Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్న జవాబులు

Vol 7 సంచిక 5
September/October 2016


1. ప్రశ్న: వైబ్రో మందులను తీసుకుంటున్న సమయంలో నీరు అధికంగా తాగడం యొక్క ముఖ్యత్వం ఏమిటి?

    జవాబు: ప్రతి రోజు, రోజుకి రెండు నుండి మూడు లీటర్ల స్వచ్ఛమైన నీరు తాగవలసిందిగా రోగులకు సలహా ఇవ్వబడుతుంది. భౌతిక స్థాయిలో, వైబ్రియానిక్స్ మందుల ద్వారా శరీర అవయవాలలో ఉన్న విష పదార్థాలు రక్తంలో కలుస్తాయి. ఈ విషపదార్థాలు నీటి సహాయంతో శరీరం నుండి తొలగించబడతాయి. నీరు అధికంగా తాగడం ద్వారా వ్యాధి వేగంగా నయమవుతుంది. నీరు అనేక పుష్టికారులను అందించడమే కాకుండా శరీరంలో జరిగే జీవక్రియను వేగవంతం చేస్తుంది. నీరు తక్కువగా తాగినప్పుడు  నిర్జలీకరణము ఏర్పడి శరీరం యొక్క పనితీరు క్షీణిస్తుంది. శరీరంలో కేవలం 1.5% నీటి నష్టం ఏర్పడడం కారణంగా (ఉదాహరణకు తీవ్ర వ్యాయాయం చేసిన సందర్భంలో లేదా ఉష్ణమైన వాతారణం కారణంగా) శరీర ఉష్ణోగ్రతలో మార్పు ఏర్పడడం, ఉత్సాహం మరియు ఏకాగ్రత తగ్గిపోవడం, తలనొప్పి, ఆతృత కలగడం, నీరసం మరియు జ్ఞ్యాపక శక్తి క్షీణించడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

నీరు అధికంగా తాగడం ద్వారా మలబద్ధకం, క్యాన్సర్, మూత్రపిండాల్లో రాళ్లు వంటి అనేక వ్యాధి సమస్యలు నయమయ్యే అవకాశం ఉంది. భోజనం చేయడానికి అరగంట ముందు నీరు తాగడం ద్వారా మనము తీసుకొనే క్యాలరీల మొత్తం తగ్గుతుంది. ముఖ్యంగా ఇది వృద్ధులకు మరియు బరువు అధికంగా (ఒబీస్) ఉన్న వ్యక్తులకు సహాయపడుతుంది.

_____________________________________

2. ప్రశ్న: త్రాగునీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు వైబ్రియానిక్స్ ను విధంగా ఉపయోగించవచ్చు?

    జవాబు: స్ట్రక్టర్డ్ (నిర్మితి) నీరు ఉత్తమ నాణ్యతగల త్రాగునీరు. AVP పుస్తకం లో స్ట్రక్టర్డ్ నీరు తయారీ విధానం ఇవ్వబడింది. నీటి నాణ్యతను మెరుగుపర్చేందుకు స్వచ్ఛమైన నీటిలో క్రింది కాంబోలను చేర్చవచ్చు: NM12 Combination-12 + SR360 VIBGYOR లేదా ను CC12.1 Adult tonic ను చేర్చండి.

_____________________________________

3. ప్రశ్నకాలిన గాయములు ఉన్న ఒక బిడ్డకు విధముగా చికిత్సను ఇవ్వవలెను?

   జవాబు: కాలిన గాయములకు బిడ్డలకైనా లేక పెద్దలకైనా ఒకే విధమైన చికిత్స ఇవ్వబడుతుంది. తక్షణ ఉపశమనం కొరకు SR346 Cantharis 6X తరచుగా ఇవ్వవలెను మరియు పై పూత ముందుగా నీటిలో 1X పొటెన్సీ లో ఇవ్వవలెను. కాన్తరిస్ క్రీమును (హోమియో దుకాణంలో లభిస్తుంది) అవసరమైన సమయంలో వెంటనే ఉపయోగించే విధముగా ఇంటిలో సిద్ధముగా ఉంచుకుంటే మంచిది.

పైన ఇవ్వబడిన మందు లేదా క్రీము అందుబాటులో లేకపోతే మీరు ముందుగా కాలిన ప్రాంతాన్ని చల్లబర్చడం అవసరం; ఈ విధంగా చేయడం ద్వారా చర్మ ఉష్ణోగ్రత తగ్గి గాయం మరింత తీవ్రమవ్వకుండా ఉండేందుకు సహాయపడుతుంది. కుళాయి నుండి వచ్చే చల్లటి నీటి క్రింద బాధిత ప్రాంతాన్ని ఉంచవలెను లేక బాధిత ప్రాంతమును చల్లటి నీరు పోసిన ఒక గిన్నెలో ఉంచవలెను. ఇటువంటి సందర్భాల్లో ఐస్ నీటిని ఉపగోయిస్తే కణజాలం శిధిలమయ్యే అవకాశం ఉంటుంది. బొబ్బలుంటే వాటిని పగులకొట్ట రాదు. క్రింది మిశ్రమాన్ని ఉపయోగించవలెను.           

CC10.1 Emergencies + CC15.1 Mental & Emotional tonic + CC18.5 Neuralgia + CC20.1 SMJ tonic + CC21.1 Skin tonic + CC21.4 Stings & Bites + CC21.11 Wounds & Abrasions…6TD

    ఒక జపాన్ చికిత్సా నిపుణులు, అత్యంత ప్రభావవంతమైన సహజ వైద్య పదార్థాల్లో ఒకటైన లోకట చెట్టు యొక్క ఆకుల నుండి తయారు చేసిన ద్రవరూపకమైన యౌషధమును ఉపయోగిస్తున్నారు. ఈ ఔషధమును బాధిత చర్మం పై స్ప్రే (చల్లటం) చేయవచ్చు  లేదా తేలికగా రాయవచ్చు.

