Sai Vibrionics Newsletter

" Whenever you see a sick person, a dispirited, disconsolate or diseased person, there is your field of seva. " Sri Sathya Sai Baba
Hands Reaching Out

ప్రశ్నలు సమాధానాలు

Vol 6 సంచిక 2
March/April 2015


1.  ప్రశ్న: కొందరు పేషంట్లు రెమిడి లను నీటిలో కలుపుకొని అలా చార్జ్ అయిన నీటిని పగటిపూట తాగడం అనుకూలంగా ఉందని చెపుతున్నారు. ఐతే ఈ డోసేజ్ 6TD ఐనట్లయితే  పేషంటు దీనికన్నా ఎక్కువగా తీసుకోవడం వలన దైనా సమస్యగా మారడం లేదా పుల్లౌట్ రావడం వంటివి ఏవైనా జరుగుతాయా ?

సమాధానంఏ రెమిడి ఐనా చెప్పిన మోతాదులో క్రమశిక్షణతో తీసుకుంటేనే బాగా పనిచేస్తుంది. ప్రతీ సందర్భంలోనూ కాకపోయినా ఒక్కొక్కసారి అధిక మోతాదులో రెమిడి తీసుకున్నపుడు పుల్లౌట్ చాలా తీవ్రంగా రావచ్చు. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉన్నప్పుడు రెమిడిని ఎక్కువసార్లు తీసుకోవచ్చు కానీ బాగా పనిచేయాలంటే నియమిత కాలవ్యవధిలో తీసుకుంటేనే మంచిది మరియు రెమిడి ని గోళీల రూపంలో కాక నీటితో తీసుకుంటేనే బాగా పనిచేస్తాయి.

______________________________________

2.  ప్రశ్న:  కొందరు ప్రాక్టీషనర్ లు మొదట రెమిడి డ్రాప్స్ బాటిల్స్ లో వేసిన తర్వాత వాటిని గోళీలతో నింపుతారు. మరికొందరు గోళీలతో నింపిన తరువాతే రెమిడి చుక్కలు వేస్తారు  ఈ రెండు  పద్ధతులూ సరియైనవేనా ?

సమాధానం: రెండు పద్ధతులలోనూ ఫలితం ఒకటే. ఐతే ముందుగా రెమిడి డ్రాప్స్ వేయడం వలన 2/3 వంతు కన్నా ఎక్కువ గోళీలు బాటిల్ లో పడినప్పుడు వాటిని తొలగింఛినపుడు అవి వ్యర్ధమై పోతాయి. అంతేకాక ప్రయాణ సమయంలోనూ క్యాంపుల్లోనూ మొదట గోళీలను నింపుకొని వాటిని తీసుకెల్లడమే మీకు సదుపాయముగా ఉంటుంది.   

______________________________________

3.  ప్రశ్న: ప్రైమరీ స్కెలోరోజింగ్ కోలిన్జైటిస్ PSC వ్యాధి నివారణకు వైబ్రో రెమిడిలను ఉపయోగించవచ్చా – ఐతే ఏ విధంగా ?  

సమాధానం: అవశ్యం ఉపయోగించ వచ్చు. ఈ రెమిడి ని ఉపయోగించి చూడండి: CC4.2 Liver & Gallbladder tonic + CC4.6 Diarrhoea + CC4.11 Liver & Spleen + CC12.4 Autoimmune diseases + 21.4 Stings & Bites.

SRHVP మిషన్ ఉన్నవారయితే : NM2 Blood + NM22 Liver + NM102 Skin Itch + NM113 Inflammation + BR12 Liver + SM5 Peace & Love Alignment + SR284 Chelidonium 30C + SR340 Aloe 30C + SR504 Liver.

______________________________________

4.  ప్రశ్న: మూత్రపిండాలు, గుండె, లివరు వంటి ప్రధాన అవయవ మార్పిడి చేయించుకున్న పేషంట్లకు ఇవ్వవలసిన వైబ్రో చికిత్స గురించి సూచనలిస్తారా, అటువంటి వారికి కొత్తగా చేరిన అవయవం పట్ల శరీరంలో వ్యతిరేకత రాకుండా అల్లోపతీ మందుల వాడకం వలన వారి రోగనిరోధక వ్యవస్థ నిర్వీర్యం అవుతుందనే ఉద్దేశ్యం నాకుంది. కనుక వీరికి ఈ శక్తిని పటిష్ట పరిచేందుకు రెమిడిలు ఇవ్వవచ్చా? 

