ప్రశ్న-జవాబులు
Vol 9 సంచిక 5
September/October 2018
1. ప్రశ్న : ఒకరోగి తన ప్రతికూలమైన ఆలోచనలను అపలేని నిస్సహాయ స్థితి లో కూడా వైబ్రో రెమిడి లు అతని వ్యాధి మరియు అతని ప్రతికూల ఆలోచనల నివారణకు తోడ్పడతాయా ?
జవాబు : ఔను వైబ్రో నివారణలు పేషంటు యొక్క ప్రతికూల ఆలోచనలను వ్యాధిని కూడా నివారిస్తాయి. సానుకూలమైన ఆలోచనలను కలిగిన వారికి చాలా త్వరగా నయమవుతుంది. కనుక పేషంట్లు ఎప్పుడూ సానుకూలమైన ద్రుక్ఫధాన్ని కలిగి ఉండి మంచిగా ఆలోచించేలా ప్రాక్టీషనర్ లు ప్రోత్సహిస్తూ ఉండాలి. అలాగే వైబ్రో నివారణులు రోగుల సమస్యలను నయం చేయడంలో అద్భుతంగా సహాయపడతాయని చికిత్సా నిపుణునికి పూర్తి విశ్వాసం ఉండాలి. రెండవ విషయానికి వస్తే పేషంటు లో నెగిటివ్ ఆలోచనలకు మూలం ఏమిటో గుర్తించాలి. సాధారణముగా భయము, తిరస్కారము, షాక్, కోపము, విచారము ఇవి భావోద్వేగాల రూపంలో అణిచివేయబడి ఉంటాయి. కనుక ప్రాక్టీషనర్ వీటికి గల అంతర్గత కారణాన్ని తెలుసుకొనడానికి హృదయపూర్వకంగా ప్రయత్నించి 15, 17 లేక 18 వర్గాలలో సూచించిన విధంగా తగిన రెమిడి ని పేషంటుకు ఇవ్వాలి. ఒకవేళ పేషంటు కు ఈ రెమిడి వలన పెద్దగా ప్రయోజనం చేకూరకపోతే మరలా కౌన్సిలింగ్ చేసి సరియయిన కారణం రాబట్టాలి. ఒకవేళ ఇవన్నీ చేసినప్పటికీ పేషంటు అసంతృప్తిగా ఉంటే ప్రాక్టీషనర్ తన ఆత్మవిశ్వాసాన్ని వైబ్రో మందుల పైన విశ్వాసాన్ని కోల్పోకూడదు. కొన్ని సందర్భాలలో మన ప్రయత్నం కంటే పేషంటు యొక్క సంస్కారాలు అనగా గత జన్మ యొక్క కర్మలు, వాటి తాలూకు వాసనలు బలంగా ఉంటాయి. ఐతే దివ్య వైద్యుడయిన భగవంతుడు సాధకుని యొక్క అంతర్గత ప్రయాణాన్ని పరిగణన లోనికి తీసుకోని చివరిలో అతని బాధలకు ముగింపు నిస్తాడు. ఐతే సాధకుడు భగవంతుని పట్ల పూర్తి విశ్వాసం ఉంచి బాధను భారంగా కాక సాధనగా స్వీకరించే స్థితిని కలిగి ఉండాలి. ఉదాహరణకు దాక్టర్ జాన్ హిస్లోప్ తను ఈ దేహాన్ని కాదు ఆత్మను అన్న సత్యాన్ని గుర్తించి భగవంతుడు తన కర్మలన్నింటినీ ప్రక్షాళన చేస్తున్నారని భావించి కేన్సర్ తో ఉన్న తన శరీరాన్ని ఆనందంగా వదిలివేశారు. ఐతే కొన్నిసార్లు రోగి దుర్బలతను బట్టి, పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని బట్టి, పరిసరాలలో ఉన్న సమస్యలు అనగా పిల్లలు ప్రేమ రాహిత్య వాతావరణం లో పెంచబడడం, పర్యావరణం బట్టి కూడా నివారణ ఆలస్యం కావచ్చు. ఎవరికయినా జీవితం మీద ఆశ లేకపోతే వారి జీవితంలో అనందానుభూతి, మనసు, దేహాలకు ఆరోగ్యాన్ని అందించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే అభ్యాసకుడు పేషంటు కు ప్రేమతో చికిత్స చేస్తూ వారిలో విశ్వాసాన్ని, ఆశను వాస్తవిక ధృక్పదాన్ని కల్పించడం ప్రధానం. .
________________________________________
2. ప్రశ్న: గైనేకొమాస్టియా(పురుషులలో వక్షోజ పెరుగుదల) నివారణకు CC14.3 కాకుండా వేరే ఏదయినా రెమిడి ఉందా ?
జవాబు: మీ వద్ద 108CC బాక్స్ మాత్రమే ఉండి సీనియర్ ప్రాక్టీషనర్ ను సంప్రదించడానికి అవకాశం లేకపోతే CC14.3 చాలా ఉత్తమమైన మిశ్రమం. ఐతే SRHVP ఉన్నవారు SR262 Nat Phos 6X…OD ని SR381 Conium 1M…OW. తో పాటుగా ఇవ్వవచ్చు. గమనించ వలసినది ఏమిటంటే ఈ సమస్య పురుషులలో అధికబరువు ఉన్నవారికి వస్తూ ఉంటుంది కనుక వారి ఆహారంలో కూడా నియంత్రణ పాటించడం మంచిది.
