Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

డా.జిత్. కే అగ్గర్వాల్ యొక్క మాటల్లో

Vol 8 సంచిక 1
January/February 2017


ప్రియమైన విబ్రియో అభ్యాసకులరా,

ముందుగా మీ అందరికీ ప్రమోద భరితమైన ఈ 2017 నూతన సంవత్సర శుభాకాంక్షలు.

ఈ నూతన సంవత్సరం మనందరి జీవితములలో  అన్ని రంగాల లోనూ సమృద్ధి కరమైన ఆనంద ప్రదాయి గా ఉండాలని మన ప్రియ భగవానుని హృదయ పూర్వకంగా ప్రార్ధిస్తున్నాను.  గడచిన 2016 సంవత్సరాన్నిఅన్ని విషయాలలో విజయ వంతమైనట్టిది గా మలచిన మన మార్గదర్శి భగవాన్ బాబాకు ఒక్క క్షణం మన  హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలుపుకుందాం. ఈ సందర్భంగా  గడచిన సంవత్సర విషయాలను మీతో ఇలా పంచుకోవడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.

మీతో మరో ఆనందదాయకమైన విషయం పంచుకోబోతున్నాను.ఈ  2016 సంవత్సరం లో మనకు అందిన అనేక ఆశ్చర్యకరమైన కేస్ హిస్టరీల ద్వారా విబ్రో విధానం పట్ల ప్రాక్టిషనర్ ల అంకిత భావం, వారి తపన ప్రస్పుటం గా కనిపిస్తోంది.

           స్వామి పదే పదే చెపుతూ ఉంటారు. ప్రేమకు హద్దులు లేవని. కనుక మనం ఈ దివ్య నియమానికి కట్టుబడి అందరం ఒకటే అనే ఉదాత్త భావనతోనే కలసి పనిచేస్తూ 2017 సంవత్సరాన్ని మరపురానిదిగా చేద్దాం. ఈ సంవత్సరం మొక్కలు, జంతువుల పైన  పరిశోధన చేయుటకు వాటి అవసరాలు కనుగొనుటకు అంకిత భావం కల ఒక పరిశోధనా టీం ను రూపొందించాలని ఆలోచన ఉన్నది. మన లక్ష్యం ఏమిటంటే మొక్కలు,జంతువులకు కావలసిన ఒక సమగ్రమైన వైద్య విధానము అందుబాటులోనికి తీసుకొని రావడం. ఈ 2016 సంవత్సరం లో చేపట్టిన మెంటర్ ప్రోగ్రాం ను మరింత పటిష్ట పరుస్తూనే డిజిటల్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ వ్యవస్థ ను అందుబాటులోనికి తీసుకురావాలని ఆలోచన ఉంది. చాలామంది ప్రాక్టిషనర్ లు మానవ మనుగడ, జీవన విధానము గూర్చిన అంశాలను తిరిగి ప్రవేశ పెట్టాలని ఎందు కంటే రోగుల సమస్యలు తెలుసుకొనడానికి ఇది తమకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయం వెలిబుచ్చారు. ఈ  సంవత్సరంలో ఈ వార్తా లేఖతో పాటు నిరంతర విద్యలో భాగంగా మానవ వ్యవహార శైలి ఆరోగ్యము అనే ఉప శీర్షిక ప్రారంభింపబడింది. ఈ శీర్షిక లో మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఉపవాసము అనే విషయం పై చక్కటి వివరణ ఇవ్వబడింది. ఈ సంచిక లో జపాన్ దేశానికీ చెందిన జీవకణ శాస్త్రవేత్త, శరీరనిర్మాణ శాస్త్రము మరియు వైద్య శాస్త్రానికి  గానూ 2016 సంవత్సరపు నోబెల్ బహుమతి గ్రహీత ఐన డాక్టర్ యోషినోరి ఓషుమి స్వీయభక్షక నిర్మాణాలు  ఆటోఫాజి విధానముల పై వారి పరిశోధనా వ్యాసం ఇవ్వబడింది

ఇంత గా  ఔత్సాహకర వాతావరణం ఉన్నందువల్ల  ప్రాక్టి షనర్ లు ఇంకా మన విబ్రో విధానం లో జరుగుతున్న పరిశోదనలు, కొంగ్రొత్త పోకడలను గూర్చి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ దిశ లో మేము సహృదయులకూ ,నైపుణ్యంతో కూడిన వ్యక్తులకూ ,సేవాద్రుక్పధం కలిగిన వారికీ పురోగమన దిశలో ఉన్న మా విబ్రియో కుటుంబం లోకి హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. స్వామి తమ అపార అనుగ్రహంతో మనకిచ్చిన అరుదైన వరమైనట్టి సాయి విబ్రియోను  ఆత్మ విశ్వాసంతో ముందుకు తీసుకొని వెళ్ళడానికి మరింత విస్త్రుతంగామానవాళికి సేవలందించే భాగ్యం మనందరికి స్వామి ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ

మీ అందరికి ప్రేమను మరియు కాంతిని  ప్రసరిస్తూ,

ప్రేమపూర్వకంగా సాయి సేవలో,

జిత్ కే అగ్గర్వాల్