డా.జిత్ కె. అగ్గర్వాల్ డెస్క్ నుండి
Vol 9 సంచిక 6
November/December 2018
ప్రియమైనచికిత్సానిపుణులకు,
ప్రశాంతి నిలయంలో మన ప్రియభగవానుని 93వజన్మదినోత్సవ సందర్భంగా మీతో ఈ విధంగా నా భావాలను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నది. ప్రశాంతి నిలయం అంతటా ఒక విధమైన పాజిటివ్ వైబ్రేషన్ తోనూ రంగురంగుల అలంకరణలతో భక్తుల కోలాహలంతోను ఎంతో సందడిగా ఉన్నది. ఇప్పుడు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలు పురస్కరించుకొని ప్రపంచమంతటా సాయి కుటుంబ సభ్యులలోనూ ఇతరుల లోనూ ఆనంద కరమైన వాతావరణం నెలకొని ఉన్నది. ముఖ్యంగా ఈ ఏడాది పొడుగునా మనమంతా నిస్వార్థ సేవ లో పాల్గొనడం అటువంటి అవకాశాన్ని స్వామి మనకు కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతా భావాన్ని తెలియచేసుకుందాం. బాబా మాటల్లో చెప్పాలంటే‘’సేవలో ఉన్న గొప్పతనం ఏ ఇతర ఆధ్యాత్మిక సాధనా మార్గం లోనూ ఉండదు. ఇట్టి సేవను ప్రాథమిక లక్ష్యంగా కలిగి ఉండి అనంతరం భక్తి యొక్క వివిధ మార్గాలను అనగా భగవంతుని లీలలు వినడం, దైవ నామాన్ని ధ్యానం చేయడం, వారి పాదాలకు ప్రణమిల్లడం, భగవంతుని సేవకునిగా సేవలు అందించడం, స్నేహితుడిగా ప్రేమను చూపించడం, విచారణా మార్గము ఇవన్నీ కూడా అనుసరించడం ద్వారా చేసే సేవ అహంకారమును నిర్మూలిస్తుంది. అహంకారానికి ఉన్న మరొక రూపము పశుప్రవృత్తి. సేవ దీనిని నిర్మూలనం చేసి మనిషిని మృదువుగా చేసి భగవంతునికి దగ్గర చేస్తుంది”... స్వామి ఉపన్యాసం మూడవ సేవాదళ్ కాన్ఫరెన్స్ 15 నవంబర్ 1975.
ఇప్పుడు శరదృతువు అంతమై శీతాకాలం ఆరంభమవుతున్న సంధికాలం. ఉత్తరార్ధ గోళంలో నివశిస్తున్న వారికి ఇది చాలా కఠినమైనది. ఐతే సూక్ష్మ దృష్టితో చూసినట్లైతే ఇది అంతర్దృష్టి పెంపొందించడానికి, నిలకడకు మారుపేరు. అలాగే ఈ కాలం మనం రోగులకు సేవలందించడానికి కూడా అనుకూల సమయం. ఆయుర్వేదం ప్రకారం ఈ చల్లని వాతావరణం మనిషిలో ‘’వాత’’ గుణంలో అసమతౌల్యాన్ని (https://en.wikipedia.org/wiki/Dosha) పెంపొందించి ప్రతీ ఒక్కరిలోనూ జలుబు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలను కలిగిస్తూ శరీరానికి హాని చేస్తుంది. కనుక మీ పెషంట్లకు వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి వ్యాధి లక్షణాలు కనబడిన వెంటనే మిమ్మల్ని సంప్రదించ వలసిందిగా సూచించండి. ఎందుకంటే రోగ లక్షణాలు బయటపడ్డ వెంటనే సంప్రదించడం ద్వారా మన వైబ్రో నివారణలు ఇన్ఫెక్షన్ లను తగ్గించడం లేదా పూర్తిగా నయం చేయడం వంటి సత్ఫలితాలు ఇస్తాయి.
