Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

జవాబుల విభాగం

Vol 6 సంచిక 3
May/June 2015


1.  ప్రశ్న: నేను నెలవారీ నివేదికలు క్రమంతప్పకుండా పంపిస్తున్నాను కాని ప్రతి నెల నా రికార్డు పుస్తకం నుండి నేను సేవ చేసిన సమయం మరియు నేను చికిత్స ఇచ్చిన రోగుల సంఖ్య లెక్కపెట్టడానికి సమయం చాలా ఎక్కువ తీసుకుంటున్నాను.ఇది సులభంగా తక్కువ సమయంలో చేయడానికి మార్గమేదైన ఉంటె చెప్పాలని కోరుకుంటున్నాను.

     జవాబు: క్రింద పట్టికలో ఇచ్చిన విధముగా నిలువుగా టైటిల్స్ తో పాటు ఆరు భాగాలు చేసుకోండి:

తేది           సేవ చేసిన సమయం (గంటల్లో)    కొత్త పేషంట్లు     పాత పేషంట్లు      జంతువులు      మొక్కలు
1.4.15                             2.5                     1                       3                   1                 6
3.4.15                             0.5                    0                       1                    0                 6
.........                            ........                .......                 .......                .......         .......
30.4.15                           3.5                    2                       1                    0                 3
Total                               31                   24                     15                   5                99

పై ఉదాహరణలో చూపిన విధంగా ప్రతి సమావేశం పూర్తైన తర్వాత తగిన సంఖ్యలు రికార్డు పుస్తకంలో నమోదు చేసుకోవాలి. ప్రతి నెల చివరిలో మీరు కేవలం మీ నెలవారీ నివేదికలో ఐదు నిలువ వరుసలలో ఉన్న సంఖ్యలను జోడించి మొత్తాన్నిరాయాలి.ఇలా చేస్తే మీకు నెలవారీ నివేదికను రాయడం చాలా సులభమవుతుంది.

________________________________________

 2.  ప్రశ్న: కొన్నిసార్లు వై బ్రో మందుల ద్వారా నొప్పినుండి ఉపశమనం కలుగడం లేదు.ఇలాంటప్పుడు ఏమిచేయాలో చెప్తారా?     

జవాబు: డైక్లో ఫెనాక్ వంటి బలమైన అల్లోపతి పెయిన్ కిల్లర్ల నోసోడ్స్ తయారు చేసి ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు లభించ్చాయి. కాని కొంత మంది పేషంట్లకు అసలైన అల్లోపతి పైన్కిల్లర్ని కూడా వీటితో పాటు తీసుకొవలిసివచ్చింది. క్రమంగా అల్లోపతి పయిన్ కిల్లర్ మోతాదుని తగ్గించి ఆపై పూర్తిగా మానేశారు.అదనంగా రోగంపైనున్న దృక్పధాన్ని మార్చుకోమని మీ పేషంట్లకు మీరు సలహా ఇవ్వాలి. ఉదాహరణకు పేషంటు తనకున్న నొప్పి తగ్గుతున్నట్లు ఊహించుకోవడం మరియు  రోగంపై కాకుండా ఆశక్తికరమైన కార్యకలాపాలుమీద తన ద్రిష్టిని మళ్ళించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మీరు సలహా ఇవ్వాలి. అంతే కాకుండా " నాకు నొప్పి లేదు,నేను భగవంతుడి దయతో ఆరోగ్యంగా ఉన్నాను" వంటి సానుకూలమైన నిర్ణయాలను మళ్ళి మళ్ళి చెప్పుకోమని మీరు పేషంట్లను ప్రోత్సాహించాలి.

________________________________________

3.  ప్రశ్న: పేషంట్లు నోసోడ్తో పాటు ఇతర వై బ్రో మందుల్ని కూడా తీసుకోవడం కొనసాగించవచ్చా?

      జవాబు: నోసోడ్ తీసుకుంటున్న ఒక పేషంటుకు కేవలం నోసోడ్ మాత్రమే ఇవ్వడం శ్రేష్టం. కొన్ని ప్రత్యేక సందర్భాలలో, నోసోడ్ తొ పాటు ఇతర వైబ్రేషన్లు ఇవ్వవచ్చు కాని కేసుకి తగిన చికిత్స అందించడం చాలా ప్రధానం. మీరు [email protected] వద్ద మీ ప్రశ్నలను పంపితే మా పరిశోధన టీంలో ఉన్న నిపుణుల సలహాలని పొందవచ్చు.

________________________________________

4.  ప్రశ్నరాగి లేదా వెండి పాత్రల్లో ఉంచిన నీరు త్రాగే పేషంట్లు వైబ్రో మందుల్ని తీసుకోవచ్చా?

