అదనంగా
Vol 6 సంచిక 3
May/June 2015
18 మే 2014 ఇల్ఫోర్డ్, ఎసెక్స్, UKలో జరిగిన వై బ్రియానిక్స్ అభ్యాసకుల వార్షిక రిఫ్రెషర్ కోర్సు నుండి కొన్ని అంశాలు
1.0 హాజరైనవాళ్ళు: 25 అభ్యాసకులు , 3 అతిథులు. డా.జిత్ కే అగ్గర్వాల్ ప్రధార్శననిచ్చారు. డా.అగ్గర్వాల్ ఆ రోజు నిర్వాహకుడైన,UK సమన్వయకర్తైన మరియు జనవరి 2014లో ప్రశాంతి నిలయంలో జరిగిన మొదటి అంతర్జాతీయ సాయి వైబ్రియానిక్స్ అభ్యాసకుల కాన్ఫరంస్లో ఎంతో ఎక్కువగా సహాయపడిన అభ్యాసకుడకు 02822...UK ,ధన్యవాదాలు తెలుపుకున్నారు.
1.1 108 కామన్ కాంబో బాక్సు
ఈ బాక్సుని ప్రతి రెండు సంవత్సరాలకి ఒక సారి రీచార్జ్ చేయాలి. లేకపోతే మందులు దుర్భలం అవుతాయి. విద్యుత్- అయస్కాంత వికిరణం కాంబోల యొక్క సమర్థతను ప్రభావితం చేస్తుంది.విద్యుత్ ద్వారాలు , భూగర్భ ప్రవాహాలు , మొబైల్ ఫోన్లు మరియు ట్రాన్స్మిటర్లు వంటి వాటితో జాగ్రత్త వహించండి. అనింటి కన్నా ఎక్కువ హాని కార్డ్లెస్ ఫోన్లు వల్ల కలుగుతుంది.Wi -Fi : రౌటర్ / మోడెమ్ పడక గదిలో ఉంటె రాత్రి దాన్ని ఆపివేయండి
1.2 చక్రాలు
- మన అవయవాల ఆరోగ్యం చక్రాలపై ఆధారపడి ఉంటుంది.(7 ప్రధాన + 2 అర్ధ ప్రధాన మరియు 300 పైనున్న ఇతర చక్రాలు)..
- చక్రాలు అవయవాలను ఆరోగ్యకరంగా ఉంచడానికి మరియు సంతులత కొరకు శక్తిని అందుకుంటాయి.ఒక చక్రంలో అసమతుల్యత లేదా సంతులత లేకపోతే ఈథరు శరీరంలో వ్యాధి ఉద్భవించి క్రమంగా అది భౌతిక అవయవంల్లో విశదపరుస్తుంది.చక్రాలకు రంగులుంటాయి.ఎవరైతే ఈ చక్రాలని చూడగలుగుతారో వాళ్ళు ఇతరులలో ఉన్న సమస్యలను చూడగలుగుతారు. ఈ సామర్ధ్యాన్ని అభివృద్ధి పరుచుకుంటే వైబ్రియానిక్స్ ఆచరణలో సహాయకారిగా ఉంటుంది.
- మనస్సు వ్యాధులకు మూలకారణం. స్వామీ సులభంగా అర్ధమయ్యేలా "మంచి చూడండి,మంచిగా ఉండండి మరియు మంచి చేయండి" అని చెప్పారు.మనస్సు స్వచ్చంగా ఉంటె అనారోగ్యాలు దూరంగా ఉంటాయి.
- అసూయ, కోపం, ద్వేషం, దురాశ, మదం, అహంకారం, మరియు కామము వంటి ఏడూ శత్రువులు మనలో ఉన్నాయి.స్వామీ తన భోధనల్లో చాలా సులభమైన మార్గం ఒకటి చెప్పారు: మీరు ఒక దుర్గుణం(శత్రువు) నియంత్రించడానికి ప్రయత్నిస్తే చాలు స్వామీ మిగతావాటిని చూసుకుంటారు.ఈ కలియుగంలో ఏమిచేసినా ఎదోయోక్క గడియలో అనారోగ్యం రాక తప్పదు.
- సువర్ణ యుగం లోకి అడుగు పెడుతున్నామని అందరు అంటున్నారు.కొందరికి సువర్ణ యుగం రానే వచ్చింది. సానుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు సువర్ణ యుగం సర్వత్రా వ్యాపిస్తుంది.
1.3 మన ఆలోచనలు
- మన ఆలోచనలు మన ఆరోగ్యానికైన అనారోగ్యానికైన మూల కారణం. ఆరోగ్యం నిగూఢమైన శక్తులపై ఆధారపడి ఉంటుంది. ప్రతికూల ఆలోచనలువల్ల ప్రతికూల స్పందనలు సృష్టించబడతాయి. ఈ ప్రాథమిక నిర్మాణ కణాల ద్వారా శక్తి ప్రవహిస్తుంది.మనలో ఒక ప్రతికూల ఆలోచన కలిగిన వెంటనే అది భాహ్య ప్రపంచానికి వెళిపోతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం.