_____________________________________

4. ప్రశ్నఉప్పు మరియు వినెగర్ ను (ద్రాక్షరసం పులుసు) ఉపయోగించి హెర్బిసైడ్లను, రసాయన ఎరువులు మరియు పురుగుమందుల యొక్క జాడలను కృత్రిమంగా పెరిగిన కూరగాయలు మరియు పండ్లు నుండి తొలగించవచ్చని AVP /SVP పుస్తకం ద్వారా నేను తెలుసుకున్నాను. ఇదే పనిని  వైబ్రియానిక్స్ ద్వారా చేయవచ్చా?

    జవాబు: ఉప్పు మరియు వినెగర్లో కూరగాయలను మరియు పండ్లను నానపెట్టి శుభ్రపరచడం చాలా మంచి పద్దతి.  అయితే ఈ విధానం యొక్క సమర్థతను మరింత పెంచేందుకు NM46 Allergy-2 + SM1 Removal of Entities + SR324 X-ray (108CCలో ఉండే మిశ్రమం:  CC17.2 Cleansing). ఈ విధంగా శుభ్రపర్చబడిన కూరగాయలు మరియు పండ్లు యొక్క సహజమైన రుచిని చూసి మీరు ఆశ్చర్య పోతారు. వేసవికాలంలో, నీటిలో కొన్ని ఐసు ముక్కలను వేయడం మంచిది. అయితే వరి మరియు అవకాడోలు వంటివి శుభ్రం చేసే సమయంలో వినెగర్ ను చేర్చవద్దు.

_____________________________________

5. ప్రశ్నకీళ్ల శైథిల్యం కారణంగా కలిగే దీర్ఘకాలిక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న అనేక వృద్ధులకు నేను వైబ్రో చికిత్సను అందజేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో వైబ్రో మందుల ద్వారా ఉపశమనం కలగడం లేదు. ఇటువంటి సందర్భాల్లో నేను వారికి ఏ విధముగా సహాయపడవచ్చు?

    జవాబు: ఈ సాధారణ సమస్యకు మూల కారణం మృదులాస్థి (ఎముకల మధ్యలో ఉన్న కుషన్ (పరిపుష్టి)) అరిగిపోయి ఆస్టియో ఆర్త్రైటిస్ వ్యాధికి దారి తీస్తుంది. మీరు క్రింది మిశ్రమాన్ని ఇస్తున్నారని నమ్ముతున్నాము: CC20.2 SMJ pain + CC20.3 Arthritis + CC20.4 Muscles & Supportive tissue. గోలీల రూపంలో ఇవ్వడంతో పాటు ఈ మిశ్రమాన్ని ఆవధం, పల్లీల నూనె, నల్ల జీలకర్ర నూనెలను కలిపిన మిశ్రమంలో చేర్చి నొప్పిగా ఉన్న ప్రాంతం పై మస్సాజ్ (మర్దనం) చేయవలెను. వేడి నీటిలో స్నానం చేసిన తర్వాత ఈ విధముగా చేస్తే ఇంకా మంచిది. రుతువిరతి దశలో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గుతున్న కారణంగా పైన ఇవ్వబడిన మిశ్రమంలో SR513 Oestrogen (CC8.1 లో చేర్చబడింది) చేర్చడం సహాయకరంగా ఉంటుంది.  

అధిక శరీర బరువు యొక్క ప్రభావం కీళ్లు మరియు మోకాళ్ళ పై పడుతుంది కాబట్టి ఇటువంటి రోగులు శరీర బరువును అదుపులో ఉంచుకోవడం మంచిది. శరీర బరువు ఒక పవుండు పెరిగితే ఆస్టియో ఆర్త్రైటిస్ వ్యాధి ఉన్న రోగులలో కీళ్ల పై ఒత్తిడి నాలుగు పవుండ్లు పెరుగుతుందని ఒక కొత్త అధ్యయనం చెబుతున్నది. మెట్ల పై ఎక్కి దిగడం ద్వారా ఇటువంటి రోగులలో కీళ్ల పై ఒత్తిడి ఎనిమిది రెట్లు పెరిగే అవకాశం ఉంది.

అందువలన శరీర బరువును తగ్గించుకోవడం ద్వారా కీళ్లపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. తద్వారా మోకాళ్ళ నొప్పి తగ్గడమే కాకుండా కీళ్లు మరింత అరిగిపోకుండా సంరక్షించు కోవచ్చు.

క్రమమైన వ్యాయాయం మోకాళ్ళ నొప్పి నిర్వహణలో మరో ముఖ్యమైన అంశం. నొప్పి కలిగే అవకాశముందని తలచి ఆస్టియో ఆర్త్రైటిస్ రోగులు వ్యాయాయం మానేసే అవకాశం ఉంది. అయితే ఈత, నడక లేదా సైక్లింగ్ వంటి తేలికైన వ్యాయామాల ద్వారా చలనశక్తి మరియు బలం పెరుగుతాయి. తేలికైన బరువులను ఎత్తే వ్యాయామాలను చేయడం ద్వారా క్వాడ్రిసెప్స్ (తొడలోని స్నాయువు-మాంసపుకండ) బలపడి మోకాళ్ళ నొప్పి తగ్గే అవకాశం ఉంది.