Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

అదనపు సమాచారం

Vol 8 సంచిక 2
March/April 2017


ఆరోగ్య చిట్కాలు

నీరు మరియు ఆరోగ్యం భాగం-1 - నీరు యొక్క వింతలు, అద్భుతమైన విశేషాలు!

నీరును అర్ధం చేసుకోవడం అంటే ఈ బ్రహ్మాండాన్ని, ప్రకృతి యొక్క రమణీయతను మరియు జీవితాన్ని అర్ధం చేసుకోవడమే. ముందుగా మనం నీరును, అది ఏ విధంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుందో తెలుసుకోవాలి. అతి సాధారణమైన, అత్యద్భుతమైన నీరును మన వేదాలు అత్యంత పవిత్రమైనదిగా కీర్తించాయి. శాస్త్రజ్ఞులు నీటి యొక్క అద్భుత గుణాలను ఆశ్చర్యంతో తెలుసుకుంటున్నారు. నీరు మన నిత్య జీవితంలో అంతర్భాగం. మనం ప్రతిరోజూ నీటిని చూస్తాం, త్రాగుతాం మరియు అనేకావసరాలకు వాడుతాము. మన జీవితానికి నీరు ముఖ్యంగా పరిశుద్ధమైన నీరు అత్యవసరం. నీరు లేకుండా మనం జీవించగలమా?

1. మన భూమిలో ఉన్నది ఎక్కువ శాతం నీరే

పంచభూతాలలో ఒకటి నీరు మన భూమి మీద ఉంది. మిగిలినవి మట్టి ఆకాశం అగ్ని మరియు వాయువు. భూమిలో శాతం ఉన్నది నీరే. అదే విధంగా పంచ భూతాలతో నిండి ఉన్న మన మానవ శరీరం లో శాతం నీరే. mokkalu మరియు jantuvulalo కూడా నీరు శాతం మించి ఉంటుంది. సమస్త జీవకోటిలో నీరే అత్యధిక శాతం ఉంటుంది.

2. దివ్య ఉపదేశం

"మనం త్రాగే నీరు మనకు జీవితాన్ని ప్రసాదిస్తోంది. అది శివునియొక్క శిరసు నుంచి ఆవిర్భవిస్తుంది - బాబా రిగ్వేదంలోని  ఆపః సూక్తంలో నీరు ప్రాణం మరియు శక్తికి ముఖ్య ఆధారంగా కారణంగా కీర్తించబడింది నీరు ఔషధం. దానిని అత్యంత భక్తిశ్రద్దలతో మనల్ని సంరక్షించాలని ప్రార్థిస్తూ సేవించాలి. మనం త్రాగిన నీరులో ఎక్కువ శాతం మూత్రంగా విసర్జించబడుతుంది. కొద్దీ శాతం ప్రాణ శక్తిగా మారుతుంది. అందువలన మనం తినే ఆహరం త్రాగే నీరు మన యొక్క ప్రవర్తనను నిర్దేశిస్తుంది. మనం ఈ ఆహారాన్ని నీటిని పరిశుద్ధం గావించుకున్నపుడే దివ్యత్వాన్ని పొందగలము"...సత్య సాయి బాబా, quoted from Vision of Sai vol-2 by Rita Bruce, p234

3. నీటికి విలక్షణ లక్షణాలున్నాయి

నీరులో రెండు హైడ్రోజెన్  అణువులు ఒక ఆక్సీజన్ అణువుతో ముడిపడి ఉండడం వలన నీటికి విలక్షణ విద్యుత్ రసాయన లక్షణాలుంటాయని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. నీరు సహజంగానే ఘానా, ద్రవ మరియు వాయు రూపాలలో ఉండగలదు. ఇటువంటి విలక్షణ లక్షణాలు నీటికి లేకపోతె ఈ భూమి మీద జీవ కోటి మనుగడ సాగించలేవు. శరీరంలో అనేక లవణాలు, పదార్దాలు కరగడానికి మరియు శరీరంలో జరిగే చాలా జీవ రసాయన చర్యలకు నీరు ఎంతో అవసరం3.

4. నీటిలో స్పందన మరియు ప్రతిచర్య గుణములుంటాయి1,6-8

నీటిలో వివరాలు విషయాలు గుర్తుపెట్టుకొనే శక్తి ఉంటుంది. నీటిని శక్తివంతం చేయవచ్చు. అందువలన నీటికి స్వస్థత కలిగించే లక్షణముంది. నీరు ఆలోచనలకూ, మాటలకు, సంగీతానికి చక్కగా ప్రతిస్పందిస్తుంది మరియు తన యొక్క భౌతిక ఆకారాన్ని మార్చుకుంటుంది. కలుషితమైన నీటిని ప్రార్థన  మరియు పాజిటివ్ విషువలిసెషన్ ద్వారా శుభ్రపర్చవచ్చు. నీరు యొక్క స్పటికాలపై జపాన్ శాస్త్రవేత్త, రచయిత, ఫోటోగ్రాఫర్ మసారు ఏమోటో 1990లో చేసిన పరిశోధన ద్వారా ఇది నిరూపించబడింది.  అతను నీటిని వివిధ రకాల మాటలకు (మాట్లాడిన మరియు టైపు చేసిన ) బొమ్మలకు, వీడియోలకు, సంగీతానికి మరియు ప్రార్థనకి గురిచేసి తరువాత ఆ నీటిని తొందరగా శీతలీకరణ చేసి మైక్రోస్కోప్ ద్వారా ఆ నీటి యొక్క స్పటికాల ఆకృతిని పరీక్షించారు.    