- మనము ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలనే సృష్టించుకోవాలి,వీటిలో అతిముఖ్యమైనది క్షమా భావన. మనను దుఖించిన వ్యక్తులు ఎవరో ఒకళ్ళు అందరికి ఉండే ఉంటారని డా.అగ్గర్వాల్ చెప్పారు. మనకి దుఖం కలిగిన సందర్భాన్ని ఒకటి ఊహించుకొని ఆ దుఖం కలిగించిన వ్యక్తికి మీరు క్షమను మరియు మీ ప్రేమను పంపించందని ఆయన చెప్పారు.ఆ వ్యక్తికు ప్రేమను పంపడం ద్వారా ప్రతికూల ఆలోచనలు తొలగిపోతాయి. కొద్ది రోజులలోనే మీకు సానుకూలమైన ప్రతిస్పందన లభ్యమవుతుంది.ఈ ప్రతిస్పందనను మనం డా.అగ్గర్వాల్ తనకు మెయిల్ పంపవలసిందిగా కోరారు. వ్యాఖ్యానం: ఈ చర్య చేయడంవల్ల కలిగే ప్రయోజనాన్ని గుర్తించి అందరు చాలా మంచి ప్రతిపుష్టినిచ్చారు. అందులో ఒక అభ్యాసకురాలు ఈ సాధన చేసిన తర్వాత తన జీవితంలో ఒక మంచి మలుపు ఏర్పడిందని చెప్పింది.
- మీరు క్షమిస్తే మర్చిపోతారు. కాని గుర్తుంచుకుంటే క్షమించనట్లే. అంతయు దైవ సంకల్పమే, ఇంకెవరు భాధ్యులు కారని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం.
- మనము ఇతరులను నియంత్రించడానికో లేదా మార్చడానికో ఇక్కడ లేము.మనలో మార్పు తెచ్చుకోవాలి.భగవంతుడిని నియంత్రణ తీసుకోమని ప్రార్థించండి. మన వైఖిరిని మార్చుకోవాలి.
• ‘మన గుండె ఒక సీటున్నసోఫా లాంటిది.ఇది కేవలం దేవుడికి మాత్రము దాచిపెట్టండి.
• మంచి మరియు అనుకూల ఆలోచనలు ఆహ్వానించండి.
- వ్యాధి నివారణకై చికిత్స పొంధడంకన్న వ్యాధి రాకుండా జాగ్రతలు వహించడం మన అంతిమ లక్ష్యం కావాలి.
1.4 వైబ్రియానిక్స్ మందుల మీద ఆలోచనలయోక్క ప్రభావం
కొందరు పేషంట్లకు వై బ్రో మందులు ప్రారంభంలో పనిచేసినట్లు తర్వాత పని చేయట్లేదన్న అనుభూతి కలుగుతోంది.దీనికి ఈ క్రింద వ్రాసిన కారణాలు కావచ్చు:
- పేషంట్లు శీఘ్ర నివారణ కోసం చూస్తున్నారు; వాళ్ళు వైబ్రియానిక్స్ పిల్‌ను 'మేజిక్ పిల్' అనుకుంటున్నారు.
- పేషంట్లు ఇతర వైద్యాలు ఎంతకాలం తీసుకున్నారు? ఐదు రోజులలో నయం కావాలంటే ఎలా సాధ్యం?దీర్గ కాలిక వ్యాధి ఒక అలవాటు లాంటిది లేదా ఒక వృక్షం వంటిది.అది శరీరంలో లోతుగా పాతుకుపోయి ఉంటుంది. చక్రాలలో అసమతుల్యత ఏర్పడియుంటుంది. పేషంట్లు అవాస్తవ అంచనాలతో వస్తున్నారు.దీనివలన నిరాశ చెందుతున్నారు.
- పేషంట్లు నియమాలు పాటించకపోవడం లేదా జాగ్రతలు వహించకపోవడం
- పేషంటు యొక్క ఆలోచనలు నివారణకు అడ్డుకావచ్చు.పేషంట్లు అసహనం వల్ల మరియు ఉపశమనం లభించట్లేదన్న తమ ప్రతికూల ఆలోచనలవల్ల ఒక అడ్డును సృష్టించుకుంటున్నారు. దీనివల్ల నయంకావడానికి మరింత సమయం పడుతుంది.
- ఒక వ్యక్తి గాడమైన విశ్వాశాన్ని కలిగియుంటే, అది సానుకూల సౌరభం మరియు శక్తిని సృష్టిస్తుంది కాబట్టి నివారణ త్వరగా జరుగుతుంది.
