ప్రధాన వైద్యుడు యొక్క దివ్య వాక్కు
Vol 8 సంచిక 4
July/August 2017
"జీవరాసులన్నిటిలోను మానవుడు మాత్రమే ప్రకృతిసిద్ధంగా దొరికే సహజమైన ఆహారాన్ని ఇష్టపడడు. మిగతా జీవరాసులన్నీ ధాన్యము, ఆకులు, రెమ్మలు, పండ్లు ఇవన్నీ ఏరూపంలో లభిస్తాయో అలానే తింటాయి. కానీ మనిషి మాత్రం రుచి కోసం ఉడకబెట్టడం, వేపించడం, వండడం, మిక్సీ పట్టడం, ఇలా అనేక పద్ధతులను ఉపయోగిస్తాడు. దీనివలన ఆహారపు పోషకవిలువలు తగ్గిపోవడం లేదా పూర్తిగా పోవడం జరుగుతుంది. విత్తనాలు వేపించినపుడు అవి మొలకెత్తలేవు అనగా వాటిలోని ప్రాణశక్తిని అవికోల్పోయాయని అర్ధం. కనుక వండని ఆహార పదార్ధాలయిన మొలకలు వంటివి ఇంకా గింజలు పండ్లను తినడం మంచిది దేవతా మూర్తులకు అర్పించే కొబ్బరికాయ చాలా సాత్విక మైనది, దీనిలో తగినంత పాళ్ళలో ప్రోటీన్, కొవ్వు పదార్ధాలు స్టార్చ్ మరియు కనిజ లవణాలు వున్నాయి. ఆహారంలో ఎక్కువ మోతాదులో ఉప్పు లేదా మషాలాలు వుంటే అది రాజసికము (కోరికలు పెంచేది )ఔతుంది కనుక వాటిని దూరంగా ఉంచాలి. అలాగే ఎక్కువ కొవ్వు, పిండి పదార్ధాలు తీసుకోవడం తామసికము (సోమరితనం పెంచేవి). కనుక అవి శరీరము పైన ప్రభావితం కలిగించకుండా దూరంగా ఉంచడం మంచిది.."
-సత్యసాయిబాబా , “ఆహారము ఆరోగ్యము ” దివ్యవాణి 21 సెప్టెంబర్ 1979
http://www.sssbpt.info/ssspeaks/volume14/sss14-31.pdf
"ప్రేమ లేని జీవితం అర్ధం లేనిది. ఎంతగా ప్రేమిస్తూ ఉంటే అంతగా అది పెరుగుతూ ఉంటుంది. వ్యక్తుల పట్ల, వస్తువుల పట్ల ఉన్నది వ్యామోహమా లేక నిజమైన ప్రేమ అన్నది యోచించాలి. వ్యామోహము స్వార్ధము పైన ఆధారపడింది, కానీ ప్రేమ నిస్వార్ధ మైనది. ప్రేమ అనేది నీవు చేసిన మంచి పనుల నుండి వచ్చిన ఫలము. కనుక నిస్వార్ధ మైన సేవాకార్యక్రమాలలో పాల్గొనడంద్వారా పవిత్రమైన ప్రేమను అనుభవంలోనికి తెచ్చుకోవచ్చు.''.
-సత్యసాయిబాబా , “ప్రేమ ద్వారా సమానత్వము ” 11 డిసెంబర్ 1985నాటి ఉపన్యాసము
http://www.sssbpt.info/ssspeaks/volume18/sss18-28.pdf