అతిశీతలమైన (ఫ్రోజెన్) కొళాయి నీరు లేదా నిల్వఉంచిన లేదా కలుషితమైన నీరు అసమానమైన స్పటికాలుగా మారినట్లు గుర్తించారు. కానీ వర్షపునీరు, పరిశుద్ధమైన నదులు, వాగులు, మంచు గడ్డల యొక్క నీరు, పవిత్ర పుణ్య తీర్థాల నుంచి సేకరించిన నీరు చక్కని అందమైన స్పటికాలకృతిని పొందినట్లు గమనించారు. అంతేకాకుండా శబ్ద, ఆలోచన, వ్రాతపూర్వకంగా పాజిటివ్ వైబ్రేషన్స్ కు గురైన నీరు చక్కని కనులవిందైన సమన స్పటికాకృతిని పొందగా , నెగటివ్ వైబ్రేషన్స్ కు గురైన నీరు చిందరవందరైన, విరిగిన ఆకారాలను పొందినట్లు ఆయన గమనించారు. ప్రొఫెసర్ ఎమోటో ఏమంటారంటే పాజిటివ్ మాటలు నీటిని ఆధ్యాత్మికతో నింపి ఆ నీటియొక్క అద్భుతమైన గుణాలు పూర్తిగా మనకు ఉపయోగపడే విదంగా చేస్తాయి. ప్రేమ మరియు కృతజ్ఞతా భావ తరంగాలకు గురైన నీరు అత్యంత అద్భుతమైన, ఘనమైన స్పటికాలుగా మారాయి. ఆలోచనలు నీటిని ఇంత మార్పుకు గురి చేసాయంటే, ఇంక ఆ ఆలోచనలు మన మీద ఎంత ప్రభావం చూపించగలవో ఆలోచించండి!

విజ్ఞాన ప్రపంచం ఆయన పరిశోధనలపై వివిధ రకాలుగా స్పందిస్తుంటే, నీరు యొక్క మహిమాన్విత, అద్భుత లక్షణాలు ఇతర శాస్త్రజ్ఞుల పరిశోధనలలో కూడా నిరూపించబడ్డాయి 9-11.  

 

                   

 

 

5. నీరు - దృశ్యపూర్వక జ్ఞాపక శక్తి గల ఒక ఒక ద్రవ కంప్యూటర్ !

నోబెల్ బహుమతి గ్రహీత 2014లో చేసిన వాటర్ మెమరీ అనే డాక్యుమెంటరీ లో నీటి యొక్క అద్భుత ఫోటోగ్యార్ఫిక్ మెమరీ గురించి మరియు ఏ విదంగా నీటి సమూహం ఒక కంప్యూటర్ మేమెరి కార్డు వలె వివరాలను నిక్షిప్తం చేసుకుని తనలో దాచుకొనగలోదో వివరించారు. నీరు యొక్క రసాయన కూర్పు కంటే దాని యొక్క అణువులాకృతి చాలా ముఖ్యమైనదిగా మనం గుర్తించాలి.  నీరు కాలుష్యాన్ని, రసాయన దుర్వినియోగాన్ని, మన భావాలను, చివరికి మన ఇష్టాయిష్టాలను గుర్తుంచుకొంటుంది. ఎక్కడ ప్రజలు పరస్పర నిందారోపణలు చేసుకొంటారో అక్కడ నేరాలు ఎక్కువగా జరుగుతాయి. మనం నీటిని ఏవిధంగా చూస్తామో ఆ విధంగా నీరు స్వరూపం మారుతుంది. చర్చిలో ఇచ్చే పవిత్ర బాప్తిస్మల్ నీటిని లాబరేటరీ లో పరీక్షించినప్పుడు ఆ నీటికి శక్తివంతమైన స్తిరాకృతి ఉన్నట్లు గుర్తించారు. నీరు సంకేతాలను తీసుకొనగలదు మరియు ప్రసారం చేయగలదు. 10000 కి మీ దూరం నుంచైనా మనం నీటిని సూక్ష్మ శక్తులతో శక్తివంతం చేయవచ్చు.

నీరు యొక్క జ్ఞప్తి ఉంచుకునే (జ్ఞాపక  శక్తి) స్వభావాన్ని, రెమెడీలను వరుసగా పలుచన చేయడం ద్వారా మరింత శక్తివంతం చేయుటకై హోమియోపతి లో ఉపయోగిస్తారు. ఎంతగా పలుచన చేస్తారంటే రెమెడీ లో అసలు ఆ పదార్థమే లేనంతగా. కేవలం ఆ పదార్థం యొక్క జ్ఞాపకం మాత్రం ఆ రెమెడీ లో ఉంటుంది అందువలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

6. నేల తేమ యొక్క గుర్తు11 - ఒక వినూత్న పరిశోధన

అమెరికా లోని నాసా వారు ఆకాశం భూమి మరియు సముద్రం నుంచి డేటా సేకరించి అవి మన భూమికి భావితరాల భవిష్యత్తుకు ఏ విధంగా ఉపయోగపడగలవో పరిశోధిస్తుంటారు.  2015 నుంచి మసచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (MIT), కేంబ్రిడ్జి మరియు నాసా వారు నేల తేమ యొక్క మెమరీ, నేల పై  ఉన్న 5 సెంటీమీటర్ల మట్టిని  విశ్లేషించడం ద్వారా పరిశోధిస్తున్నారు.  వారి పరిశోధనలు భూమి యొక్క వాతావరణ మార్పులను విశ్లేషించడంలో మరియు వ్యవసాయ పంటల అభివృద్ధికి సహకరించగలవు.      

