాణ సమయంలో ఉత్తమ నాణ్యత గల ప్లాస్టిక్ బాటిళ్ళను ఉపయోగించవచ్చు. ఒకసారి ఉపయోగించిన ప్లాస్టిక్ కంటైనర్లను పదే పదే వాడకూడదు అనేది గ్రహించాలి.

________________________________________

5. ప్రశ్న: మన పేషంటుకు  బాధ కలిగించకుండా వారిని మాంసాహారము తినకుండా ఎలా ప్రేరేపించవచ్చు?

జవాబు: పేషంటుతో సత్సంబంధాలు ఏర్పరుచుకొని వారు వ్యాధి పూర్తిగా తగ్గేవరకూ రెమిడీ వాడేదానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ మాంసాహార విషయాన్ని వారికి  క్లుప్తంగా మాత్రమే చెప్పాలి. వారికి పూర్తిగా తగ్గిపోయిన తరువాత మీరు చెప్పేది నమ్మే సానుకూలత ఏర్పడుతుంది. అప్పుడు కౌన్సిలింగ్ ద్వారా సున్నితంగా ఈ విషయం చెప్పాలి. స్వామి భక్తులను ఒప్పించటం మరింత సులభం. వారి విశ్వాసానికి మరింత బలం చేకూర్చడానికి స్వామి చెప్పిన విషయాలు చెప్పడం అట్టి సాహిత్యాన్ని చదివించడం లేదా స్వామి స్పీచ్ కి సంబంధించిన వెబ్సైట్ లింక్ లను ఇవ్వడం వంటివి చేయవచ్చు. భగవంతుడు మనిషి శరీరాన్ని తయారు చేసిన విధానం ఎటువంటిదంటే శాకాహార భోజనం ముఖ్యంగా ఉడికించని ఆహారంతోనే మానవుడు ఎక్కువ కాలం జీవిస్తాడు.

________________________________________

6. ప్రశ్న: కుక్క కాటుకు మనం  CC1.1 Animal tonic ను ఇవ్వవచ్చా?

జవాబు : CC10.1 Emergencies అనేది తగిన రెమిడీ. ఎందుకంటే ఇది షాక్, గాయము, గాట్లు, భయము, టెటనస్ మరియు దైవిక రక్షణ మొదలగు అన్ని సిమ్యులేటర్ కార్డుల వైబ్రేషన్ కలిగి ఉంది. CC1.1 Animal tonic జంతువులను గాయాలనుండి, పుండ్లనుండి, పురుగుల నుండీ రక్షిస్తుంది కనుక దీనిని మనుషులకు ఇవ్వవవలసిన అవసరం లేదు. ఐతే  CC10.1 అందుబాటులో లేనప్పుడు, CC1.1 ఇస్తే అది తప్పనిసరిగా సహాయ పడుతుంది.