పేషంట్ల మొదటి సంపర్కంలో గుర్తుంచు కోవలసిన విషయాలు:
- అధికంగా మాట్లాడే అవసరం లేదు.వై బ్రియానిక్స్ గురించి క్లుప్తంగా ఇలా చెప్పండి - ఇది సరళమైన,ఉచితమైన మరియు దుష్ప్రభావాలు లేన వైద్య విధానమని. ఈ వైద్యంలో ఏ విధమైన రసాయన పదార్థము ఉపయోగించలేదని మరియు ఇది కేవలం భగవంతుడు కృప మాత్రమేయని చెప్పాలి. వాళ్ళ వ్యాదులకి సంభందించిన విషయాలు తెలుసుకోవాలంటే పేషంట్లను వైబ్రియానిక్స్ వెబ్సైటు కు వెళ్లి గత వార్తాలేఖలను చదువమని చెప్పవచ్చు[www.vibrionics.org లేదా news.vibrionics.org] పురాతన సమస్యతో ప్రారంభించి పేషంట్ వ్యాధి సంభందించిన అన్ని విషయాలు మీ పేషంటు రికార్డు పుస్తకంలో రాసుకోవాలి.
- నివారణ సమయం గురించి పేషంట్లతో మాట్లాడవద్దు. నయం చేసేది మందులు కాదు దేవుడని చెప్పండి.వాళ్లకి ఓర్పుతో ఉండమని చెప్పి నయమవుతారని హామీనివ్వండి.
- పుల్ అవుట్ గురించి సరైన విధంలో వివరించండి.
సెషన్ యొక్క సారాంశము: వైబ్రేషన్ల ప్రభావం మన జీవితం పైన ఉంటుంది.ప్రతికూల ఆలోచనలు ఒక చక్రాన్ని కలతపర్చి ఆ చక్రానికి సంభందించిన అవయవంలో అనారోగ్యానికి దారితీస్తాయి.
1.5 ప్రశ్నలు
1.5.1 ప్రశ్న: వివాహాలలో మద్యం త్రాగమనడం మరియు మాంసాహారం అందించటం వంటి అంగీకరించలేని పరిస్థితిలు ఏర్పడితే మేము ఏంచేయాలి?
జవాబు: మనము ఇతరులు చేసే వాటికి ఎదురు చెప్పకుండా వాళ్లకు మన ప్రేమను మాత్రమే అందించాలి. మనం ఇతర్లుని మార్చలేము. మనం మనల్ని మార్చుకుని ఇతర్లకు నిదర్శనంగా ఉండాలి.
1.5.2 ప్రశ్న: కొందరు పేషంట్లు వైబ్రో మందులు ప్రారంభంలో భాగా పనిచేసి తర్వాత పని చేయడంలేదని భావిస్తున్నారు.దీనికి పరిష్కారం ఏమిటి?
జవాబు: వివరణ: పేషంట్లు తక్షణ ఫలితాల్ని ఆశిస్తున్నారా?
- పేషంట్లు ఇది ఒక మాజిక్ పిల్ అని భావిస్తున్నారు.ఉదాహరణకు 20 ఏళ్ళగా వీపు నొప్పితో భాదపడుతున్న ఒక వ్యక్తిని వైబ్రియానిక్స్ చికిత్స కోసం తీసుకువచ్చారు. ఆ వ్యక్తి బహుశా ఇంతవరకు సఫలితాన్ని ఇవ్వలేని అనేక వైద్యాలు చేయించుకుని ఉండవచ్చు.అలాంటప్పుడు వైబ్రో మందులు తక్షణ నివారణను ఇవ్వాలని ఎందుకు ఆశించాలి? ఆ పేషంటు వ్యాధి ప్రారంభంలోనే వైబ్రో చికిత్సని తీసుకునియుంటే అతనికి ఉపశమనం సులభంగా లభించేది.ఈ వ్యాధి పేషంటు శరీరంలో లోతుగా పాతుకుపోవడంతో దాన్ని నయం చేయడం అంత సులభం కాదు.వెళ్ళు తన్నిన ఒక మహా వృక్షంలా పెరిగిన ఈ వ్యాధిని నయం చేయడానికి అసాధారణ కృషి చేయడం అవసరం.
- నియమాలు పాటించినప్పడికి ఫలితాలు కలుగలేదంటే దానికి మరో కారణం పేషంటు యొక్క ఆలోచనలు కావచ్చు."నాకు నయం కావట్లేదు" వంటి ప్రతికూల ఆలోచనల వల్ల నివారణకు ఆటంకం కలిగి నయం కావడానికి మరింత సమయం పడుతుంది.’
- అభ్యాసకుల మరియు రోగుల సానుకూల ఆలోచనల వల్ల దివ్యమైన శక్తి ఉద్భవించి వైద్య ప్రక్రియ వేగవంతమవుతుంది.
- రోగులతో వైబ్రియానిక్స్ గురించి మాట్లాడేడప్పుడు జాగ్రత వహించాలి: కొంత సమయం దీనికొరకు కేటాయించండి కాని క్లుప్తంగా ఉండాలి.మనము డాక్టర్లు కాకపోయినప్పటికీ వృత్తిపరమైన రీతిలో చికిత్సనంధించాలి. ఈ చికిత్స ఇతర చికిత్సలతో జ్యోక్యం కాదని పేషంట్లకు చెప్పాలి.