7. నీరును గౌరవించండి

మన ఆరోగ్యం యొక్క కిటుకు నీటిని గౌరవించడంలోనే ఉంది. చెడు ఆలోచనలు మరియు చెడు భావాల ద్వారా మన శరీరంలో ఉన్న నీరును మనమే కలుషితం చేసుకుంటాం. నీటిని చులకనగా చూడటం, లెక్క చేయకపోవటం ఇంకా ప్రమాదకరం. ఉదాహరణకి పట్టించుకోకుండా వదిలి వేసిన నీటిలో అసంపూర్ణ స్పటికాకృతి ఉంటుంది. మన ఆలోచనలు మరియు భావాల ద్వారా మనం నీరు యొక్క రసాయన కూర్పు మార్చకుండానే, అణువాకృతిని మార్చగలం. ఒక గ్లాస్ మంచి నీరును మనం ఏ విధంగా చూస్తాం, పట్టుకుంటాం, త్రాగుతాం  అన్న ఒక్క విషయం మన మీద, మనం ఆ నీటిని ఇచ్చే ఇతరుల మీద ప్రభావం చూపుతుంది. నీటిని భక్తిశ్రద్దలతో గౌరవించడం ద్వారా మనం మన జీవితాలను ఏంతో ఆరోగ్యంగా, ప్రశాంతంగా, ఆనందోత్సాహాలతో గడపవచ్చు. నీరు పై భక్తి ‘అందరిని ప్రేమించండి అందరిని సేవించండి’ అనే సిద్ధాంతానికి దగ్గర చేసి మనం మానవత్వానికి భూమికి కృతజ్ఞతాపూర్వకoగా ఉండేటట్లు చేస్తుంది

8. ప్రేమ మరియు కృతజ్ఞత పంచడానికి నీటితో అనుసంధానం అవ్వండి

ఒక విధంగా మనం శరీరంలో ఉన్న కదిలే నీటి ట్యాంకుల వంటి వాళ్ళం. మన శరీరంలో ఉన్న నీరు యొక్క నాణ్యత బట్టి మన యొక్క మనస్తత్వం ఆధారపడి ఉంటుంది13. ఎప్పటివరకైతే మనం కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు శత్రువుల యొక్క ఆదీనంలో బందీ అయి ఉంటామో అప్పటివరకు మన శరీరం, మెదడు, గుండెలో ఉన్న నీరు పవిత్రంగా ఉండజాలదు. మనం ప్రేమ, కృతజ్ఞత మరియు ఆశావహ దృక్పధం ద్వారా మనలో ఉన్న మరియు మన చుట్టుప్రక్కల ఉన్న నీరును శక్తిమయం చేసుకోగలం. ఈ విధంగా సర్వ వ్యాపి అయిన నీరును మనం ప్రేమ, శాంతి, ఆనందం మరియు కృతజ్ఞతను విశ్వంలో పంచుకోవడానికి ఒక మాధ్యమంగా ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వలన ఆ పవిత్ర బావాలు ప్రతిబింబం, ప్రతిచర్య మరియు ప్రతిధ్వని ద్వారా మన దగ్గరకే తిరిగి వస్తాయి.

9. విబ్రియోనిక్స్ మరియు నీరు

విబ్రియోనిక్స్ రెమెడీలు నీటిలో చేసినా లేదా నీటితో తీసుకొన్నా అవి ఎందుకు ఎక్కువ ప్రభావవంతంగా, తొందరగా పనిచేస్తాయో మనం నీరు యొక్క సహజ సిద్దమైన లక్షణాలను పరిశీలిస్తే అర్ధమవుతుంది. అంతే కాకుండా రెమెడీలు తయారు చేసేటప్పుడు, ఇచ్చేటప్పుడు మరియు తీసుకునేటప్పుడు మన మనసు ప్రశాంతంగా ఆశావహ దృక్పధంతో ఉండటం అవసరం మరియు తగినంత నీరును శరీరంలోని కలుషితాలను కడిగి బయటకు పంపించడానికి అవసరం.

ప్రస్తావనలు మరియు లింకులు

  1. The Hidden Messages in Water by Masaru Emoto, Atria Books Edition, 2005  http://isha.sadhguru.org/blog/video/the-5-elements-of-existence-explained/
  2. Water has Unique Properties: http://www.physicalgeography.net/fundamentals/8a.html
  3. Sathya Sai Speaks, Vol.27, 23rd November 1994
  4. Rig Veda on water: http://www.greenmesg.org/mantras_slokas/vedas-apah_suktam.php 
  5. Water can Respond and React: Emoto’ s experiments with water crystals: https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=emoto+water    https://www.youtube.com/watch?v=Is8FE0RQo8A 
  6. What the Bleep do we know –Feature film on thoughts and also water crystals: https://archive.org/details/WhatTheBleepDoWeKnow_201601# 
  7. Water’s memories :Scientific Proof  https://www.youtube.com/watch?v=59iuelCL0M 
  8. Water Memory – a 2014 Film on Water Experiments by Professor Nobel Prize laureate Luc Montagnier ,Virologist, applying technology of Scientist, Dr Jacques Benveniste who first raised notion of water memory in1980s)  https://www.youtube.com/watch?v=R8VyUsVOic0 
  9. NASA study on Soil Moisture Memory http://www.jpl.nasa.gov/news/news.php?feature=6726 
  10. Sadhguru at Chennai IIT on Water has Memory: https://www.youtube.com/watch?v=6C1p4HUHlfE 
  11. We are a  bottle of Memory: https://www.ishafoundation.org/news/columns/Mystic-Mantra/2012/DeccanChronicle-22-Mar-2012.pdf

 

నీరు మరియు ఆరోగ్యం భాగం - 2 -- డీహైడ్రేషన్

1.  డీహైడ్రేషన్1-3 అనగానేమి ?