వైబ్రియానిక్స్ విషయానికొస్తే అభ్యాసకులకు ఆన్లైన్ ద్వారా తమ పేషంట్ ల మరియు సేవా గంటల వివరాలు వెబ్ సైట్ https://practitioners.vibrionics.org లో అప్లోడ్ చేయడం చాలా సులువుగా ఉండడంతో మన వెబ్ సైట్ చక్కటి విజయాన్ని సాధించింది. ఇట్టి వెబ్సైట్ యొక్క రూప కల్పనలో లో పాల్గొన్న వారి ప్రయత్నాలు మరువలేనివి. ఈ వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ ప్రక్రియ మరింత సమర్థవంతంగా వేగవంతంగా జరుపుటకు మార్గం సుగమం అవడమే కాదు ముందుముందు మనం మన ప్రణాళికల అమలు, సంస్థ అభివృద్ధికి ఇది ఒక బంగారు గని వంటిదిగా రూపు దిద్దుకుంది. ఆన్లైన్లో తమ నివేదికలను అప్లోడ్ చేయలేక పోయిన వారి కోసం స్థానిక సమన్వయకర్తలు ద్వారా తమ వివరాలను పంపించడానికి ఏర్పాటు చేశాము.ఈ విధంగా కొంత అదనపు సమయం (అంటే వారానికి కొన్ని నిమిషాలు మాత్రమే) కేటాయిందలచిన వారు [email protected] ద్వారా మాకు తెలియజేయండి. ఇది మన కోఆర్డినేటర్లకు వెసులుబాటును కల్పించి వారి సమయాన్ని మరిన్ని ఉత్తమ సేవలకు అనగా శిక్షణా మరియు సేవా శిబిరాలను ఏర్పాటు చేయడానికి ఉపకరిస్తుంది.
బెంగుళూరు లో వైట్ ఫీల్డ్ లో ఉన్న సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ సెంటర్ వద్ద మంగళవారం, గురువారం, మరియు శనివారాలలో 2 గంటల నుంచి 4 గంటల వరకు వారానికి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న మన క్లినిక్ ఎంతో గణనీయమైన సేవచేస్తున్నట్లుగా రిపోర్టులు అందుతున్నాయి. ప్రాక్టీషనర్12051…ఇండీయా నేతృత్వంలో గత 11 నెలలలో 750 మంది రోగులకు చికిత్స చేసాము. మీఅందరికీ తెలిసిన విషయమే. ఈ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న చాలామంది రోగులు భారత దేశపు సుదూర ప్రాంతాలనుండి , వెనుకబడిన ప్రాంతాలనుండి వీరిలో కొందరు దీర్ఘకాల ప్రయాణాలు (మూడు రోజుల రైలు ప్రయాణం) చేసి గుండె, మెదడు వంటి వాటికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల నిమిత్తం ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితేపేషంట్ల జాబితా పొడవుగా ఉండి వీరికి తగిన సహాయం చేయలేకపోతున్న సందర్భాల్లో రద్దీని తట్టుకోవడం కోసం ఆసుపత్రి వర్గాలు వారిని మనవద్దకు పంపుతూ ఉండడం జరుగుతోంది. ప్రాధమిక విచారణ అనంతరం రోగి యొక్క పురోగతి గురించి ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదిస్తూ అవసరమైతే ఆ రోగికి నివారణలను కూడా పోస్టు ద్వారా ఉచితంగా పంపుతున్నాము.
మన యొక్క 2016 వైబ్రియానిక్స్ పుస్తకానికి అవసరమైన అనువర్తనాలను జోడించి బాబా వారి జన్మదినోత్సవం నాటికి ఆవిష్కరించాలని ఆశిస్తున్నాము. ఈ జన్మ దినోత్సవ సందర్భంగా మనమంతా ఆనందాన్ని అనుభవిస్తూ ప్రేమతో స్వామిని అర్చిస్తూ మరింత శక్తివంతంగా మరింత భక్తి భావంతో మన సేవకు పునరంకితం కావాలని ఆశిస్తున్నాను.
ప్రేమతో మీ
జిత్ కె అగర్వాల్