- చికిత్సా సమయాన్ని గురించి అభ్యాసకులకే తెలియదు కాబట్టి దాని గురించి పేషంట్లతో చర్చించరాదు. చికిత్సకు పట్టే సమయం ఈ క్రింద వ్రాసిన అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది: వ్యాధి ప్రారంభమై ఎంత కాలమైంది, పేషంటు యొక్క వయస్సు, అతని జీవనశైలి, పర్యావరణం మొదలైనవి. 15 ఏళ్ళగా ఒక వ్యక్తికున్నరోగం ఒకటే పిల్‌తో నయమైన సందర్భం ఉంది. ఇదే రోగ సమస్య మరో రోగికి నయం కావడానికి అధిక సమయం పట్టవచ్చు.చికిత్సకు పట్టే సమయం భగవంతుడుపైన ఆధార పడియుంది. మందు పనిచేసే వరకు ఓర్పుతో ఉండాలి.
- అక్యూట్ సమస్యల నివారణ తక్కువ సమయంలో కలుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలు నయంకావడానికి అధిక సమయం పట్టవచ్చు. ఇలాంటి సందర్భాలలో పేషంట్లు ఓర్పు వహించాలి.
- మొదటి సారి పేషంటు మిమ్మల్ని సంప్రధించినప్పుడే ఒక సానుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలి.
1.5.3 ప్రశ్న: పుల్ అవుట్ ఎదుర్కొన్న రోగుల గురించి: వీళ్ళు అంతకు ముందున్న సమస్యలకన్న ఎక్కువ సమస్యలు ఎదుర్కోవల్సివస్తే ఏంచేయాలి?
జవాబు: వ్యాధి రోగి శరీరంలో లోతుగా పాతుకునియున్నప్పుడు ఇలాంటి సమస్యలు రావచ్చు. అనేక చక్రాలపై పడిన ప్రభావం వల్ల అనేక అవయవాలలో సమస్యలు ఏర్పడి ఉండుంటాయి.దీని ఎరుక పేషంటుకు ఉండకపోవచ్చు.పూర్తిగా పెరిగిన చెట్టుని భూమినుండి పైకి లాగినప్పుడు కొన్ని వేర్లు భూమిలో ఉండిపోతాయి. పుల్ అవుట్ అన్నది ఇటువంటిదే. ఇది వైబ్రో చికిత్సలో ఏర్పడే ఒక క్రియ మాత్రమే కాని ప్రతిక్రియ కాదు.పుల్ అవుట్ అన్నది రోగి శరీరంనుండి విషపధార్తాలని తీసి వేసే ఒక సానుకూలమైన క్రియ.పేషంటుకు పుల్ అవుట్ గురించి వివరించి ఓర్పు వహించమని ప్రోత్సాహించాలి. పుల్ అవుట్ రకాన్ని బట్టి మోతాదును సర్దుబాటు చెయ్యాలి.
1.5.4 ప్రశ్న: మానసిక మరియు శారీరిక రోగాలతో లేదా బహుళ రోగాలతో, అల్లోపతి మందుల వల్ల కలిగిన దుశ్ప్రభావాలతో భాదితులైన పేషంట్లకు చికిత్సను ఏ విధంగా ఇవ్వాలి?
జవాబు: మానసిక అనారోగ్యం నియంత్రించడానికి ఇవ్వబడే మందుల దుష్ప్రభావాలు అధికంగా ఉంటాయి. దీన్ని పరిష్కరించేందుకు మీరు ఒక సీనియర్ అభ్యాసకుడిని సంప్రదించి ఒక ప్రత్యేక మందును (నోసోడ్) తయారు చేయించుకోవాలి.పేషంటుకు దుశ్ప్రభావాలని కలుగ చేస్తున్న అల్లోపతి మందుయొక్క నమూనాని SVP కు అందచేయాలి.ఇలా తయారు చేసిన వై బ్రో మందుని వాడటం వల్ల అల్లోపతి మందు కలుగచేసిన దుష్ప్రభావాలు తొలగిపోతాయి.పేషంటు ను అల్లోపతి మందు తీసుకోవడం కొనసాగించమని చెప్పాలి.
ప్రత్యామ్నాయంగా ఆ రోగికి CC17.2 Cleansingతో చికిత్స ప్రారంభించండి.ఈ చికిత్స తీసుకుంటున్నప్పుడు పేషంటు అధికంగా నీరు తాగాలని చెప్పడం చాలా ముఖ్యం.పేషంటుకు పుల్ అవుట్ సంభావ్యత గురించి ముందే హెచ్చరించండి. ఈ పరిహారం మొదలుపెట్టిన తర్వాత పేషంటు నొప్పుందని పిర్యాదు చేస్తే జాగ్రత వహించాలి. నొప్పి రావడం యొక్క పుల్ అవుట్ లక్షణం కావచ్చు.