శరీరంలోని నీరు బాగా తగ్గిపోయి శరీరం తనంత తాను సరిగా పనిచేయలేకపోవడాన్ని డీహైడ్రేషన్ అంటారు. ఇది ఎవరికైనా రావచ్చు.

మన శరీరంలో  మూడింట  రెండు బాగాలున్న నీరు మన ఆరోగ్యానికవసరమైన ఒక ప్రాణాధార పోషకం. నీరు మన శరీరం చక్కగా పనిచేయటానికి ఎంతో అవసరం. నీరు పోషకాలను కణాలలోకి తీసుకెళుతుంది మరియు శరీర ఉష్ణోగ్రతను జీర్ణక్రియను సంరక్షిస్తుంది. అది మన కీళ్లను కళ్ళను తడిగా ఉంచి లూబ్రికేషన్ ఇస్తుంది మరియు విష పదార్దాలను బయటకు పంపించడం ద్వారా  చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ ఓకే షాక్ అబ్సర్బెర్ వలె పని చేస్తుంది.  

మన శరీరం సాధారణ జీవ ప్రక్రియలో భాగంగా శ్వాస క్రియ విసర్జన క్రియ లాంటి ఇతర దైనందిన చర్యల్లో వాతావరణ మార్పుల్లో భాగంగా నీటిని కోల్పోతూ ఉంటుంది. శరీరంలో అత్యద్భుతమైన వ్యవస్థ నీరును చక్కగా అదుపు చేస్తూ అవసరమైన కణాలకి నీరును అందిస్తుంది. కానీ మానవ శరీరంలో కొవ్వుపదార్థాలని నిల్వ చేసే వ్యవస్థ ఉంది కానీ నీరును నిల్వ చేసే వ్యవస్థ లేదు.. అందువలన శరీరానికి తగినంత నీరు మనము ఇవ్వకపోతే శరీర సమతుల్యత దెబ్బ తిని డీహైడ్రేషన్ వచ్చే అవకాశముంది.

శరీరంలో నీటి శాతం 1 – 2, శాతం తగ్గితే మనం నీరును తీసుకోవాలి అన్న దానికి సంకేతంగా శరీరం లో దప్పిక అనే అద్బతమైన సహజ ప్రక్రియ ఉంది.

2. డీహైడ్రేషన్ కు ఒక మనిషి ఎలా గురవుతాడు3

డీహైడ్రేషన్ ఆకస్మికంగా కానీ ఒక వ్యాధి వలన కానీ ప్రతిసారి రాదు. ప్రతిరోజూ తక్కువ నీటినితాగడం, దప్పిక వేసినప్పటికీ నీరును త్రాగకపోవడం వంటి కారణాలవల్ల డీహైడ్రేషన్ రావచ్చు. దీర్ఘకాలిక డీహైడ్రేషన్ వలన ఎన్నో వ్యాధులు రావచ్చు.

డీహైడ్రేషన్ కు ఇతర అంశాలు లేదా వ్యాధులు కార్మ కావచ్చు.త్రాగవల్సిన నీరు కంటే తక్కువ నీరును త్రాగినప్పుడు లేదా ఎక్కువ నీటిని శరీరం నుంచి కోల్పోయినప్పుడు, అధిక పని లేదా వ్యాయామం అధిక వేడి లేదా ఒత్తిడికి లోనైనప్పుడు, వాంతులు విరేచనాలు అధిక జ్వరం , ఎక్కువ సార్లు మూత్ర విసర్జన చేయాల్సి రావడం శరీర గాయం లాంటి కారణాలవలన డీహైడ్రేషన్ రావచ్చు.క్రమ తప్పకుండ చల్లని పానీయాలు, కోక్ కాఫీ లాంటివి పొడి ఆహార పదార్థాలు శరీరం నీటిని కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి కారణాలవలన శరీరంలోని నీరు తగ్గి ఆకస్మికంగా డీహైడ్రేషన్ కు గురి కావచ్చు.

శరీరాన్ని తగినంతగా హైడ్రేషన్ లో ఉంచడానికి నీటికి బదులుగా ఏ ఇతర ద్రవ పదార్థం, పాలు పండ్ల రసాలు కూడ సరిపోవు.      

3. డీహైడ్రేషన్ యొక్క లక్షణాలు1-4

విపరీతమైన దాహం, ఎండిపోయిన నోరు, వాచిన నాలుక, అలసట, బలహీనత, కళ్ళు తిరగటం, నిస్సతువ, గుడ్ దడ, తిక మక పడటం, మూర్ఛపోవడం, మూత్రం చాల తక్కువగా, చిక్కగా రావటం, తల నొప్పి, కడుపులో నొప్పి, బి పి తక్కువగా ఉండటం, ముడతలు లేదా పొడిబారిన చర్మం, పసుపు లేదా యెర్రని రంగులో మూత్రం ( మూత్రం సహజంగా ఏ రంగు లేకుండా లేదా లేత పసుపులో ఉంటుంది). ప్రతి ఒక్కరు తమ శరీరం యొక్క నీటి అవసరాలను హైడ్రేషన్ ను గమనిస్తుండాలి, కానీ తీవ్రమైన పరిస్థితులలో అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి!    

డీహైడ్రేషన్ యొక్క లక్షణాలను ముందు మంచి నీరు త్రాగడం ద్వారా నివారించాలి. అంతేకాని మందులు లేదా రసాయనాలు అదే పనిగా ఉపయోగించడం శరీర కణ జాలానికి మంచిది కాదు. 