సమాధానం: ఇటువంటి సందర్భాలలో పేషంటు యొక్క అలోపతి వైద్యమునకు చేదోడు గా ఉంటూ అదే సమయంలో సైడ్ఎఫెక్ట్ లు రాకుండా ఉండేందుకు ప్రాక్టీషనర్ సానుభూతితోనే కాక విచక్షణతోనూ, అవగాహనా తోనూ, రెమిడి లు ఇవ్వవలసి ఉంటుంది. మీరిచ్చే రెమిడి పేషంటును  శారీరకంగా, మానసికంగా  దృఢంగా చేయడమేకాక కొత్తగా శరీరంలో చేరిన అవయవానికి వ్యతిరేకత రాకుండా చేయగలిగేదిగా ఉండాలి.  

ఈ రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవము పైన దాడి చేయకుండా ఉండడానికి తగిన పర్యవేక్షణ తోపాటు ఆరోగ్యవంతమైన ఆహారము, డాక్టర్ సలహాతో తగినటువంటి వ్యాయామము, యోగా, ఆరోగ్యవంతమైన ఆధ్యాత్మిక జీవన విధానము ధ్యానము, ప్రార్ధనలు ఎంతో ఉపకరిస్తాయి. ఇంకా పేషంట్లకు కావలసిన ఉపయోగకరమైన సూచనల కోసం ఈ వెబ్సైటు చూడండి  http://www.webmd.com/a-to-z-guides/life-after-transplant-tips-managing-health

ఇటువంటి వారికోసం CC12.1 Adult tonic ఇవ్వడం ఎంతో క్షేమకరం అలాగే ఏ పరిస్థితి లోనయినా సరే  CC15.1 Mental & Emotional tonic. నూ ఇవ్వవచ్చు. దీనితోపాటుగా ఆ అవయానికి చెందిన రెమిడి కూడా ఇవ్వడం, తను తీసుకునే అలోపతి డోస్ కు చెందిన నోసోడ్ కూడా తప్పనిసరిగా ఇవ్వాలి.

______________________________________

5.  ప్రశ్న: మరీ ఎక్కువగా కాక పోయినా నిత్యమూ అలవాటు ప్రకారం కిళ్ళీలు, వక్కలు నమిలేవారికీ, సారాయి సేవించే వారికీ  వైబ్రో రెమిడిలు ఇవ్వవచ్చా?

సమాధానం: ఇవ్వవచ్చు, ఆ రెమిడి లు వారికీ పనిచేస్తాయి. ఐతే సాధారణంగా మనం వక్కలు, సారాయి తీసుకోవద్దని చెపుతూ ఉంటాము. ఏమైనప్పటికీ వక్కలు, సారాయి, మాదక ద్రవ్యాలు, కిళ్ళీలు వంటి వాటికి బానిసలైన వారికి మందులు ఇవ్వాల్సి వస్తే పేషంట్లనే స్వయంగా మిమ్మల్ని కలవవలసిందిగా సూచించాలి. అంతేకాక ఆ పేషంటు స్వయంగా ఆ దురలవాటు నుండి బయటపడడానికి ధృడంగా సంకల్పం చేసుకొని ఉండాలి. అలాంటి వారికి రెమిడిలు సత్వర సత్ఫలితాలను ఇస్తాయి.

______________________________________

6.  ప్రశ్న: కొన్నిసందర్భాలలో పేషంటు రోగలక్షణాలు ప్రాధమికంగా మెరుగయ్యి ఒక స్థాయి చేరుకున్నాక ఏ విధమైన మార్పు ఉండదు. అటువంటి పరిస్థితిలో పేషంటుకు మేలు చేకూర్చడానికి ప్రాక్టీషనర్ ఏమి చెయ్యాలి ?

సమాధానం: పేషంటు డోసేజ్ విషయంలోనూ మందులను భద్రపరిచే విషయంలోనూ మీ సూచనలను ఖచ్చితంగా పాటించారా లేదా అనేది చూడండి. ఈ మందుల పైన పేషంటుకు విశ్వాసం పోయిందా, లేదా అతని అంతః చేతన లో ఏదైనా వ్యాధి నయమవ్వడానికి అడ్డుపడుతోందా అనేది తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కౌన్సిలింగ్ తో పాటు  అవసరం మేరకు వేరే కాంబినేషన్ లో రెమిడి ఇవ్వడానికి ప్రయత్నించండి. బహుశా పేషంటు కు సరియైన విధానంలో క్లెన్సింగ్ కు గురిచేయడం, అవసరము మేరకు  రోగనిరోధక శక్తిని పెంచే ఏర్పాటు నియమ బద్ధమైన  కాలవ్యవధి లో అందేలా చూడండి. ఆ విధానంలో అతని శరీరం పూర్తిగా సహకరించే విధంగా మార్పు తీసుకురండి.