1.5.5 ప్రశ్న: దీర్గ కాలంగా గౌట్ (వాతరోగం) సమస్యతో భాదితుడైన ఒక 50 ఏళ్ళ వ్యక్తికి వైబ్రో తీసుకుంటే తీవ్రమైన పుల్ అవుట్ రావడం జరుగుతోంది.కాని ఈ రోగికి అల్లోపతి మందు (అల్లోప్యూరినాల్) తీసుకుంటే ఉపశమనం కలిగింది. 15 ఏళ్ళగా ఈ వ్యాధితో భాద పడుతున్న ఈ పేషంటు ప్రత్యేకమైన ఆహారాని తీసుకుంటున్నాడు. పుల్ అవుట్ తీవ్రంగా రావటం వలన వైబ్రో మందులు అప్పుడప్పుడు మాత్రమే వేసుకోగలుగుతున్నాడు. ఈ పేషంటు సమస్యకు పరిష్కారం ఏమిటి?
జవాబు: పుల్ అవుట్ వస్తుందన్న భయంతో పేషంట్కు మానసిక ప్రతిష్టంభన కలిగియుండవచ్చు.భయం అన్నది ప్రేమకు వ్యతిరేకం.రోగి ఆధ్యాత్మిక స్థాయిలో పని చేయడం ద్వారా భయాన్ని అధికమించాలి. ఇలా చేస్తే వై బ్రో మందు మంచి ఫలితాన్నిస్తుంది.
1.5.6 ప్రశ్న: ఒక పిల్స్ సీసాలో ఎన్ని రకాలైన మందులను కలపవచ్చు?
జవాబు: దీనికి గరిష్ట పరిమాణం లేదు. అయితే కొత్త అభ్యాసకులు ఈ సూత్రాలను తప్పక గుర్తుంచుకోవాలి:
- తక్కువ సమయంలో నయమయ్యే అక్యూట్ సమస్యలున్నప్పుడు అనేక రకాల మందుల్ని ఒకటే సీసాలో కలపవచ్చు.
- శిక్షణ ప్రకారం, అనేక ధీర్గకాలిక వ్యాదులన్నప్పుడు,ఒక సమయంలో కేవలం ఒక మందుని ఇవ్వాలి.ఇలా చేయడం ద్వారా ఒక వేళ పుల్ అవుట్ సంభవిస్తే దానికి కారణమైన మందు ఏదో నిర్దారించడం సులభమవుతుంది.
- అనేక రకాల మందుల్ని కలుపుతున్నప్పుడు పిల్స్ ఎక్కువగా నానిపోకుండా చూసుకోవాలి.
1.5.7 ప్రశ్న: ఎన్ని రకాల వ్యాదుల్కి చికిత్స ఒకే సమయంలో ఇవ్వవచ్చు?
జవాబు: ఒకటే గ్రూప్కి చెందిన వ్యాదులైయుంటే ఒకే సమయంలో చికిత్సనివ్వవచ్చు. అసంగతమైన వ్యాదులైయుంటే ఉదాహరణకు: కంటి సమస్య మరియు కీళ్ళ వాపు- బహుశా కంటి సమస్యకు పేషంటు అల్లోపతి మందులను తీసుకుంటూ ఉండవచ్చు.ఈ సందర్భంలో పేషంటు కీళ్ళ వాపు సమస్యకు మాత్రమే చికిత్సనివ్వాలి.
రోగియొక్క ప్రాధాన్యత తెలుసుకోవడం ఉత్తమం.రెండు సమస్యలకు సంభందించిన మందుల్ని కల్పవచ్చుకాని ఉపశమనం కలుగడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు.
మనందరిలో(భగవంతుడు) సహజంగా వ్యాధిని నయం చేసే శక్తి ఉంటుంది.ఒక సమయంలో ఒక సమస్యపై దృష్టిని కేంద్రీకరించటం మంచిది. కీళ్ళ వాపు కేసులో పేషంటుకు నొప్పి ఎంత తీవ్రంగా ఉందని తెలుసుకొని, కంటి మందును కలపాలా వద్దా అని నిర్ణయించుకోవాలి.
1.5.8 ప్రశ్న: ఈ చికిత్సపై పేషంటుకు విశ్వాసం ఏర్పరచడానికి మనం ముందుగా రోగ లక్షణాన్ని నయం చేయడానికి చికిత్సనిచ్చి ఆపై రోగ కారణానికి చికిత్సనిస్తే అధిక సమయం పట్టవచ్చు కదా?
జవాబు: నొప్పి భరించ గలిగేలా ఉంటే ముందుగా రోగ కారణానికి చికిత్సనివ్వాలి.కాని ఇలాంటప్పుడు పుల్ అవుట్ తీవ్రంగా ఉండవచ్చు. పేషంటు వయస్సు మరియు కేసు ప్రత్యేకత దృష్టిలో పెట్టుకొని చికిత్సనివ్వడం ముఖ్యం.
క్లెన్సింగ్(cleansing)మందులు వలన పుల్ అవుట్ వచ్చే అవకాశం ఉంది.ఇలాంటి సందర్భాలలో ప్రతిరోజు పేషంటు పర్యవేక్షణ అవసరం. ఒక మంచి అభ్యాసకుడు ముందుగానే పేషంట్లకు పుల్ అవుట్ గురించి వివరముగా చెప్తాడు.పుల్ అవుట్ గురించి ముందుగానే తెలుసుకున్న పేషంట్లు పుల్ అవుట్ వస్తే సులభంగా ఎదుర్కొన గలుగుతారు.