4. చంటిపిల్లలు మరియు పెద్దల కొరకు ప్రత్యేక శ్రద్ద1-2

పెద్ద వయసు వారిలో తమకు దాహం వేస్తోందన్న ఎరుక వయసు పెరిగే కొద్దీ తగ్గవచ్చు. నీరు సక్రమంగా త్రాగకపోతే చంటిపిల్లలు, వృద్దులు, క్రీడాకారులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తొందరగా డీహైడ్రేషన్ కు గురవుతారు. అందువలన తల్లిదండ్రులు, ఆశ్రమ సంరక్షకులు ఈ విషయాన్ని తమ చంటిపిల్లలు,  పిల్లలు, పెద్దలు, రోగుల విషయంలో గుర్తుంచుకోవాలి.

నివారణే ఉత్తమం. శరీరం తగినంత హైడ్రేషన్ తో ఉండేలా చూసుకోండి!1-2

శరీరం తగినంత హైడ్రేషన్ లో ఉంచడానికి రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రతి ఒక్కరు తమ శరీరావసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత నీరును ఎప్పుడు, ఎలా ఎంత త్రాగాలో నిర్ణయించుకోవాలి. ఇది ప్రతిమనిషి యొక్క వయసు, లింగభేదం, ఆరోగ్య స్థితి, వాతావరణం మరియు ప్రదేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలున్నవారు మరియు / లేదా విద్య చికిత్స లేదా మందులు వాడుతున్నవారు జాగ్రత్త వహించాలి మరియు తమ వైద్యున్ని సంప్రదించాలి.

నిర్దిష్టమైన ప్రణాళిక ద్వారా నీరును త్రీసుకోవడం అనే పద్దతి ద్వారా మందులు ఉపయోగించకుండా రోగులకు చికిత్సనందించిన ఇరాన్ కు చెందిన ఒక ప్రముఖ వైద్యుడి సిద్ధాంతాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము3

  • మన శరీరం సుమారు 1.5 నుంచి 2 లీటర్ల నీటిని ప్రతి రోజు తన నిత్యావసర పనుల కోసం వినియోగించుకొంటుంది. క్రమం తప్పకుండా 1 లేదా 2 గ్లాసుల నీరు ప్రతిసారి అప్పుడపుడు రోజంతా త్రాగడం ఉత్తమం. నీరును డీహైడ్రేషన్ అవక మునుపే త్రాగడం ఉత్తమం.
  • ప్రతితోజు ఉదయం పరగడుపున నిద్ర లేచిన వెంటనే నీరును త్రాగడం వలన దీర్ఘ నిద్ర వలన కలిగిన డీహైడ్రేషన్ పోతుంది. మొదట ఒక గ్లాసుతో మొదలుపెట్టి క్రమంగా ఒక నెల వ్యవధిలో 3 గ్లాసుల నీరు త్రాగడం చేయవచ్చు. పరకడుపున నీటిని త్రాగడం వలన నీరు అద్భుత విరేచనాకారిగా పనిచేసి శరీరంలోని విషాలను, వ్యర్దాలను బయటకు పంపించి అంతర్గతంగా పరిశుద్ధంగా ఉంచుతుంది. కానీ ఒక గంట వరకు ఉదయం కాఫీ లేదా టీ త్రాగకుండా జాగ్రత్త వహించాలి.
  • వ్యాయామం చేసే ముందు నీరు త్రాగడం చాల ముఖ్యం. ఇందువలన చెమట ద్వారా నీరు పోవడానికి అవకాశం ఉంటుంది.
  • స్నానం చేసిన తరువాత కళ్ళు తిరగడం వంటి సమస్యలున్నవారు స్నానానికి మందు నీరు త్రాగడం మంచిది.
  • భోజనానికి అరగంట ముందు జీర్ణ వ్యవస్థను సమాయత్త పరచడానికి నీరుని ముఖ్యంగా ఉదర లేదా జీర్ణ సంబంధిత వ్యాధితో అజీర్తితో బాధ పడేవారు త్రాగాలి.
  • భోజనం అయినా రెండు లేదా రెండున్నర గంటల తరువాత కడుపులో జీర్ణ ప్రక్రియ పూర్తయ్యాక నీరు త్రాగాలి. ఇది జీర్ణ వ్యవస్థ ఆహారాన్ని చిన్న చిన్న పదార్దాలుగా చేయడం వలన కలిగిన డీహైడ్రేషన్ ను సరిచేస్తుంది.
  • ఎప్పుడైనా సరే దాహం వేసినప్పుడు నీరును త్రాగాలి - భోజనం చేసేటప్పుడు కూడా దాహం వేస్తె కొద్దిగా నీరును త్రాగవచ్చు.
  • నిద్రలో గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గించటానికి రాత్రి పడుకొనే ముందు ఒక గ్లాసు నీరు త్రాగడం మంచిది.    

7. 70-80 శాతం నీరు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం శరీర హైడ్రేషన్ కు అవసరం5

రోజంతా నీరును అదే పనిగా త్రాగడం సరి కాదని అందువలన శరీర సమతుల్యం దెబ్బ తినే అవకాశం ఉందని ఒక అభిప్రాయం ఉంది. దాహం వేసినప్పుడు దప్పిక తీర్చుకోవడానికి తగినంత నీరే కాకుండా 10-15 శాతం అదనంగా త్రాగాలి. తగినంత నీరును త్రాగుతూ నీటి శాతం ఎక్కువగా ఉన్న తాజా కాయగూరలు. పండ్లు తినడం చాల మంచింది ముఖ్యంగా వేసవి కాలంలో. మన శరీరంలో ఉన్న నీటికి అనుగుణంగా శాతం నీరున్న ఆహారాన్ని తీసుకోవడం చాల మంచిది.