________________________________________
3. ప్రశ్న: SRHVP చక్ర కార్డులను విడిగానే ఉపయోగించాలా లేక వాటిని మిళితం చేసే ఒకే రెమిడి గా ఉపయోగించ వచ్చా?
జవాబు: రెండు చక్ర కార్డులను కలిపి ఒక మిశ్రమం గా చేయవచ్చు. ఐతే ఒకసారికి ఒక కార్డును మాత్రమే ఉపయోగిస్తే ఫలితాలు బాగుంటాయి. దీనికి పోటెన్సీ CM మరియు డోసేజ్ OD (నిద్రపోవడానికి ముందు) సాధారణంగా ఒక చక్రా ను బ్యాలన్స్ చేయడానికి ఈ రెమిడి రెండు రోజులు తీసుకుంటుంది. చక్రా చికిత్సా సమయంలో ఇతర వైబ్రో రెమిడి లను ఉపయోగించరాదు. ఒకవేళ పేషంటు అప్పటికే ఇతర రెమిడి తీసుకుంటూ ఉన్నట్లయితే చక్రా రెమిడి ఇవ్వడానికి మూడు రోజుల ముందు దానిని నిలిపి వెయ్యాలి. చక్రా బ్యాలెన్సు ఐన తర్వాత తిరిగి ఆ రెమిడి ని పునః ప్రారంభించాలి.
________________________________________
4. ప్రశ్న :ఒక రెమిడి ని రోజుకు ఎన్నిసార్లు పేషంటుకు ఇవ్వవచ్చు. కొందరు గోళీలను TDS గా తీసుకోవడం ఇబ్బంది అంటున్నారు. మరికొందరు త్వరగా కోలుకునేందుకు గానూ 6TD కన్నాఎక్కువ సార్లు తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. మరికొందరు పేషంట్లు ప్రతీ రోజు రెమిడి ని తీసుకొనడానికి బద్దకిస్తూ ఉంటారు కానీ మందులు పనిచేయడం లేదని నిందను వైబ్రో రెమిడి ల మీదికి తోస్తూ ఉంటారు. ఇటువంటి పేషంట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జవాబు: అధికశాతం ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా వ్యాధులు అనుభవిస్తూ కూడా నివారణ మాత్రం త్వరగా కావాలని కోరుకుంటారు. అటువంటి వారి విషయంలో వ్యాధి నయం కావడానికి సమయం పడుతుంది. ముఖ్యంగా భౌతిక శరీరంలో అభివ్యక్తమయ్యే ముందు శరీరం చుట్టూ ఉన్న శక్తి రంగంలో కంపనాలు బలంగా రూపుదిద్దుకోవాలి. ఈ విషయంలో పేషంటు యొక్క అంచనాలకు అనుగుణంగా ఉండడం ముఖ్యమే ఐనప్పటికీ అంతకంటే ముందు భగవంతుడికి ఇచ్చిన వాగ్దానము దృష్టిలో పెట్టుకొని నిబద్దతతో పనిచేస్తూ పేషంటు ను మన సూచనలు అంగీకరింపచేయదానికి కృషి చెయ్యాలి. రెమిడి ని ఇచ్చిన మోతాదు ప్రకారం క్రమం తప్పకుండా తీసుకోవడం వలన నివారణ వేగవంతం అవుతుంది. అంతేకాకుండా అసలు తీసుకోకపోవడం కంటే తక్కువసార్లు మోతాదును తీసుకోవడం వలన కూడా నివారణ సాధ్యమే. సాధారణంగా ఒక రెమిడిని గరిష్ట స్థాయిలో రోజుకు 6TD గా తీసుకోవడం జరుగుతుంది. ఐతే వ్యాధి తీవ్రత బట్టి ప్రతీ పదినిమిషాలకు ఒక డోస్ చొప్పున రెండు గంటల వరకూ కూడా తీసుకోవచ్చు. ఐతే 6TD కన్నాఎక్కువసార్లు మందు తీసుకున్న దాఖలాలు మన ప్రచురణ కేసులలో లేవు.
________________________________________
5. ప్రశ్న నాకు పేను ముట్టడి తో బాధపడే ముగ్గురు పేషంట్లు ఉన్నారు. వీరికి వైబ్రో రెమిడి ఇవ్వడానికి సరియయిన పద్దతి ఏమిటి?
జవాబు: ఈ సమస్య తో ఉన్నవారికి CC11.2 Hair problems…TDS లేదా SR315 Staphysagria…OD ని పై పూతగా నెల రోజులపాటు ఇవ్వవచ్చు. పేల నివారణకు వాడే షాంపు ను మేము సిఫారసు చేయము ఎందుకంటే వీటిలో అధిక మోతాదులో రసాయనాలు ఉంటాయి. ఉత్తమమైన పద్దతి ఏమిటంటే నీటితో నివారణని తయారుచేసి BD. గా తలపైన రాయడం ఉత్తమ మైన పద్దతి.