పుల్ అవుట్కి హోమియోపతి పధం "వైద్య సంక్షోభం".ఈ పధం ప్రతికూల పదంగా ఉండటం కారణంగా మనమీ పదాన్ని వాడము.
1.5.9 ప్రశ్న: వైబ్రియానిక్స్ చేతి పుస్తకంలో చర్మ సమస్యలకు వాసెలిన్ని ఒక మాధ్యమంగా ఉపయోగించవచ్చని రాసియుంది.వాసెలిన్ లోకి మందుల్ని ఎలా కలపాలో చెప్తారా?
జవాబు: చర్మ సమస్యలకు చికిత్స రెండు విధాలుగా చేయాలి.మందుని చర్మం పై లేపనం వలె రాయవచ్చు మరియు మౌఖికంగా నీటిలో కలిపి తీసుకోవచ్చు.
మందుల్ని వాసెలిన్ తో ఎలా కలపాలి : ఒక చుక్క మందుని వాసెలిన్ లో వేసి ఒక లోహముకాని గరిటతో మూడు నిమిషాలు భాగా కలపాలి.మరొక్క చుక్క మందును వేసి పై విధముగా మరో రెండుసార్లు కలపాలి.ఈ విధంగా మిశ్రమాన్ని సుమారు పది నిమిషాల పాటు కలిపాక వాసెలిన్ రంగు మారుతుంది. పరిమళమైన వాసెలిన్ వాడకండి. పరిమళము లేని సహజ వాసెలిన్నే వాడండి.
- చాలా సంవత్సరాలు పచ్చి వర్జిన్ నూనె వాడటం ఉత్తమమని సిఫారసు చేసారు కాని ఇటీవల కొబ్బరి నునె మరింత సపలితాలని ఇస్తుందని తెలిసింది.శీతల ఒత్తిడి చేయబడ్డ సేంద్రియ పచ్చి కొబ్బరి నునె శ్రేష్టమైనది.ఇది శరీరంలో కొవ్వు స్థాయిను తగ్గిస్తుంది.
- వైబ్రియానిక్స్ పరిహారాలు (మందులు) చర్మం మీద అన్వయించేడప్పుడు రోగి యొక్క చేతులతో చేయవచ్చు.
- నీటిలో ఎలా కలపాలి:200 ml నీటిలో ఒక చుక్క మందుని కలపాలి.భాదితమైన ప్రాంతంపై పేషంటు తన చేతులతో రుద్దాలి లేదా పత్తితో అద్ధవచ్చు.
1.6.0 ప్రశ్న : 60 ఏళ్ళు నిండిన అనేక వృద్ధ రోగులు ప్రేగుల నియంత్రణ సమస్యల కారణంగా ఇళ్ళనుండి బయిటకు వెళ్ళడానికి భయపడుతున్నారు.దీనికి పరిహారం ఉందా?గత కొన్ని నెలలుగా ఏడుగురు వృద్ధ పేషంట్లు నన్ను ఈ సమస్య పరిహారం కొరకు సంప్రదించారు.ఈ వృద్ధులకు ఆత్మ గౌరవం తగ్గి సమాజంలో అడుగుపెట్టడానికి సిగ్గుపడీ ఇళ్ళలో ఉండిపోతున్నారు.
జవాబు: డా.అగ్గర్వాల్ కండరాల పరిహారం NM7 CB7 కండరాల్ని బలపరచడానికి ఉపయోగించవచ్చని (SRHVP యంత్రం ఉపయోగించి తయారు చేయబడింది) లేదా: CC4.6 Diarrhoea + CC12.1 Adult tonic + CC15.1 Mental & Emotional tonic + CC20.4 Muscles & Supportive tissue ఇవ్వవచ్చని చెప్పారు.
జవాబు: అతితుల్లో ఒకరైన ఒక MD ఈ సమస్య 60 నుండి 70 ఏళ్ళ వయస్సులో ప్రారంభం అవుతోందని చెప్పారు.ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు భాదితమైన కండరాలను (పైత్యరసనాళమును) పొద్దున మరియు రాత్రి వేళల్లో 9 సార్లు భిగసించటం మరియు సడలించటం వంటి వ్యాయామాలు చేయమని పేషంట్లకు చెప్పాలని అన్నారు.బయిటకు వెళ్ళడానికి ముందుగా ఇదే వ్యాయామాన్ని 18 సార్లు చేయాలని చెప్పారు. అంతేకాకుండా బయటికి వెళ్ళడానికి ముందు ఏవి తినకుండా త్రాగకుండా ఉండటం ఈ సమస్యని కొంతవరకు తగ్గిస్తుందని చెప్పారు.ఆక్యుపంక్చర్ మరియు కపల్భాటి యోగా కూడా ఈ పరిస్థితికి సహాయపడతాయని చెప్పారు.