8. డీహైడ్రేషన్ ను నివారణ మరియు నయం చేయడానికి ఉపయోగపడే విబ్రియోనిక్స్ రెమెడీలు

సారంలోని నీటి శాతాన్ని తగినంతగా ఉంచడానికి సరైన రెమెడీ NM34 Water Balance.

సీసీ బాక్సు ఉపయోగించేటట్లైతే క్రింది కాంబోలలో రోగి యొక్క ఆరోగ్య స్థితి, గురి కాబడ్డ అవయవాన్ని అనుసరించి తగిన దానిని ఉపయోగించాలి.  CC3.1 Heart tonic, CC4.1 Digestion tonic, CC4.6 Diarrhoea, CC5.3 Meniere’s disease, CC7.3 Eye infections, CC12.1 Adult tonic, CC13.1 Kidney & Bladder tonic, CC18.1 Brain disabilities, CC19.6 Cough chronic, and CC21.1 Skin tonic.

SRHVP యంత్రం ఉపయోగించేటట్లైతే రోగ లక్షణాలనుబట్టి క్రింది వాటిలో ఎంపిక చేసుకోండి: NM2 Blood, NM5 Brain Tissue Salts, NM18 General Fever, NM34 Water Balance, NM63 Back-up and NM75 Debility.

అత్యవసర మరియు ప్రాణాంతక పరిస్థితులలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించాలి

ప్రస్తావనలు మరియు లింకులు

  1. https://www.google.co.in/webhp?sourceid=chrome-instant&ion=1&espv=2&ie=UTF-8#q=What+is+dehydration
  2. http://articles.mercola.com/dehydration-symptoms.aspx
  3. “You’re Not Sick ,You’re Thirsty” by Dr F. Batmanghelidj MD, based on his pioneering research into the role of water in the body and how it can relieve a stunning range of medical conditions by his experience of curing patients (Warner Books 2003 edn).
  4. http://cci-coral-club.okis.ru/file/cci-coral-club/knigi/FereydoonBatmanghelidj_Your_Bodys_Many_Cries_for_Water_eng.pdf
  5. http://www.ishafoundation.org/us/blog/the-power-of-water/

పైన ఉంచిన విషయాలు వివిధ వెబ్ సైట్లు మరియు పుస్తకాలలోని డేటా నుంచి గ్రహించబడినవి. అంతేకానీ వాటినే పాటించాలనీ లేదా వైద్య చికిత్సకు బదులుగా,  ప్రత్నామ్యాయంగా వాటిని ఉపయోగించాలని చెప్పడం మా ఉద్దేశం కాదు. 

 

2. వైటిఫిల్డ్, బెంగుళూరు లో ప్రారంభమైన సాయి విబ్రియోనిక్స్ క్లినిక్

బాబా ఒక వ్యక్తిగత ఇంటర్వ్యూ లో చెప్పినట్లుగా, విబ్రియోనిక్స్ శ్రీ సత్య సాయి జనరల్ హాస్పిటల్ యొక్క మెడికల్ సూపరింటెండెంట్, గత సంవత్సరం డా. అగర్వాల్ గారికి ఫోన్ చేసి  శ్రీ సత్య సాయి ఉన్నత వైద్య సంస్థ, వైట్ ఫీల్డ్ లో జరగనున్న సాంప్రదాయేతర వైద్య విధానం యొక్క పరిచయ కార్యక్రమంలో భాగంగా విబ్రియోనిక్స్ గురించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానించారు. నూతన సంవత్సరంలో ధన్వంతరి హాల్  లో  జరగబోవు ఈ కార్యక్రమం యొక్క ఎజెండా డిసెంబర్ 31, 2016 న స్వామి వారి పద పద్మముల దగ్గర ఉంచగా, వెంటనే ఆ రెండు కాగితములు విభూతితో నిండిపోయినవి - నిజంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి యొక్క నూతన సాంప్రదాయేతర వైద్య విధాన అనుసంధాన ప్రక్రియకు ఇది ఒక అద్భుత దైవ ఆశీర్వాదము!

SSSIHMS యొక్క డైరెక్టర్ మరియు సూపరింటెండెంట్, ఇద్దరు కూడా సాంప్రదాయేతర వైద్య విధానం యొక్క ప్రాముఖ్యతను మరియు స్వామి యొక్క వైద్య సేవా రంగంలో దీనిని భాగంగా చేయడం యొక్క ఆవశ్యకతను గురించి చాల సేపు మాట్లాడారు. సాయి విబ్రియోనిక్స్ తో పాటు మూడు ఇతర సంపూర్ణ వైద్య విధానాలైన తాచిన్, యాక్సిస్ బార్స్ మరియు అక్యూప్రెస్సుర్ గురించి కూడా ప్రదర్శన ఇవ్వబడింది. వీలైనంత తొందర్లో లో ఒక వెల్నెస్ క్లినిక్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. జనవరి 19, 2017 న SSSIHMS ప్రారంభోత్సవ వార్షికోత్సవ సందర్బంగా వెల్నెస్ క్లినిక్ యొక్క బ్రోచర్ ను సెంట్రల్ ట్రస్ట్ సెక్రటరీ సభ్యుడు విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక వైద్య ఆరోగ్య శాఖా మంత్రి, సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు మరియు ఇతర ప్రముఖులు విచ్చేసారు.