      జవాబురాగి లేదా వెండి పాత్రల్లో ఉంచిన నీరు త్రాగడం ఆరోగ్యానికి లాభదాయకం మరియు అలాంటి నీరు వై బ్రెషన్లను తటస్తం చేయదన్న శుభావార్తని తెలుపుకుంటున్నాను. వైబ్రో మందుల్ని విడిగా ఉంచాలి. వీటిని లోహపు పాత్రల్లో తయారు చేయడంకాని లేదా ఉంచడంకాని చేయరాదు.

________________________________________

5.  ప్రశ్న: మందు సీసా పైన అతికించే పట్టీ మీద రోగం యొక్క పేరును రాయరాదని నాకు ఇటీవల తెలిసింది.పట్టి మీద రాసే సరియైన విధం ఏమిటో చెప్పమని కోరుకుంటున్నాను.

     జవాబు: మొదటి సందర్శన సమయంలో ప్రతి పేషంటుకు ఒక ప్రస్తావన సంఖ్యను కేటాయించాలి.ఈ సంఖ్యను సీసా పట్టీ మీద వ్రాయవచ్చు.రికార్డుల సంఖ్యలు క్రమంలో ఉంచితే పేషంటు యొక్క తదుపరి సందర్శనలో రోగియొక్క పూర్తి రికార్డును చూడడం సులభంగా ఉంటుంది. సీసా పట్టి మీద రోగం యొక్క పేరుని లేదా రోగ లక్షణాలని వ్రాయరాదని గుర్తుంచుకోవాలి.ఒక పేషంటుకి రెండు లేదా మూడు సీసాలు ఇస్తున్నప్పుడు పట్టీల మీద "శాంతి","ఆరోగ్యం"లాంటి రోగి సమస్యకి తగిన సానుకూల పదాలు వ్రాయడం మంచిది. ఒకే కుటుంభానికి చెందిన వ్యక్తులకు చికిత్సనందిస్తుంటే పేషంటు యొక్క పేరులో మొదటి అక్షరాన్ని సీసా పట్టీ మీద వ్రాయవచ్చు.

________________________________________

6.  ప్రశ్న: వైబ్రియానిక్స్ పుస్తకంలో పేషంట్లు రోజుకి 8 నుండి 12 కప్పులు నీరు త్రాగాలని చెప్పబడియుంది. ఒక పేషంటుకు గర్భాశయ ఫైబ్రాయిడ్లు సమస్య వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరిగి మూత్ర విసర్జన ఇబ్భందికరంగా ఉండేది.ఎక్కువ నీరు త్రాగడం వలన ఆమె సమస్య మరింత తీవ్రమైందని నాతో చెప్పింది. మరి కొందరు పేషంట్లు రోజుకి 8 నుండి12 కప్పులు త్రాగాలన్న సిఫారసును కచ్చితంగా అనుసరించాల్సి ఉందాయని అడుగుతున్నారు.నేను వారికి వీలైనంత వరకు నీరు త్రాగితే చాలని చెప్పవచ్చా?     

జవాబు: రోగిని గుణపరచడానికి రోగి శరీరంలో ఉన్న విషపదార్థాల తొలగింపు ఎంతో అవసరం.ఇది నీరు ఎక్కువగా త్రాగడం వల్ల సులభంగా సాధ్యమవుతుంది. అధికంగా నీరు త్రాగడం వల్ల మరో ఉపయోగముంది.అదేమిటంటే వైబ్రో మందులు తీసుకుంటున్నప్పుడు ఒక వేళ పేషంటుకు పుల్ అవుట సంభవిస్తే అధికంగా నీరు త్రాగడం వల్ల విషపదార్థాల తొలగింపు వేగంగా జరిగి ఒక సులభమైన పుల్ అవుట కి దారి తీస్తుంది. పేషంట్లకు వాళ్ళు సాధారణంగా త్రాగే నీటికన్నా కొంచం ఎక్కువ నీరు త్రాగమని మృదువుగా చెప్పండి. తక్కువ నీరు త్రాగి నేరం చేస్తున్నానన్న భావన పెషంట్లో కలుగ నివ్వదు.

________________________________________

7.  ప్రశ్నఉధ్యొగస్థులైన పేషంట్లకు మధ్యాహ్నం డోస్ తీసుకోవడం వీలు పడటలేదు. వాళ్ళు తమ ఆఫీసులలో కంప్యుటర్ మరియు మోబాయిల్ ఫోన్లనుండి వచ్చే కిరణ ప్రసారం వల్ల వైబ్రో మందుల్ని ఆఫీసులకు తీసుకు వెళ్ళడానికి ఇష్ట పడట్లేదు. దీనికి ఏదైనా పరిష్కారం ఉందా

      జవాబు: వికిరణం నుండి మందుల్ని రక్షించడానికి ఒకటి లేదా రెండు పిల్ల్స్ ను ఒక చిన్న కాగితంలో చుట్టి ఆఫీసుకు తీసుకు వెళ్ళచ్చు. ఒక వేళ మీరు మందపాటి రేకు రాపర్ ఉపయోగిస్తే, ఆ రాపర్ పిల్ల్స్ కు తగలకుండా ఉంచాలి.