1.6.1 ప్రశ్న: భరువు అధికంగా ఉన్న వ్యక్తులకు భరువు తగ్గడానికి ఏ మందుని ఇవ్వాలి? అందరికి హైపోతయిరాయిడిసం లేదు కాబట్టి CC6.2 Hypothyroid కాంబో ని ఇవ్వలేము.ఏ కాంబో ని ఇవ్వాలో చెప్పమని కోరుకుంటున్నాను.
జవాబు: దీనికి ఇవ్వవలసిన కాంబో CC6.2 Hypothyroid + CC15.4 Eating disorders. ఇది అన్ని పరిస్తితిల్లోను పనిచేస్తుంది. బరువును తగ్గించుకోవాలంటే పేషంట్లు సరియైన వైఖిరిని కలిగియుండాలి.జీవన్ శైలిపై ఎరుక కలిగియుండాలి.భరువు ఎక్కువుగా ఉన్న వ్యక్తులకు ఆత్మగౌరవం తక్కువగా ఉంటుంది.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం మరియు వ్యాయాయం చేయటం వంటి మంచి అలవాట్లువల్ల కలిగే ఉపయోగాలని పేషంట్లకు మీరు చెప్పాలి. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు నీరు త్రాగమని మరియు ముందుగా సలాడ్ తీసుకోమని సలహా ఇవ్వాలి.పేషంట్లను మితముగా ఆహారాన్ని తీసుకోవాలని మరియు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి ముద్దను 32 సార్లు నమిలి మింగాలని చెప్పాలి.
1.6.2 ప్రశ్న: మన కాంబో బాక్సులో కార్పల్ టనల్ సిండ్రోం కి పరిహారంగా CC20.3 Arthritis కాంబో ఉంది.కార్పల్ టనల్ సమస్యలో మధ్యలో ఉన్న ఒక నరం మణికట్టు కింద భాగములో ఎముకలు మరియు లిగమంట్లు మధ్యనున్న సన్నమైన మార్గంలో ఉండటం కారణంగా ఒత్తిడివల్ల నొక్కుకుపోతుంది. CC20.3 Arthritis కాంబో ఏ విధంగా ఈ నరాన్ని వాస్తవ స్థితికి తీసుకువస్తుంది?
జవాబు: మనికట్టులో 9 ఎముకలున్నాయి.ఈ కామ్బోలో ఉన్న వైబ్రేషన్లు సంభందిత చక్రాలలో సంతులనం తీసుకు వస్తాయి.దీని కారణంగా నరాలలో ఒత్తిడి తగ్గి వాస్తవ స్తితికి వస్తాయి. CC20.5 Spine స్లిప్ డిస్క్ సమస్యలకు కూడా ఇదేవిధముగా వైబ్రేషన్లు పని చేస్తాయి.కొన్ని కేసులలో ఒక్క డోస్తో ఈ సమస్యనుండి ఉపశమనం కలిగింది.ఇది భగవంతుడు కృప తప్ప వేరొకటి కాదు.
1.6.3 ప్రశ్న: పారాథైరాయిడ్ గ్రంధి అతిక్రియాశీలత సమస్యకు ఏ కాంబోని ఉపయోగించాలి? ఈ సమస్య కారణంగా శరీరంలో కాల్షియం స్థాయిలు పెరుగుతాయి.
జవాబు: దీనికి SR517 Parathyroid ఇవ్వాలి. ఇది CC6.1 Hyperthyroid లో ఉంది. కాని రక్తముయోక్క నమూనా నుండి ఒక నోసోడ్ ను తయారు చేయటం ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. పేషంటుకు కొంత సమయం కేటాయించి శరీరంపై మనస్సు యొక్క ప్రభావం గురించి చెప్పాలి. మంచి ఆలోచనలయోక్క సఫలితాల గురించి వాళ్లకి వివరించటం మంచిది.పేషంటుకు ఉపశమనం కలుగాలని భగవంతుడిని ప్రార్థించాలి.
పేషంట్లతో పాటు హో'ఒపోనోపోనో అని ఒక పురాతన హవాయియన్ ప్రార్థన యొక్క సలహాను అనుసరించి ఈ కింద వ్రాసియున్న నాలుగు వాఖ్యాలను పునరావృతం చేస్తే మంచిది:1.నన్నుక్షమించు 2.నేను నిన్ను ప్రేమిస్తున్నాను 3.ఐ యాం సారి 4. ధన్యవాదాలు.ఈ వాఖ్యాలను చెపుతున్నపుడు మీ మనస్సులో మిమ్మల్ని గాయపరచిన లేదా మీచేత గాయపడిన వ్యక్తిని ఉద్దేశించి చెప్పుకోవాలి.
1.6.4 ప్రశ్న: ఒక క్లిష్టమైన కేసులో తనకు ఏ విధమైన అనారోగ్యము లేదని తలచే ఒక 39 ఏళ్ళ వ్యక్తికి ఏ కాంబో ఇవ్వవచ్చు? ఆ పేషంటు యొక్క తల్లి అతన్ని నన్ను సంప్రదించడం కొరకు తీసుకువచ్చింది.