సాయి విబ్రియోనిక్స్ చరిత్రలో  ఫిబ్రవరి 23, 2017 ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ఎందుకనగా ఆ రోజు, SSSIHMS వైట్ ఫీల్డ్ లో, విబ్రియో క్లినిక్ అధికారికంగా వెల్నెస్ సెంటర్ లో ఓక బాగంగా ప్రారంభించబడింది. పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినాన ఓపిడి విభాగంలో హాస్పిటల్ డైరెక్టర్ చే ఘనంగా విబ్రియో క్లినిక్ ప్రారంభించబడింది. విబ్రియోనిక్స్ పట్ల ప్రజల ఆసక్తి ఎంత గొప్పగా ఉందంటే, విబ్రియో వైద్య సేవలు మూడు రోజుల తరువాత మొదలు కావాల్సిఉంటే ఆ రోజు ఉదయమే అయిదు మంది విబ్రియో చికిత్స తీసుకొన్నారు. నిజంగా స్వామి యొక్క పరమాద్బుత కృప మరియు ఆశీర్వాదం !

 

3. వీపి రిఫ్రెషర్ వర్క్ షాప్ మరియు అవేర్నెస్ సెమినార్, నాగపూర్

ప్రస్తుత అభ్యాసకులకు మరింత శిక్షణ మరియు విబ్రియోనిక్స్ లోని నూతన సమర్థ వైద్య సేవా విధానాలను వారికి పరిచయం చేయుటకు రిఫ్రెషర్ వర్క్ షాప్ మరియు అవేర్నెస్ సెమినార్, మహారాష్ట్ర రాష్ట్రంలోని నాగపూర్ లో జరిగింది. కొన్ని నెలల కఠిన శ్రమతో VT10375 మరియు నాగపూర్ కోఆర్డినేటర్ SVP10228 ఈ సెమినార్ను నిర్వహించారు. ఎప్పుడూ కరెస్పాండెన్స్ కోర్సు చేయని వారు ఈ ఆన్లైన్ కోర్సులో  మనస్ఫూర్తిగా ఉత్సాహంగా పాల్గొన్నారు. కంప్యూటర్ వాడడంలో అవగాహన లేని వారు మాన్యువల్  కోర్సులో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసారు. 29 మంది ఉత్సాహవంతులైన అభ్యాసకులు ( 14 AVPs & 15VPs )పాల్గొన్న ఈ రెండు రోజుల కార్యక్రమం VT10375 మరియు SVP10001  వారిచే విజయవంతంగా నిర్వహించబడింది. అంతే కాకుండా  సాయి విబ్రియోనిక్స్ సేవను చేయుటకు ఆసక్తి గా ఉన్న మంది వ్యక్తులు, ఫిబ్రవరి 18-19, 2017లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విబ్రియోనిక్స్ యొక్క పరిచయం, రోగుల రికార్డ్స్ యొక్క ఆవశ్యకతను, రోగ చరిత్రలను రాయడం. విబ్రియోనిక్స్ లోని నూతన పంధాలను మరియు విబ్రియోనిక్స్ ను చక్కగా, సమర్థవంతంగా చేయడానికి అవసరమైన చిట్కాలను ఈ కోర్సులో భాగంగా నేర్పించారు. ఈ కోర్సుకు హాజరైన వారు, 21 కేటగిరిల  108 సీసీ బాక్సు గురించి, అది ఉపయోగించడానికి అవసరమైన ప్రాథమిక అనాటమిని, ప్రాక్టికల్ కోణంలో తెలుసుకొన్నారు.      

అభ్యాసకులందరు పరీక్ష రాసి, చక్కగా ఉతీర్ణులవడంతో ఈ కోర్సు ముగిసింది. తరువాత అందరు దేవునికి చేసిన వాగ్దానం తిరిగి జ్ఞప్తికి తెచ్చుకొని మరలా వాగ్దానం చేసారు. ముగింపు కార్యక్రమంలో డా. అగర్వాల్, టెలి సదస్సు ద్వారా సభికులందరితోను మాట్లాడి వారి ప్రశ్నలు, సందేహాలను తీర్చి చాల సంతోషం కలిగించారు. ² రోగనివారణ, స్వస్థత కలిగించేది స్వామేనని మనమంతా కేవలం అయన యొక్క ఎంపిక కాబడ్డ పనిముట్లు ² అన్న సత్యాన్ని ఎల్లపుడు గుర్తుంచుకోవాలన్న ముఖ్యమైన సందేశంతో ఆ సదస్సు విజయవంతంగా ముగిసింది.   

4. విబ్రియో అభ్యాసకులు సాధనా శిబిరం, కేరళ  

కేరళ లోని విబ్రియో అభ్యాసకులు, నూతన సంవత్సర శుభ దినాన, వైద్య విభాగ రాష్ట్ర కోఆర్డినేటర్ మరియు కేరళ ట్రస్ట్ వారి షోరనూర్ సాయి హాస్పిటల్ సంరక్షకులైన డా. ఆనందమోహన్ గారిచే ప్రధమ సాధనా శిబిరాన్ని నిర్వహించారు. వారు మంది విబ్రియో అభ్యాసకులకు వారి విబ్రియో వైద్య సేవలో  ఆధ్యాత్మికత మరియు వ్యక్తిగత సాధన యొక్క ప్రాముఖ్యాన్ని వివరించారు. స్వస్థత అనేది మనిషికి సంబంధించిందని కానీ నయమవ్వడం అనేది రోగమునకు సంబంధించిందని చెప్పారు. పరిపూర్ణ స్వస్థత కలగాలి అంటే ఆధ్యాత్మిక దృక్పధం కూడా ఉండాలి అని చెప్పారు. తన యొక్క వ్యక్తిగత ఆధ్యాత్మికత వికాసానికి ప్రతి అభ్యాసకుడు తానే బాధ్యత వహించాలని చెప్పారు. విబ్రియోనిక్స్ చికిత్స విధానం స్వయానా భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారిచే ప్రారంభించబడి ఆశీర్వదించబడింది. అందువలన ఇది అత్యంత పవిత్రమైంది మరియు శుభప్రదమైంది. కావున ప్రతి ఒక్కరు స్వామి యొక్క దివ్య హస్తాలలో పవిత్రమైన, ప్రేమతో నిండిన ఒక అద్భుత పనిముట్టుగా ఉండటానికి ప్రయత్నించాలి. తద్వారా విబ్రియో రెమెడీల స్వస్థతా  సామర్ధ్యాన్ని పెంచుకోవాలి. మనం మన యొక్క రోజువారీ జీవితం ఆధ్యాత్మికతో నిండటానికి శక్తివంచన లేకుండా ప్రయత్నించాలి. దీని ద్వారా మనకే కాకుండా సహాయo, కోసం మన దగ్గరకు వచ్చే వారికీ కూడా ఎంతో మేలు జరుగుతుంది. వారు క్రింది విషయాల గురించి విపులంగా చర్చించారు.  

  1. శరీరం-మనసు-ఆత్మ యొక్క సంబంధం మరియు ఆరోగ్యం పై వాటి ప్రభావం : ఆధ్యాత్మికంగా మనం ఈ చరాచర విశ్వంతోను మరియు అందరిలోనున్న దివ్య వైద్యుడైన ఆ భగవంతునితోను ముడిపడి ఉన్నాము. సర్వాంతర్యామి సర్వవ్యాపి అయిన ఆ దివ్య వైద్యుడే మన ఆరోగ్యానికి ఆరోగ్య సంరక్షణకు మూల కేంద్రం. శరీరం-మనసు-ఆత్మ ను అనుసంధానం చేస్తూ సంతుల్యతతో జీవిస్తూ కౌన్సిలింగ్ ద్వారా మనం ఆ దివ్య వైద్యుడితో సంబంధం పెట్టుకోవచ్చు.
  2. సమగ్ర పరిపూర్ణ చికిత్స విధానంగా ఆధ్యాత్మిక సంరక్షణ: దీనిని ప్రతి రోగికి అందించవచ్చు  అయిదు మానవతా విలువలను నిత్య జీవితంలో ఆచరించడాన్ని ప్రోత్సహించడం ద్వారా ఆత్మశోధన ద్వారా ఈ విధానం ప్రశాంతమైన మనసును మరియు ఆహ్లాదకరమైన శరీరాన్ని అందిస్తుంది. అందువలన మనిషి యొక్క ఆలోచన దృక్పధం మారి ఆ వ్యక్తి ఉన్నత చేతనావస్థకు మరియు విస్తృత అవగాహనా ఎరుకకు చేరుకోగలడు.           
  3. ఉపశమన చికిత్సలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యం: ఆధ్యాత్మిక జీవన సరళి ప్రతి ఒక్కరికి రోగముల భారమును తగ్గిస్తుంది, ముఖ్యంగా నయం చేయలేని వ్యాధి ఉన్నవారికి, ప్రాణాంతకములైన వ్యాధి ఉన్నవారికి, తీవ్రమైన రోగంతో బాధ పడే వారికీ, అవసాన దశలో ఉన్నవారికి. భగవాన్ బాబా యొక్క బోధనలు, ఉపదేశానుసారం ఒక స్పష్టమైన ఆధ్యాత్మిక పరమార్థం ప్రతి ఒక్క హెల్త్ ప్రాక్టీషనర్, తాను ఏ విభాగానికి చెందిన వాడైనా (అల్లోపతి, ఆయుర్వేద, హోమియోపతి లేదా వేరే ఏ విభాగమైన)  తప్పకుండా తెలుసుకోవాలి.
  4. రోగ నివారణా వైద్య విధానంలో భాగంగా ఆధ్యాత్మిక సంరక్షణ:  రోగముల నివారణకై ఆరోగ్యకరమైన మనసు అవసరం మరియు ఆధ్యాత్మిక విజ్ఞానం అటువంటి మనసుకు పునాది వంటిది. ఆధ్యాత్మికత వలన కలిగిన మనోశక్తి మన శరీరం యొక్క రోగనిరోధక వ్యవస్థను పెంపొందిస్తుంది మరియు బలోపేతం చేస్తుంది. బలమైన రోగ నిరోధక వ్యవస్థ చక్కటి ఆరోగ్యమును ప్రసాదిస్తుంది మరియు అన్ని రోగ నివారణా వైద్య విధానాల సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది.   

అంతకు ముందుగా చైర్మన్ ( రాష్ట్ర విబ్రియో కోఆర్డినేటర్ కూడా 02090) తన ప్రారంభ ఉపన్యాసంలో సాధన మీద స్వామి ఉపదేశాలను ఉదహరిస్తూ మన యొక్క మనసు మరియు బుద్ది ఎల్లప్పుడూ పవిత్రమైన ఆలోచనలతో మరియు నిస్వార్థమైన ప్రేమతో నిండి ఉండాలని చెప్పారు. ఇందువలన అభ్యసకులు తమ యొక్క స్వస్థతా కార్యక్రమాన్ని మరింత ప్రభావవంతంగా చేయగలుగుతారు.  కార్యక్రమం యొక్క ముగింపు ఉపన్యాసంలో డా. అగర్వాల్ గారు మాట్లాడుతూ విబ్రియోనిక్స్ యొక్క నూతన పరిణామాల గురించి విశదీకరించారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు అభినందించారు. చివరగా పాలొగొన్న వారందరూ తాము నేర్చుకున్న దానికి ఎంతో సంతోషించి, భవిష్యతులో ఇటువంటి సాధనా క్యాంపులు మరిన్ని జరగాలని అభిలషించారు. 

 

 

Om Sai Ram