జవాబు: ఈ పేషంటుకు మానసిక సమస్య ఉండే సంభావ్యత ఉంది. ఈ పేషంటుకు CC15.2 Psychiatric disorders దీర్గ కాలం వరకు ఇవ్వాలి. CC18.1 Brain disabilities కూడా చేర్చవచ్చు.
వ్యాఖ్యానం: బహుశా పేషంటు యొక్క తల్లి అతని పరిస్థితికి కారణం కావచ్చని సూచించారు. ఒకొక్కసారి మందు ఇవ్వడం ఒకటే పరిష్కారాన్ని ఇవ్వదు. ఆలోచనల ప్రభావం బిడ్డపై పడుతుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు తమ ఆలోచనల గురించి శ్రద్ధ వహించాలి.
జవాబు: [డా.అగ్గర్వాల్ స్పందన:] సాయి బాబాగారు అనారోగ్యానికి మూల కారణం మనస్సుయని చెప్పారు. ఈ సత్యాన్ని స్వామీ రామా [1970 లో మనస్సు-శరీర పరిశోధనలు US లో కొంత సమయం గడిపిన] నిర్ధారించి చూపించారు. US యూనివర్సిటి ఆడిటోరియుంలో ప్రేక్షకులలో ఒక వ్యక్తి చేతిపైన 10 డిగ్రీ అవకలన ఉండే ఉష్ణోగ్రతను సృష్టించి చూపారు.అంతేకాకుండా ఒక గోల్ఫ్ బంతి యొక్క పరిమాణంలో ఉన్న ఒక సిస్ట్ ను సృష్టించి మాయం కూడా చేసారు.దీనినుండి తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మనమందరము ఒకటే.
రోజంతా మనము ఆలోచనలు కలిగియుంటాము. వాటిలో చాలా ప్రతికూలమైనవిగా ఉంటాయి.వాటిని ఆపడానికి ప్రయత్నించవద్దు.వాటిని అనుకూల ఆలోచనలతో భర్తీ చేయాలి.
1.6.5 ప్రశ్న: సాధారణంగా రోగి యొక్క నోసోడ్ను నిల్వ చేయడం ఎలా?
జవాబు: పిల్స్ లో కలిపిన నోసోడ్ అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. మరొక సీసాలో కొన్ని పిల్స్ ఉంచి వాటిని ప్రతి ఆరు నేలలోక సారి పునరుద్ధరించే ప్రక్రియ చేయాలి. నమూనా పిల్స్ ను పేషంటు తన వద్ద ఉంచుకోవటం మంచిది.
1.7. డా.అగ్గర్వాల్ నుండి అదనపు సిఫార్సులు:
- 200 ml నీటిలో మందుని కలిపి 5 ml సింగిల్ డోసుగా తీసుకుంటున్నప్పడికి మీరు ప్రతి ఏడూ రోజులకి ఒకసారి పాత్రను శుబ్రపర్చి నీటిని మార్చాలి. మీరు పేషంట్లను మందు కలిపిన నీటిని మధ్యలో చూసుకోమని, నీటి రంగులో మార్పు లేదా పైన పొరలా ఏర్పడటం వంటి మార్పులు కలిగియుంటే నీటిని వెంటనే మార్చాలి.
- పేషంటు నోటిలో సీసానుండి నేరుగా మందును వేయరాదు.
- కళ్ళు మరియు చెవుల చికిత్సకు చుక్కలు తయారు చేయవచ్చు. కళ్ళ కోసం మందు తయారు చేసేడప్పుడు 200 ml స్వేదనజలం లో తయారు చేసి దీనినుండి 30 ml డ్రాపర్ సీసాలో నింపుకొని కంటి చుక్కలుగా వాడవచ్చు. మిగిలిన నీటిని పారవేయచ్చు.
- సీసాలను, పాత్రలను శుబ్రపర్చడానికి వేడి నీరోకటి చాలు డిటర్జంట్ వాడవద్దు.
- వైబ్రియానిక్స్ అభ్యాసకులందరి వద్ద కూడను ఎమర్జెన్సీ కిట్ ఉండటం ఎంతో అవసరం. అభ్యాసకులందరు ఎల్లప్పుడూ 9 కాంబో లున్న వెల్ నెస్ కిట్‌ను తమ వద్ద ఉంచుకోవాలని డా.అగ్గర్వాల్ నొక్కిచెప్పారు.(ఫార్ములాలు కొరకు వెల్ నెస్ కిట్ 108 కామన్ కాంబోలు, 2011 వైబ్రియానిక్స్ చేతి పుస్తకం, పు.2).
[గమనిక: ఈ వాత్క్ షాప్ లో రిపోర్టు చేయబడిన అసాధారణ కేసులు జూన్/జూలై 2015 వార్తాలేఖలో ప్రచురింప బడుతాయి].
ఓం సాయి రామ్